కరెన్సీ నోట్లు కావలసినంత ముద్రించుకోవడానికి బంగారంతో ఏమైనా సంభందం ఉందా ?

కరెన్సీ నోట్లు కావలసినంత ముద్రించుకోవడానికి  బంగారంతో ఏమైనా సంభందం ఉందా ?


పైన చూస్తున్న బంగారు నాణేలు దీ గ్రేట్ అలెగ్జాండర్  330 B.C  కాలానికి  సంభందించినవి.
ఈ ఆర్టికల్ యొక్క ముఖ్యఉద్దేశం  ఎవరైనా సరే  భవిష్యత్తులో  వృద్ది ( appreciate in future ) చెందడానికి అవకాశం ఉండే ఆస్తులు మాత్రమే సంపాదించుకోవాలి  కాని  తరుగుదల ( Depreciating in future) ఉండే ఆస్తులను సంపాదించుకోవడం కాని,కొంత కాలానికి విలువ కోల్పోయే ( purchasing power)నగదును కాని నిల్వ చేసుకోవడం వలన ఎలాంటి లాభం ఉండదు అని  తెలియచేయడం ఈ ఆర్టికల్ ఉద్దేశం.
1970   కంటే ముందు  USA  మరియు  ఇతర ప్రపంచ దేశాలు  కరెన్సీ నోట్లు ముద్రించడానికి బంగారాన్ని ప్రామాణికంగా పరిగణించేవారు.అంటే ఒక డాలర్ లేదా కరెన్సీ ముద్రిస్తున్నారు అంటే అంతే విలువ కలిగిన బంగారాన్ని నిల్వ చేసేవారు . దీనినే గోల్డ్ స్టాండర్డ్ అని పిలిచేవారు.ఉదాహరణకు ఒక డాలర్ ముద్రిస్తున్నారు అంటే  దానికి సమానంగా విలువ కలిగిన గోల్డ్ అంటే 0.693 ounce బంగారం నిల్వ చేసేవారు. ఖచ్చితంగా ఎంత బంగారం అని తెలియదు కాని  కొంత బంగారాన్ని మాత్రం ప్రామాణికంగా నిల్వ చేసేవారు. దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజలకు ప్రభుత్వ  వ్యవస్థ మీదా విశ్వాసం లేనప్పుడు ,ద్రవ్యోల్బణం పెరిగి ,  డాలర్ లేదా ఇతర కరెన్సీ వలన  వారి  కనుగోలు శక్తి తగ్గినా సమయంలో  వారి వద్ద ఉన్న కరెన్సీ  నోట్లతో బంగారాన్ని మార్పిడి చేసుకొనే అవకాశం ఉండటం. దీనినే   గోల్డ్ స్టాండర్డ్  అని అంటారు.
ఈ గోల్డ్ స్టాండర్ వలన ప్రభుత్వం ఎప్పుడైనా కరెన్సీ నోట్లను ముద్రించి చలామణిలోకి తీసుకరావాలి అంటే ముందుగా ప్రభుత్వం అంతే విలువ కలిగిన బంగారాన్ని నిల్వ చేసుకోవాలి.దాని తర్వాత మాత్రమే  కరెన్సీ నోట్లను ముద్రించి చలామణిలోకి తీసుకరావదానికి వీలు కలుగుతుంది.

ఈ గోల్డ్ స్టాండర్డ్ అనే పదం ఎప్పటి నుండి ఎక్కడి నుండి  వాడుకలోకి వచ్చినది అని ఆలోచిస్తున్నారా ? ఇది  కొన్ని శతాబ్దాల క్రితమే ప్రారంభం కావడం జరిగినది. వీటిని ప్రజలు వారి  వస్తువులు , ఆస్తులు, సేవలు  పొందే సమయంలో మార్పిడి క్రింద బంగారాన్ని  ఉపయోగించేవారు.కొన్ని సంవత్సరాల తర్వాత  ప్రజలూ ఈ విధంగా  బంగారం తో మార్పిడి చేయడం రిస్కు అని భావించి నగరంలో పేరొందిన బంగారు వ్యాపారస్తుడి వద్ద బంగారం పెట్టి దాని బదులు అతని వద్ద  హామీ పత్రం తీసుకొనేవారు. అంటే ఆ పత్రాన్ని ఎవ్వరూ తీసుకవచ్చిన బంగారం ఇచ్చే విధంగా. ఈ విధంగా  ఈ హామీ పత్రాల చలామణీ ప్రజలకు చాలా సౌకర్యవంతంగా  ఉండేది.ఒకరకంగా చెప్పాలి అంటే ఈ విధంగా కరెన్సీ నోట్ల చలామణి వాడుకలోకి వచ్చినది.

కొన్ని సంవత్సరాల తర్వాత ఈ బంగారు వ్యారస్తులు ఈ హామీ పత్రాలను ప్రింట్ చేసి వారి వద్ద బంగారం నిల్వ చేసి హామీ పత్రాల కోసం వచ్చే వారికి ఇచ్చేవారు.ఈ విధంగా కరెన్సీ నోట్ల ముద్రణ ప్రారంభం కావడం జరిగినది. కాని ఎప్పుడైనా చలామణి లో ఉండే  కరెన్సీ నోట్లలో పెరుగుదల ఉంటే వాటి కనుగోలు శక్తి తగ్గుత్న్ది అనే విషయం మీకు తెలుసుకదా ? కొన్ని సంవత్సరాల తర్వాత ప్రబుత్వం ఈ పద్ధతి మీదా అజమాయిషీ తీసుకొని ద్రవ్య  సరఫారా ను నియంత్రణలోకి తీసుకోవాలని భావించడం జరిగినది. దానినే  మోడరన్ గోల్డ్ స్టాండర్డ్ అని పిలువడం జరిగినది.
మరికొన్ని సంవత్సరాల తర్వాత  అంటే   1970 లో    USA ప్రభుత్వం  గోల్డ్ స్టాండర్డ్ కి ఎందుకు కట్టుబడి ఉండాలి అనే ఉద్దేశంతో చాలా తెలివిగా ఈ గోల్డ్ స్టాండర్డ్ ను రద్దు చేయడం జరిగినది. అంతే కాకుండా  USA ప్రభుత్వం  తన ప్రజలకి కరెన్సీ కి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ హామీ ఇస్తుంది అని తెలియచేయడం జరిగినది.
ఈ విధంగా USA ప్రభుత్వం  గోల్డ్ స్టాండర్డ్ రద్దు చేయడమే కాకుండా  అదనంగా కావలసినంత కరెన్సీ ఎప్పుడూ కావాలంటే అప్పుడు ప్రింట్ చేయగలం అని పరోక్షంగా తెలియచేయడం జరిగినది. 1970 నుండి    USA ప్రభుత్వం  ప్రతి సంవత్సరం కరెన్సీ నోట్లు ముద్రించి చలామణి లోకి తీసుకవస్తుంది. ఈ విధంగా అధిక కరెన్సీ నోట్లు చలామణిలోకి రావడం వలన కరెన్సీ నోట్ల యొక్క కనుగోలు శక్తి తగ్గిపోవడం తో ఇన్ఫ్లేషన్ కూడా పెరగడం మొదలైంది. మీ చేతిలో ఉన్న కరెన్సీ నోటు ఎలాంటి ఇంట్రెన్సిక్  విలువ లేనటువంటి కాగితం మాత్రమే. దానిపై ఎప్పుడో చనిపోయిన ఒక నాయకుడి  ఫోటో మాత్రమే ఉంటుంది. అందువలనే ఈ కరెన్సీ నోట్ యొక్క కనుగోలు ప్రతి సంవత్సరం దారుణంగా తగ్గిపోతుంది.ఈ ఆర్టికల్  నుండి మీరూ తెలుసుకోవలసినది ఏమిటంటే మీరు కరెన్సీ నోట్లను దాచుకోవడం కంటే ఆస్తులు కూడగట్టడం  చాలా మంచిది. మీ దగ్గర అవసరానికి మించి డబ్బూ ఉంటే , కొంత కాలం దానితో పని లేకపోతే  బ్యాంక్ లో  లేదా బీరువాలో దాచే బదులు ఏవైనా  విలువ పెరిగే ఆస్తులు కనుగోలు చేయండి.  అంటే షేర్లు , లాండ్స్ , బాండ్స్,  ఏవైనా కావచ్చు.మీరూ కేవలం డబ్బూ దాచుకోవడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటె దాని విలువ కొంత కాలంలో తగ్గిపోతుంది అని మీకు తెలుసుకదా ? ఇప్పుడు ఉన్న కరెన్సీ నోటు  ఏదైనా కాని డాలర్, యూరో , రూపాయి  ఏదైనా సరే ఎలాంటి   ఇంట్రెన్సిక్   వాల్యూ లేనటువంటి కాగితం  నోటు అని మాత్రమే గుర్తుపెట్టుకోండి. కాబట్టి దానిని దాచి పెట్టుకొనే బదులు ఆస్తులు కనుగోలు చేయండి.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.