ఈవారం స్టాక్ మార్కెట్10-09-2012to14-09-2012
గత వారం ఆరో
తేదిన సమావేశమైన యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ బాండ్ల కనుగోలుకు సంభందించి కీలక నిర్ణయం తీసుకోవడం
మరియు క్రింది లెవల్లో నిఫ్టీ కి మదతు రావడంతో కనుగోల్లు జరిగి నిఫ్టీ కీలక
రెసిస్టన్స్ 5348 మరియు 20 sma 5330 పైననే ముగియడం జరిగినది.అంతే కాకుండా
కీలకమైన 20 sma 5330 పైన శుక్రవారం రోజు ముగిస్తే మార్కెట్ లో ర్యాలీ మరింత కొనసాగడానికి అవకాశం
కలదు అనే విషయం మీకు తెలియచేడం జరిగినది.ఇక ఈ వారానికి వస్తే మార్కెట్ ను ప్రభావిత
చేసే అంశాలు పన్నెండో తేదీ బుధవారం నాడు
వెలువడనున్న IIP డేటా , తదుపరి ద్రవ్యోల్భణం మొదలగునవి మార్కెట్
ను ప్రభావితం చేస్తాయి. అదే విధంగా వచ్చే
సోమవారం జరుగనున్న రిజర్వు బ్యాంక్ సమావేశం కూడా కీలకమే.
నిఫ్టీ
టెక్నికల్ అనాలసిస్ విషయానికి వస్తే పై చార్ట్ లో మార్క్ చేసిన పాయింట్ల వద్ద
ట్రెండ్ లైన్ సపోర్ట్ పొందిన ప్రతిసారి మంచి ర్యాలీ రావడం జరిగినది. ఈ సారి కూడా
నిఫ్టీ ట్రెండ్ లైన్ వద్ద సపోర్ట్ తీసుకోవడం జరిగినది. గత చరిత్ర ప్రకారం చూస్తే నిఫ్టీ లో ర్యాలీ ఈ సారీ కనీసం 5520 వరకు జరుగగలదు
అని అంచనా వేయడం జరుగుతుంది.అంటే ఇది ఒక్కరోజు లో జరిగే పని కాదు. ఈ నెలలో మాత్రం చేరుకోవడానికి అత్యధిక అవకాశం మాత్రం కలదు . అదే అదే విధంగా లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ రెసిస్టన్స్ 5331 పైన నిఫ్టీ
ట్రేడ్ జరుగుతున్నంత వరకు బుల్ల్స్ కి ఎలాంటి ఇబ్బంది లేదు.
అదే విధంగా పై
చార్ట్ గమనిస్తీ నిఫ్టీ కీలకమైన 5190-5200 సపోర్ట్ పైననే ముగియడం జరిగినది. ఇది 50% ఫిబోనసీ రేషియో . అదే విధంగా మార్కెట్ లో ర్యాలీ
జరగాలి అంటే ఎప్పుడూ కూడా నిఫ్టీ 50% ఫిబోనసీ రేషియో పైననే ఉండటం జరగాలి. అందుకోసమే మీకు గత వారం 5190-5200 కంటే నిఫ్టీ
కిందకు దిగాజారనంత వరకు లాంగ్ పోజిశాన్స్ తీసుకోవడానికి ఎలాంటి భయం అవసరం లేదు,
క్రింది లెవల్లో కనుగోలు చేయండి అని తెలియచేయడం జరిగినది.ఈ వారం ప్రతి డిప్ లో బై చేయడం మంచిది.
ఈ వారం రెసిస్టన్స్ 5400, 5450, 5520 సపోర్ట్ 5330, 5300. నిఫ్టీ లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే అప్
డేట్ చేయగలం.
ముఖ్య గమనిక :మీరు టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా ఒక పద్ధతి ఎంచుకొని దానినే స్థిరంగా మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు
డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్
మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే
ఎర్నింగ్ సాధ్యం అవుతుంది. http://telugufinancialschool.blogspot.in/2012_09_01_archive.html
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.