నెంబర్ 72 మహత్యం


నెంబర్ 72  మహత్యం 

సాదరణంగా చాలా మందిని ఒక సందేహం   ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. అదేమిటంటే   వారి డబ్బు ఎంత కాలంలో రెట్టింపు అవుతుంది అనే విషయం. చక్రవడ్డీ తో మీరు పొదుపు చేసిన డబ్బు  ఎంతకాలంలో రెట్టింపు అవుతుంది తెలుసుకోవాలి అంటే  మీరు నెంబర్  72 గురించి తప్పకుండా తెలుసుకోవలసినదే. ఈ ఫార్ములా ని శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ అవిష్కరించెను . ఇది చాలా సులభం వడ్డీ రేటు తో 72 ను భాగిస్తే చాలు . మీ సొమ్మూ ఎంత కాలంలో రెట్టింపు అవుతుందో సులభంగా తెలిసిపోతుంది. ఉదాహరణకు వడ్డీ రేటు 12 శాతం అనుకుంటే మీ డబ్బు 8  సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది.అదెలాగంటే  72/12=8.  ఈ విధంగా  72 సంఖ్యా ద్వారా మీ దబ్బు రెట్టింపు  జరిగే కాలాన్ని సులభంగా లెక్కించవచ్చు.వడ్డీ రేటు స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమె ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది.మీరు రూ.  2,500  లను 9% శాతం వడ్డీ కి ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు  72/9= 8.  సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది.

ధనవంతులు కావడానికి ఉన్న అవకాశాలు

ధనవంతులు కావడానికి ఉన్న అవకాశాలు
ధనవంతులు  ఏ విధంగా కావచ్చు అని ఎవ్వరిని అడిగిన చెప్పే సమాధానం . బాగా సంపాదించు  లేదా కోరికలను తక్కువగా కలిగి ఉండి  అధికంగా అదా చేయడం అని చెప్తారు. కాని చాలా మంది రెండిటిలో దేనిలో కూడా ప్రావీణ్యం కలిగి ఉండలేరు.చాలా  మందికి  అధిక కోరికలు  ఉంటాయి కాని అధిక సంపాదన మాత్రం ఉండదు. చాలా మంది ఇతర  మార్గాలా ద్వారా ధనవంతులు  కావడం జరుగుతుంది.  మనం ఒక్కసారి ఆ మార్గాలు ఏమిటో పరిశీలిద్దాం.
మీరు ధనవంతులైన  అమ్మాయిని లేదా అబ్బాయిని పెళ్లి చేసుకోవడం. 
చాలా మందికి ధనవంతులు కావడానికి సులభంగా ఎన్నుకొనే మార్గం. ఈ రోజుల్లో దాదాపుగా ప్రతి పెళ్లి వెనుక డబ్బు ప్రముఖ పాత్ర వహిస్తుంది.కాని ఇక్కడ ఒక్క విషయం కేవలం డబ్బుపై ప్రేమతో అమ్మాయి లేదా అబ్బాయి పై ప్రేమ లేకుండా  పెళ్లి చేసుకోవడం వలన  జీవితంలో  ఇబ్బందుల పాలు తప్పకుండా పడతారు.
మోసగాడు లేదా నిజాయితీ లేని వ్యక్తిగా మారడం.
చాలా మంది లీగల్ గా నిజాయితీ తో ధనవంతులు కాలేము అనే ఉద్దేశంతో  ఇల్లీగల్ మారగాన్ని అంటే మోసపూరిత మార్గాన్ని ఎన్నుకుంటారు.  కాని ఈ మార్గంలో ఎప్పటికైనా జైలు కి వెళ్ళాక తప్పదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.ఈ మార్గం ఎన్నటికి అనుసరణీయం కాదు.
వంశ పారంపర్యంగా ధనవంతులు కావడం. 
ఉదాహరణకు మీ తాత లేదా తండ్రిగారు ధనవంతులు ఐతే  , ఆ ఆస్థి వారసత్వంగా మీ వద్దకు చేరుకోవడం వలన కూడా ధనవంతులు  కావచ్చు. కాని  మీ సంపాదన ద్వారా  మీరు ధనవంతులు ఐతే ఉండే ఆనందం దీనిలో ఉండదు.అంతే కాకుండా ఇలా వారసత్వంగా ధనవంతులు కావడం అనేది అందరికి ఉండే అవకాశం మాత్రం కాదు.
లాటరీ గెలుపొందడం వలన ధనవంతులు కావడం.
ఈ మార్గం ద్వారా ధనవంతులు కావడం  మంచిదే. కాని ఈ విధంగా ధనవంతులు కావాలి అని మీరు ఎదిరి చూడటం గాలిలో దీపం లాంటిది.చాలా మంది లాటరీ గెలుస్తాం అనే ఆశతో లాటరీ టిక్కెట్లు కొనడం చూస్తేనే ఉంటాం. కాని  ఈ విధంగా ధనవంతులు కావదానికి ఉండే అవకాశం చాలా తక్కువ..
సినిమా స్టార్ లేదా గొప్ప స్పోర్ట్ స్టార్  కావడం
మీరు చాలా అందంగా ఉండి  మీ వద్ద టాలెంట్ ఉంటే మీరు సినిమా స్టార్ లేదా టి వి స్టార్  కావడం లేదా మీకు ఏదైనా ఆటలో మంచి ప్రావీణ్యం ఉంటే  గొప్ప స్పోర్ట్ స్టార్  కావడం వలన కూడా మీరు ధనవంతులు కావచ్చు.
ధనవంతులు కావాలి కోరిక మీలో అధికంగా ఉండటం.
కొంత మందికి ధనవంతులు కావలి అనే కోరిక చాలా అధికంగా ఉంటుంది. ఇలాంటి వారూ ,వారి లక్ష్యాల కోసం చాలా కష్టపడతారు. వారి లక్ష్యం కోసమా వారి వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేయవలసి ఉంటుంది.
ఆర్ధికంగా పూర్తీ అవగాహన కలిగి  ఉండటం. 
కొంత మంది ఆర్ధిక విషయాల పట్ల పూర్తీ అవగాహన కలిగి ఉండి  సరియైన సమయంలో , సరియైన విధంగా ఫైనాన్సియల్ ప్లానింగ్ ఏర్పాటు చేసుకొని ధనవంతులు కావడం జరుగుతుంది. దీని కోసం మీరు ఆర్ధిక విషయాలు నేర్చు కోవలసి ఉంటుంది.
చాలా మందికి సేవ చేయడం.
ఇక్కడ సేవ చేయడం అంటే  సామాజిక సేవ చేయడం కాదు. మీరు ఉద్యోగస్తులూ  ఐతే మీ సర్వీసు కొంత మందికే మాత్రమే అందించ బడుతుంది దానికి మీరు జీతం అందుకుంటారు .అదే మీరు వ్యాపారస్తులూ ఐతే చాలా మందికి సేవ చేయవచ్చు. దాని ద్వారా మీ వ్యాపారం సులభంగా అభివ్రుద్ది చెందడంతో మీ కోరిక నెరవేరుతుంది.కాని ఈ పద్దతిలో మీరు ధనవంతులో కావాలి అంటే మాత్రం మీరు మీ ఉద్యోగాన్ని వదిలి మీ స్వంత బిజినెస్ ప్రారంభం చేయాల్సి ఉంటుంది.

ఈ రోజు స్టాక్ మార్కెట్ 28-09-2012


ఈ రోజు స్టాక్ మార్కెట్ 28-09-2012
సెప్టెంబర్ సీరీస్ కాంట్రాక్ట్ ముగియడం జరిగినది. ఈ వారంలో నిఫ్టీ అటు ఇంతకు ముందు ఏర్పాటు చేసినటువంటి హై 5720 ను కాని, క్రింది వైపు మీకు ఇదివరకే తెలియచేసిన సపోర్ట్ 5648క్రింద ముగియడం కాని జరగలేదు.కాకపోతే  5640 వద్ద డబల్ బాటం పాటర్న్ ఏర్పాటు కావడం జరిగినది.ఇది బుల్లిష్ పాటర్న్ .నిఫ్టీకి తక్షణ మద్దతు 5640, 5618  వద్ద కలదు. నిఫ్టీ 5600  కంటే క్రిందికి క్లోసింగ్ కానంత వరకు  లాంగ్ పొజిషన్స్ కి  ఎలాంటి  ఇబ్బంది లేదు. రెసిస్టన్స్   5680, 5700, 5720  వద్ద కలదు 

రాష్ట్ర ప్రభుత్వాలు VAT విధించి ఇన్ఫ్లేషన్ పెరగడానికి ఏ విధంగా కారణం అవుతాయో తెలుసుకుందాం?


రాష్ట్ర ప్రభుత్వాలు VAT విధించి  ఇన్ఫ్లేషన్ పెరగడానికి ఏ విధంగా కారణం అవుతాయో తెలుసుకుందాం?
మీకు అవగాహన ఉందో లేదో తెలియదు కాని ప్రభుత్వాలు ప్రజల  నుండి వివిధ రూపాలలో  ఇరవై  రకాల పన్నులను వసూలు చేస్తున్నాయి . వాటిలో అత్యంత ప్రముఖమైనవి ఇనకం టాక్స్ , సర్వీస్ టాస్క్ .ప్రజల వద్ద నుండి ప్రభుత్వం వసూలు చేసిన మొత్తం తో దేశాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు ,రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాలు మొదలగునవి  సమకూర్చుకోవడానికి వినియోగిస్తారు.

ఈ రోజు  ప్రజలూ సంపాదిస్తున్న మొత్తంలో అధిక శాతం టాక్స్ లు చెల్లించడానికే  పోతుంది. సాదారణంగా ప్రజలూ వారూ చెల్లించే పన్నుల ద్వారా దేశాభివృద్ది జరుగుతుంది అని ఆశిస్తారు. కాని ఈ పన్నులు ఒక ప్రజల యొక్క ఆర్ధిక పరిస్థతి ని చాలా దారుణంగా ప్రభావితం చేస్తున్నాయి.  
ముందుగా మీరు ఇన్ఫ్లేషన్ గురుంచి అర్ధం చేసుకోండి. ఈ ఇన్ఫ్లేషన్ మరియు టాక్స్ లు ప్రజల ఆర్ధికస్థితి పై ఏ విధమైన ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకుందాం. మీకు ఇన్ఫ్లేషన్ గురుంచి వివరంగా తెలుసుకోవాలి అంటే క్రింద ఇవ్వబడిన లింక్స్ పై క్లిక్ చేసి చదవండి.


రోజు రోజుకి వస్తువులా ధరలు పెరుగుతున్నాయి   అనే విషయం మీ అందరికి తెలుసు. చాలా మంది ప్రభుత్వం ఈ ధరల పెరుగుదలని అరికట్టడానికి ఇన్ఫ్లేషన్  పెరుగుదలని అరికట్టడానికి తగు చర్యలు తీసుకోవాలి అని బావిస్తుంటారు.వాస్తవానికి ప్రభుత్వం ఏమైన  చర్యలు తీసుకుంటుందా. మీరు ఒక్కసారి గత పది సంవత్సరంల నుండి ఇన్ఫ్లేషన్ రేటు ఏ విధంగా ఉందో ఒక్కసారి క్రింది పట్టికలో చూడండి.

Year
Inflatation rate
Apr -03
5.12%
Apr -04
2.23%
Apr -05
4.96%
Apr-06
4.65%
Apr-07
6.67%
Apr-08
7.81%
Apr-09
8.70%
Apr-10
13.33%
Apr-11
9.41%
Apr-12
10.22%
  పై పట్టికను గమనిస్తే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా  ఇన్ఫ్లేషన్ పెరుగుతూనే ఉంది.సాదారణ మధ్యతరగతి కుటుంబం ఒక్కప్పుడు ప్రతి నెల రూ 10,000 లతో ఇంటి ఖర్చులు సరిపెట్టుకుంటే ఇప్పుడు అదే కుటుంబానికి రూ .  30,000  లు కూడా సరిపోవడం లేదు. దీనికి ప్రభుత్వం చెప్పే సమాధానం లైఫ్ స్టైల్ లో మార్పు . కాని వాస్తవం వేరే  ఉంది. అదేమిటో ఒక్కసారి చూద్దాం.
VAT( value added tax ) అనేది రాష్ట్ర ప్రభుత్వం విధించే టాక్స్ .దాని పేరు లోనే ఉన్నట్టుగా వస్తువుకి  అదనపు విలువ కలవడం వలన వస్తువు ధర పెరిగి వస్తువు ధర మరింత అధికం  కావడానికి కారణం అవుతుంది.ఈ టాక్స్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళుతుంది. ఈ టాక్స్ రేటు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది. మీరు వస్తువులపై  ఎంత వ్యయం చేస్తే అంత అధికంగా పన్ను చెల్లించవలసి ఉంటుంది.
సాదారణంగా పెట్రోలు , డిజీల్  మరియు గ్యాస్ ప్రతిఒక్కరికి అవసరమైనవి. ప్రస్తుతం ఇవి లేకుండా జీవితాన్ని ఉహించలేం . వస్తువులు రవాణా చేయడానికి ఇందనం తప్పనిసరి . ఈ ఇందనం ధర పెరగడం వలన రవాణా చార్జీలు పెరిగి వస్తువులా ధరలు పెరగడానికి కారణం అవుతాయి.అంటే ఇందన ధరలు పెరిగితే , వస్తువుల ధరలు పెరగడంతో , ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది.
ఉదాహరణకు ఒక వస్తువు ధర రూ 20 ఆయితే  ఇంధన ధరలు పెరగడం వలన రవాణా చార్జీలు పెరిగి ఆ వస్తువు ధర రూ 25 అవుతుంది.
మీకు తెలుసా ? ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం  దేశంలోకెల్లా అత్యధికంగా  34% టాక్స్  వసూలు  చేస్తుంది.ఉదాహరణకు లీటరు పెట్రోలు రూ 75 ఉంటే మీరు  చెల్లించే  డబ్బులలో రూ .25.50 ప్రభుత్వానికే వెళ్తాయి.అదే గోవాలో ఐతే కేవలం 0.1% మాత్రమే  పెట్రోలు పై వ్యాట్ విధిస్తున్నారు.దీనివలన రూ 11 తక్కువకే పెట్రోలు అక్కడ దొరుకుతుంది.గోవా ప్రభుత్వం ఈ విధంగా ప్రజలకోసం తక్కువ వ్యాట్ వసూలు చేస్తున్నప్పుడు మిగితా రాష్ట్రాలు ఆ విధంగా ఎందుకు చేయలేకపోతున్నాయి.వివిధ రాష్ట్రాలలో వ్యాట్ ఏవిధంగా ఉందో ఒక్కసారి చూద్దాం ..

State
Petrol
diesel
Andharapradesh
34%
23%
Arunachalapradesh
20%
20%
Assam
27.50%
16.50
Chattishgarh25%
25%
25%
Delhi
20%
20%
Goa
0.10%
19%
Gujarath
23%
21%
Haryana
20%
12%
Himachalapradesh
20%
14%
Madhyapradesh
30.04%
-
Maharasra
26%
24%
Punjab
32.69%
8.80%
Rajasthan
28.89%
18%
Tamilnaadu
33%
30%
Westbengal
26.87%
-
మనం పెట్రోలు పై మాత్రమే కాకుండా మనం కనుగోలు చేస్తున్న ప్రతి వస్తువుపై 5 % to 15%వరకు రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ వసూలు చేస్తుంది. దీని వలన వస్తువు యొక్క ధర పెరగడమే కాకుండా ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. అదే ప్రభుత్వాలు వ్యాట్ తగ్గిస్తే ధరలు తగ్గి , ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది. కాని రాష్ట్ర ప్రభుత్వాలు ఆవిధంగా మాత్రం చేయవు. వాటికి ఇన్ఫ్లేషన్ పెరిగి ప్రజలూ ఇబ్బందులపాలు ఐనా పర్వాలేదు. కాని వాటి ఆదాయాన్ని పోగొట్టుకోవడానికి మాత్రం ఇష్టపడవు.ఇది మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం 12.36%  సర్వీసు  టాక్స్ కూడా వడ్డిస్తూనే ఉంది..
చాలా మంది ఇంతకు ముందు గోవాకి అక్కడి సుందర దృశ్యాలు. బీచ్ లు చూసి వస్తూ , వస్తూ కాజు కొనుక్కొని వచ్చే వాళ్ళు . ఇప్పుడు మాత్రం పెట్రోలు కూడా కొనుక్కొని వస్తున్నారు




ఇన్ఫ్లేషన్ అనగా ఏమి ? దాని ప్రభావం మనపై ఏ విధం గా ఉంటుంది? part -2


ఇన్ఫ్లేషన్ అనగా ఏమి ? దాని ప్రభావం మనపై ఏ విధం గా ఉంటుంది?  part -2

ఇన్ఫ్లేషన్ మీ ఆర్ధిక స్థితి గతులపై చాలా తీవ్రమైన ప్రభావం చూపెడుతుందిఇన్ఫ్లేషన్  అనేది ధరలలో  పెరుగుదలను కొలిచే ఒక సాధనంఇన్ఫ్లేషన్ కనుక  6% ఉంది  అంటే సగటున  ధరలలో 6%  పెరుగుదల  నమోదు ఐనట్టు  అంటే   వస్తువు కాని గత సంవత్సరం రూ  100 ఉంటే అదే వస్తువు ప్రస్తుతం రూ 106   లభ్యమవుతుందిఇన్ఫ్లేషన్  6%  మాత్రమే  నమోదు అవుతుంది  అనుకుంటే  రోజు రూ  100 విలువ పది సంవత్సరాల తర్వాత Rs 53.86 గానూ ,ఇరవై సంవత్సరాల తర్వాత రూ  29.01 గానూ మాత్రమె  ఉంటుందిఅంటే రూపాయి విలువ దారుణంగా తగ్గిపోతుంది.  అందుకే ఎప్పుడు కూడా మీ ఇన్వెస్ట్మెంట్ పై రాబడి ఇన్ఫ్లేషన్ కంటే అధికంగా ఉన్నప్పుడే  మీరు నిజమైన రాబడి అందుకున్నట్టు.

సాదారణంగా మీరందరూ  బ్యాంక్ లో ఫిక్సెడ్ డిపాజిట్  చేసి దాని మీదా  8.5 % నుండి 9.0% వడ్డీ   వస్తుంది  అని చాలా మంది సంతోషపడుతుంటారు . మీకు 9.0% వడ్డీ   వస్తుంది అంటే సంవత్సరం తర్వాత మీ రూ  100  వడ్డీ తో కలిపి రూ  109  అవుతుంది బాగానే ఉంది మీ వంద పై తొమ్మిది రూపాయల రాబడి  వచ్చినది అనుకుంటున్నారు . కాని,   మీ బ్యాంక్ వడ్డీ పై సాదారణంగా   3% నుండి 3.5% టాక్స్ చెల్లించాల్సి వస్తుంది.  ఇక మిగిలినది రూ . 106 కాని, ఇన్ఫ్లేషన్    ఉండనే ఉంది.  అంటే మీరు గత సంవత్సరం వంద రూపాయలకు కొన్న వస్తువు ఈ రోజు నూట ఆరు రూపాయలు . ఇక మీకు వచ్చిన రాబడి ఎక్కడ ?
ఇన్ఫ్లేషన్ మీ కొనుగోలు సామర్ధ్యం ను తగ్గించి వేస్తుంది.సాదారణంగా సంప్రదాయ ఇన్వెస్టర్స్ రిస్కు లేకుండా  ఉండటానికి అని  బ్యాంక్ లేదా  డేట్  సాధనాలలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. మీకు వచ్చే రాబడి కేవలం  ఆరు నుండి ఏడు శాతం ఉండి , ఇన్ఫ్లేషన్ కూడా ఏడు శాతం వరకు ఉంటే మీకు వచ్చే రాబడి ఎమి ఉండదు.  అదే విధంగా సేవింగ్ ఖాతా లో చాలా మంది సొమ్మూ ఉంచేస్తారు. ఇది కూడా పద్ధతి కాదు . ఈ విధంగా చేయడం వలన మీ సొమ్మూ యొక్క విలువ తగ్గి పోతుంది తప్ప ఎట్టి పరిస్తుతులల్లో  విలువ పెరుగదు. కేవలం సేవింగ్ ఖాతాలో మీ ఎమర్జేన్సీ ఫండ్   తప్ప అంతకంటే అధిక సొమ్మూ ఉంచరాదు.