కంపెనీ కొత్తగా షేర్లను ఇవ్వడాన్ని పబ్లిక్ ఇష్యూ అంటారు. కంపెనీ తన వ్యాపరం గురించి, ఇంతకు ముందు కంపెనీ ఉన్నట్టు ఐతే పూర్వపు లాభాల గురించి , తన ఆస్తులు మొదలగు వాటితో కూడిన వివరాలతో దిన పత్రికలో ప్రకటన ఇస్తుంది.అప్పుడు మనకు ఆ కంపెనీ గురించిన సమాచారం నచ్చి , నమ్మకం కుదిరితే అప్లయ్ చేయవచ్చు.కొనేవారి సంఖ్యా ఎక్కువగా ఉంటే లాటరీ తీసి పంచుతారు.పెద్ద కంపెనీ షేర్లు ఈ విధంగా లాటరీ ద్వారా సంపాదించటం కొద్దిగా కష్టం..ఈ విధంగా పంపకం జరిగాక తమకి సంక్రమించిన షేర్లని కొందరు అమ్మజూపుతారు.కావలసినవాళ్ళు హెచ్చు ధరకి దాన్ని కొనుక్కోవడాన్ని సెకండరీ మార్కెట్ అంటారు.క్యూ లైన్ లో సినిమా టికెట్స్ దొరక్కపోతే బ్లాకులో ఎక్కువ ధర పెట్టి కొనుక్కున్నట్టు .
షేరు ధరలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి.ప్రభుత్వం పెట్రోల్ ధర పెంచాగానే ఎక్స్ కెమికల్ కంపెనీ షేర్ల ధర పెరగవచ్చు.దానికి కారణాలు అన్వేషించాలి అంటే చాలా లింకులు ఆలోచించాలి.పెట్రోలు ధర పెరిగితే బైక్ లకన్నా లూనాల డిమాండ్ పెరుగుతుంది. లూనాల టైర్లలో వాడే రసాయనాన్ని ఈ ఎక్స్ కెమికల్ కంపెనీ తయారు చేస్తుంది.అందువలన వచ్చే సంవత్సరం దీనికి లాభాలు ఎక్కువగా వస్తాయి అన్న ఉద్దేశంతో ఈ కంపెనీ షేరు ధర పెరుగుతుంది.
ప్రధానమంత్రి , వాణిజ్య మంత్రిని పదవి నుంచి తొలగించాగానే ఒక చెప్పుల కంపెనీ ధర విపరీతంగా పడిపోవచ్చు.దానికి , దీనికి లింక్ ఏమిటని ఆలోచిస్తే సదరు మంత్రి బావమరిదికి అరబ్ దేశాలకు చెప్పులు ఎగుమతి చేసే లైసన్స్ ఉండి ఉండవచ్చు.దాని క్రింద లోపాయికారిగా కోట్ల విలువచేసే చెప్పులు ఎగుమతి చేస్తూ లాభాలు గడిస్తూ ఉండవచ్చు.ఇకముందు ఈ ఆటలు సాగవు కదా ? అందుకే ఆ కంపెనీ షేరు ధర పడిపోయింది. ఈ విధంగా దేశంలో ఎక్కడో ఏదో జరిగితే మరెక్కడో షేరు ధరలు పెరగడమో, తరగాడమో జరుగుతుంది.కేరళలో వర్షాలు పడితే బొంబాయి కొబ్బరి నూనె కంపెనీ షేరు ధరపై ఆ ప్రాభావం ఉంటుంది.కార్మిక సంఘాల స్ట్రయికులు , రాజకీయ అనిశ్చితి, పంటలు, యుద్ధం మొదలగునవి అన్ని కూడా షేర్ల ధరలపై ప్రభావం చూపెడతాయి.దేశంలో ఒక చిన్న కదలిక రాగానే అది ఏ కంపెనీ మీదా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కరెక్ట్ గా అంచనా వేసి అందరికన్నా ముందుగా దాన్ని పట్టుకొని దాంతో వ్యాపారం చేసే బ్రోకర్లని స్పెక్యులేటర్లు అంటారు. మనిషి తెలివి తేటలకు వీరి మెదళ్ళు పరాకాష్ట. వీరిలో రెండు రకాలు. బుల్ల్స్, బెర్స్.
స్టాక్ మార్కెట్ లో లో వ్యాపారం చేసే వాళ్ళు సాదరణంగా ఈ రెండు రకాల్లో ఏదో ఒక రకానికి చెందినవారూ అయి ఉంటారు. మార్కెట్ లో వీళ్ళిద్దరూ ఎప్పుడు యుద్దానికి తలపడే యోదుల్లా ఉంటారు. బుల్ ఆశాజీవి. దేశంలో ఏ చిన్న పరిమాణం జరిగిన షేరు ధర విపరీతంగా పెరుగుతుంది అనుకొనేవాడు.బెర నిరాశాజీవి.ధర అనుకున్నంతగా పెరగదని , కొండకచో తగ్గిపోతుంది అని భావించేవాడు . ఉదాహరణకు జనవరి 1వ తారీఖున కిలో పంచదార 10 రూపాయలు ఉందనుకొందాం. ఆ సంవత్సరం చెరకు సరిగ్గా పండలేదు అనుకుందాం.మార్చి 31 వ తారీఖు వీరిద్దరూ ఉహించే ధరలు ఈ విధంగా ఉంటాయి.
జనవరి 1 ధర మార్చి 31ధర
బుల్ 10 16
బేర్ 10 12
జనవరి ఒకటో తారీఖు పొద్దున్నే బుల్ స్వీట్స్ తీసుకొని బేర్ కి నూతన సంవత్సర శుబాకాంక్షలు చెప్పి బేరం మొదలు పెడతాడు. బ్రదర్ మార్చి 31 వ తారీఖు నాటికి నాకు లక్ష కిలోల పంచాదార కావాలి . కిలో పద్నాలుగు రూపాయల చొప్పున ఆ రోజు నాటికి ఇవ్వగలవా ? అని అడుగుతాడు.
కొత్త సంవత్సరం మొదట్లో భలే బేరం తగిలిందని బేర్ సంతోషిస్తాడు.మార్చి 31నాటికి అతడు ఉహిస్తున్న ధర కిలో 12 మాత్రమే. ఆ రోజు పన్నెండుకి కొని పద్నాలుగికి అమ్మితే రెండు లక్షలు లాభం వస్తుంది అని ఆలోచిస్తాడు.బుల్ ఆలోచనలు వేరు . ఆ రోజు ధర పదహారు రూపాయలు ఉంటే అతడికి రెండు లక్షలు లాభం.ఈ విధంగా ఇద్దరి మధ్య ఒక్క పంచదార పలుకు లేకుండా లక్షల వ్యాపారం చేస్తారు.
మరుసటి ఆర్టికల్ లో షేర్ మార్కెట్ లో మోసాలు ఎలా జరుగుతాయి . హర్షద్ మెహతా చేసిన మోసం ఎలాంటిదో తెలుసుకుందాం.
మరుసటి ఆర్టికల్ లో షేర్ మార్కెట్ లో మోసాలు ఎలా జరుగుతాయి . హర్షద్ మెహతా చేసిన మోసం ఎలాంటిదో తెలుసుకుందాం.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.