ఇన్ఫ్లేషన్ అనగా ఏమి ? దాని ప్రభావం మనపై ఏ విధం గా ఉంటుంది? part -1
మీ చిన్నప్పుడు కొన్న వస్తువు ఏదైనా సరే ఇప్పుడు కూడా అదే ధరకు లభ్యమవుతుందా !
లేదా ఈ రోజు కొన్న వస్తువు ఏదైనా సరే , భవిష్యత్తులో అదే
ధరకు లభిస్తుంది అని నమ్ముతున్నారా ! లేదు కదా ! మీ చిన్న వయస్సులో కిలో పది
రూపాయలు ఉన్న బియ్యం ధర ఈ రోజు కిలో
ముప్పై రూపాయల పైననే . మీరు ఏ వస్తువైన తీసుకోండి
మీ చిన్నప్పటికి , ఇప్పటికి ఎన్నో రెట్లు ధరలు పెరిగాయి.దీనికి ముఖ్య కారణం
ద్రవ్యోల్బణం . దీనిని ఎక్కువగా
ఇన్ఫ్లేషన్ అని అంటారు.ఇన్ఫ్లేషన్ పెరగడం వలన
డబ్బు యొక్క విలువ తగ్గిపోవడంతో
మీకు తక్కువ వస్తువులు కాని సేవలు కాని లభ్యమవుతాయి. అదేవిధంగా ఈ
ఇన్ఫ్లేషన్ మీ యొక్క సేవింగ్ లేదా
ఇన్వెస్ట్మెంట్ పై చాలా ప్రమాదకర ప్రభావం చూపెడుతుంది. ఇన్ఫ్లేషన్ వలన ఒక వ్యక్తీ
యొక్క కొనుగోలు సామర్ధ్యం తగ్గిపోతుంది. ఉదాహరణకు ఈ రోజు కిలో బియ్యం ఇరవై
ఉంటే అదే కిలో బియ్యం సంవత్సరం తర్వాత ఇరవై ఐదు రూపాయలకు లభిస్తుంది అంటే ధర ఇరవై ఐదు శాతం పెరిగినట్టు
లేదా ఇన్ఫ్లేషన్ ఇరవై ఐదు శాతం నమోదు ఐనట్టు. మీరు మీ వద్ద గల వంద రూపాయలకు ఈ రోజు
ఐదు కిలోలు కొనగలిగితే సంవత్సరం తర్వాత
మీరు కొనగలిగే బియ్యం నాలుగు కిలోలే.అంటే
ఇక్కడ ఏమి జరిగినది మీ వద్ద గల వంద రూపాయల కొనుగోలు శక్తి తగ్గిపోయినట్టే కదా ! అదే విధంగా మీరు ఈ రోజు సేవింగ్ చేసిన లేక
ఇన్వెస్ట్మెంట్ చేసిన వంద రూపాయల మీద కనుక రాబడి సంవత్సరానికి ఇరవై ఐదు శాతం పైన
వస్తేనే మీకు నిజమైన రాబడి వచ్చినట్టు .ఎందుకంటె ఈ రోజు కొన్న ఐదు కిలోల బియ్యం , సంవత్సరం తర్వాత కొనాలి అంటే నూట ఇరవై ఐదు
రూపాయలు కావాలి కదా! ఇన్ఫ్లేషన్
లెక్కించడానికి అన్ని రకాల వస్తువులు మరియు సేవలను లెక్కలోకి తీసుకోవడం
జరుగుతుంది. ఇక్కడ కేవలం ఉదాహరణ కొరకు మాత్రమే
బియ్యం తీసుకోవడం జరిగినది. ఈ
రోజు గల రూపాయి విలువ సంవత్సరం తర్వాత అదే విధంగా ఉండటం లేదు అంటే రూపాయి విలువ
ప్రతి సంవత్సరం తగ్గిపోతుంది .అదే విధంగా
ఈ రోజు వంద రూపాయలు మీరు ఎవ్వరికైనా అప్పుగా ఇచ్చి సంవత్సరం తర్వాత కూడా వంద
రూపాయలు తిరిగి పొందడం వలన లాభమా ! నష్టమా ! అంటే
మీకు నష్టమే . ఇన్ఫ్లేషన్ కనుక పది శాతం
నమోదు అవుతుంటే మీరు నూట పది
రూపాయలు తిరిగి పొందితేనే మీకు ఎలాంటి నష్టం లేదు
ఈ రోజు ఏదైనా ఉన్నత
విద్య పూర్తీ చేయాలంటే కనీసం రెండు లక్షల రూపాయలు అవుతున్నాయి అనుకుంటే ఈ రోజు
పది సంవత్సరాలు వయస్సు ఉన్న మీ
కూతురు మరో పది సంవత్సరాల తర్వాత ఇదే
ఉన్నత విద్య పూర్తీ చేయుటకు
అప్పుడు కూడా ఈ రెండు లక్షలే సరిపోతాయా ! మీ సమాధానం ఎట్టి పరిస్తుతులలో కానే కాదు. ఇన్ఫ్లేషన్ కనుక ఎనిమిది శాతం నమోదు అవుతుంది అనుకుంటే
కావలసిన మొత్తం రూ. 431785 . ఈ విధంగా పెరిగే ఖర్చులు తట్టుకోవాలి నాటే మంచి
ఫైనాన్సియల్ ప్లానింగ్ ఏర్పాటు చేసుకోవాలి.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.