ఈ వారం స్టాక్ మార్కెట్ 31-12-2012 to 04-01-2013

ఈ వారం స్టాక్ మార్కెట్ 31-12-2012  to 04-01-2013
నిఫ్టీ గత పదమూడు ట్రేడింగ్ సెషన్స్ నుండి కేవలం 5823-5930 మధ్య మాత్రమే కదలాడటం జరుగుతుంది. మీరూ నిఫ్టీ మూమెంట్ గమనించినట్టు ఐతే నవంబర్ ర్యాలీ అనంతరం 21 ట్రేడింగ్  సెషన్స్ నుండి కేవలం 5823-5965  మధ్య మాత్రమే కదలాడటం జరుగుతుంది.అందువలన నిఫ్టీ లో ట్రేడింగ్ చేసేముందు బ్రేక్ అవుట్ జరిగే వరకు  సపోర్ట్ వద్ద బై చేయడం , రెసిస్టన్స్ వద్ద సెల్ చేయడం మంచిది.ప్రస్తుతం మార్కెట్ మూమెంట్ బై సపోర్ట్, సెల్ రెసిస్టన్స్ అనే విధంగా ఉంది.
అదే విధంగా గత కొన్ని రోజులుగా బ్యాంక్ నిఫ్టీ కూడా 12200-12600 మధ్య కదలడం జరుగుతుంది.బ్యాంక్ నిఫ్టీ 12580  క్రాస్ చేసి నిలదొక్కుకున్నట్టు ఐతే 12800-13100  వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది.   

స్టాక్ మార్కెట్ టిప్స్ ప్రొవైడర్స్ ప్రజలను ఏవిధంగా మోసం చేస్తారో చూద్దాం.



స్టాక్ మార్కెట్ టిప్స్ ప్రొవైడర్స్ ప్రజలను ఏవిధంగా మోసం చేస్తారో చూద్దాం.
స్టాక్ మార్కెట్ టిప్స్ పోవైడర్స్  దగ్గర  సుమారు పదివేల మంది ఈమెయిల్స్ లేదా సెల్ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి. ఈ పదివేల మందిని రెండు గ్రూపులు గా విభజించి  వాటిలో ఒక గ్రూప్ కి  బైకాల్   , రెండవ గ్రూప్ కి సెల్ కాల్  ఇస్తారు. ఈ విధంగా పంపించిన కాల్స్ లో ఒక గ్రూప్ కి  తప్పనిసరిగా కరెక్ట్  కాల్స్  వేళ్ళుతాయి
.కరెక్ట్ ఐనా   గ్రూప్ ను  మరల రెండు గ్రూప్ లుగా విభజించి ఒక గ్రూప్ కి  బైకాల్   , రెండవ గ్రూప్ కి సెల్ కాల్  ఇస్తారు .ఈ విధంగా ఆరుసార్లు చేయడం వలన  అన్ని సార్లు కేవలం  నూట యాభై ఆరు మంది మాత్రమే  కరెక్ట్ కాల్స్ పొందుతారు.ఇప్పడు ఈ నూట యాభై ఆరు మంది కి టిప్స్ పోవైడర్స్  మీదా చాలా నమ్మకం ఏర్పడి  వారిలో కనీసం ఇరవై , ముప్పై శాతం మంది  వారి టిప్స్ కోసం తప్పకుండా మనీ చెల్లిస్తారు.టిప్స్ ఇవ్వడానికి వారు చార్జీలు సుమారు పదివేల నుండి యాభైవేల వరకు తీసుకుంటారు.కేవలం ఆరు రోజులు ఈ విధంగా టిప్స్ ఇచ్చి అమాయకులను , అవగాహన లేని వాళ్ళను బుట్టలో వేసుకుంటారు. కాబట్టి  మీరు ఇలాంటి వారి మాయలో  పడి  నష్టాల పాలు మాత్రం కావద్దు.అందరూ అలాగే ఉంటారు అని కాదు కాని ఎక్కువ శాతం ఇలాగే ఉంటారు.  అందుకే మీరు  ఆర్ధిక విషయాలపై   ఇతరుల పైన అధారాపడకుండా   మీరు అవగాహన కల్పించుకోవడం మంచిది. నా వద్ద  కనీసం మన దేశంలో  1000 మంది టిప్స్ అందించే వారి జాబితా కలదు. అందులో  కేవలం పది శాతం మంది మాత్రమే మార్కెట్ పై అవగాహన  కలిగిన వారూ  మాత్రమే. మిగితా వారూ కేవలం అమాయక ప్రజలతో ఆటలాడుకునే వారు మాత్రమే.మీరూ ఒక్క విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సాదారణంగా మనుషుల మనస్తత్వాలు ఒక్కో రకంగా ఉంటాయి. అందులో డబ్బూ సంగతి దగ్గరికి వచ్చే సరికి చెప్పవలసిన పని లేదు.వాస్తవ ట్రేడింగ్ సమయంలో ఒక్కో మనిషి ఎమోషన్స్ ఒక్కో రకంగా ఉంటాయి. టిప్స్ అందించే వారూ ఎంత సమర్ధవంతమైన వ్యక్తీ ఐనప్పటికీ  మీరూ ఆ టిప్స్ ద్వారా లాభాలు అందుకోవడం అనేది చాలా కష్టం. నేను నా  పన్నెండు సంవత్సరాల అనుభవంలో ఎందరో ట్రేడర్స్  నెలకు 500-100000 (లక్ష)  టిప్స్ కోసం చెల్లించి కూడా నష్టపోయిన వారిని చూడటం జరిగినది. అందులో ఎంతో పేరొందిన అనలిస్టుల వద్ద కూడా టిప్స్ పొందడం జరిగినది. దురదృష్టం  కొలది ఎంతో పేరొందిన వారూ అనుకున్న వారూ కూడా మార్కెట్ పై ఎలాంటి అవగాహన లేకుండా టిప్స్ అందించడం జరిగినది.అందుకే దయచేసి ఎవ్వరిని కూడా టిప్స్ పై ఆధారపడకుండా మీ స్వంతంగా , మీ స్వయం నిర్ణయాలపై  అధారపడండి .  ఎప్పుడూ కూడా ఇతరులపై అధారపడకండి.. మీకూ తెలివి ఉంది. మార్కెట్ గురించి నేర్చుకోండి. ఎంత కాలం పరాన్న జీవుల వలె బ్రతుకుతారు.మీ స్వయం శక్తి పై మార్కెట్ లో నిలబడండి. టెక్నికల్ అనాలసిస్   మీదా పేరొందిన వ్యక్తుల వద్ద నేర్చుకోండి. మంచి ట్రేడింగ్ సాప్ట్ వేర్  మన  మన రాష్ట్రానికి చెందిన ఐ చార్ట్ కంపెనీ కొన్ని సంవత్సరాల నుండి అతి తక్కువ ధరకే అందించడం జరుగుతుంది.మీకూ  టెక్నికల్ అనాలసిస్ వస్తే  మీరూ ఏ సాప్ట్ వేర్   ఉపయోగించిన దాని వలన లాభ పడవచ్చు. ఎందుకంటె లెక్కల సూత్రం ఏ మాస్టారు చెప్పిన ఒక్కటే. ఆ లెక్కల ప్రాథమిక సూత్రం తెలిస్తే మీరూ సులభంగా లెక్కలు చేయవచ్చు.

ఈ ఆర్టికల్ వ్రాయడానికి ముఖ్య కారణం చాలా మంది నుండి వస్తున్న మెయిల్స్ . మేము ఫలానా టిప్స్ అందించే వారికి డబ్బూ చెల్లించాలి అనుకుంటున్నాం మీ సలహా ఏంటి.కొంత మంది ఎలాంటి బ్రోకరేజి లేదు మీరూ ఎంతయినా ట్రెడింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు దయచేసి మీ సలహా చెప్పండి అని అడుగుతున్నారు. నా ప్రయత్నం కేవలం  మీరెవరూ స్టాక్ మార్కెట్ మోసగాళ్ళ వలలో పడకుండా మీరూ స్వయంగా స్టాక్ మార్కెట్ నిర్ణయాలు తీసుకొనేలా ఎదిగేలా మీకూ తోడ్పాటు అందించడమే.నేను మీకూ చెప్పేది ఒక్కటే  learn to earn , earn to learn       

 

స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ పరిచయం -1

స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్  పరిచయం -1

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి అనునది రెండు విశ్లేషణ పద్దతుల ద్వారా జరుగుతుంది. మొదటిది  ఫండమెంటల్ అనాలసిస్ ,రెండవది టెక్నికల్ అనాలసిస్ .ఫండమెంటల్  అనాలసిస్ అనగా కంపనీ యొక్క బాలన్స్ షీటు,డివిడెండ్,కంపనీ యొక్కబుక్ వాల్యూ,E.P.S(Earning per share),P/E రేషియో,PEG రేషియో  మొదలగు వాటి గురుంచి తెలియచెస్తుంది..అంతే కాకుండా  ఫండమెంటల్  అనాలసిస్ లో గమనించవలసినది ప్రమోటర్ల  చరిత్ర ,వాతావరణం ,ఎంపిక చేసుకున్న రంగం,కంపనీ యొక్క ఎగుమతులు, దిగుమతులు ,రాబోయే కాలం లో కంపెనీ విస్తర , ఉత్పత్తి చేయు పొడక్ట్ యొక్క సప్లయ్ మరియు డిమాండ్, భవిష్యత్తు అంచనా ,  ప్రభుత్వం యొక్కనిర్ణయాలు  కంపెనీమీద  విధంగా ప్రభావితం చూపిస్తాయి అనే మొదలగు విషయాల మీద ఆధారపడి ఉంటుంది.  ఇక్కడ మనం పూర్తిగా టెక్నికల్ అనాలసిస్ గురించి తెలుసు కొంటున్నాం కావున ఫండమెంటల్ అనాలసిస్  గురుంచి  లోతుగా వెళ్ళడం లేదు
 టెక్నికల్  అనాలసిస్ అనగా సెక్యూరిటీ ధర యొక్క గత ప్రవర్తన ఆధారంగా రాబోవు కాలం లో ఆ షేర్ ధర ఏ విధంగా  ఉండగలదో ఉహించ గలగడమే టెక్నికల్ అనాలసిస్. టెక్నికల్ అనాలసిస్ నందు గతంలో  సెక్యూరిటీ  ధర యొక్క మార్పులు మరియు వాల్యూమ్ పరిమాణాన్ని చార్ట్ రూపంలోఉంచి దానిని విశ్లేషించడం ద్వారా భవిష్యత్తులో  సెక్యూరిటీ యొక్క ధరని అంచనా వేయడం జరుగుతుంది. టెక్నికల్ అనాలిసిస్ అనగా మార్కెట్ ని అధ్యయనం చేయడం.ఇక్కడ సెక్యూరిటీ అనగా స్టాకులుఇండెక్స్ ,బాండ్స్ మొదలగునవి .ఈ   రోజులలో షేర్ మార్కెట్ లో ప్రోపెనల్స్ ,  రిటరైనవారు ,స్టూడెంట్స్, గృహిణులు  మొదలగు అన్ని రంగాలవారు ప్రవేశిస్తున్నారు.అంతేకాకుండా   షేర్ మార్కెట్ కూడ చిన్న పట్టణాలకు విస్తరించడం తో కొత్తవారు చాలామంది  ప్రవేశిస్తున్నారు .ఈ రోజులలో  కంప్యూటర్లు మరియు  ఇంటర్నెట్ అనేది సులభంగా  అందరికి అందుబాటులో ఉండడం తో ట్రేడర్స్ మార్కెట్ యొక్క మొత్తం డెటానీ విశ్లేషించడం ద్వారా వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకోగలుగుతున్నారు . కానీ మార్కెట్లోకి  కొత్తగా వస్తున్న చాలా  మంది  వారిదగ్గర  కంప్యూటర్స్ మరియు  చార్టింగ్  సాఫ్టవేర్ ఉన్నప్పటికిని దానిని సరియగు పద్దతిలో  ఉపయోగించుకోకుండా  స్వంతంగా నిర్ణయాలు తీసుకోలేక బ్రోకర్స్ మరియు టిప్స్  అందించే వారి మీద ఆధారపడుతుంటారు.
ముఖ్య గమనిక :మీరు  టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా ఒక పద్ధతి  ఎంచుకొని దానినే స్థిరంగా  మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్ మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ సాధ్యం అవుతుంది.  http://telugufinancialschool.blogspot.in/2012_09_01_archive.html