మీ బ్యాంక్ అకౌంట్స్ ప్రాడ్స్ నుండి ఎలా కాపాడుకోవాలి.?


మీ బ్యాంక్  అకౌంట్స్  ప్రాడ్స్ నుండి ఎలా  కాపాడుకోవాలి.?
Crime patrol అనేది సోనీ టి వి లో ప్రసారమయ్యే పాపులర్ క్రైం షో . ఈ షో వాస్తవంగా జరిగిన  క్రైం వెనుక గల సంఘటనలను తెలియచేస్తుంది.ఇందులో ఇటివలే చెన్నయ్ లో జరిగిన e-fruad ప్రసారం చేయడం జరిగినది.ఈ వాస్తవ సంఘటన వెనుక ఉన్న అసలు విషయం మరియు దాని వలన మనం నేర్చుకోవలసినది ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం.
ప్రతీక్ష చెన్నయ్ కి చెందిన సాప్ట్ వేర్ ఇంజనీర్ . ఆమె గత ఏడు సంవత్సరాల నుండి TCS e-serve లో ప్రముఖ అంతర్జాతీయ బ్యాంక్ అయినటువంటి సిటి బ్యాంక్ కి చెందిన బ్యాక్ ఎండ్ ఆపరేషన్ చూసే విభాగంలో పని చేస్తుంది.  ప్రతీక్ష వివాహం కొన్ని నెలల క్రితమే జరిగినది. ఆమె భర్త కూడా   సాప్ట్ వేర్ ఇంజనీర్. ఆమె చిన్ననాటి స్నేహితుడు చాలా అత్యవసరమైన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండి ప్రతీక్షని ఏదైనా  నాన్ ఆపరేటివ్ అకౌంట్ లో నుండి డబ్బు దొందిలించవలసినదిగా  ప్రోత్సహించేవాడు. ప్రతీక్ష సంవత్సరం నుండి ఎలాంటి ఆపరేటివ్ లేని కొన్ని నాన్ ఆపరేటివ్ బ్యాంక్ అకౌంట్స్ గుర్తించి వాటి అకౌంట్ హాల్దర్ అడ్రస్ మార్పు చేసింది.అటుపిమ్మట బ్యాంక్ వారికి డెబిట్ , క్రెడిట్ కార్డ్ కోసం రిక్వెస్ట్ పంపించడం జరిగినది.బ్యాంక్ వారూ మార్పు చేసినటువంటి కొత్త అడ్రస్ కి డెబిట్ , క్రెడిట్ కార్డ్ పంపించడం జరిగినది.వాటిని ఆమె స్నేహితుడు తీసుకొని వాటి ద్వారా బ్యాంక్ అకౌంట్ నుండి నలబై తొమ్మిది లక్షలు డ్రా చేయడం జరిగినది.


ఒకానొక సమయంలో బ్యాంక్ అధికారులకు అనుమానం వచ్చి అకౌంట్ హాల్దార్ ను సంప్రదించడం  జరిగినది.అతను ఎలాంటి రిక్వెస్ట్ లు పంపించడం కాని, డబ్బు డ్రా చేయడం  కాని చేయలేదని తెలియచేయడం జరిగినది. బ్యాంక్ అధికారులు  TCS e-serve విభాగం వారికి ఫిర్యాదు చేయడం జరిగినది.వారూ వారి విచారణలో ప్రతీక్ష కంప్యుటర్ నుండి బ్యాంక్ డేటా మార్పు జరిగినట్టుగా గుర్తించారు. ప్రతీక్ష కూడా ఈ విషయం ఒప్పుకోవడం జరిగినది. ఆమె స్నేహితుడు ప్రస్తుతం పరారీలో ఉండటం జరిగినది.
 పై స్టోరీ నుండి ఏమి నేర్చుకోవాలో ఒక్కసారి తెలుసుకుందాం.

ఇక్కడ వారూ ప్రాడ్ చేయడానికి ఎన్నుకున్న అకౌంట్ ,నాన్ ఆపరేటివ్ అకౌంట్ అంటే కొంత కాలం నుండి ఎలాంటి లావాదేవీలు నిర్వహించడం లేనటువంటి అకౌంట్.సంవత్సరం కంటే  ఎక్కువకాలం మీరు మీ అకౌంట్ లో ఎలాంటి లావాదేవీలు నిర్వహించకపోతే దానిని నాన్ ఆపరేటివ్ అకౌంట్ . కొన్ని బ్యాంక్స్ సంవత్సర కాలాన్ని పరిగణలోకి తీసుకుంటే మరికొన్ని రెండు సంవత్సరాల కాలాన్ని పరిగణలోకి తీసుకుంటాయి.అందువలన మీ బ్యాంక్ అకౌంట్  ని ఎక్కువ కాలంఎలాంటి లావాదేవీలు నిర్వహించకుండా ఉంచకండి.ఆ విధంగా ఉంచడం వలన మీ అకౌంట్ ని ఇలాంటి ప్రాడ్స్ కోసం ఎన్నుకోవడానికి అధిక అవకాశం ఉంటుంది.మీ అకౌంట్ నాన్ ఆపరేటివ్ అకౌంట్ గా మారడానికి ఎక్కువగా మీకు సమయం లేకపోవడం, లేదంటే అకౌంట్ లో ఉన్న డబ్బూ పై వడ్డీ వస్తుంది అని ఆశించడం ఏదైనా కావచ్చు.ఒకవేళ మీకు వడ్డీ కావలి అనున్కుంటే బ్యాంక్ అకౌంట్ లో ఉంచే బదులు ఫిక్సుడ్ డిపాజిట్  చేయడం చాలా మంచిది.ఒకవేళ మీ అకౌంట్ ఆపరేటివ్ అకౌంట్ అయినా కూడా తరచుగా మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్ మెంట్ చెక్ చేసుకోవడం మంచిది.
మీరు మీ డబ్బూ బ్యాంక్ అకౌంట్ లో ఉంచడం కన్నాఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది.పైన చెప్పినట్టుగా నలభై తొమ్మిది లక్షలు నాన్ ఆపరేటివ్ అకౌంట్ లో ఉంచుకోవడం కంటే బుడి తక్కువ పని మరొకటిలేదు కదా ? బ్యాంక్ అకౌంట్ లో ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ ఫండ్ కంటే ఎక్కువగా డబ్బూ మీ బ్యాంక్ అకౌంట్ లో ఉంచకూడదు.బ్యాంక్ అకౌంట్ లో ఈ డబ్బూ ఉంచడం వలన మీరూ మీ డబ్బూ ఇన్వెస్ట్ చేయడానికి గల చాలా అవకాశాలను కోల్పోతుంది.
సాదారణంగా బ్యాంక్స్ వారి వద్ద నుండి హోం లోన్స్, క్రెడిట్ కార్డ్స్, కార్ లోన్స్, పర్సనల్ లోన్స్ కోసం మాతరం చాలా ఫోన్స్ వస్తాయి. కాని ఏ బ్యాంక్ వారూ కూడా మీ అకౌంట్ నా ఆపరేటివ్ అకౌంట్ గా మారుతుంది అని మాత్రం తెలియచేయారు. ఈ విషయంలో బ్యాంక్ వారూ కాస్త శ్రద్ద చూపిస్తే ఇలాంటి ప్రాడ్స్ జరగకుండా చూసుకోవచ్చు.
ఇలాంటి ప్రాడ్స్ ఎక్కువగా సెక్యూరిటీ  ఉల్లంఘన వలెనే అధికంగా జరుగుతాయి. చాలా బ్యాంక్స్ కూడా వారి  బ్యాక్ ఎండ్ ఆపరేషన్ కోసం థర్డ్ పార్టీ ని నియమించుకోవడం లేదా వారి సాప్ట్ వేర్ వాడటం చేస్తుంటాయి.కస్టమర్ యొక్క సున్నితమైన డేటా విషయంలో బ్యాంక్స్ వారూ అధిక శ్రద్ద  తీసుకోవడం మంచిది.బ్యాంక్స్ ఒకటికి రెండు సార్లు ఇలాంటి విషయాలు జరగకుండా రక్షణ చర్యలు లేదా బయోమెట్రిక్ రక్షణ చర్యలు చేపట్టడం మంచిది. కస్టమర్స్ కష్టపడి సంపాదించిన వారి సొమ్మూ బ్యాంక్ లో అయితే భద్రంగా ఉంటుంది అనే నమ్మకంతో మాత్రమే బ్యాంక్స వద్దకు వస్తున్నారు. ఇలాంటి సంఘటన వలన బ్యాంక్స్ పై కూడా నమ్మకం సడలే  అవకాశం కూడా కలదు.

బంగారం ఎక్కడి నుండి ఎంత వస్తుంది? ఎక్కడికి ఎంత వెళ్తుందో ఒక్కసారి చూద్దాం?



బంగారం ఎక్కడి నుండి ఎంత వస్తుంది? ఎక్కడికి ఎంత వెళ్తుందో ఒక్కసారి చూద్దాం?
మీకు క్రింద ఇవ్వబడిన బంగారు ట్రీ లో బంగారం ఎక్కడి నుండి ఎంత వస్తుంది ? ఎక్కడికి ఎంత వెళ్తుందో వివరంగా చిత్రంలో చూపబడినది.

బంగారం గురించి బంగారం లాంటి నిజాలు.


బంగారం గురించి బంగారం లాంటి నిజాలు.
క్రింద ఇవ్వబడిన చిత్రంలో బంగారం గురుంచి బంగారం లాంటి నిజాలు ఉన్నాయి . అవి ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం.ఇప్పటివరకు బంగారు మైన్స్ నుండి  వెలికితీసిన బంగారం ఎంతో తెలుసా ?  167,000 టన్నులు అంటే సుమారు 120 షిప్పింగ్ కంటెయినర్స్ లలో నింపడానికి సరిపోతుంది. ఈ బంగారం బరువు మొత్తం కలిపి ఈఫిల్ టవర్ బరువుకంటే 16.5 రేట్లు అధికంగా బరువు ఉంటుంది.ప్రపంచంలో అత్యంత పెద్దది ఐనటువంటి సూపర్ ట్యాంకర్ ఈ బంగారం కంటే మూడూ రెట్ల అధిక బరువును మోస్తుంది.ఈ బంగారం యొక్క ప్రస్తుత మార్కెట్  విలువ అమెరికా డాలర్లలో 8 ట్రిలియన్లు అంటే 8,000,000,000,000,అమెరికా డాలర్లు.అంటే ఇది అమెరికాకి గల అప్పులలో సగానికి సమానం.మన రూపాయలలోఅయితే 416,000,000,000,000 లకి సమానం. ఈ బంగారంతో బంగారు ఆకులూ తయారు చేస్తే వాటితో స్విట్జర్లాండు మొత్తం పరచవచ్చు లేదంటే  న్యూజెర్సీ  కంటే రెండు రేట్లు అధిక ప్రదేశంపై పరచవచ్చు.కేవలం 60 టన్నుల బంగారంతో తీగ తయారు చేస్తే ఆ తీగ భూమి నుండి సూర్యుడికి గల దూరాన్ని కొలవడానికి సరిపోతుంది. ప్రతి సంవత్సరం 1960 టన్నుల  బంగారం జ్వెల్లరీ కొరకు    1640 టన్నుల  బంగారం ఇన్వెస్ట్మెంట్ కొరకు    460 టన్నుల  బంగారం టెక్నాలజీ కొరకు వాడుచున్నారు. 

బంగారం ధర పెరుగుదల పై అపోహలు.


 బంగారం ధర పెరుగుదల పై అపోహలు.
మనదేశంలో బంగారం ధర పెరుగుదలపై అనేక అపోహలు ఉన్నాయి.అవిఎమిటో ఒక్కసారి చూద్దాం.
దీపావళి పండుగ దగ్గరలో ఉంది కాబట్టి ప్రజలూ అధిక బంగారం కనుగోలు చేస్తారు కావున బంగారం ధర పెరగడానికి అవకాశం ఉంది.
పెళ్ళిళ్ళ సీజన్ ప్రారంభం కాబోతుంది . కాబట్టి   బంగారం ధర పెరగడానికి అవకాశం ఉంది.
దీపావళి అనంతరం బంగారం ధరలు పడిపోతాయి . ఎందుకంటే  డిమాండ్ తగ్గిపోతుంది కాబట్టి.
బంగారం ధర పైకే వెళ్ళుతుంది. ఎందుకంటె భారతీయులు బంగారం అధిక కనుగోలు చేస్తారు కావున .
ఇప్పుడు బంగారం పది గ్రాములకు ముప్పైవేలు ఉంది కాబట్టి ప్రజలూ కొనడం మానేస్తారు . అందువలన బంగారం ధరలు పడిపోతాయి.
అక్షయ తృతీయ వస్తుంది కావున , బంగారం అధికంగా కనుగోలు  చేస్తారు కావున బంగారం ధర పెరుగుతుంది.

వాస్తవం 
పైన పేర్కొన్నవన్ని కేవలం అపోహలు మాత్రమే. పైనవన్ని కలిపి కూడా బంగారం ధరపై కేవలం  ఒక్క శాతం మాత్రమే ప్రభావం చూపగలవు.బంగారం ధర సాదారణంగా అమెరికా మానీటరీ పాలసీ కి అనుగుణంగా పెరగడం , తగ్గడం జరుగుతుంది. మనదేశంలో బంగారం ధరను  రూపాయి బలహీనపడటం, బలపడటం కూడా ప్రభావితం చేస్తుంది.   

మీరు లేదా మీ పిల్లలు జీవితంలో ఆర్ధికంగా ఎదిగి మిలియనీర్లు , బిలియనీర్లు కావాలి అంటే తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆర్ధిక విషయాలు part -3


మీరు లేదా మీ పిల్లలు జీవితంలో ఆర్ధికంగా ఎదిగి మిలియనీర్లు , బిలియనీర్లు కావాలి అంటే తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆర్ధిక విషయాలు part -3
మిలియనీర్లు, బిలియనీర్లు  ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్  గురుంచి అధికంగా ఆలోచిస్తారు.వారూ ఎప్పుడైనా  కొత్త  బిజినెస్ ప్రారంభించడం లేదా వారి డబ్బూ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ సాధనంలో  ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు  ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్  ఏ విభాగం లో ఐతే వారూ పెట్టిన డబ్బూ అధిక రాబడి ఇస్తుందో,  అని ఆలోచిస్తారు.  కాని మధ్యతరగతి వారి దగ్గరికి వచ్చేసరికి  ఇలాంటి ఆలోచన ఏ మాత్రం ఉండదు. మీరు లేదా మీ పిల్లలు  జీవితంలో మిలియనీర్లు లేదా బిలియనీర్లుగా ఎదగాలి అంటే తప్పనిసరిగా ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్  గురించి తప్పనిసరిగా ఆలోచించాలి.కనీసం ఇప్పటినుండైనా   ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్  గురించి తెలుసుకోవడం చేయండి. అదే ధనవంతుల విషయానికి వచ్చే సరికి వారి పిల్లలకు చిన్నప్పటి  నుండే తెలియచేయడం వలన వారూ పెరిగి పెద్దయ్యాక ఆర్ధిక విషయాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు.మధ్యతరగతి వారూ  ఆర్ధికంగా ఎదగపోవడానికి ముఖ్య కారణం ఈ ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్  అవగాహన లేకపోవడమే. వారికి అవగాహన లేకపోవడంతో వారూ కూడా ,వారి పిల్లలకు ఏ విధమైన  ఆర్ధిక పరమైన  విషయాలను పంచలేకపోతున్నారు. అదే ధనవంతుల పిల్లలు ఎప్పుడూ  ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్  గురుంచి ఆలోచిస్తుంటారు. ధనవంతులైన , ధనవంతులు కావాలి అనుకుంటున్నవారూ ఎవరైనా సరే తప్పకుండా   ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్  గురుంచి తెలుసుకోవాలి.
దురదృష్టావశాత్తూ మన స్కూల్స్ లేదా కాలేజీలు ఈ  ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్  పై ఎలాంటి భోధన చేయడం లేదు. స్కూల్స్ లేదా కాలేజీలు అనేవి కేవలం ఎంప్లాయిస్ లేదా సెల్ఫ్  ఎంప్లాయిస్ లను తయారు చేసే విధంగా మాత్రమే రూపకల్పన చేయబడ్డాయి.వీరూ ధనవంతుల యొక్క వ్యాపారాలను నడుపుటకు ఉపయోగపడతారు. ఒకవేళ  స్కూల్స్ లేదా కాలేజీలు ప్రతి ఒక్కరికి  ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్ బేసిక్స్ నేర్పించినట్టు ఐతే ధనవంతుల యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని బానిసలాగా కస్టపడి ముందుకు నడిపించేవారూ ఎవ్వరూ? అందువలనే ఈ   ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్ గురించి  స్కూల్స్ లేదా కాలేజీలలో నేర్పించరు. ఆ పదాన్ని మన ఉద్దేశ పూర్వకంగానే తొలగించడం జరిగినది.కొన్ని శతాబ్దాల క్రితమే ధనవంతులకు తెలుసు ఆర్ధికంగా ఎదగాలి అంటే ముందుగా  ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్ గురుంచి తెలుసుకోవాలి అనే విషయం.
మీరు జీవితంలో మిలియనీర్లు, బిలియనీర్లు కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి.  ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్  అనేది మీరు  మిలియనీర్లు, బిలియనీర్ల క్లబ్ లోకి ప్రవేశించే ప్రవేశ ద్వారం వంటిది.చాలా మంది ఆర్ధిక సలహాదారులు మీరు ఈ మ్యుచవల్ ఫండ్స్ పథకం లేదా ఫలానా షేర్లలో ఇన్వెస్ట్ చేయండి అని సలహా ఇస్తుంటారు తప్పితే ముందుగా మీ ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్ గురుంచి ఆలోచించండి అని కాని , మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ మీ    ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ ప్రకారం మీకు అనుకూలంగా ఉంటుందా లేదా అని ఆలోచించమని మాత్రం చెప్పరు.ప్రతి పెట్టుబడి మిమ్ములను ధనవంతులను చేయాలని లేదా ప్రతి పెట్టుబడి సాధనం ధనవంతులను చేయగలిగే సామర్ధ్యం కలిగి ఉంటుంది అని అనుకోవడానికి ఎంత మాత్రం వీలు లేదు.మీరు   ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్ గురుంచి తెలుసుకోకుండా   ఫైనాన్షియల్ పొడక్ట్ కొనడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. అదే ధనవంతులూ మాతరం వారూ వారి జీవితంలో చేసే ప్రతి ఇన్వెస్ట్మెంట్ ముందు తప్పనిసరిగా  ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్ గురించి తెలుసుకున్నతర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వయూ పెట్టె పెట్టుబడులు ఎప్పుడు మంచి రాబడిని మాత్రమే అందిస్తాయి. 

ఇప్పుడు రెండేళ్ళ వయస్సున్న మీ కూతురి వివాహం ఇరవై సంవత్సరాల తర్వాత చేయడానికి అప్పుడు కావాల్సిన మొత్తం ఎంత ? దానిని ఏ విధంగా సమకూర్చుకోవాలి ?

ఇప్పుడు రెండేళ్ళ వయస్సున్న మీ కూతురి వివాహం ఇరవై సంవత్సరాల తర్వాత చేయడానికి అప్పుడు కావాల్సిన మొత్తం ఎంత ? దానిని ఏ విధంగా సమకూర్చుకోవాలి ?

మనదేశంలో సాదారణంగా కూతురి వివాహం చేయడం చాలా ఖర్చుతో కూడుకున్నదే.మీకు ఇష్టం ఉన్నా , లేకపోయినా  ఆడపిల్ల వివాహసమయంలో వరకట్నం ఇవ్వడం అనేది చాలా సహజం. ఈ విషయంలో ఎవ్వరూ ఎన్ని మొత్తుకున్న  సమాజంలో  వరకట్నం అనే జాడ్యాన్ని
 రూపుమాపలేకపోతున్నారు. అంతేకాకుండా రోజురోజుకి ఈ వరకట్నాలు ,వివాహ ఖర్చులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇంకా చెప్పాలి  అంటే ఒకరికిమించి ఒకరూ పోటిపడి వీటిని పెంచుతున్నారు. సరే దాని గురుంచి మనం వదిలేద్దాం  అసలు విషయానికి వద్దాం.ఈ రోజు రెండు సంవత్సరాల వయస్సు ఉన్న మీ పాప వివాహం ఇరవై సంవత్సరాల తర్వాత చేయాలి అంటే ఎంత ఖర్చు అవుతుందో ఒక్కసారి చూద్దాం. మీరనవచ్చు మా పాప వయస్సు రెండు సంవత్సరాలే కదా ?  ఇప్పుడే వివాహం గురించి ఆలోచన అవసరమా ? అని. అవసరమా ? కాదా ? అనేది మొత్తం చదివిన తర్వాత నిర్ణయం మీరే నిర్ణయం తీసుకోండి.
ముందుగా మీరు ప్రస్తుత పరిస్థితితులలలో మీ పాప వివాహం ఈ రోజు చేస్తే ఎంత ఖర్చు అవుతుందో ఒక్కసారి ఆలోచించండి.మీ సామాజిక పరంగా , మీ కుటుంబ పరంగా  అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని ఆలోచించండి. అంటే కొన్ని వర్గాలలో వరకట్నం తక్కువగా ఉంటుంది. మరికొన్ని వర్గాలలో అధికంగా ఉంటుంది. ఈ రోజు మీ పాప వివాహం చేసి, అన్ని లాంచనాలతో ,   వరకట్నంతో సహా ఇచ్చి అత్తవారింటికి పంపించడానికి  పది లక్షలు ఖర్చు ఆయితే  ఇదే వివాహం ఇదే స్థాయిలో చేస్తే  ఎంత ఖర్చుఅవుతుందో తెలుసా ?  రూ . 3869685 అవును సుమారు ముప్పై తొమ్మిది లక్షలరూపాయలు . అది కూడా ఇన్ఫ్లేషన్  7% తీసుకొని లెక్కించడం వలన . ఒకవేళ ఇన్ఫ్లేషన్ 8% ఐతే కావాల్సిన మొత్తం రూ 4660958.మీకు ఇన్ఫ్లేషన్ మరియు అది మనపై ఏ విధమైన ప్రభావం చూపెడుతున్నదో తెలియకపోతే క్రింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి చదవండి.


ఇరవై సంవత్సరాల తర్వాత  మీ కూతురి వివాహం చేయడానికి   రూ . 3869685 కావలి అని తెలిసినది కదా ఇంత మొత్తం ఎలా సమకూర్చుకోవడం అంటారా ?  అందుకే మీ పాప వయస్సు ప్రస్తుతం  రెండు సంవత్సరాలు మాత్రమే అని చూడకుండా ఇరవై ఏళ్ళ తర్వాత కావాల్సిన మొత్తం ఏవిధంగా ఏర్పాటు చేసుకోవాలో ఆలోచించుకోండి.. మీరు ఇప్పటి నుండే సేవింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేయడం చేయాలి. సేవినగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ కి గల తేడా ఇంతకు ముందు పోస్టులో  తెలియచేయడం జరిగినది. బ్యాంక్స్ సాదారణంగా 8% వడ్డీ అందిస్తున్నాయి కాబట్టి మీరు ఇప్పటి నుండి ప్రతినెల రూ.7861 లు పొదుపు చేస్తే ఇరవై ఏళ్ళ తర్వాత మీకు కావాల్సిన మొత్తం అందుతుంది.లేదంటే మీరు షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లో ప్రతినెల ఇన్వెస్ట్ చేయండి. షేర్ మార్కట్ లో ఇన్వెస్ట్ చేయడానికి అవగాహన చాలా అవసరం. దాని బదులు మీరు మ్యుచవల్  ఫండ్స్ లో ప్రతినెల SIP  పద్ధతి ద్వారా ఇన్వెస్ట్ చేయండి.ఇరవై సంవత్సరాలు అంటే చాలా సుదీర్ఘకాలం  కాబట్టి మీ రాబడి 15% నుండి 18% వరకు వస్తుంది. కనీసం మీరు15% రాబడి వస్తుంది అనుకున్న మీకు కావాల్సిన మొత్తం  ఇరవై సంవత్సరాల తర్వాత అందుకోవాలి అంటే మీరు ప్రతి నెల  రూ .3075  ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. అదే 18% రాబడి వస్తుంది అనుకుంటే మీరు ప్రతినెల ఇన్వెస్ట్ చేయాల్సిన మొత్తం కేవలం రూ. 2000 మాత్రమే. కాని ముందు జాగ్రత్తగా కొద్ది తక్కువగా రాబడి శాతం అంచనా వేయడం మంచిది. ఒకవేళ మీరు మీ పాప రెండేళ్ళ వయస్సు నుండి కాకుండా ఏడేళ్ళ వయస్సునుండి అంటే  ఐదు సంవత్సరాలు ఆలస్యంగా సేవింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ ప్రారంభిస్తే బ్యాంక్ లో ఐతే మీరు ప్రతినెల రూ 9100 మ్యుచవల్ ఫండ్ లో ఐతే  15% రాబడి అంచనా వేస్తె రూ 4700 ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. మీరు ఆలస్యం చేసిన కొలది మీరు ప్రతినెల ఇన్వెస్ట్ చేయాల్సిన మొత్తం కూడా  పెరుగుతుంది.అందుకే వీలయినంత త్వరగా అంటే పాప మొదటి పుట్టిన రోజు కంటే ముందే ఈ విధంగా చేయడం మంచిది. చాలా తక్కువ మొత్తం ప్రతినెల ఇన్వెస్ట్ చేయడం వలన , సుదీర్ఘకాలం కాబట్టి రాబడి కూడా చాలా బాగుటుంది.

మీరు లేదా మీ పిల్లలు జీవితంలో ఆర్ధికంగా ఎదిగి మిలియనీర్లు , బిలియనీర్లు కావాలి అంటే తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆర్ధిక విషయాలు part -2


మీరు లేదా మీ పిల్లలు జీవితంలో ఆర్ధికంగా ఎదిగి మిలియనీర్లు , బిలియనీర్లు కావాలి అంటే తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆర్ధిక విషయాలు part -2
బిలియనీర్లు ఆర్ధిక వ్యవస్థలో సంపదను స్ప్రుస్టించే స్ప్రుస్టికర్తలు 
బిలియనీర్ల ఆలోచనా విధానం  మధ్యతరగతి వారికి మరియు మిలియనీర్ల కంటే కూడా వేరే విధంగా ఉంటుంది.నిజం చెప్పాలి అంటే వీరూ  ఆర్ధిక వ్యవస్థ లో సంపదను స్ప్రుస్టిస్తారు . బిలియనీర్లు , మధ్యతరగతి వారిలా డబ్బూ కోసం పని చేయడం కాని, మిలియనీర్లలా మనీ ని వారి కోసం పనిచేసే విధంగా చేయడం చేయరు. అంటే వీరూ ఇన్వెస్ట్మెంట్ చేయరని కాదు .ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాని వీరి ఇన్వెస్ట్మెంట్ పద్ధతి వేరే విధంగా ఉంటుంది.బిలియనీర్లు వారికి అవసరమైన మనీని  ఆర్ధిక వ్యవస్థలో చట్టబద్దంగా ముద్రించుకుంటారు.
సరే ఆయితే  వీరూ ఆర్ధిక వ్యవస్థలో సంపద ఎలా  స్ప్రుస్టిస్తారు? చట్టబద్దంగా ఆర్ధిక వ్యవస్థలో వారికి కావాల్సిన మనీని ఏ విధంగా ముద్రించుకుంటారు అనే కదా ? మీ సందేహం. ముందుగా వీరు  ఒక వ్యాపారాన్ని ప్రారంభించి దానిని విజయవంతమైన వ్యాపారంగా తీర్చిదిద్ది ,దానిని ప్రజల వద్దకు పబ్లిక్ ఆఫర్ రూపంలో తీసుకవచ్చి, వారి వ్యాపారంలో కొంత వాటా లేదా షేర్స్ ని మిలియన్ల కొద్ది  ప్రజలకు అమ్మడం ద్వారా  ప్రజలకు  సంపదను స్ప్రుస్టించి వారూ కూడా బిలియనీర్లుగా మారతారు.
మీరు ఇప్పటి  వరకు మధ్యతరగతి, మిలియనీర్లు , బిలియనీర్ల ఆలోచనా విధానం , సంపాదనా విధానం  ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నారు.ఇకనుండి మీకు చెప్పబోయే ఆర్ధిక పరమైన విషయాలు చక్కగా చదివి అర్ధం చేసుకోండి. ఒకే ఆర్ధిక పరమైన విషయాన్ని మధ్యతరగతి వారూ, మిలియనీర్లు, బిలియనీర్లు  ఏ విధంగా అర్ధం చేసుకొని  ,ఏ రీతిలో  ఉపయోగిస్తారో  తెలుసుకోండి.

ఫైనాన్షియల్ స్టేట్ మెంట్
మీరు ఇదివరకే ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ అనే పదం చాలా సార్లు వినే ఉంటారు. దాని గురుంచి మీకు కొద్దో గొప్పో అవగాహన ఉండటం లేదా అసలు ఏమాత్రం అవగాహన కూడా ఉండకపోవచ్చు.మీరు క్రింద ఇవ్వబడిన చిత్రాన్ని చూడండి.మీరు మీ కాలేజీ  నుండి బయటకు వచ్చే సరికి మీ దగ్గర ఉండే  ఫైనాన్షియల్ స్టేట్ మెంట్  మీ మార్కుల షీటు మాత్రమే.మీరు మీ కాలేజీలో నేర్చుకున్న దాని ప్రకారమే  మీ జీవితాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది.అదే మిలియనీర్ల , బిలియనీర్ల పిల్లలు చిన్నతనం నుండే  ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ పై అవగాహన వారి కుటుంబ సభ్యులనుండే పొందుతారు. అదే మధ్యతరగతి వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చే సరికి   ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ గురుంచి చెప్పేవారే ఉండరు. అందుకే మధ్యతరగతి వాళ్ళ పిల్లలు ఎప్పుడూ మధ్యతరగతి గానే  మిగిలిపోతున్నారు.అయినా ఒక మధ్యతరగతి వ్యక్తీ తన పిల్లలకు  ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ గురుంచి , ఆర్ధిక వ్యవహారాల గురుంచి ఏ విధంగా తెలియచేస్తాడు? స్వయంగా అతనికి లేదా ఆమెకే ఏమాత్రం ఆర్ధిక వ్యవహారాలపై అవగాహనలేనప్పుడు.

ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ అంటే ఏమిటి? మీరు  మీ జీవితంలో ధనవంతులు కావాలంటే అది ఎందుకు అతి ముఖ్యమో  సాదారణ బాషలో తెలుసుకుందాం .మీ ఆదాయం , మీ ఖర్చులు, మీఅస్తులు , మీ అప్పులు  మొదలగు వాటి వివరాలు పేపర్ పై నమోదు చేస్తే దానినే ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ అంటారు.

         FINANCIAL STATEMENT
                   INCOME STATEMENT
INCOME
EXPENSE
CASH FLOW

                  BALANCE SHEET
ASSETS
LIABILITY
పైన చిత్రంలో చూపించిన విధంగా   ఫైనాన్షియల్ స్టేట్ మెంట్  రెండు భాగాలను కలిగి ఉంటుంది. ఒక్కటి ఇన్ కమ్ స్టేట్ మెంట్ , రెండవది బ్యాలన్స్ షీట్ . 
ఇన్ కమ్ స్టేట్ మెంట్ లో మీ సాలరీ , వడ్డీ ఆదాయం, డివిడెండ్ ఆదాయం,రెంటల్ ఆదాయం, బిజినెస్ ఆదాయం,ఇతర ఆదాయాలతో పాటు,  మీ ఖర్చుల వివరాలు అంటే, మీరు చెల్లించే టాక్స్ , మీరు జీవించడానికి పెట్టె ఖర్చులు అంటే ఆహారం, బట్టలు మొదలగు వాటికి పెట్టె ఖర్చులు, మీ క్రెడిట్ కార్డ్ బిల్స్, మీ ఈ ఏం  ఐ లు మొదలగు వాటి వివరాలు ఉంటాయి.
బ్యాలన్స్ షీట్ కూడా రెండు భాగాలను కలిగి ఉంటుంది. మొదటిది  అసెట్ కాలమ్  , రెండవది లయబిలిటీ కాలమ్. సాదారణంగా మధ్యతరగతి ప్రజలూ  ఒకే  ఫైనాన్షియల్ స్టేట్ మెంట్  ఉంటుంది. అది వారి స్వంతది అనే అపోహలో ఉంటారు.కాని వాస్తవంగా ఒక్కో ఆర్ధిక సాధనానికి , ఒక్కో  ఫైనాన్షియల్ స్టేట్ మెంట్  ఉంటుంది. అదే  మిలియనీర్లు, బిలియనీర్లు మనీ తో  మాత్రమే కాకుండా ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్  తో కూడా ఆటలు ఆడతారు.

మీరు ,మీ పిల్లలు జీవితంలో ఆర్ధికంగా ఎదిగి మిలియనీర్లు , బిలియనీర్లు కావాలి అంటే తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆర్ధిక విషయాలు part -1

మీరు ,మీ పిల్లలు జీవితంలో ఆర్ధికంగా ఎదిగి మిలియనీర్లు , బిలియనీర్లు కావాలి అంటే తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆర్ధిక విషయాలు part -1

డబ్బు గురుంచి మిలియనీర్లు , బిలియనీర్లు వాళ్ళ పిల్లలకు నేర్పేది , పేద , మధ్యతరగతి వాళ్ళు, వాళ్ళ పిల్లలకు నేర్పలేనిది ఏమిటో తెలుసుకుందాం.
సాదారణంగా మీరు ఏ ఇంట్లో చూసిన ఏ తల్లిదండ్రులు అయినా వారి పిల్లలకు  పై క్రింది  నేర్పిస్తారు.మీరు జీవితంలో కనుక ధనవంతులు , మిలియనీర్లు , బిలియనీర్లు కావాలి అంటే మాత్రం  కొన్ని ఆర్ధిక విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.  అవి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

MIDDLE CLASS TEACH
RICH TEACH
GO TO SCHOOL
FINANCIAL STATEMENTS
WORK HARD
ASSETS
GET GOOD GRADES
LAIBILITIES
GET A JAB
CASH FLOW
JOB SECURITY
GOOD & BAD DEBT
DO IT YOUR SELF
BUSINESS
NEVER THINK OF MONEY
INVESTMENTS
BUSINESS IS RISKY
CREATE JOBS
INVESTMENT IS RISKY
PASSIVE INCOME


అందరూ వారి జీవితంలో ఏదో ఒక్కరోజు ధనవంతులు కావాలి అని ఆశ పడుతూ కలలు కంటారు. ఆశపడటం , కలలు కనడంలో  ఎలాంటి తప్పు లేదు.కాని దురద్రుస్టావశాత్తు  మన విద్యా వ్యవస్థ డబ్బు గురుంచి ఎలాంటి భోదన చేయడం లేదు. అందువల్లనే  చాలా మంది విద్యార్థులు వారి కళాశాల విద్య అనంతరం జీవితంలో డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. చివరకు వారం ప్రారంభంలో  సాలరీ కొరకు ఎదిరి చూడాల్సి వస్తుంది.పోనీ కనీసం తల్లిదండ్రులు అయినా  పిల్లలకు  డబ్బు గురుంచి, ఆర్ధిక విషయాల గురుంచి చిన్నప్పటి నుండి  నేర్పిస్తారా అంటే అది ఉండదు. ఇందులో పాపం వారి తప్పేం ఉంది. ముందుగా వారికి అవగాహన ఉండాలి కదా ?. అదే మిలియనీర్లు , బిలియనీర్లు  వారి పిల్లలకు చిన్నప్పటి నుండి డబ్బు గురుంచి,  ఆర్ధిక విషయాల గురుంచి చిన్నప్పటి నుండి నేర్పిస్తారు. ఎందుకంటె వారికి ఆర్ధిక విషయాల పట్ల పూర్తీ అవగాహన ఉంటుంది కాబట్టి. మీరు జీవితంలో ఆర్ధికంగా ఎదగాలి అంటే మాత్రం తప్పనిసరిగా మీరు ఇక్కడ చెప్పే విషయాలను తప్పనిసరిగా నేర్చుకోవాలి. ముందుగా మీరు మధ్యతరగతి, మిలియనీర్లు, బిలియనీర్ల  ఆలోచనా విధానాలలో  గల తేడా తెలుసుకోండి.

మధ్యతరగతి వాళ్ళు డబ్బు కోసం కష్టపడతారు.
మధ్యతరగతి వారి ఆలోచనా విధానం సాదారణంగా సెక్యూరిటీ గా ఉండే  ఉద్యోగం సంపాదించడం , ఆ ఉద్యోగంలో నెలవారీ జీతం కోసం కష్టపడటం , కొంత వయస్సు వచ్చాక అంటే అరవై , అరవై ఐదేళ్ళ వయస్సు వచ్చాకా రిటైర్ కావడం అనే విధంగా ఉంటుంది.
ఈ ఆలోచన విధానం వారి తల్లిదండ్రులు, తాతముత్తాతల నుండి వస్తుంది. ఇప్పటికి కూడా వారి ఆలోచన విధానంలో తేడా ఎంత మాత్రం ఉండదు. ఉద్యోగం లేకపోవడం లేదా ఉన్న ఉద్యోగం పోవడం అనే ఆలోచనే వారికి భరింపరానిదిగా ఉంటుంది.  వీరికి డబ్బు సంపాదించడానికి చేతనైనది ఒక్కటే అది ఉద్యోగం చేయడం. వారి విలువైన జీవితాన్ని ఉద్యోగానికి అంకితం చేస్తూ ప్రతినెల మొదటి వారం రాగానే సాలరీ కొరకు ఎదిరిచూడటం మాత్రమే చేస్తారు.
మిలియనీర్లు వారి  మనీని వారి కోసం పనిచేసే విధంగా చేస్తారు.
సాదారణంగా మిలియనీర్లు వారి మనీ ని వారి కోసం పనిచేసే విధంగా చేస్తారు.అంటే వారూ అధికంగా కష్టపడకుండా  వారూ ఇదివరకే సంపాదించిన మనీ , ఇంకా వారి కోసం సంపాదించే విధంగా చేసుకుంటారు.వీరూ  మనీని మానేజ్ చేసే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు.అంటే మనీని పెట్టుబడి పెట్టడం . వీరూ సాదారణంగా అనేక రకాలైన పెట్టుబడులు పెడతారు. అంటే షేర్స్ , రియల్ ఎస్టేట్ , గోల్డ్, బాండ్స్, మ్యుచవల్  ఫండ్స్, బిజినెస్ , వెబ్సైట్స్ మొదలగునవి. వీరికి ఇన్వెస్ట్మెంట్ చేయడం నైపుణ్యంతో కూడుకున్నది అనే విషయం బాగా తెలుసు, దాని వలన ఆర్ధికంగా చాలా త్వరగా ఎదగవచ్చు అనే విషయం కూడా బాగా తెలుసు. అందువల్లనే వారూ వారి  యుక్త వయస్సులో అంటే సంపాదన  మొదలైన తొలినాళ్ళ లోనే  వీరూ ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడతారు. వీరి ఆలోచన విధానం ఒక్కటే .ఇన్వెస్ట్ చేసిన మొదటి రోజు నుండే వారి మనీ ,వారి కోసం  పని చేయడం మొదలు పెట్టి కొంత కాలానికి వారిని ఆర్ధికంగా ఉన్నత స్థితిలో నిలబెట్టి ధనవంతులు చేస్తుంది అని.  అంతే కాకుండా వీరూ  ,వారి పిల్లలకు చిన్నప్పటి నుండి  ఆర్ధికపరమైన పాఠాలు  , ఇన్వెస్ట్మెంట్ నైపుణ్యాలు నేర్పుతారు. అదే సమయంలో మధ్యతరగతి వారూ మాత్రం వారి పిల్లలకు బాగా చదివి  మంచి మార్కులు తెచ్చుకుంటే ,  సెక్యురిటీ ఉన్న మంచి ఉద్యోగం వస్తుంది.దానితో పాటు మంచి సాలరీ వస్తుంది అని పిల్లలకు నేర్పుతారు.

మీరు సంపాదిస్తున్న ఆదాయం మంచిదా ? లేక చెడ్డదా ? అసలు ఆదాయం ఎన్ని రకాలు ? వాటిలో ఏ ఆదాయం మంచిది ? ఎందుకు మంచిది ?


మీరు  సంపాదిస్తున్న ఆదాయం మంచిదా ? లేక చెడ్డదా ? అసలు ఆదాయం ఎన్ని రకాలు ? వాటిలో ఏ ఆదాయం మంచిది ? ఎందుకు మంచిది ?
ఆదాయం అంటే  ఉద్యోగం, బిజినెస్ ,ఇన్వెస్ట్మెంట్ ద్వారా  వచ్చే డబ్బు. ఈ ఆదాయం  మంచి ఆదాయం , చెడ్డ ఆదాయం ఏదైనా కావచ్చు. ఏంటి? ఆదాయంలో కూడా మంచి ఆదాయం , చెడ్డ ఆదాయం అని కూడా ఉంటాయి అని అనుకుంటున్నారా ?  అవును తప్పకుండా ఉంటాయి.మీ దృష్టిలో మంచి ఆదాయం అంటే మంచి సాలరీ , అధిక ఆదాయం ఉండటం , చెడ్డ ఆదాయం అంటే తక్కువ సాలరీ ఉండటం , తక్కువ ఆదాయం ఉండటం.అంటే మీరు పొందుతున్న ఆదాయం యొక్క పరిమాణం ను బట్టి అది మంచి ఆదాయం లేదా చెడ్డ ఆదాయం అనే నిర్ణయానికి వస్తారు.కాని ఇది ఎంత మాత్రం మంచిది కాదు.ఇప్పుడు ఒక్కసారి మనం ఆదాయం ఎన్ని రకాలు దానిలో మంచి ఆదాయం , చెడ్డ ఆదాయం ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం.
ఆదాయం సాదారణంగా మూడు రకాలుగా ఉంటుంది.
ఆక్టివ్ ఇనకమ్  లేదా ఎర్నేడ్ ఇనకమ్:ఈ ఆదాయం సాదారణంగా మీరు పని చేయడం వలన వచ్చే ఆదాయం.మీరు సాదారణంగా ప్రతి నెల అందుకొనే సాలరీ .దీనిలోనే మీ బోనస్ , కమీషన్ , ఓవర్ టైమ్ పని చేయడం వలన వచ్చే ఆదాయం కూడా ఉంటుంది. ఈ ఆదాయం మీరు ఎప్పుడైతే పని చేయడం అపేస్తారో, అప్పుడు ఈ ఆదాయం రావడం కూడా ఆగిపోతుంది.
పోర్ట్ఫోలియో ఇనకమ్ : ఈ ఆదాయం సాదారణంగా పేపర్ అస్తులవలన  లేదా ఎలక్ట్రానిక్ ఆస్తుల వలన వస్తుంది. అంటే  షేర్స్ ,బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మొదలగు వాటి ద్వారా వచ్చే ఆదాయం.
పాసివ్ ఇనకమ్:పాసివ్ ఇనకమ్ సాదారణంగా బిజినెస్ లేదా రియల్ ఎస్టేట్ మార్గాల ద్వారా వస్తుంది.అంతే కాకుండా మీ తెలివి తేటల మీదా వచ్చే రాయల్టీ ఇనకమ్ అంటే మీరు వ్రాసిన బుక్స్, సాంగ్స్ ,మొదలగు వాటిపై వచ్చేది.
పై మూడింటిలో పోర్ట్ఫోలియో ఇనకమ్, పాసివ్ ఇనకమ్ మంచి ఆదాయం ఆయితే , ఆక్టివ్ ఇనకమ్  లేదా ఎర్నేడ్ ఇనకమ్  చెడ్డ ఆదాయం అవుతుంది. చాలా మందికి ఈ చేడ్డ ఆదాయం సంపాదించడం మాత్రమే చేతనవుతుంది.మంచి ఆదాయం సంపాదించే ప్రయత్నం కూడా చేయరు.చెడ్డ ఆదాయం కోసం మాత్రం  అధికంగా కష్టపడతారు. 
ఆక్టివ్ ఇనకమ్  లేదా ఎర్నేడ్ ఇనకమ్ ఎందుకు చెడ్డ ఆదాయం.?
ఈ ఆదాయం కోసం మీరు నిరంతరం శ్రమ పడవలసి ఉంటుంది.
మీరు సంపాదించే ఆదాయం పై అధికంగా టాక్స్ చెల్లించవలసి ఉంటుంది.
మీ ఆదాయం పై మీకు ఎలాంటి  కంట్రోల్ ఉండదు. అంటే మీరు టాక్స్ చెల్లించగా మిగిలే ఆదాయం ను మాత్రమే మీకు ఇష్టమైన రీతిలో వాడుకోవచ్చు.
కొన్ని సమయాలలో మీకు కనీస ఆదాయం కూడా మిగలకపోవచ్చు.
ఈ ఆదాయానికి నిర్దిష్ట పరిమితి ఉంటుంది.
ఈ ఆదాయం నో వర్క్ , నో  పే  అనే కేటగిరికి చెందుతుంది.
ఈ ఆదాయం కోసం మీరు నిజంగా చెప్పాలి అంటే బానిసలాగా పని చేయవలసి ఉంటుంది.
ఈ ఆదాయం మీరు ఎంత ఎక్కువగా పొందుతుంటే మీరు అంత బానిసలాగా పని చేయవలసినదే. మీరు పని చేయడం ఒక్కసారి ఆపి వేసారు అంటే మీ ఆదాయం రావడం ఆగిపోతుంది. అంతే కాకుండా ఈ ఆదాయం కొరకు మీరు మీ విలువైన మీ సమయం మొత్తం కేటాయించవలసి ఉంటుంది. కొంత మంది ఈ ఆదాయం కోసం వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబానికి కనీస సమయం కూడా కేటాయించకుండా కష్టపడేవాళ్ళ ని చాలా మందిని చూస్తేనే ఉంటారు. ఈ కష్టం పాసివ్  ఇనకమ్ కొరకు కష్టపడితే వారి జీవితం ఆర్ధికంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉండేది.
పాసివ్ ఇనకమ్ ఎందుకు ఆమంచి ఆదాయం.
పాసివ్ ఇనకమ్ కొరకు తక్కువగా పని చేయవలసి ఉంటుంది.
పాసివ్ ఇనకమ్ పై టాక్స్ తక్కువగా ఉంటుంది.
ఈ ఆదాయానికి టాక్స్ పరంగా కూడా చాలా మినహాయింపులు ఉంటాయి.
ఈ ఆదాయం సంపాదించడానికి ఎలాంటి నిర్దిష్ట పరిమితి ఉండదు. ఆకాశమే హద్దుగా మీకు చేతనయినంత ఆదాయం సంపాదించు కోవచ్చు. 
మీరు ఎంత ఎక్కువ మందికి సేవ అందించగలిగితే అంత ఆదాయం సంపాదించు కోవచ్చు.
ఒక్కసారి మీరు ఈ ఇనకమ్ సంపాదించడంలో మాస్టర్ అయితే ఇక మీ ఆదాయానికి తిరుగు ఉండదు.
సాదారణంగా బిజినెస్ ఓనర్స్ వారి ఆదాయం పై అధిక కంట్రోల్ కలిగి ఉంటారు. వీరు ఖర్చు పెట్టగా మిగిలిన దానిపై మాత్రమే టాక్స్ చెల్లిస్తారు. మీరు ధనవంతులు కావాలి అంటే మీరు తప్పకుండా పాసివ్ ఇనకమ్ కొరకు ప్రయత్నం చేయాలి.  కాని దురద్రుస్టావశాత్తు చాలా మంది చెడ్డ ఆదాయం కొరకు బానిసలాగా కష్టపడతారు.కనీసం మంచి ఆదాయం సంపాదించే ప్రయత్నం కూడా చేయరు.
ఆక్టివ్ ఇనకమ్  లేదా ఎర్నేడ్ ఇనకమ్ ను 70% ఆదాయం అని కూడా అంటారు.ఎందుకంటె ఈ ఆదాయంలో మీరు తప్పనిసరిగా గరిష్ట  టాక్స్ 30% మీరు చెల్లించిన తర్వాత మిగిలిన ఆదాయం 70% ను మాత్రమే సాలరీ రూపంలో అంటే పే చెక్ రూపంలో అందుకోగలరు. అంటే కనీసం మీరు సంపాదించిన ఆదాయం మీ చేతికి కూడా రాక ముందే 30% పోతుంది. ఇకా మిగిలేది 70% ఆదాయం మాత్రమే కదా ?
జాబ్ చేయడం వలన సెక్యురిటీ ఉంటుంది అని చాలా మంది భావిస్తుంటారు. ఈ రోజుల్లో జాబ్ కి ఎంత సెక్యురిటీ ఉంటుందో మీకు ఎవ్వరూ చెప్పవలసిన  పనిలేదు. జాబ్ చేయడం వలన మీరు చాలా చాలా తక్కువ ఆదాయం పొందుతారు. కాని చాలా ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది.ఈ రోజుల్లో తెలివైన వారూ చేసే పని తక్కువ కష్టపడటం , ఎక్కువ ఆదాయం పొందటం. దీనినే 80:20  రూల్ అంటారు . అంటే మీ  20% కష్టం తో 80% ఆదాయం రావాలి. ఇది కూడా మన జనాభాలో 20 % మాత్రమే అంటే పాసివ్ ఇనకమ్  కోసం మాత్రమే పని చేస్తారు . 80 % మాత్రం ఆక్టివ్ ఇనకమ్  లేదా ఎర్నేడ్ ఇనకమ్ కోసం పని చేస్తారు. ఏది ఎమైనా మీరు మీ స్వంత బిజినెస్ కోసం కష్టపడం వలన చాలా లాభాలు ఉంటాయి.

-
EMPLOYESS
BUSINESS OWNER
STEP 1
EARNS
EARNS
STEP 2
TAXED (TDS)
SPENDS
STEP 3
SPENDS WHAT IS LEFT
PAY TAX WHAT IS LEFT
ఉద్యోగస్తులూ , బిజినెస్ చేసే వాళ్ళు ఇద్దరూ  ఆదాయం పొందుతారు.కాని  ఉద్యోగస్తులూ ముందుగా వారూ సంపాదించిన దానికి టాక్స్ చెల్లించి మిగిలిన మొత్తాన్ని మాత్రమే ఖర్చు చేసుకొనే అవకాశం కలిగి ఉంటారు. అదే వ్యాపారస్తులు ఐతే మాత్రం  సంపాదించిన ఆదాయం ముందుగా ఖర్చు చేసి మిగిలిన మొత్తం పై మాత్రమే టాక్స్ చెల్లిస్తారు. ఉద్యోగస్తుల కొరకు టాక్స్ లా  పరమ దరిద్రంగా ఉంటే , వ్యాపారస్తుల కోసం మాత్రం టాక్స్ లా   చాలా అనుకూలంగా ఉంటుంది.మీరు మీకున్న భాద్యతల వలన ఉద్యోగం తప్పనిసరి అయితే మీకున్న ఖాళీ సమయం ప్రెండ్స్ తో పనికి రాని కబుర్లు,  టి .వి చూడటం కంటే పార్ట్ టైం బిజినెస్ ప్రారంబించి  మంచి ఆదాయం పొందడానికి  కష్టపడండి.