ఈ రోజు స్టాక్ మార్కెట్ 26-09-2013



ఈ రోజు స్టాక్ మార్కెట్ 26-09-2013
ఈ రోజు  డేరివేటివ్  కాంట్రాక్టు  ముగింపు  రోజు కావున మార్కెట్ లో ఓడిదిడుకులు  ఉండటం చాలా సహజం. నిఫ్టీకి ప్రస్తుతం 5798  వద్ద సపోర్ట్ కలదు. రెసిస్టన్స్ 5935  రేంజ్ లో కలదు. వీలయినంత వరకు సపోర్ట్ వద్ద  బయ్యింగ్ చేయటం , రెసిస్టన్స్ వద్ద సెల్లింగ్ చేయటం మంచిది. నిఫ్టీ  లో  పతనం జరుగుతున్నప్పటికీ కూడా 200 sma  పైన క్లోజ్ కావటం జరుగుతుంది.కావున నిఫ్టీ  సపోర్ట్ వద్ద   బయ్యింగ్ చేయటం మంచిది.

ఈ రోజు స్టాక్ మార్కెట్ 12-09-2013



ఈ రోజు స్టాక్ మార్కెట్ 12-09-2013
నిన్న మీకూ తెలియచేసినవిధంగా  నిఫ్టీ మొదట 5910 వద్ద రెసిస్టన్స్ తీసుకొని   దరిదాపుగా సపోర్ట్ వద్దకు పతనమైన అనంతరం  తిరిగి రెసిస్టన్స్ వద్దకు చేరుకోవటం జరిగినది.ఈ రోజూ కూడా నిన్నటి విధంగానే అనాలసిస్  ఉంటుంది. రెసిస్టన్స్ పైన నిలదొక్కుకుంటే బయ్యింగ్ చేయటం లేదా సపోర్ట్ వద్ద బయ్యింగ్ చేయటం , రెసిస్టన్స్ వద్ద నిలదోక్కుకోలేకపోతే సెల్లింగ్ చేయటం మంచిది. 

ఈ రోజు స్టాక్ మార్కెట్ 11-09-2013



ఈ రోజు స్టాక్ మార్కెట్ 11-09-2013
నిన్నటి నిఫ్టీ ర్యాలీ అనంతరం నిఫ్టీకి ప్రస్తుతం చార్ట్ లో చూపించిన విధంగా సపోర్ట్ మరియు రెసిస్టన్స్  కలవు. ప్రస్తుతం నిఫ్టీ 5900-5910  రెసిస్టన్స్ కలదు. ఒకవేళ ఈ రెసిస్టన్స్ పైన నిలదొక్కుకుంటే మాత్రం నిఫ్టీ 6000, 6093  వరకు వెళ్ళగలదు. అదే విధంగా నిఫ్టీ కి సపోర్ట్ 5750-5808 వద్ద కలదు. నిఫ్టీ 5900-5910  రెసిస్టన్స్ దాటలేకపోయినట్టు అయితే మాత్రం నిఫ్టీ సపోర్ట్ వద్దకు పతనం కాగలదు. కాబట్టి, రెసిస్టన్స్ వద్ద సెల్లింగ్ , సపోర్ట్ వద్ద బయ్యింగ్ చేయటం మంచిది.

ఈ రోజు స్టాక్ మార్కెట్ 04-09-2013


  రోజు స్టాక్ మార్కెట్ 04-09-2013
నిఫ్టీ మీకూ నిన్న తెలియచేసినట్టుగా వాల్యూం అతి తక్కువ పరిమాణంతో రెసిస్టన్స్ బ్రేక్ అవుట్ కావటం జరిగినది కావున పై లెవల్లో నిఫ్టీ నిలదొక్కుకుంటే మాత్రమె పైకి వెళ్ళుతుంది. బ్రేక్ అవుట్ జరిగిన  రెసిస్టన్స్ ప్రస్తుతం సపోర్ట్ గా ఉంది. ఈ సపోర్ట్ నిలబడలేకపోతే మాత్రం నిఫ్టీ మరింత దిగజారుతుంది అని తెలియచేయటం జరిగింది. అదే విధంగా నిఫ్టీ  సపోర్ట్ బ్రేక్ చేస్తూ బేరిష్ ఎగుల్పింగ్ చార్ట్ పాటర్న్ ఏర్పాటు కావటం జరిగినది.ఇది మార్కెట్ లో మరింత వీక్ నేస్ ను తెలియచేస్తుంది. నిఫ్టీ కి ప్రస్తుతం చార్ట్ లో ఉన్న ట్రెండ్ లైన్ సపోర్ట్ కలదు. అదే విధంగా 5361  పైన నిలదోక్కుంటే  మాత్రం 5420-5480 వరకు వెళ్ళుతుంది. డౌన్ సైడ్ సపోర్త్స్ మీకూ ఇదివరకే తెలియచేయటం జరిగినది. 5361 పైన బయ్యింగ్ చేయవచ్చు. ట్రెండ్ లైన్ సపోర్ట్ క్రింద స్టాప్ లాస్ పెట్టుకోండి. లేదా పై లెవల్లో 5480 రెసిస్టన్స్ వద్ద సెల్లింగ్ చేయండి. 

ఈ రోజు స్టాక్ మార్కెట్ 03-09-2013


ఈ రోజు  స్టాక్ మార్కెట్ 03-09-2013
నిన్న నిఫ్టీ రెసిస్టన్స్ లెవల్స్ ఐనటువంటి 5528  ను బ్రేక్ చేయటమే కాకుండా పైన క్లోజ్ కావటం కూడా జరిగినది. ఐతే నిన్న fii  కి సెలవు కావటం వలన చాలా తక్కువ వాల్యూం  తో రెసిస్టన్స్ బ్రేక్ కావటం జరిగినది. ఒకవేళ నిఫ్టీ  బ్రేక్ జరిగిన  రెసిస్టన్స్  పైన నిలదోక్కుంటే మాత్రం 5565 -5575 దానిపైన నిలదొక్కు కోవటం జరిగితే 5755 వరకు వెళ్ళటానికి అవకాశం కలదు. నిన్న తక్కువ వాల్యూం తో బ్రేక్ జరిగిన రెసిస్టన్స్ 5528 ప్రస్తుతం సపోర్ట్ గా ఉంది. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా నిలబడలేకపోతే మాత్రం నిఫ్టీ 5480-5420  నోకహ పడిపొగలదు. రెసిస్టన్స్ వద్ద సెల్లింగ్ చేయండి. సపోర్ట్ వద్ద బయ్యింగ్ చేయండి.