ఈ వారం స్టాక్ మార్కెట్ 24-12-2012 to 28-12-2012

ఈ వారం స్టాక్ మార్కెట్ 24-12-2012 to 28-12-2012

 
 నిఫ్టీ గత 16  ట్రేడింగ్ రోజుల  నుండి కేవలం   5825- 5965 మధ్య మాత్రమే కదలాడుతూ  ఒక శ్రేణిని  ఏర్పాటు చేసుకోవడం జరిగినది. ఈ రోజు నిఫ్టీ 50hsma 5883 ని క్రాస్ చేసి నిలబడినట్టు ఐతేనే  మరింత  పైకి వెళ్ళడానికి అవకాశం కలదు. ఏది ఏమైనా 5950-5970 పైన  నిలదొక్కు కుంటే మాత్రమే నిఫ్టీ లో ర్యాలీ రావడం జరుగుతుంది.గత కొన్ని రోజుల నుండి ఏర్పాటు కాబడిన శ్రేణి  5825- 5965 ఏదైనా ఒక వైపు  బ్రేక్ జరిగే వరకు  పై లెవల్లో సెల్ చేయడం , క్రింది ల్లెవల్లో బై చేయడం మంచిది. ఈ వారం ఎక్స్ ఫైరీ వారం కూడా కావడం , రేపు సెలవు రోజు కావున కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.   5815-25 బ్రేక్ కానప్పటివరకు తగిన స్టాప్ లాస్ తో  క్రింది లెవల్లో బై చేయడం మంచిది.  అదే విధంగా పై లెవల్లో  రెసిస్టన్స్ బ్రేక్ కానప్పటివరకు తగిన స్టాప్ లాస్ తో సెల్ చేయడం చాలా మంచిది. రెసిస్టన్స్ 5883, 5925, 5965 సపోర్ట్ 5815-25, 5770 మీరూ రెగ్యులర్ గా ఈ బ్లాగ్ ని అనుసరిస్తే సులభంగా మీరూ మార్కెట్ ను అంచనా వేయవచ్చు.


బ్యాంక్ నిఫ్టీ కూడా  12197-12571మధ్య శ్రేణిలో కదలడం జరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ప్రస్తుతం 12190-12200 మధ్య కలదు.    


ముఖ్య గమనిక :మీరు  టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా ఒక పద్ధతి  ఎంచుకొని దానినే స్థిరంగా  మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్ మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ సాధ్యం అవుతుంది.  http://telugufinancialschool.blogspot.in/2012_09_01_archive.html

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.