ఈ వారం స్టాక్ మార్కెట్


ఈ వారం స్టాక్ మార్కెట్























గత వారం మనం  అనుకున్న విధంగానే నిఫ్టీ  50 sma ఐనటువంటి 5255 వద్ద సపోర్ట్ తీసుకోవడమే కాకుండా దాని పైననే క్లోజ్ కావడం జరిగినది. ఇక ప్రస్తుత వారానికి వస్తే శని వారం రోజు జనరల్ యాంటీ అవాయిడేన్స్ రూల్స్ ( గార్) పై ఏర్పాటు ఐన నిపుణుల సంఘం పన్ను ప్రతిపాదనలను వాయిదా వేయాలి అని కోరడం మార్కెట్ కి ఉత్సాహం అందించే వార్తనే. అదే విధంగా ఫేడ్ బ్యాంక్ చైర్మన్  బెర్నంకే జాక్ అండ్ హోల్ మీటింగ్ లో quantitative easing, or "QE3."  గురుంచి ఎలాంటి ప్రకటన చేయకపోవడం నిరుత్సాహకరమే.కాని దాని గురుంచి పూర్తిగా కొట్టిపడవేయలేదు.అంటే సమీప భవిష్యత్తులో ఉద్దీపన చర్యలు ప్రకటించే ఆవకాశం కలదు. అదే విధంగా GDP డేటా అంచనా వేసినదానికంటే ఎక్కువగానే వచ్చింది కాబట్టి మరోసారి రిజర్వు బ్యాంక్ వడ్డీ రెట్లు తగ్గిస్తుంది అని ఆశించవచ్చు.  అదే విధంగా కేంద్ర ప్రభుత్వం వివాదస్పద బొగ్గు గనులను కేటాయింపును రద్దు చేసే అవకాశం కూడా కలదు. 
ఇక నిఫ్టీ  టెక్నికల్ అనాలసిస్ గురుంచి చర్చించాల్సి వస్తే గత వారం నిఫ్టీ గ్యాప్ డౌన్ ప్రారంభం జరిగి 5400 వద్ద హై ప్రైస్ ఏర్పాటు కాబడి   5238 వద్ద లో ప్రైస్ ఏర్పాటు కావడం జరిగినది.నిఫ్టీ 50 sma ఐనటువంటి 5255 వద్ద గత వారపు చివరి రెండు  ట్రేడింగ్ రోజులలో   సపోర్ట్ తీసుకుంటున్నది అని తెలుస్తుంది. అంటే, లోయర్ లెవల్లో బయ్యింగ్ రావడం జరుగుతుంది,.  అదే విధంగా 5200-5220 రేంజ్ లో కూడా సపోర్ట్ ఉంది. ఫిబోనస్సీ రేషియో అనాలసిస్ ప్రకారం కూడా 50% రేషియో  రూపంలో  5200 వద్ద సపోర్ట్ కలదు. అదే విధంగా రైజింగ్ ట్రెండ్ లైన్ రూపంలో కూడా   5200 వద్ద సపోర్ట్ వస్తుంది.ఈ సెప్టెంబర్ నెలలో నిఫ్టీ 5200-5400 రేంజ్ లో కదలాడే అవకాశం కలదు అని అంచనా వేయడం  జరిగినది. కావున లోయర్ లెవల్లో 5190 సపోర్ట్ తో బై చేయడం మంచిది. సపోర్ట్ 5220, 5190, 5160 రెసిస్టన్స్ 5302,5348,ఒకవేళ ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయడం జరుగుతుంది.
ముఖ్య గమనిక :మీరు  టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా ఒక పద్ధతి  ఎంచుకొని దానినే స్థిరంగా  మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్ మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ సాధ్యం అవుతుంది. 

స్టాక్ మార్కెట్ లో మీరూ ప్రతి రోజూ వినే సెన్సెక్స్ అంటే ఏమిటి?



స్టాక్  మార్కెట్ లో మీరూ ప్రతి రోజూ వినే  సెన్సెక్స్ అంటే ఏమిటి?

సెన్సెక్స్ లేదా సెన్సిటివ్ ఇండెక్స్  ( SENSEX-or SENSitve index ) ను జనవరి 1 1986 రొజూ ముంబాయి స్టాక్ ఎక్సేంజీ ద్వారా పరిచయం చేసారు.ఇది ఇండియా లో గల ప్రముఖ ఇండేక్స్లలో ఒకటి .ఈ సెన్సెక్స్ మొత్తం మార్కెట్ ను ప్రతిబంబించేలా రూపొందించబడినది.దీనిలో బాగా పేరొందిన , స్థిరపడిన , ఆర్ధికంగా బాగా బలమైన పునాదులు కలిగినటువంటి  ముప్పై  పెద్ద కంపెనీలతో ఏర్పాటు చేయడం జరిగినది.సెన్సెక్స్ లెక్కించడం కోసం ఆ కంపీనీ మార్కెట్ కాపిటలైజేషన్ లెక్కలోకి తీసుకోవడం జరిగినది. అధిక కాపిటలైజేషన్ కలిగిన కంపెనీకి అధిక వెయిటేజీ ఇవ్వడం జరిగినది.అదే విధంగా 1978-79వ సంవత్సరం ను బెస్ సంవత్సరంగా , 100 ను బెస్ ఇండెక్స్ వాల్యుగా పరిగణలోకో తీసుకోవడం జరిగినది.అంటే సెన్సెక్స్ నిర్మాణ సమయంలో మొత్తం మార్కెట్ కాపిటలైజేషన్ విలువ  100 తీసుకోవడం వలన మరుసటి రోజూ మార్కెట్ కాపిటలైజేషన్  10% పెరిగితే ఇండెక్స్ కూడా   10% పెరిగి 100 నుండి  110 అవుతుంది. 100 ను బెస్ ఇండెక్స్ వాల్యుగా తీసుకోవడంలో ముఖ్య ఉద్దేశం లెక్కించడానికి సులభంగా ఉంటుంది అనే ఆలోచనే. సెన్సెక్స్ లో ఎన్నుకొనే కంపెనీలు క్వాలిటీ పరంగా మరియు క్వాంటిటీ పరంగా మంచి లక్షణాలు కలిగిఉంటాయి.
ఇప్పుడు సెన్సెక్స్ ఇండెక్స్ యే విధంగా నిర్మిస్తారో ఒక్కసారి చూద్దాం.మార్కెట్ లో ఒక స్టాక్ మాత్రమే ఉంటే దానిలో పెరుగుదల కాని, పతనం కాని సులభంగా అర్ధం చేసుకోవచ్చు. బెస్ ఇండెక్స్ విలువ  100 కాబట్టి ఒక స్టాక్ యొక్క ధర 200 నుండి 240 వరకు పెరిగితే ఆ స్టాక్ లో పెరుగుదల  20% నమోదు ఐతే ఇండెక్స్ లో కూడా పెరుగుదల 20% ఉండి ఇండెక్స్  100 నుండి 120 కి చేరుకుంటుంది. మరుసటి రోజు ఆ స్టాక్ యొక్క ధర  10% పతనం జరిగి  216 కు చేరుకుంటే సెన్సెక్స్ ఇండెక్స్ కూడా 10%  తగ్గడంతో   110 కి చేరుకుంటుంది.ఈ విధంగా సెన్సెక్స్ లో ఒకే స్టాక్ ఉండటం వలన ఇండెక్స్ విలువ  మనం లెక్కించడం సులభంగా జరిగినది. మరి ఒకటి కంటే ఎక్కువ అంటే రెండు స్టాక్ లు ఉంటే యే విధంగా లెక్కించాలో చూద్దాం.
ఇప్పుడు ఇండెక్స్ లో A మరియు B అనే రెండు కంపెనీల స్టాక్స్ ఉన్నాయి అనుకోండి. A స్టాక్ ధర 200 వద్ద ఉంది , B స్టాక్ ధర  150 వద్ద ఉంది.సెన్సెక్స్ ఇండెక్స్ ఏర్పాటు చేయడంలో స్టాక్స్ యొక్క మార్కెట్ కాపిటలైజేషన్ పరిగణలోకి తీసుకొని దానికి అనుగుణంగా ఆ కంపెనీకి ఇండెక్స్ లో వెయిటేజీ ఇస్తారు అని మనం ఇది వరకే తెలుసుకున్నాం. మరి ఇప్పు ఈ రెండు స్టాక్ ల యొక్క వెయిటేజీ ఏవిధంగా తెలుసుకోవాలో ఒక్కసారి చూద్దాం. ఒక కంపీనీ లో గల మొత్తం షేర్లను ఆ కంపెనీ షేరు లేదా స్టాక్ ధరతో గుణించగా వచ్చేదే మార్కెట్ కాపిటలైజేషన్ . కంపెనీ  A వద్ద  100,000 షేర్లు మరియు కంపెనీ  Bవద్ద  200,000 షేర్లు ఉంటే కంపెనీ  A కాపిటలైజేషన్  200 x 100000 =20000000 మరియు కంపెనీ  B కాపిటలైజేషన్ 150 x 200000 = 30000000 అవుతుంది. మొత్తం మార్కెట్ కాపిటలైజేషన్ (200 x 100000 + 150 x 200000) Rs 500 lakhs అవుతుంది. ఈ మొత్తం  సెన్సెక్స్ ఇండెక్స్ బెస్ విలువ   100 కి సమానం  అవుతుంది.ఇప్పుడు కంపెనీ  A స్టాక్ ధర  260 (30% increase in price) కి చేరుకుంది.కంపెనీ  B స్టాక్ ధర  135. (10% drop in price)కి చేరుకుంది.ఇప్పుడు మార్కెట్ కాపిటలైజేషన్  260 x 100000 +135 x 200000= Rs 530 lakhsలకు చేరుకుంది. అంటే స్టాక్స్ ధరలలో మార్పు వల్ల మార్కెట్ కాపిటలైజేషన్ ) Rs 500 lakhs నుండి Rs 530 lakhsలకు చేరుకుంది. అంటే 6% పెరుగుదల నమోదు కావడం జరిగినది కావున సెన్సెక్స్ ఇండెక్స్ లో కూడా పెరుగుదల 6% నమోదు కావడం జరుగుతుంది కాబట్టి సెన్సెక్స్ ఇండెక్స్ 100 to 106 మార్పు చెందడం జరుగుతుంది.ఈ విధమైన లాజిక్ ను సెన్సెక్స్ లో ఎంచుకున్న స్టాక్స్ అన్నిటికి విస్తరించి లెక్కించడం జరుగుతుంది. అందుకే స్టాక్స్ యొక్క ధరల మార్పు కి అనుగుణంగా సెన్సెక్స్ కూడా మార్పు చెందడం జరుగుతుంది. ఐతే సెన్సెక్స్ ఇండెక్స్  ముప్పై ఆర్ధికంగా బలంగా ఉన్న పెద్ద కంపెనీలను చేర్చడం ద్వారా లెక్కిస్తాయు అని తెలుసుకున్నాం. కాని ఒక్క విషయం ఈ విధంగా లెక్కించడానికి  కంపెనీ యొక్క అన్ని షేర్లను పరిగణలోకి తీసుకోరు. కేవలం ఫ్రీ ప్లోటింగ్ ఉన్న షేర్ల విలువను  మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.ప్రీ ప్లోటింగ్ అంటే ఏమిటో మనం ఒక్క సారి తెలుసుకుందాం.స్టాక్ మార్కెట్ లో ప్రజలూ ట్రేడ్ చేయడానికి అందుబాటులో ఉన్న షేర్లను ప్రీ ప్లోటింగ్ షేర్లు అంటారు.అంటే కంపెనీ ప్రమోటర్లు, FDIs , ప్రభుత్వం వద్ద ఉన్న షేర్లు మినహాయించి మిగిలిన షేర్లను ప్రీ ప్లోటింగ్ షేర్లు అంటారు.ఒక కంపెనీ యొక్క    ప్రీ ప్లోటింగ్ విలువను లెక్కించాలి అంటే ఒక కంపెనీ మొత్తం కాపిటలైజేషన్లో  ఎంత శాతం పబ్లిక్ వద్ద ఉందో ఆ మొత్తం ను పరిగణలోకి తీసుకుంటారు.. పబ్లిక్  వద్ద  ఎంత శాతం షేర్లు అందుబాటులో ఉంటే ఆ కంపెనీ యొక్క ప్రీ ప్లోటింగ్ విలువ ఎక్కువగా ఉంటుంది.

ఉదాహరణకు ఒక కంపెనీ యొక్క మార్కెట్ విలువ  Rs 100,000 కోట్లు అనుకుంటే ఒక్క షేర్ విలువ Rs 1,000 ఐతే కంపెనీ వద్ద ఉన్న మొత్తం షేర్ల సంఖ్యా 100 అవుతాయి. కాని కేవలం 20% షేర్లు మాత్రమే పబ్లిక్ కి అందుబాటులో ఉంటే అప్పుడు కంపెనీ యొక్క ఫ్రీ ప్లోటింగ్ మార్కెట్ విలువ మొత్తం కంపెనీ యొక్క మార్కెట్ విలువ లో  20% మాత్రమే అవుతుంది. అంటే  Rs 100,000x20% =20,000అవుతుంది.మీరు ఈ ఫ్రీ ప్లోటింగ్ విలువ ఎప్పటికప్పుడు క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
Click this link to get it.

ఇప్పుడు సెన్సెక్స్  లో గల ముప్పై కంపెనీల ఫ్రీ ప్లోటింగ్ విలువ ప్రకారం సెన్సెక్స్ ఇండెక్స్ పెరగడం లేదా తగగ్డం జరుగుతుంది.
ఉదాహరణకు  Rs 10,00,000కోట్ల ఫ్రీ ప్లోట్   మార్కెట్ కాపిటలైజేషన్  ఉన్నప్పుడు సెన్సెక్స్ ఇండెక్స్  12500 ఉంటే , ఫ్రీ ప్లోట్   మార్కెట్ కాపిటలైజేషన్ పెరిగి   Rs 11,50,000 కోట్లకు చేరుకుంటే సెన్సెక్స్ ఇండెక్స్  ఎంత ఉండగలదో లేక్కగట్టండి.తెలియడం లేదా ఐతే సమాధానం ఏంతో తెలుసా 14,375. ఎలాగో తెలియడం లేదా చిన్నప్పుడు లెక్కల్లో నేర్చుకున్న  ratios and proportionsగుర్తుతెచ్చుకోండి.ఐనా సాధ్యం కాకపోతే మాకు మెయిల్ చేయండి. 
స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్  ట్రైనింగ్

స్టాక్ మార్కెట్ లో మీరు ఎప్పుడు నష్టాలనే పొందుతున్నారా ? లాభాలు ఎలా వస్తాయో మీకు తెలియడం లేదా ?.ఇంకా ఎంత వరకు మీరు మార్కెట్ డైరెక్షన్ కోసం లేదా కాల్స్ కోసం ఇతరులపై ఆధారపడతారు.మీరే టెక్నికల్ అనాలసిస్ నేర్చుకోండి. మీకు టెక్నికల్ అనాలసిస్ తెలుగులో బేసిక్ నుండి నేర్పడమే కాకుండా యే ట్రేడింగ్ స్ట్రాటజీ ఉపయోగించి  లాభాలు అందుకోవచ్చో తెలుపడం జరుగుతుంది. టెక్నికల్ అనాలసిస్ అనేది చాలా విస్తృతమైన సబ్జెక్ట్  అందులో ఏది అవసరమో కాదో తెలుసుకోవడం చాలా కష్టం. మేము మీకు అవసరమైనవి తెలియచేయడమే కాకుండా నేర్చుకున్నవాటిని యే విధంగా ఉపయోగించాలో తెలియచేస్తాం. చాలా ఇనిస్టిట్యూట్స్ సుమారు యాభై వేల నుండి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తాయి.  మీ ఇంటికి వచ్చి మీకు నేర్పడం జరుగుతుంది. టెక్నికల్ అనాలసిస్ నేర్చుకోండి .స్వయంగా లాభాలు సంపాదించుకొండి. మీరు లెర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ సాధ్యం అవుతుంది.లెర్నింగ్ లేకపోతే మీకు మార్కెట్ లో నష్టాలు సంభవించడం చాలా సర్వసాదారణం .ఈ ప్రపంచంలో ఏది ఉచితంగా రాదు అనే విషయం తెలుసుకోండి.ఇంకా ఎంత కాలం స్టాక్ మార్కెట్ కోసం ఇతరుల మీదా , టి .వి. అనలిస్టుల మీదా ఆధారపడతారు.స్టాక్ మార్కెట్ లో ఒక్కరి మీదా ఆధారపడే వారూ ఎప్పుడు లాభాలు అందుకోలేరు.మీకు మేము స్టాక్ మార్కెట్ అనే అడవిలో లాబలతో బయట పడటానికి కావలసిన రోడ్ మ్యాప్ యే విధంగా ఏర్పాటు చేసుకోవాలో నేర్పుతాం.మీకు స్టాక్ మార్కెట్ పై పూర్తీ అవగాహన లేకపోతే మీ వద్ద గల మొత్తం కాపిటల్ నష్టపోయే ప్రమాదం అధికంగా కలదు.స్టాక్ మార్కెట్ నిన్న ఉంది, నేడు ఉంది , రేపు కూడా ఉంటుంది. కాని ఒక్కసారి మీ కాపిటల్ లాస్ ఐతే మీరు చేయగలిగేడి ఏమి ఉండదు. అందువలన మీరు స్టాక్ మార్కెట్ పై ఇతరుల మీదా ఆధారపడకుండా స్వయం నిర్ణయం యీసుకొనే శక్తి సంపాదించుకొండి . పెద్ద పెద్ద ఇన్స్టిట్యుట్స్ వేలు , లక్షల ఫీజు తీసుకుంటాయి. మీరు క్లాసు రూం లో కాని , సెమినార్ లో కాని మీకు వచ్చిన సందేహాలు  లేదా మీరు ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగిస్తే లాభాలు అందుకోగలరో   తెలియచేయరు. కాని మేము మీకు వ్యక్తిగతంగా  తెలుగులో మీకు కాన్సెప్ట్ అర్ధం అయ్యేలా  నేర్పడం వలన మీకు స్టాక్ మార్కెట్ పై గల అపోహలు అన్ని పోతాయి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి స్టాక్ మార్కెట్ అంటే మీరు సరియైన మార్గంలో అనాలసిస్ చేయగలిగితే సంపద స్ప్రుటించే సాధనం.మీరు ఏదో  షేర్లు కొన్నాం , అమ్మాం  అంటే తప్పకుండా నష్టాలే వస్తాయి. అలా కాకుండా మీరు స్టాక్ మార్కెట్ లో డబ్బులు సంపాదించాలి అంటే మీకు పూర్తీ అవగాహన అవసరం. మీరు ఒక బిజినెస్ లో డబ్బులు సంపాదించడానికి ఎంత కష్టపడతారో   స్టాక్ మార్కెటులో సంపాదించాలి అంటే కూడా దానిని కూడా ఒక బిజినెస్ గానే చూడాలి. అందువలన మీరు స్టాక్ మార్కెట్ పై  పట్టు సాధించాలి అంటే మేము మీకు నేర్పించే స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ ట్రైనింగ్ తీసుకోండి.గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్టుగా  మీరు టెక్నికల్ అనాలసిస్ నేర్చుకోవడానికి  ట్రైనర్ లేదా మెంటర్  తప్పనిసరి. మీరు ఒక్కరోజు స్టాక్ మార్కెట్ లో పొందే నష్టంతో టెక్నికల్ అనాలసిస్ నేర్చుకున్నట్టు ఐతే మీరు తర్వాత నుండి విజయవంతమైన ట్రేడర్ కాగలరు. మీరు టెక్నికల్ అనాలసిస్ నేర్చుకున్న తర్వాత కేవలం యాభై వేల రూపాయల పెట్టుబడితో  సంవత్సరం తిరిగే సరికల్లా ప్రతినెల లక్ష రూపాయలు యే విధంగా సంపాదిన్చావచ్చో మీకు వివరంగా తెలియచేయడం జరుగుతుంది.       
వివరాలకు   telugufinancialschool@gmail.com





 ఈ రోజు స్టాక్ మార్కెట్ 31-08-2012












నిన్న నిఫ్టీ 50 sma 5255 వద్ద సపోర్ట్ తీసుకొని రివర్స్ కావడం  జరిగినది. ఆదే విధంగా  నిఫ్టీ  పతనం జరగాలి అంటే  50 sma 5255 బ్రేక్ జరిగి ట్రేడ్ కావడం జరగాలి. అదే విధంగా రెసిస్టన్స్ వచ్చి 20 sma 5333 మరియు  5348 పైన ట్రేడ్ కావడం జరగాలి.ఈ రోజు వెలువడనున్న GDP డేటా కూడా మార్కెట్ ను ప్రాభావితం చేస్తుంది. పై లెవల్లో   5348  స్టాప్ లాస్ తో సెల్ చేయడం క్రింది లెవల్లో   5255 స్టాప్ లాస్ తో బై చేయడం మంచిది.


ఈ రోజు స్టాక్ మార్కెట్ 30-08-2012













ఈ రోజు ఈ నెల డేరివేటివ్స్ కాంట్రాక్ట్  చివరి తేదీ . నిఫ్టీ పతనం ఇంకా కొనసాగాడానికే అధిక   అవకాశం గలదు. నిఫ్టీ ఒకవేళ 5265 దిగినట్టు ఐతే  ఇది వరకు ఏర్పాటు ఐనటువంటి గ్యాప్ పూరించే అవకాశం కలదు. దానితో 5217 వరకు నిఫ్టీ దిగాజారగలదు.ఒకవేళ నిఫ్టీ 5302 పై ట్రేడ్ అవుతూ నిలదోక్కుకున్నట్టు ఐతే మాత్రం 5327, 5348 వెళ్ళడానికి అవకాశం కలదు.

మీరు తరుచుగా వినే రూపాయి విలువ పతనం కావడం అంటే అర్ధం ఏమిటి ?







డాలర్ తో పోలిస్తే రూపాయి  విలువ తగ్గడం గురుంచి ఈ మధ్య మీరందరూ తరుచుగా వింటూనే ఉన్నారు.ఈ మధ్య డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 57.32 చేరుకోవడం మీకు తెలిసే ఉంటుంది.. అసలు రూపాయి పతనం అంటే ఏమిటో ఒక్క సారి చూద్దాం. మార్కెట్ లో ఏదైనా ఒక వస్తువు ధర పడిపోయినప్పుడు దానిని కనుగోలు చేయాలి అనుకున్న వ్యక్తీ తక్కువ ధర చేల్లిస్తాడు అనే విషయం మీకు తెలుసుకదా ? అదే విధంగా  భారత దేశంలో నివసిస్తున్న మనం రూపాయిని  కనుగోలు చేయలేము. మనం ,మనకు కావలసిన రూపాయలను జీతం ద్వారా,  మనం అందించిన సేవల ద్వారా మాత్రమే పొందగలం.కాని మీరు ఒక్కసారి ఆలోచించండి.  విదేశాల నుండి మనం దేశానికి వచ్చే టూరిస్టులు కాని, విదేశాలలో ఉన్న మన బందువులు కాని మనకు డబ్బు పంపాలి అంటే  వారూ మన దేశ రూపాయిని కనుగోలు చేయాల్సి ఉంటుంది అంటే వారి వద్ద ఉన్న విదేశీ కరెన్సీని  మన దేశ కరెన్సీలో కి మార్చు కోవాల్సి ఉంటుంది. ఈ విధంగా వారూ వారి వద్ద గల 100 డాలర్లతో మన రూపాయిని కనుగోలు చేసినప్పుడు  ఇది వరకటి కంటే ఎక్కువ రూపాయలు పొందితే  రూపాయి విలువ తగ్గినట్టు.అంటే మార్కెటులో ధర తగ్గడం వలన వస్తువులు అధికంగా వచ్చినట్టుగా . ఉదాహరణకి గతంలో 100 డాలర్లకు 4500  రూపాయలు వస్తే ఇప్పుడు అదే 100 డాలర్లకు 5500 రూపాయలు వస్తున్నాయి.అంటే గతంతో పోలిస్తే అధిక రూపాయలు వస్తున్నాయి కదా ? మనం ఇది వరకు వంద రూపాయలు ఇచ్చి కొన్న వస్తువులు , ఈ సారి అదే వంద రూపాయలకు అవే వస్తువులు ఇదివరకటి కంటే ఎక్కువ వస్తే దాని అర్ధం వస్తువల ధర పడిపోవడమే కదా ? అదే విధంగా రూపాయి కూడా .

ఒక దేశ కరెన్సీ దాని స్వంత భౌగోళిక ప్రాంతంలో మాత్రమే చెల్లు బాటు అవుతుంది.దాని  భౌగోళిక ప్రాంతం వెలుపల డబ్బుతో సంభందమైన యే లావాదీవీ జరపాలన్న పరస్పర ఆమోదయోగ్యమైన  కరెన్సీ ద్వారా మాత్రమే లావాదేవీలు నిర్వహించవలసి ఉంటుంది. సాదారణంగా అంతర్జాతీయ లావాదేవీలకు  us డాలర్ ను పరస్పర ఆమోదయోగ్యమైన కరెన్సీగా వాడతారు. అందువలనే ఒక దేశ కరెన్సీ  యొక్క విలువని డాలర్ తో పోలుస్తారు. మనం మన రూపాయిని డాలర్ తో పోలుస్తున్నప్పుడు  USD –INR అని సంబోదించడం జరుగుతుంది. అంటే ఒక డాలర్ విలువ ఎన్ని రూపాయలకో సమానం అనే విషయం తెలియచేస్తుంది.ఉదాహరణకు USD –INR = 55 అంటే ఒక డాలర్ కి 55 రూపాయలు సమానం .

రూపాయి విలువ పతనం వలన మన దేశం అధిక  విదేశీ నిధులను పొందలేదు. అదే రూపాయి బలంగా ఉంటే అధిక విదేశీ నిధులను పొందడానికి  అవకాశం ఉంటుంది. రూపాయి విలువ పతనం కావడం అనేది గిరాకి ,సరఫరా ,ఆర్ధిక మరియు రాజకీయ కారణాలపై ఆధారపడి ఉంటుంది.

మన దేశం మన వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం , అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకోవడం చాలా సర్వసాధారణం. ఎగుమతి చేయడం ద్వారా విదేశీ మారకం పొందితే , దిగుమతి చేసుకున్న వస్తువులకు విదేశీ మారకం చెల్లించవలసి ఉంటుంది. ఇది సాదారణంగా us డాలర్ రూపంలోనే జరుగుతుంది.ఐతే మన దేశం ఎగుమతుల ద్వారా పొందే విదేశీ మారకం కంటే , చేసుకొనే దిగుమతులకు చెల్లించవలసిన విదేశీ మారకం ఎక్కువ కావడం వలన విదేశీ మారక ద్రవ్యలోటు ఏర్పడుతుంది.ఈ లోటు కొంత వరకు  NRIs పంపే డబ్బు, విదేశీ అప్పుల వలన తీరితే  మిగితా  లోటు పూరించడానికి మనం అంతర్జాతీయ  మార్కెట్ లో కనుగోలు చేయవలసి ఉంటుంది. ఎప్పుడైతే గిరాకీ అధికంగా ఉంటుందో  అప్పుడు దాని విలువ పెరుగుతుంది.దానితో మన రూపాయి విలువ తక్కువగా ఉంటుంది.  

మన దేశంలో ద్రవ్యోల్బణం అధికంగా ఉంది. దానిని తగ్గించడానికి రిజర్వు బ్యాంక్ వివిధ చర్యలు తీసుకున్నప్పటికి కూడా  ద్రవ్యోల్బణం దిగిరావడం లేదు .దీనివలన విదేశీ పెట్టుబడులు తగ్గడంతో  రావలసిన డాలర్ ప్రవాహం తగగ్డం వలన కూడా రూపాయి పతనం జరుగుతుంది.

సాదారణంగా దేశంలో భారీ విదేశీ మారకం నిల్వ ఉంటుంది. వాటి నుండి దేశం చేసుకొనే దిగుమతలకు కావాల్సిన మొత్తాన్ని చెల్లిస్తుంది. ఎప్పుడైతే విదేశీ మారక నిల్వలు తక్కువగా ఉంటాయో అప్పుడు మన అవసారాలకు సరిపడా డాలర్ కనుగోలు చేయవలసి ఉంటుంది. దానితో రాపాయి విలువ తగ్గిపోతుంది.

 దేశం చేసే స్వల్ప కాలిక ఋణాలు చెల్లించడానికి  డాలర్లు సేకరించవల్సి  ఉంటుంది. దానితో డాలర్ విలువ పెరిగి రూపాయి పతనం కావడం జరుగుతుంది.

దేశంలో అధికారంలో ఉన్న పార్టీ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా బలహీన ప్రభుత్వం అనడానికి పరోక్షంగా ఎన్నో సంకేతాలు ఉన్నాయి. పాలక పార్టీ ఎన్నో విధాన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకంజ వేయడం జరుగుతుంది. దీనివలన విదేశీ పెట్టుబడి దారులు మన ఆర్ధిక వ్యవస్థపై సందేహంతో పెట్టుబడి పెట్టడానికి వేనుకాడతారు.  ఇది కూడా రూపాయి విలువపై  ప్రభావం చూపిస్తుంది.
రూపాయి పతనం వలన ఎవరికి లాభమో తదుపరి తెలుసుకుందాం.