మీరు లేదా మీ పిల్లలు జీవితంలో ఆర్ధికంగా ఎదిగి మిలియనీర్లు , బిలియనీర్లు కావాలి అంటే తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆర్ధిక విషయాలు part -2
బిలియనీర్లు ఆర్ధిక వ్యవస్థలో సంపదను స్ప్రుస్టించే స్ప్రుస్టికర్తలు
బిలియనీర్ల ఆలోచనా విధానం మధ్యతరగతి వారికి మరియు మిలియనీర్ల కంటే కూడా వేరే విధంగా ఉంటుంది.నిజం చెప్పాలి అంటే వీరూ ఆర్ధిక వ్యవస్థ లో సంపదను స్ప్రుస్టిస్తారు . బిలియనీర్లు , మధ్యతరగతి వారిలా డబ్బూ కోసం పని చేయడం కాని, మిలియనీర్లలా మనీ ని వారి కోసం పనిచేసే విధంగా చేయడం చేయరు. అంటే వీరూ ఇన్వెస్ట్మెంట్ చేయరని కాదు .ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాని వీరి ఇన్వెస్ట్మెంట్ పద్ధతి వేరే విధంగా ఉంటుంది.బిలియనీర్లు వారికి అవసరమైన మనీని ఆర్ధిక వ్యవస్థలో చట్టబద్దంగా ముద్రించుకుంటారు.
సరే ఆయితే వీరూ ఆర్ధిక వ్యవస్థలో సంపద ఎలా స్ప్రుస్టిస్తారు? చట్టబద్దంగా ఆర్ధిక వ్యవస్థలో వారికి కావాల్సిన మనీని ఏ విధంగా ముద్రించుకుంటారు అనే కదా ? మీ సందేహం. ముందుగా వీరు ఒక వ్యాపారాన్ని ప్రారంభించి దానిని విజయవంతమైన వ్యాపారంగా తీర్చిదిద్ది ,దానిని ప్రజల వద్దకు పబ్లిక్ ఆఫర్ రూపంలో తీసుకవచ్చి, వారి వ్యాపారంలో కొంత వాటా లేదా షేర్స్ ని మిలియన్ల కొద్ది ప్రజలకు అమ్మడం ద్వారా ప్రజలకు సంపదను స్ప్రుస్టించి వారూ కూడా బిలియనీర్లుగా మారతారు.
మీరు ఇప్పటి వరకు మధ్యతరగతి, మిలియనీర్లు , బిలియనీర్ల ఆలోచనా విధానం , సంపాదనా విధానం ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నారు.ఇకనుండి మీకు చెప్పబోయే ఆర్ధిక పరమైన విషయాలు చక్కగా చదివి అర్ధం చేసుకోండి. ఒకే ఆర్ధిక పరమైన విషయాన్ని మధ్యతరగతి వారూ, మిలియనీర్లు, బిలియనీర్లు ఏ విధంగా అర్ధం చేసుకొని ,ఏ రీతిలో ఉపయోగిస్తారో తెలుసుకోండి.
ఫైనాన్షియల్ స్టేట్ మెంట్
మీరు ఇదివరకే ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ అనే పదం చాలా సార్లు వినే ఉంటారు. దాని గురుంచి మీకు కొద్దో గొప్పో అవగాహన ఉండటం లేదా అసలు ఏమాత్రం అవగాహన కూడా ఉండకపోవచ్చు.మీరు క్రింద ఇవ్వబడిన చిత్రాన్ని చూడండి.మీరు మీ కాలేజీ నుండి బయటకు వచ్చే సరికి మీ దగ్గర ఉండే ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ మీ మార్కుల షీటు మాత్రమే.మీరు మీ కాలేజీలో నేర్చుకున్న దాని ప్రకారమే మీ జీవితాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది.అదే మిలియనీర్ల , బిలియనీర్ల పిల్లలు చిన్నతనం నుండే ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ పై అవగాహన వారి కుటుంబ సభ్యులనుండే పొందుతారు. అదే మధ్యతరగతి వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చే సరికి ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ గురుంచి చెప్పేవారే ఉండరు. అందుకే మధ్యతరగతి వాళ్ళ పిల్లలు ఎప్పుడూ మధ్యతరగతి గానే మిగిలిపోతున్నారు.అయినా ఒక మధ్యతరగతి వ్యక్తీ తన పిల్లలకు ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ గురుంచి , ఆర్ధిక వ్యవహారాల గురుంచి ఏ విధంగా తెలియచేస్తాడు? స్వయంగా అతనికి లేదా ఆమెకే ఏమాత్రం ఆర్ధిక వ్యవహారాలపై అవగాహనలేనప్పుడు.
ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ అంటే ఏమిటి? మీరు మీ జీవితంలో ధనవంతులు కావాలంటే అది ఎందుకు అతి ముఖ్యమో సాదారణ బాషలో తెలుసుకుందాం .మీ ఆదాయం , మీ ఖర్చులు, మీఅస్తులు , మీ అప్పులు మొదలగు వాటి వివరాలు పేపర్ పై నమోదు చేస్తే దానినే ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ అంటారు.
FINANCIAL STATEMENT
INCOME STATEMENT
BALANCE SHEET
|
పైన చిత్రంలో చూపించిన విధంగా ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ రెండు భాగాలను కలిగి ఉంటుంది. ఒక్కటి ఇన్ కమ్ స్టేట్ మెంట్ , రెండవది బ్యాలన్స్ షీట్ .
ఇన్ కమ్ స్టేట్ మెంట్ లో మీ సాలరీ , వడ్డీ ఆదాయం, డివిడెండ్ ఆదాయం,రెంటల్ ఆదాయం, బిజినెస్ ఆదాయం,ఇతర ఆదాయాలతో పాటు, మీ ఖర్చుల వివరాలు అంటే, మీరు చెల్లించే టాక్స్ , మీరు జీవించడానికి పెట్టె ఖర్చులు అంటే ఆహారం, బట్టలు మొదలగు వాటికి పెట్టె ఖర్చులు, మీ క్రెడిట్ కార్డ్ బిల్స్, మీ ఈ ఏం ఐ లు మొదలగు వాటి వివరాలు ఉంటాయి.
బ్యాలన్స్ షీట్ కూడా రెండు భాగాలను కలిగి ఉంటుంది. మొదటిది అసెట్ కాలమ్ , రెండవది లయబిలిటీ కాలమ్. సాదారణంగా మధ్యతరగతి ప్రజలూ ఒకే ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ ఉంటుంది. అది వారి స్వంతది అనే అపోహలో ఉంటారు.కాని వాస్తవంగా ఒక్కో ఆర్ధిక సాధనానికి , ఒక్కో ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ ఉంటుంది. అదే మిలియనీర్లు, బిలియనీర్లు మనీ తో మాత్రమే కాకుండా ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్ తో కూడా ఆటలు ఆడతారు.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.