స్టాక్
మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ పరిచయం
స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి అనునది రెండు విశ్లేషణ పద్దతుల ద్వారా జరుగుతుంది. మొదటిది ఫండమెంటల్ అనాలసిస్ ,రెండవది టెక్నికల్ అనాలసిస్ .ఫండమెంటల్ అనాలసిస్ అనగా కంపనీ యొక్క బాలన్స్ షీటు,డివిడెండ్,కంపనీ యొక్కబుక్ వాల్యూ,E.P.S(Earning per
share),P/E రేషియో,PEG రేషియో
మొదలగు వాటి గురుంచి తెలియచెస్తుంది..అంతే
కాకుండా ఫండమెంటల్
అనాలసిస్ లో గమనించవలసినది ప్రమోటర్ల చరిత్ర ,వాతావరణం ,ఎంపిక చేసుకున్న రంగం,కంపనీ యొక్క ఎగుమతులు, దిగుమతులు ,రాబోయే
కాలం లో కంపెనీ విస్తరణ , ఉత్పత్తి చేయు పొడక్ట్ యొక్క సప్లయ్
మరియు డిమాండ్, భవిష్యత్తు అంచనా , ప్రభుత్వం
యొక్కనిర్ణయాలు ఆ కంపెనీమీద ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయి అనే మొదలగు విషయాల మీద ఆధారపడి ఉంటుంది.
ఇక్కడ మనం పూర్తిగా టెక్నికల్ అనాలసిస్ గురించి తెలుసు కొంటున్నాం కావున
ఫండమెంటల్ అనాలసిస్ గురుంచి లోతుగా వెళ్ళడం లేదు
“టెక్నికల్
అనాలసిస్ అనగా సెక్యూరిటీ
ధర యొక్క గత ప్రవర్తన ఆధారంగా రాబోవు కాలం లో ఆ షేర్ ధర ఏ విధంగా ఉండగలదో ఉహించ గలగడమే టెక్నికల్
అనాలసిస్”. టెక్నికల్ అనాలసిస్ నందు గతంలో సెక్యూరిటీ ధర
యొక్క మార్పులు మరియు వాల్యూమ్ పరిమాణాన్ని చార్ట్ రూపంలోఉంచి దానిని విశ్లేషించడం
ద్వారా భవిష్యత్తులో సెక్యూరిటీ యొక్క ధరని అంచనా వేయడం జరుగుతుంది.
టెక్నికల్ అనాలిసిస్ అనగా మార్కెట్ ని అధ్యయనం చేయడం.ఇక్కడ సెక్యూరిటీ అనగా స్టాకులు, ఇండెక్స్ ,బాండ్స్ మొదలగునవి
.ఈ రోజులలో షేర్ మార్కెట్ లో ప్రోపెషనల్స్ , రిటరైనవారు ,స్టూడెంట్స్, గృహిణులు మొదలగు
అన్ని రంగాలవారు ప్రవేశిస్తున్నారు.అంతేకాకుండా షేర్ మార్కెట్ కూడ చిన్న పట్టణాలకు విస్తరించడం తో కొత్తవారు చాలామంది ప్రవేశిస్తున్నారు .ఈ రోజులలో కంప్యూటర్లు మరియు ఇంటర్నెట్ అనేది
సులభంగా అందరికి అందుబాటులో ఉండడం తో ట్రేడర్స్ మార్కెట్ యొక్క మొత్తం
డెటానీ విశ్లేషించడం ద్వారా వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకోగలుగుతున్నారు . కానీ మార్కెట్లోకి కొత్తగా వస్తున్న చాలా మంది
వారిదగ్గర కంప్యూటర్స్ మరియు చార్టింగ్ సాఫ్టవేర్
ఉన్నప్పటికిని దానిని సరియగు పద్దతిలో ఉపయోగించుకోకుండా స్వంతంగా
నిర్ణయాలు తీసుకోలేక బ్రోకర్స్ మరియు టిప్స్ అందించే వారి మీద
ఆధారపడుతుంటారు . ఫలితంగా వారు గాని డబ్బు సంపాదించడం అటుంచి మీదనుండి డబ్బు
లాస్ అవుతున్నారు. దానితో వారు మార్కెట్‌లో ఒక్కోసారి ఒక్క విధంగా
ప్రవర్తిస్తారు.ఒక్కసారి ఇన్వెస్టర్ గా మరోసారి ట్రేడర్
లాగా ప్రవర్తిస్తారు..విజయవంతమైన ఇంవేస్టింగ్ లేదా
ట్రేడింగ్ అనునది మూడు M ల మీద
ఆధారపడి .ఉంటుంది. మైండ్, మెథడ్, మరియు మనీ. అంతే కాకుండా ద్రుడమైనమానసిక బలాన్ని , సరిగా డబ్బు నిర్వహణ పద్దతి కలిగి ఉండాలి..మన దగ్గర డబ్బులు ఉన్నాయ్ కదా అని మనకు డ్రైవింగ్ రాకున్న మూడు లక్షలు పెట్టి కారు కొని దానిని నడుపుటకు ప్రయత్నిస్తే మన కారుకు ప్రమాదం
జరగడమే కాకుండా దానిని నడుపుతున్న వ్యక్తికీ ,రోడ్డు
మీద వెళ్తున్న వారికి కూడా ప్రమాదం జరగవచ్చు ముందుగా మనం కారు
నడుపుటలో మెళకువలు నేర్చుకొని కారు
కొన్నచో మనం
తగు జాగ్రత్తగా ఉంటాం .అదే
విధంగా మన
దగ్గర డబ్బులు ఉన్నాయ్ కద అని
షేర్ మార్కెట్ గురుంచి ఎలాంటి అవగాహనా ,విశ్లేషణ సామర్ధ్యం లేకుండా టిప్స్ మీద ఆధారపడి ,టిప్స్
కోసం నెల
నెల వేలకు వేలు ఫీజు చెల్లిస్తూ ,మన
కష్టార్జితాన్ని నష్టపర్చుకుంటూ
షేర్ మార్కెట్ అంటే జూదంగా ,అది
ఒక్క మహాసముద్రం అది
మనకు అర్థం కాదు
దీనిలో మనం డబ్బులు సంపాదించలేము అనుకొంటారు. . స్టాక్ మార్కెట్ ను పెట్టుబడి వృద్ది చేసే సాధనం గా చూడాలి.మనం డబ్బులు సంపాదించు కొనుటకు ఏ
బిజీనేసు అయిన మొదలు పెట్టేముందు దాని గురించి పూర్తిగా తెలుసుకొని మనం
బిజినెసు మొదలు
పెడతాము.అలాగే షేర్ మార్కెట్ లో
డబ్బులు సంపాదించాలి అంటే దాని గురుంచి కూడ వివరంగా తెలుసుకోవాలి.మన బిజినేసు కొరకు ఎలా
కష్టపడి వివరాలు సేకరిస్తామో షేర్
మార్కెట్ గురించి కూడ అలాగే కష్టపడాలి .రిస్కు అంటారా
రిస్కు అనేది ప్రతి బిజినెసులో ఉంది
వ్యవసాయం మొదలుకొని .టాక్సీ డ్రైవింగ్
వరకు ప్రతి దానిలో ఉన్నది.రిస్కు లేకుండా కష్టపడకుండా మనం దేన్నీ సాధించలేము.టెక్నికల్ అనాలసిస్ అనునది షేర్ మార్కెట్
అనే అడవిలో సురక్షితంగా బయటపడే రోడ్డు మ్యాపు లాంటిది .ఈ మ్యాపుని సరిగా ఉపయోగించగలిగితే మీరు విజయవంతంగా బయటపడతారు. టెక్నికల్ అనాలసిస్ మీద ఇంతవరకు తెలుగులో వివరంగా ఎలాంటి
పుస్తకం లేదు.మీకు టెక్నికల్ అనాలసిస్ మీద ఇదివరకు ఎలాంటి కనీస పరిజ్ఞానం లేకున్నను మీరు ఈ పుస్తకం
ద్వారా టెక్నికల్
అనాలసిస్ ని ఏ విధమగా
ఉపయోగించుకోవచ్చో తెలియ
చేస్తుంది
ప్రసిద్ధ చైనీస్ సామెత , "ఒక మనిషికి
ఒక చేపను ఇస్తే అతనికి ఆ రోజు మాత్రమే ఆహారం
అవుతుంది కానీ మీరు ఆ మనిషికి చేపలు పట్టడం నేర్పిస్తే ఆ మనిషికి
జీవితాంతం ఆహారం అందించిన వారు అవుతారు .ఈ పుస్తకం కూడా మీకు అలాగే ఉపయోగపడుతుంది.
టెక్నికల్ అనాలిసస్లో చరిత్ర పునరావృతం అవుతుంది అనే
భావన బలంగా ఉంటుంది.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.