ఈ వారం స్టాక్ మార్కెట్ 07-01-2013 to 11-01-2013

ఈ వారం  స్టాక్ మార్కెట్ 07-01-2013 to 11-01-2013
నిఫ్టీ గత రెండు సంవత్సరాల హయ్యేస్ట్  క్లోస్ కావడం జరిగినది. అమెరికా ఫిస్కల్ క్లిఫ్ వలన రెసిస్టన్స్ ఐనటువంటి 5930-5965 క్రాస్ చేయడమే కాకుండా పై లవల్లో క్లోజ్ కావడం జరుగుతున్నది. నిఫ్తీకి తక్షణ మద్దతు 5980 వద్ద కలదు . 5980  బ్రేక్ కానంత వరకు లాంగ్ పొజిషన్ కొనసాగించవచ్చు.ఏది ఏమైనా నిఫ్టీ 5930-6020  మధ్య చలించడానికి అధిక అవకాశం కలదు. నిఫ్టీ మరింత పైకి కొనసాగాలి అంటే ఖచ్చితంగా 6020 పైన నిలదోక్కుకోవాల్సి ఉంటుంది.నిఫ్టీ పై లెవల్లో హ్యంగింగ్ మ్యాన్ ను పోలిన క్యాండిల్స్ ఏర్పాటు కావడం జరిగినది. ఇవి మార్కెట్ లో  ఉండే బలహీనతను సూచిస్తాయి. నిఫ్టీ 5920 బ్రేక్ కానప్పటి వరకు  లాంగ్ పోజిషన్స్   కొనసాగించవచ్చు. పై లెవల్లో 6040 స్టాప్ లాస్ తో సెల్లింగ్ కూడా చేయవచ్చు. సపోర్త్స్ 5980,5950,5920
        

స్టాక్ మార్కెట్ లో టెక్నికల్ అనాలసిస్ లో చార్ట్స్ యొక్క ప్రాముఖ్యత.

స్టాక్ మార్కెట్ లో  టెక్నికల్ అనాలసిస్ లో చార్ట్స్ యొక్క ప్రాముఖ్యత.


టెక్నికల్ అనాలసిస్ లో చార్ట్స్ ని విశ్లేషించినప్పుడు ఆది మీకు మార్కెట్ లో కి ఎప్పుడు ప్రవేశించాలి, ఎప్పుడు బయటకు రావాలి అనే విషయం లో సహాయం చేస్తుంది. మార్కెట్‌లో అతి వేగంగా జరిగే పెరుగుదలను మరియు పతనాన్ని గుర్తించడానికి సహాయపడుతుంది. ఇన్వెస్ట్‌మెంట్ మీద రాబడి వేగంగా రావడంలో తోడ్పడుతుంది. చార్ట్స్ ని ఉపయోగించడం వల్ల మీకు స్టాక్  యొక్క ధరలో జరిగే పెరుగుదలని , ఎంతకాలం లో పెరగగలదొ  అనే విషయాన్ని తెలియచేయడం వల్ల మీరు దాని లో ట్రేడింగ్ చేయాలో లేక ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయం తీసుకొనవచ్చు.
చార్టింగ్  అనేది టెక్నికల్ అనాలసిస్ కు  పునాది లాంటిది . చార్ట్స్  ఎప్పుడు వాస్తవాన్నే తెలుపును. కాని , చార్ట్స్ ను  చదవడంలో మానవ తప్పిదం వల్ల పొరపాటు జరగవచ్చును కాని చార్ట్స్ వల్ల కాదు. పట్టుదలతో చార్ట్స్ ని చదివి అర్థం చేసుకొంటె ఆ స్టాక్ యొక్క భవిష్యత్తు ధరని  సులభంగా ఉహించవచ్చును . చార్ట్  అనునది నిర్ణీత కాలంలో ఆ స్టాక్స్ యొక్క డిమాండ్ మరియు సప్లై లను చార్ట్ రూపంలో ప్రతిభంభిస్తుంది. చార్ట్స్   పాటర్న్స్ ని   స్టాకు మార్కెట్ , ఫారెక్స్ మార్కెట్, కమోడిటీ మార్కెట్ మరియు ప్యూచర్ మార్కెట్ లలో , డే ట్రేడింగ్, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ట్రేడింగ్ , ఇన్వెస్ట్మెంట్ లలో ఉపయోగించవచ్చు.
ఆ నిర్ణీత కాల వ్యవధి అనునది నిమిషాలు , గంటలు,రోజులు, వారాలు మరియు నెలలు కూడ కావచ్చును . నిర్ణీత కాల వ్యవధి లో గల ఆ స్టాక్ యొక్క హై మరియు లో ప్రైస్ ని నిలువు బారు రూపం లో  X-axis మరియు , Y-axix ల మీద గీయడం వల్ల చార్ట్ అనునది ఏర్పాటు అవుతుంది. చార్ట్ మీద  X-axis,అనునది టైంను    Y-axix   ప్రైస్ ను  తెలుపుతుంది. 




 టెక్నికల్ అనాలసిస్ లో  ఇంతకుముందు ఏమీ జరిగినదో ఆది మళ్లీ తిరిగి జరుగును అనే భావనే బలంగా ఉంటుంది. అనగా స్టాక్స్ యొక్క కదలిక సైకిల్ లాగా తిరుగును . చార్ట్ ని చదవడం అనునది ఆభ్యాసం  ద్వారా కాలక్రమేణా సొంతం అవుతుంది. టెక్నికల్ అనాలసిస్‌లో  వివిధ రకాల  కాల వ్యవధి గల చార్ట్స్ ను ఉపయోగిస్తారు. డైలీ  చార్ట్ అనునది ఆ రోజు యొక్క ప్రైస్ రేంజ్ ను  సూచిస్తుంది. తక్కువ వ్యవధి గల చార్ట్స్ లో ప్రైస్ రేంజ్ అనేది ఓడిదొడుకులుగా ఉండును. కావున ఎక్కువ  కాల  వ్యవధి గల చార్ట్స్ ఉపయోగించడం మంచిది.కొంత ప్రావీణ్యత  సంపాదించిన తర్వాత తక్కువ కాల వ్యవధి గల వాటిని ఉపయోగించవచ్చు.ఎక్కువ కాల వ్యవధి గా చార్ట్స్ నందు లాంగ్ టర్మ్ ట్రెండ్‌ని గుర్తుపట్టవచ్చు.

బంగారం నగలు కొనే ముందు స్వచ్చత ఏ విధంగా తెలుసుకోవాలి?




బంగారం నగలు కొనే ముందు స్వచ్చత ఏ విధంగా  తెలుసుకోవాలి?


బంగారం  నగలు కొనే ముందు హాల్ మార్కింగ్  వివరాలు  తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ హల్ మార్క్ లో ఐదు భాగాలు ఉంటాయి.
1 BIS STANDARD MARK

BIS STANDARD MARK   క్రింది విధంగా ఉంటుంది.










2 PURITY GRADE

999-24 carrt- pure gold
958-23 carrt
916-22 carrt
875-21 carrt
750-18 carrt
708-17 carrt
585-14 carrt
417-10 carrt
375-9    carrt
338-8   carrt

3.MARK OF HALLMARKING CENTRES


హాల్ మార్కింగ్ చేసిన హాల్ మార్కింగ్ సెంటర్స్ యొక్క లోగో  కూడా చెక్ చేయాలి. మార్కింగ్ సెంటర్స్ యొక్క లోగో  క్రింది విధంగా ఉంటుంది.
 



 
మీరూ క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా హాల్ మార్క్ కేంద్రాల గురించి వివరంగా తెలుసుకోవచ్చు.   
http://www.bis.org.in/cert/hallmarkass.htm

YEAR OF MARKING


నగలను  ఏ సంవత్సరంలో హల్ మార్కింగ్ చేసినారో ఆల్ఫా బేట్స్  ద్వారా తెలుసుకోవచ్చు. దీనిని  BIS  నిర్ణయిస్తుంది.  ఉదాహరణకు  Aఉంటె 2000 సంవత్సరంలో ,  Jఉంటె 2008 సంవత్సరంలో,  Nఉంటె 2010 సంవత్సరంలో ,Mఉంటె 2011 సంవత్సరంలో హల్ మార్కింగ్ జరిగినట్టు తెలియచేస్తుంది.

JEWELERS INDENTIFICATION MARK


 BIS  సర్టిఫైడ్ నగల షాపు వాళ్ళు నగల మీదా వారి స్వంత  గుర్తులు లేదా ఐడేన్టిఫికేషణ్ మార్క్స్ ముద్రిస్తారు.
నగలు తీసుకొనే ముందు క్రింది విషయాలు కూడా  గుర్తుపెట్టుకోండి.
BIS హల్ మార్కింగ్ నగలు అమ్ముతున్న షోరూమ్స్  లో మాత్రమే కొనండి.
హాల్ మార్క్ నగలనే కొనండి.
రశీదు, ఇన్ వాయిస్  తప్పకుండా తీసుకోండి.అదే విధంగా ఒక నగపై హల్ మార్కింగ్ చార్జీ కేవలం ఇరవై  ఐదు రూపాలు మాత్రమే. అంతకంటే ఎక్కువ వసూలు చేయడానికి వీలు లేదు.KDM నగలంటే ,హాల్  మార్కింగ్ నగలు కాదు. KDM బంగారం గురించి ఎలాంటి స్వచ్చత గురించి తెలియచేయదు..

బంగారం స్వచ్చత ఏ విధంగా తెలుసుకోవాలి ?part -1

బంగారం స్వచ్చత  ఏ విధంగా తెలుసుకోవాలి ?part -1
మన తాత , ముత్తాతల కాలం నుండి మాత్రమే కాకుండా కొన్ని వందల సంవత్సరాలుగా పల్లె , పట్నం , పేదా , ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బంగారాన్ని విలువైన వస్తువుగా  గుర్తించారు.ప్రతి ఒక్కరూ ఎంతో కొంత బంగారం కనుగోలు చేయాలి అనే  ఆలోచనతో ఉండేవారూ , ఉంటున్నారు.ఇక ఆడపడుచుల  గురించి అయితే చెప్పవలసిన పనిలేదు. వారూ బంగారాన్ని ముఖ్యంగా నగల కోసం అధికంగా ఇష్టపడతారు.  
సాదారణంగా బంగారం కనుగోలు చేయాలి అంటే ముందుగా ఆలోచించేది బంగారం స్వచ్చత గురించే. అది నగల రూపంలో కావచ్చు. లేదా కడ్డీల రూపంలో కూడా కావచ్చు.  ఐతే ఇక్కడ తలెత్తే ప్రశ్న బంగారం స్వచ్చత ఏ విధంగా   తెలుసుకోవాలి.వినియోగదారుల శ్రేయస్సు  కోరి బంగారు నగలపై హాల్ మార్కింగ్ తప్పనిసరి చేయడం జరిగినది. ఐతే కేవలం  హాల్ మార్కింగ్ మాత్రమే బంగారం స్వచ్చత తెలుసుకోవాడానికి ఉపయోపడదు.ఇక్కడ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS)ఇచ్చిన మార్గదర్శకాలు ఒకసారి తెలుసుకొండి.. బంగారం గురించి ప్రాథమిక నిజాలు , బంగారం కొనే ముందు చూడవలసినవి ఏమిటో తెలుసుకోండి.