స్టాక్ మార్కెట్ మూమెంట్ ను ఏ విధంగా అంచనా వేయవచ్చు. ఈ వారం స్టాక్ మార్కెట్ 03-12-2012 to 07-12-2012



స్టాక్ మార్కెట్ మూమెంట్ ను ఏ విధంగా అంచనా వేయవచ్చు.
ఈ వారం స్టాక్ మార్కెట్ 03-12-2012 to 07-12-2012
మీరూ రెగ్యులర్ గా ఈ బ్లాగ్ ఫాలో అవుతుంటే మీకూ ఇది వరకే తెలిసి ఉండాలి . మీము స్టాక్ మార్కెట్ మూమెంట్ ను ఎంత ఖచ్చితంగా అంచానా వేస్తున్నాం అనే  విషయం. మీకు దీపావళి మూహరత్ ట్రేడింగ్ సమయంలోనే తెలియచేయడం జరిగినది. మార్కెట్ లో కనీసం 4-5 % వరకు  మూమెంట్ రావడానికి అవకాశం ఉంది అని తెలియచేయడం జరిగినది. అంతే కాకుండా ర్యాలీ జరగడానికి గల అవకాశం వివరించడం జరిగినది. మీము అంచానా వేసునట్టుగానే డబల్ బాటం , రైసింగ్ ట్రెండ్ లైన్  సపోర్ట్  మరియు 20sma, 50sma  కలయిక  మార్కెట్ మూమెంట్ ను ఖచ్చితంగా అంచనా వేయడానికి సహాయపడ్డాయి.మార్కెట్ లో ఎలాంటి న్యూస్ వచ్చిన, దేశ ఆర్ధిక , రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ మార్కెట్ ను అంచనా వేయడానికి స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ సహాయపడుతుంది.అందువలన స్టాక్ మార్కెట్ లో మంచి రాబడి అందుకోవాలి . మీకూ మీరూ స్వయం నిర్ణయాలు తీసుకోవాలి అంటే తప్పకుండా మీరూ టెక్నికల్ అనాలసిస్ పై అవగాహన కలిగి ఉండాలి.నిఫ్టీ 4770 నుండి రైసింగ్ ట్రెండ్ లైన్  సపోర్ట్   తీసుకోవడం జరుగుతుంది. గత వారం కూడా ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ నుండి సుమారు 250 పాయింట్లు ర్యాలీ కావడం జరిగినది.మా PMS  క్లయింట్లు అద్భుత లాభాలు  అందుకోవడం జరిగినది.ప్రస్తుతం నిఫ్టీ  కి  సపోర్ట్ 5825  వద్ద కలదు. అదే విధంగా ప్రస్తుతం నిఫ్టీ కి రెసిస్టన్స్      5950 or + 25  వద్ద ఉంది. ఒకవేళ నిఫ్టీ కనుక 5970 పైన క్లోజ్ కాబడితే ర్యాలీ సుమారు 6150 వరకు కొనసాగగలదు. 5950 ఫిబోనస్సీ రెసిస్టన్స్ మాత్రమే కాకుండా , స్వింగ్ హై రూపంలో కూడా రెసిస్టన్స్ వస్తుంది. మీరూ స్టాక్ మార్కెట్ చరిత్రని పరిశీలిస్తే ప్రతి సంవత్సరం డిశంబర్ నెలలో ర్యాలీ రావడం  గమనించవచ్చు.ఏది ఏమైనా స్టాప్ లాస్ పాటించడం అలవాటు చేసుకోండి.నిఫ్టీ సపోర్ట్ 5825, 5770, రెసిస్టన్స్ 5950, 6025వద్ద కలవు.క్రింద ఇవవ్బడిన చార్త్స్ ద్వారా నిఫ్టీ మూమెంట్ అర్ధం చేసుకొనే ప్రయత్నం చేయండి.    

స్టాక్ మార్కెట్ లో మీరూ ప్రతి రోజూ వినే సెన్సెక్స్ అంటే ఏమిటి?



స్టాక్  మార్కెట్ లో మీరూ ప్రతి రోజూ వినే  సెన్సెక్స్ అంటే ఏమిటి?
సెన్సెక్స్ లేదా సెన్సిటివ్ ఇండెక్స్  ( SENSEX-or SENSitve index ) ను జనవరి 1 1986 రొజూ ముంబాయి స్టాక్ ఎక్సేంజీ ద్వారా పరిచయం చేసారు.ఇది ఇండియా లో గల ప్రముఖ ఇండేక్స్లలో ఒకటి .ఈ సెన్సెక్స్ మొత్తం మార్కెట్ ను ప్రతిబంబించేలా రూపొందించబడినది.దీనిలో బాగా పేరొందిన , స్థిరపడిన , ఆర్ధికంగా బాగా బలమైన పునాదులు కలిగినటువంటి  ముప్పై  పెద్ద కంపెనీలతో ఏర్పాటు చేయడం జరిగినది.సెన్సెక్స్ లెక్కించడం కోసం ఆ కంపీనీ మార్కెట్ కాపిటలైజేషన్ లెక్కలోకి తీసుకోవడం జరిగినది. అధిక కాపిటలైజేషన్ కలిగిన కంపెనీకి అధిక వెయిటేజీ ఇవ్వడం జరిగినది.అదే విధంగా 1978-79వ సంవత్సరం ను బెస్ సంవత్సరంగా , 100 ను బెస్ ఇండెక్స్ వాల్యుగా పరిగణలోకో తీసుకోవడం జరిగినది.అంటే సెన్సెక్స్ నిర్మాణ సమయంలో మొత్తం మార్కెట్ కాపిటలైజేషన్ విలువ  100 తీసుకోవడం వలన మరుసటి రోజూ మార్కెట్ కాపిటలైజేషన్  10% పెరిగితే ఇండెక్స్ కూడా   10% పెరిగి 100 నుండి  110 అవుతుంది. 100 ను బెస్ ఇండెక్స్ వాల్యుగా తీసుకోవడంలో ముఖ్య ఉద్దేశం లెక్కించడానికి సులభంగా ఉంటుంది అనే ఆలోచనే. సెన్సెక్స్ లో ఎన్నుకొనే కంపెనీలు క్వాలిటీ పరంగా మరియు క్వాంటిటీ పరంగా మంచి లక్షణాలు కలిగిఉంటాయి.
ఇప్పుడు సెన్సెక్స్ ఇండెక్స్ యే విధంగా నిర్మిస్తారో ఒక్కసారి చూద్దాం.మార్కెట్ లో ఒక స్టాక్ మాత్రమే ఉంటే దానిలో పెరుగుదల కాని, పతనం కాని సులభంగా అర్ధం చేసుకోవచ్చు. బెస్ ఇండెక్స్ విలువ  100 కాబట్టి ఒక స్టాక్ యొక్క ధర 200 నుండి 240 వరకు పెరిగితే ఆ స్టాక్ లో పెరుగుదల  20% నమోదు ఐతే ఇండెక్స్ లో కూడా పెరుగుదల 20% ఉండి ఇండెక్స్  100 నుండి 120 కి చేరుకుంటుంది. మరుసటి రోజు ఆ స్టాక్ యొక్క ధర  10% పతనం జరిగి  216 కు చేరుకుంటే సెన్సెక్స్ ఇండెక్స్ కూడా 10%  తగ్గడంతో   110 కి చేరుకుంటుంది.ఈ విధంగా సెన్సెక్స్ లో ఒకే స్టాక్ ఉండటం వలన ఇండెక్స్ విలువ  మనం లెక్కించడం సులభంగా జరిగినది. మరి ఒకటి కంటే ఎక్కువ అంటే రెండు స్టాక్ లు ఉంటే యే విధంగా లెక్కించాలో చూద్దాం.
ఇప్పుడు ఇండెక్స్ లో A మరియు B అనే రెండు కంపెనీల స్టాక్స్ ఉన్నాయి అనుకోండి. A స్టాక్ ధర 200 వద్ద ఉంది , B స్టాక్ ధర  150 వద్ద ఉంది.సెన్సెక్స్ ఇండెక్స్ ఏర్పాటు చేయడంలో స్టాక్స్ యొక్క మార్కెట్ కాపిటలైజేషన్ పరిగణలోకి తీసుకొని దానికి అనుగుణంగా ఆ కంపెనీకి ఇండెక్స్ లో వెయిటేజీ ఇస్తారు అని మనం ఇది వరకే తెలుసుకున్నాం. మరి ఇప్పు ఈ రెండు స్టాక్ ల యొక్క వెయిటేజీ ఏవిధంగా తెలుసుకోవాలో ఒక్కసారి చూద్దాం. ఒక కంపీనీ లో గల మొత్తం షేర్లను ఆ కంపెనీ షేరు లేదా స్టాక్ ధరతో గుణించగా వచ్చేదే మార్కెట్ కాపిటలైజేషన్ . కంపెనీ  A వద్ద  100,000 షేర్లు మరియు కంపెనీ  Bవద్ద  200,000 షేర్లు ఉంటే కంపెనీ  A కాపిటలైజేషన్  200 x 100000 =20000000 మరియు కంపెనీ  B కాపిటలైజేషన్ 150 x 200000 = 30000000 అవుతుంది. మొత్తం మార్కెట్ కాపిటలైజేషన్ (200 x 100000 + 150 x 200000) Rs 500 lakhs అవుతుంది. ఈ మొత్తం  సెన్సెక్స్ ఇండెక్స్ బెస్ విలువ   100 కి సమానం  అవుతుంది.ఇప్పుడు కంపెనీ  A స్టాక్ ధర  260 (30% increase in price) కి చేరుకుంది.కంపెనీ  B స్టాక్ ధర  135. (10% drop in price)కి చేరుకుంది.ఇప్పుడు మార్కెట్ కాపిటలైజేషన్  260 x 100000 +135 x 200000= Rs 530 lakhsలకు చేరుకుంది. అంటే స్టాక్స్ ధరలలో మార్పు వల్ల మార్కెట్ కాపిటలైజేషన్ ) Rs 500 lakhs నుండి Rs 530 lakhsలకు చేరుకుంది. అంటే 6% పెరుగుదల నమోదు కావడం జరిగినది కావున సెన్సెక్స్ ఇండెక్స్ లో కూడా పెరుగుదల 6% నమోదు కావడం జరుగుతుంది కాబట్టి సెన్సెక్స్ ఇండెక్స్ 100 to 106 మార్పు చెందడం జరుగుతుంది.ఈ విధమైన లాజిక్ ను సెన్సెక్స్ లో ఎంచుకున్న స్టాక్స్ అన్నిటికి విస్తరించి లెక్కించడం జరుగుతుంది. అందుకే స్టాక్స్ యొక్క ధరల మార్పు కి అనుగుణంగా సెన్సెక్స్ కూడా మార్పు చెందడం జరుగుతుంది. ఐతే సెన్సెక్స్ ఇండెక్స్  ముప్పై ఆర్ధికంగా బలంగా ఉన్న పెద్ద కంపెనీలను చేర్చడం ద్వారా లెక్కిస్తాయు అని తెలుసుకున్నాం. కాని ఒక్క విషయం ఈ విధంగా లెక్కించడానికి  కంపెనీ యొక్క అన్ని షేర్లను పరిగణలోకి తీసుకోరు. కేవలం ఫ్రీ ప్లోటింగ్ ఉన్న షేర్ల విలువను  మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.ప్రీ ప్లోటింగ్ అంటే ఏమిటో మనం ఒక్క సారి తెలుసుకుందాం.స్టాక్ మార్కెట్ లో ప్రజలూ ట్రేడ్ చేయడానికి అందుబాటులో ఉన్న షేర్లను ప్రీ ప్లోటింగ్ షేర్లు అంటారు.అంటే కంపెనీ ప్రమోటర్లు, FDIs , ప్రభుత్వం వద్ద ఉన్న షేర్లు మినహాయించి మిగిలిన షేర్లను ప్రీ ప్లోటింగ్ షేర్లు అంటారు.ఒక కంపెనీ యొక్క    ప్రీ ప్లోటింగ్ విలువను లెక్కించాలి అంటే ఒక కంపెనీ మొత్తం కాపిటలైజేషన్లో  ఎంత శాతం పబ్లిక్ వద్ద ఉందో ఆ మొత్తం ను పరిగణలోకి తీసుకుంటారు.. పబ్లిక్  వద్ద  ఎంత శాతం షేర్లు అందుబాటులో ఉంటే ఆ కంపెనీ యొక్క ప్రీ ప్లోటింగ్ విలువ ఎక్కువగా ఉంటుంది.

ఉదాహరణకు ఒక కంపెనీ యొక్క మార్కెట్ విలువ  Rs 100,000 కోట్లు అనుకుంటే ఒక్క షేర్ విలువ Rs 1,000 ఐతే కంపెనీ వద్ద ఉన్న మొత్తం షేర్ల సంఖ్యా 100 అవుతాయి. కాని కేవలం 20% షేర్లు మాత్రమే పబ్లిక్ కి అందుబాటులో ఉంటే అప్పుడు కంపెనీ యొక్క ఫ్రీ ప్లోటింగ్ మార్కెట్ విలువ మొత్తం కంపెనీ యొక్క మార్కెట్ విలువ లో  20% మాత్రమే అవుతుంది. అంటే  Rs 100,000x20% =20,000అవుతుంది.మీరు ఈ ఫ్రీ ప్లోటింగ్ విలువ ఎప్పటికప్పుడు క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.


ఇప్పుడు సెన్సెక్స్  లో గల ముప్పై కంపెనీల ఫ్రీ ప్లోటింగ్ విలువ ప్రకారం సెన్సెక్స్ ఇండెక్స్ పెరగడం లేదా తగగ్డం జరుగుతుంది.
ఉదాహరణకు  Rs 10,00,000కోట్ల ఫ్రీ ప్లోట్   మార్కెట్ కాపిటలైజేషన్  ఉన్నప్పుడు సెన్సెక్స్ ఇండెక్స్  12500 ఉంటే , ఫ్రీ ప్లోట్   మార్కెట్ కాపిటలైజేషన్ పెరిగి   Rs 11,50,000 కోట్లకు చేరుకుంటే సెన్సెక్స్ ఇండెక్స్  ఎంత ఉండగలదో లేక్కగట్టండి.తెలియడం లేదా ఐతే సమాధానం ఏంతో తెలుసా 14,375. ఎలాగో తెలియడం లేదా చిన్నప్పుడు లెక్కల్లో నేర్చుకున్న  ratios and proportionsగుర్తుతెచ్చుకోండి.ఐనా సాధ్యం కాకపోతే మాకు మెయిల్ చేయండి.

డీమ్యాట్ ఖాతా లాభాలు

డీమ్యాట్ ఖాతా లాభాలు
  సెక్యూరిటీల యొక్క తక్షణ బదిలీ
సెక్యూరిటీల బదిలీ పై ఎలాంటి  స్టాంప్ డ్యూటీ ఉండదు.
కాగితపు  సర్టిఫికేట్లుకు వలే ఎలాంటి భయాలు ఉండవు.అనగా చినిగిపోవడం  దొంగతనం,నకిలీ  సర్టిఫికేట్లు, పోర్జరీ మొదలైనవి వంటివి.
సెక్యూరిటీల బదిలీ  సమయంలో  కాగితపు పని లో తగ్గింపు.
ట్రాన్సాక్షన్ కాస్ట్ లో తగ్గింపు
నామినేషన్ సౌకర్యం
DP రికార్డ్  లో చిరునామా  మార్పు నమోదు చేయడం వల్ల మీరు వాటా  కలిగి ఉన్న ప్రతి కంపెనీకి మీచిరునామా  మార్పుగురుంచి  తెలియచేయనవసరం లేదు
 folios / 
ఖాతాల నిర్వహణ అనుకూలమైన పద్ధతిని  కలిగి ఉంటుంది.
అన్ని రకాల సెక్యూరిటీలకు ఒకే రకమైన  ఖాతా ఉంటుంది.
మీ సెక్యూరిటీలలో బోనస్ కాని, స్ప్లిట్  లేదా విలీనం జరిగినప్పుడు మీ వాటా మీ ఖాతా యందు ఆటోమాటిక్ గా జమ అవుతుంది .

మ్యూచవల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వలన కలిగే ప్రయోజనాలు


మ్యూచవల్  ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వలన కలిగే  ప్రయోజనాలు

Professional Management 
మ్యూచవల్  ఫండ్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బును సరియైన పద్దతిలో ఇన్వెస్ట్ చేయడానికి అపారమైన అనుభవం  , నైపుణ్యం కలిగిన ఫండ్ మేనేజర్లు ఉంటారు. వారికి సహాయంగా మీ ఇన్వెస్ట్మెంట్ చూడాటానికి  టీం కూడా ఉంటుంది. వారు ఈక్విటీ ఫండ్స్  మరియు డేట్స్ ఫండ్స్  లలో ఇన్వెస్ట్ చేయడానికి ముందు రీసేర్చీ చేసి  పూర్తీ అవగాహన తో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు.మీరు   మ్యూచవల్  ఫండ్స్ గత చరిత్ర ను ఇంతవరకు పరిశీలించిన వారు స్థిరమైన రాబడిని అందిస్తున్నారు.
Diversification 
మీ ఫోర్ట్ ఫోలియోలో  డైవరిఫికేషన్ అనేది మీ పెట్టుబడికి రక్షణగాను  , దానికి స్థిరత్వం ఇచ్చేదిగా  ఉంటుంది.ఫండ్ మేనేజర్ మీ దగ్గర నుండి సేకరించిన డబ్బును వివిధ రకాల స్టాక్స్ మరియు సేక్యురిటిలలో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ వైవిధ్యమైన పెట్టుబడి ఇన్వెస్టర్స్ కు మంచి రాబడి అందిస్తుంది. అదే  మీరు స్వయంగా ఇన్వెస్ట్ చేస్టే  ఈ వైవిధ్యమైన పెట్టుబడి చేయడం మీకు సాధ్యం కాకపోవచ్చు. అంతే కాకుండా కొన్ని సమయాలలో మీ దగ్గర ఉన్న చిన్న మొత్తం ద్వారా ఇది అసలే సాధ్యం కాదు. కాని మ్యూచవల్  ఫండ్స్ కొంత మొత్తం ద్వారా కూడా సాధ్యం అవుతుంది.
 Convenient Administration
 మీరు మ్యూచవల్  ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం  ఎంతో సులభం . మీరు మ్యూచవల్  ఫండ్ పథకాన్ని నిపుణుడి సహాయంతో  ఎన్నుకొని ,దరఖాస్తు ఫారాన్ని  నింపి ,వారి పేరు మీదా చెక్కు  జారీ చేసి రావడమే .ఇది మొత్తం రెండు నిమిషాల పని . అదే విధంగా మీ ఇన్వెస్ట్మెంట్ తిరిగి తీసుకోవడం కూడా చాలా సులభం.
Return potential
 మ్యూచవల్ఫండ్సలోమధ్య కాలం నుండిదీర్ఘ కాలం కొరకు ఇన్వెస్ట్ చేసినచో మంచి రాబడి          అందిస్తాయి.ఎందుకంటే వారు వివిధ పథకాలలో ఇన్వెస్ట్ చేస్తుంటారు కాబట్టి.   

    Low cost
 కాబట్టి.   మీరు ఎటైనా ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సులో వెళ్ళిన దానికంటే మీ స్వంత వాహనంలో వెళ్ళితే అధిక ఖర్చు   ఏ విధంగా  అవుతుందో అదే విధంగా ఇక్కడ కూడా  మ్యూచవల్  ఫండ్స్ పథకాలలో కొన్ని వేల మంది ఇన్వెస్ట్ చేయడం వలన ఫండ్ నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. దానితో  మీకు కూడా తక్కువ ఖర్చు అవుతుంది. 
Liquidity
 మ్యూచవల్  ఫండ్స్ పథకాలలో నుండి మీరు ఎప్పుడు కావలి అంటే అప్పుడు ఉపసంహరించుకోవచ్చు.మీరు ఉపసంహరణ దరఖాస్తూ సంతకం చేసి ఇచ్చిన రెండూ మూడు రోజులలో మీ డబ్బు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.   ఒక వేళ ప్రతేకంగా ఆ పథకానికి లాక్ ఇన్ పిరియడ్ , టాక్స్ సేవింగ్ పథకం ఐతే మాత్రం  సాధ్యం కాదు.ఓపెన్ ఎండెడ్ పథకాలనుండి ఎప్పుడైనా బయటకు రావచ్చు. క్లోజ్ ఎండెడ్ పథకాల యూనిట్స్ ని స్టాక్ ఎక్సేంజీ లో ఎప్పుడైనా అమ్ముకోవచ్చు.  మీకు   టాక్స్ సేవింగ్   అవసరమైతే తప్ప లేనిచో టాక్స్ సేవింగ్ పథకాల వైపు వెళ్ళవద్దు.
Transparency
 పారదర్శకత  అనేది మ్యూచవల్  ఫండ్స్ యొక్క ముఖ్యమైన ప్రయోజనం .ఒక ఇన్వెస్టర్ గా మీ డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ చేయబడినది , ప్రస్తుతం దాని విలువ ఎంత ఉన్నది మొదలగు వివరాలు మీకు క్రమం తప్పకుండా తెలియచేయబడతాయి.
 Choice of schemes
మీ పెట్టుబడి లక్ష్యాలకు అనుగుణంగా , మీరు తీసుకొనే రిస్కు స్వభావానికి అనుగుణంగా , మీరు నిర్ణయించుకున్న నిర్ణీత కాలానికి అనుగుణంగా  , మీ అవసరాలకు అనుగుణంగా ,మీరు వివిధ రకాల మ్యూచవల్  ఫండ్స్ పథకాలను ఎంచుకొనే  అవకాశం కలదు. మీకు  ఈక్వీటీ   మార్కట్ , డేట్ మార్కెట్ , మనీ మార్కెట్ , ఈ టి ఫ్స్  , గోల్డ్ ఈ టి ఫ్స్, టాక్స్ సేవింగ్ ,  ఇలా  వివిధ రకాల పథకాలు  మీకు అందుబాటులో ఉంటాయి.
 Well regulated
 మీ అన్ని మ్యూచవల్  ఫండ్స్ కూడా సేబీ వద్ద రిజిస్టర్ కాబడి , సెబీ నిబందనల ప్రకారం పనిచేయబడతాయి. ఈ మ్యూచవల్  ఫండ్స్ ను సేబీ రెగ్యులర్ గా మానిటర్ చేస్తుంది.
 Tax benefits
మ్యూచవల్  ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా  టాక్స్ మినహాయింపులు పొందవచ్చు. ఈ మినహాయింపులు సమయానుకూలంగా  మారుతుంటాయి. మనం దీని గురుంచి మరో చాప్టర్ లో చదువుకుందాం.