షేర్స్ ఏ విధంగా కొనాలి?
షేర్స్ ని మనం రెండు మార్గాల్లో కొనవచ్చు. మొదటి మార్గం ప్రైమరీ మార్కెట్ , రెండవది సెకండరీ మార్కెట్ , ప్రైమరీ మార్కెట్
లో మీరు షేర్స్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ
కి వచ్చినప్పుడే కొనటానికి అవకాశం ఉంటుంది.
ప్రైమరీ మార్కెట్
IPO (Initial
Public Offerings ,IPO’s) ప్రజలకు తొలిసారిగా షేర్లు అమ్మడాన్ని IPO’s అంటారు.
ఇది ప్రైమరి మార్కెట్ లో జరుగుతుంది.
ఎవరైన ఈ తొలి వాటా లను కొనుగోలు చేయాలి .అంటే ఈ IPO’s ద్వారా కంపెనీ నిబంధనల
ప్రకారం దరఖాస్తు చేయాలి. మన దరఖాస్తును
పరిశీలించిన అనంతరం వారికి వాటాలను కేటాయించడం
జరుగుతుంది..వాటాల కేటాయింపు అనంతరం
కంపెనీ ని స్టాకు
ఎక్సేంజ్ లో నమోదు చేయడం జరుగుతుంది..ప్రైమరీ
మార్కెట్లో మీరు షేర్స్ కొనటానికి సిద్దపడినా మనకు కచ్చితంగా షేర్లు వస్తాయని ,
కావాల్సినన్ని దక్కుతాయని హామీ లేదు.
ఎందుకంటే వారు జారీ చేసే వాటలకంటే ఎక్కువ మంది ఉంటె వాటిని దరఖాస్తు చేసిన అందరికి ఒక నిష్పత్తి లో జారి చేస్తారు. వాటాల
జారీ అనంతరం ఇవి స్టాకు ఎక్సేంజ్
నందు లిస్టు అవుతాయి.పైగా పరిమిత కాలానికే ఈ మార్కెట్
అందుబాటులో ఉంటుంది. ప్రతి పబ్లిక్ ఇష్యూలోను
25 శాతం
వాటాలను చిన్న వాటాదారులకు కేటాయిస్తారు. రెండు లక్షల రూపాయలకంటే తక్కువ విలువైన షేర్లకు
దరఖాస్తు చేసుకునే వారిని చిన్న
ఇన్వెస్టర్లు గా పరిగనిస్తారు. ప్రైమరీ మార్కెట్ నందు మీకు రిస్కు తక్కువగా
ఉంటుంది.
ఒక కంపనీ ప్రైమరీ మార్కెట్లో వాటాదారులకు ఎ ధరకు
ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటుందో దానిని ఇష్యూ ప్రైస్ అని పిలుస్తారు. ఈ కంపనీ షేర్ స్టాకు ఎక్సేంజ్ లో లిస్టు ఐనప్పుడు అ ప్రైస్ ఇష్యూ ప్రైస్ కంటే ఎక్కువగాను , తక్కువగాను ఉండవచ్చు.ఎక్కువగా ఉంటె మీకు
లాభం తక్కువగా ఉంటె మీకు నష్టం రాగలదు. ఈ మధ్యన IPO వచ్చిన కోల్ ఇండియా తీసుకొంటే దాని ఇష్యూ ప్రైస్ Rs. 245 ఐతే అది
లిస్టు ఐన రోజు క్లోజ్ ప్రైస్ Rs. 342 అనగా మీకు సుమారు 39% లాభం .
ఇక మీ అందరికి గుర్తుండే ఉంటుంది.రిలయన్స్ పవర్
షేర్ల గురుంచి దాని ఇష్యూ ప్రైస్ Rs 450 ఐతే అది లిస్టు ఐన రోజు క్లోజ్ ప్రైస్ Rs 372.50 అనగా ఆ షేర్ మీద మీకు నష్టం 17%.మీరు లిస్టు ఐన రోజు
హై లేదా లో ప్రైస్ నందు ఎవ్వరు అమ్మలేరు కావున క్లోజ్ ప్రైస్ తీసుకోవడం జరిగినది.
ఇక్కడ మీరు గమనించడం జరిగినది ఏమిటంటే
అన్ని IPO లు కూడా లాభ సాటి కావు. కావున
మీరు IPO కు అప్లై
చేసేముందు కంపెనీ గురుంచి అన్ని వివరాలు తెలుసుకోవాలి. దీని గురుంచి మనం తర్వాత వివరంగా తెలుసుకొందాం.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.