రూపాయి పతనం వలన
మన పై ఏ విధమైన ప్రభావం ఉంటుంది.
రూపాయి విలువ పతనం
వలన మన పై చాలా ప్రభావం ఉంటుంది.
ముందుగా రూపాయి విలువ పడిపోవడం వలన లాభపడేది
ఎవరో ఒక్కసారి పరిశీలిద్దాం .
ఎగుమతి దారులు
సాదారణంగా వారూ ఎగుమతి చేసిన వస్తువులకు లేదా అందించిన సేవలకు వారి
పేమెంట్ డాలర్ లేదా విదేశీ కరెన్సీ రూపంలో అందుకొని వాటిని మన రూపయలలోకి
మార్చుకుంటారు.రూపాయు పతనం వలన వారూ మార్చుకొనే డాలర్ లేదా విదేశీ కరెన్సీ కి అధిక
రూపాయలు రావడం వలన లాభం కలుగుతుంది.
NRI లు
విదేశాల నుండి తరుచుగా వారి కుటుంబ సభ్యులకోరకు డబ్బులు పంపిస్తుంటారు. రూపాయు
పతనం వలన వారూ పంపించే డాలర్ కి అధిక రూపాయలు రావడంతో NRI లు మరియు వారి
కుటుంబ సభ్యులు లాభం అందుకుంటారు.
కొంత మంది కొన్ని విదేశీ కంపెనీల కొరకు మన
దేశంలో నుండి అన్ లైన్ జాబ్ చేయడం
జరుగుతుంది. దీనికొరకు వారూ విదేశీ కరెన్సీ రూపంలో పేమెంట్ అందుకోవడం జరుగుతుంది.
వారూ కూడా లాభ పడతారు. ఉదా : Ad sense
ఇప్పుడు రూపాయి విలువ పడిపోవడం వలన నష్టపోయేది ఎవరో
ఒక్కసారి పరిశీలిద్దాం .
దిగుమతిదారులు
వారూ దిగుమతి చేసుకున్న వస్తువులకు లేదా పొందిన
సేవలకు పేమెంట్ డాలర్ లేదా విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించవలసి ఉంటుంది.
విదేశాలకు వెళ్ళే
టూరిస్టులు, విదేశాలలో చదువుకోవడానికి వెళ్ళే విద్యార్థులు వారి ప్రయాణానికి ,
విదేశాలలో అవసరమైన డాలర్లు పొందడానికి రూపాయి పతనం వలన అధిక రూపాయలు చెల్లించవలసి
ఉంటుంది.
పైన పేర్కొన్న
వారూ మాత్రమే కాకుండా సాదారణ ప్రజానీకంపై రూపాయి పతనం చాలా ప్రభావం కలుగచేస్తుంది.
ముఖ్యంగా మన దేశం ఆయిల్ దిగుమతి చేసుకోవడం
వారి పేమెంట్ డాలర్ల రూపంలో జరపవలసి ఉండటం వలన అధిక విదేశీకరెన్సీ కొరకు అధిక రూపాయలు చెల్లించవలసి
ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్ లో ఆయిల్
ధరలు పెరగడానికితోడు , అదే సమయంలో మన రూపాయి విలువ పతనం కావడం వలన
సామాన్యుడిపై పెట్రోలు, డిజిల్ , గ్యాస్ ధరలు పెరగడం జరుగుతుంది. వీటి ధరలు పెరగడం వలన మిగితా
వస్తువుల ధరలు కూడా పెరిగి సామాన్యుడిపై అధిక భారం పడుతుంది.అదేవిధంగా ఇతర దిగుమతి
కంపెనీల పై అధిక భారం పడటం వలన అవి నష్టాలపాలు కావడమే కాకుండా కంపెనీలు
మూసివేయాల్సిన పరిస్థితులు కూడా తలెత్తుతాయి. దీనివలన చాలా మంది ఉద్యోగాలు
కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పాటు
అవుతాయి.రూపాయి పతనం వలన ఎగుమతిదారులు
మరియు NRI లు తప్ప మిగితా ప్రజల పై తీవ్ర ప్రాభవం
ఉంటుంది. ఏది ఎమైనప్పటికి కూడా రూపాయి పతనం కావడం దేశానికి ఎల్లప్పూడూ మంచిది
కాదు.
ముఖ్య గమనిక :మీరు టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా ఒక పద్ధతి ఎంచుకొని దానినే స్థిరంగా మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు
డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్
మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే
ఎర్నింగ్ సాధ్యం అవుతుంది. http://telugufinancialschool.blogspot.in/2012_09_01_archive.html
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.