ఈ వారం స్టాక్
మార్కెట్ 10-12-2012 to 14-12-2012
మార్కెట్ లో బ్రహ్మాండమైన
ర్యాలీ అనంతరం కన్సోలిదేషన్ జరగటం చాలా సర్వసాదారణం .దీని గురించి మనం గత వారం
పోస్ట్ లో కూడా చర్చించడం జరిగినది.గత
వారం కేవలం నిఫ్టీ 27 పాయింట్లు
మాత్రమే స్వల్ప లాభం పొందటం జరిగినది.12 వ తేదీన వెలువడనున్న IIP డేటా , 14 వ తేదీన
వెలువడనున్న ఇన్ఫ్లేషన్ డేటా పై మార్కెట్ మూమెంట్ ఆధారపడి ఉంటుంది. ఈ
డేటా ల ప్రకారం ఈ నెలలో జరుగనున్న క్రెడిట్ పాలసీలో RBI కీలక
రెట్ల విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు .మీకూ ఇది వరకు తెలియచేసినట్టుగా 50hsma కూడా చాలా కీలకం
అని తెలియచేయడం జరిగినది. అదే విధంగా నిఫ్టీ కూడా గురు, శుక్ర వారం 50hsma సపోర్ట్ తీసుకోవడం మీరూ క్రింద ఇచ్చిన హవర్లీ
చార్ట్ లో చూడవచ్చు. ఈ వారం ప్రస్తుతం 50hsma 5885 వద్ద ఉంది.కాబట్టి దానిని ఈ రోజు జాగ్రత్తగా
గమనించాలి.5548 వద్ద ఏర్పాటు కాబడిన డబుల్ బాటం మరియు 5540 వద్ద ఉన్న
ట్రెండ్ లైన్ సపోర్ట్ మార్కెట్ లో ర్యాలీ రావడానికి సహాయపడ్డాయి. అదే విధంగా
ట్రెండ్ లైన్ బ్రేక్ జరగనంతవరకు మార్కెట్ పైకి వెళ్లడానికే అధిక అవకాశం
ఉంది.ప్రస్తుతం చార్త్స్ లో చూపిన విధంగా 5950-70 మధ్య రెసిస్టన్స్ వస్తుంది. ఒకవేళ ఈ
రెసిస్టన్స్ కనుక దాటితే 6050, 6150 వరకు నిఫ్టీ సులభంగా చేరుకోగలదు. నిఫ్టీ
బుల్లిష్ ప్లాగ్ పాటర్న్ ప్రకారం కూడా టార్గెట్ 6150 గా ఉంది.ఈ వారం నిఫ్టీ కి సపోర్ట్ 5825, 5770,5720 రెసిస్టన్స్ 5950,6050,6150 . స్టాప్ లాస్ పాటించి తగు జాగ్రత్తతో
ట్రేడింగ్ చేసుకోగలరు.
telugufinancialschool@gmail.com
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.