బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందా ?


బంగారం ధర మరింత  పెరిగే అవకాశం ఉందా ?

బంగారం  మరోసారి అత్యంత సురక్షితమైన పెట్టుబడి సాధనం అని నిరూపించబడినది. బంగారం లో పెట్టుబడి కేవలం ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి మాత్రమే కాకుండా మిగితా పెట్టుబడి సాదానాలు ఐనటువంటి షేర్లు, మ్యుచవల్  ఫండ్స్, బాండ్స్, కమోడిటీస్ మరియు ఇతర విలువైన వాటిలో పెట్టుబడి కంటే కూడా అధిక రాబదినే  అందిస్తుంది. బంగారం సరాసరి సాలీనా సుమారు 16.92% రాబడి ఇస్తుంది. ముఖ్యంగా 2008 సంవత్సరం నుండి బంగారంలో 148 % వృద్ది నమోదు ( 12500 నుండి 31000 చేరుకుంది. ) కావడం జరిగినది. బంగారంలో పెట్టుబడి అనేది ఒక వ్యక్తీ యొక్క ఇష్టాఇష్టాలు అతను రిస్కు  తీసుకొనే స్వభావం   మొదలగు వాటిపై ఆధారపడి ఉంటుంది.




చాలా మందిలో భవిష్యత్తులో కూడా బంగారం ధర పెరుగుతుందా ? అనే సందేహం వేధిస్తుంది. చాలా మంది బంగారం ధర మీదా ఆర్టికల్ వ్రాయండి అని కోరడం జరిగినది. రాబోవు రోజుల్లోబంగారం ధర యే విధంగా ఉంటుందో ఒక్కసారి పరిశీలిద్దాం.  
బంగారం డిమాండ్ మరియు సప్లై
అన్ని వస్తువులలాగే  బంగారం కూడా  డిమాండ్ మరియు సప్లై పై ఆధారపడి ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. బంగారం డిమాండ్ సాదారణంగా నాలుగు కేటగిరీలలో ఉంటుంది. అవి. రిజర్వు బ్యాంక్ లేదా సెంట్రల్ బ్యాంక్ కనుగోలు, జ్వెల్లరీ కొరకు , పరిశ్రమల కొరకు మరియు  ఇన్వెస్ట్మెంట్ లేదా పెట్టుబడి కొరకు  కనుగోలు చేయడం జరుగుతుంది.
చాలా ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు  కంటిన్యూగా  బంగారాన్ని కనుగోలు చేస్తున్నాయి. రాబోవు రోజుల్లో కూడా ఇదే విధంగా జరుగుతుంది అని ఆశిద్దాం. గత కొన్నిసంవత్సరాల నుండి జ్వెల్లరీ కొరకు బంగారం డిమాండ్ తగ్గిపోతుంది. దీనికి ముఖ్య కారణం అధిక బంగారం ధరలు మరియు అనిచ్చిత ఆర్ధిక పరిస్థితులు ఒక కారణమైతే చాలా మంది ఇప్పుడు బంగారాన్ని  జ్వెల్లరీ కంటే పెట్టుబడి సాధనంగా గుర్తించడం మరొక కారణం. GOLD ETF  లాంటి పెట్టుబడి సాధనాలు అందరికి అందుబాటులో ఉండటంతో  బంగారంలో పెట్టుబడి చేయడం పెరిగినది. ఇది రానున్ను కాలంలో ఇంకా పెరగగలదు.  

అదే విధంగా అంతార్జాతీయ  ఆర్ధిక పరిస్థుతులు కూడా దారుణంగా ఉన్నాయి. యూరోపియన్ దేశాల అర్దిక పరిస్థితి యే విధంగా ఉందో అందరికి తెలిసిన విషయమే.  ఆర్ధిక మాంద్యం ఇంకా వెన్నాడుతూనే ఉంది. చైనా పరిస్థితి కూడా బాగాలేదు.
వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు  కనోగులు చేసిన బంగారం క్రింది విధంగా ఉంది.

2011  quarter 2nd
2012  quarter 2nd
Change in %
Purchase in Tons
66.2
157.5
138%
Value in million dollars
3207
8148
154%
 వివిధ దేశాల ఆర్ధిక వృద్ది దారుణంగా ఉండటంతో వివిధ ప్రపంచ దేశాలు ద్రవ్య లభ్యత ఉండేలా చర్యలు చేపడుతుండటంతో కూడా బంగారం ధర పెరగడానికి దోహదపడుతుంది.కాని వివిధ దేశాల బంగారం డిమాండ్ కూడా గత సంవత్సరంతో పోలిస్తే  తక్కువగానే ఉంది. వివిధ దేశాలలో గోల్డ్ డిమాండ్ యే విధంగా ఉందో ఒక్కసారి చూద్దాం.
Country
2011  quarter 2nd
2012  quarter 2nd
Change in %
India
115
56.5
-51%
Chaina
54.8
53.1
-3%
Japaan
-9.4
5.1
-
Soudi arebiya
3.9
4.4
13%
america
19.8
14.4
-27%
jermaney
22.6
34.2
51%

turkey
14.7
17.5
19%
OVERALL GOLD DEMAND
336.2
302.8
-10%

పై పట్టికను గమనించినట్టు ఐతే ప్రపంచ  వ్యాప్తంగా బంగారం 10% డిమాండ్ తగ్గి పోగా మనదేశంలో మాత్రం ఫిజికల్ గోల్డ్ లో -51% డిమాండ్ తగ్గుదల నమోదు కావడం జరిగినది.  దానికి ముఖ్య కారణం బంగారం ధరలో ఒకేసారి విపరీతమైన పెరుగుదల మరియు వర్షాభావ స్థితులు సరిగా లేకపోవడమే కారణం. ఐతే  డిమాండ్ లో తగ్గుదల కారణంగా షార్ట్ టర్మ్ లో సుమారు ఐదు నుండి పది శాతం కరెక్షన్ వచ్చే అవకాశం కూడా కలదు. కాని దీర్ఘకాలంలో మాత్రం  బంగారం ధర ఇంకా పెరగడానికే అధిక అవకాశం కలదు. దీనికి ముఖ్య కారణం  వివిధ ఇన్వెస్ట్మెంట్ సాధనాల కంటే కూడా బంగారం సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పరిగణించడమే.
ముఖ్య గమనిక :మీరు  టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా ఒక పద్ధతి  ఎంచుకొని దానినే స్థిరంగా  మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్ మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ సాధ్యం అవుతుంది.  http://telugufinancialschool.blogspot.in/2012_09_01_archive.html

ఈ రోజు స్టాక్ మార్కెట్ 04-09-2012


ఈ రోజు స్టాక్ మార్కెట్ 04-09-2012











 మార్కెట్ ను పెద్దగా ప్రభావితం చేసే వార్తలు ఏమి లేవు, కాని చైనా  మార్కెట్ మూడు సంవత్సరాల కనిష్ట స్థాయి కి చేరుకోవడం ఆందోళనకర పరిమాణమే.అదే విధంగా మన మార్కెట్ కి సంభందించి  నిన్నటి సపోర్ట్ మరియు రెసిస్టన్స్ లో ఎలాంటి మార్పులు లేవు. నిన్నటి చార్ట్ ప్రకారం పై లెవల్లో ట్రెండ్ లైన్ రెసిస్టన్స్ రావడం జరిగినది.  ప్రస్తుతం పై లెవల్లో 5315 స్టాప్ లాస్ తో  సెల్ చేయడం క్రింది లెవల్లో 5220  లేదా 5190 స్టాప్ లాస్ తో బై చేయడం మంచిది. ఏది ఏమైనా స్టాప్ లాస్ ఖచ్చితంగా పాటించడం మంచిది.
ముఖ్య గమనిక :మీరు  టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా ఒక పద్ధతి  ఎంచుకొని దానినే స్థిరంగా  మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్ మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి లెర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ సాధ్యం అవుతుంది.  http://telugufinancialschool.blogspot.in/2012_09_01_archive.html

ఈ వారం స్టాక్ మార్కెట్


ఈ వారం స్టాక్ మార్కెట్























గత వారం మనం  అనుకున్న విధంగానే నిఫ్టీ  50 sma ఐనటువంటి 5255 వద్ద సపోర్ట్ తీసుకోవడమే కాకుండా దాని పైననే క్లోజ్ కావడం జరిగినది. ఇక ప్రస్తుత వారానికి వస్తే శని వారం రోజు జనరల్ యాంటీ అవాయిడేన్స్ రూల్స్ ( గార్) పై ఏర్పాటు ఐన నిపుణుల సంఘం పన్ను ప్రతిపాదనలను వాయిదా వేయాలి అని కోరడం మార్కెట్ కి ఉత్సాహం అందించే వార్తనే. అదే విధంగా ఫేడ్ బ్యాంక్ చైర్మన్  బెర్నంకే జాక్ అండ్ హోల్ మీటింగ్ లో quantitative easing, or "QE3."  గురుంచి ఎలాంటి ప్రకటన చేయకపోవడం నిరుత్సాహకరమే.కాని దాని గురుంచి పూర్తిగా కొట్టిపడవేయలేదు.అంటే సమీప భవిష్యత్తులో ఉద్దీపన చర్యలు ప్రకటించే ఆవకాశం కలదు. అదే విధంగా GDP డేటా అంచనా వేసినదానికంటే ఎక్కువగానే వచ్చింది కాబట్టి మరోసారి రిజర్వు బ్యాంక్ వడ్డీ రెట్లు తగ్గిస్తుంది అని ఆశించవచ్చు.  అదే విధంగా కేంద్ర ప్రభుత్వం వివాదస్పద బొగ్గు గనులను కేటాయింపును రద్దు చేసే అవకాశం కూడా కలదు. 
ఇక నిఫ్టీ  టెక్నికల్ అనాలసిస్ గురుంచి చర్చించాల్సి వస్తే గత వారం నిఫ్టీ గ్యాప్ డౌన్ ప్రారంభం జరిగి 5400 వద్ద హై ప్రైస్ ఏర్పాటు కాబడి   5238 వద్ద లో ప్రైస్ ఏర్పాటు కావడం జరిగినది.నిఫ్టీ 50 sma ఐనటువంటి 5255 వద్ద గత వారపు చివరి రెండు  ట్రేడింగ్ రోజులలో   సపోర్ట్ తీసుకుంటున్నది అని తెలుస్తుంది. అంటే, లోయర్ లెవల్లో బయ్యింగ్ రావడం జరుగుతుంది,.  అదే విధంగా 5200-5220 రేంజ్ లో కూడా సపోర్ట్ ఉంది. ఫిబోనస్సీ రేషియో అనాలసిస్ ప్రకారం కూడా 50% రేషియో  రూపంలో  5200 వద్ద సపోర్ట్ కలదు. అదే విధంగా రైజింగ్ ట్రెండ్ లైన్ రూపంలో కూడా   5200 వద్ద సపోర్ట్ వస్తుంది.ఈ సెప్టెంబర్ నెలలో నిఫ్టీ 5200-5400 రేంజ్ లో కదలాడే అవకాశం కలదు అని అంచనా వేయడం  జరిగినది. కావున లోయర్ లెవల్లో 5190 సపోర్ట్ తో బై చేయడం మంచిది. సపోర్ట్ 5220, 5190, 5160 రెసిస్టన్స్ 5302,5348,ఒకవేళ ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయడం జరుగుతుంది.
ముఖ్య గమనిక :మీరు  టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా ఒక పద్ధతి  ఎంచుకొని దానినే స్థిరంగా  మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్ మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ సాధ్యం అవుతుంది. 

స్టాక్ మార్కెట్ లో మీరూ ప్రతి రోజూ వినే సెన్సెక్స్ అంటే ఏమిటి?



స్టాక్  మార్కెట్ లో మీరూ ప్రతి రోజూ వినే  సెన్సెక్స్ అంటే ఏమిటి?

సెన్సెక్స్ లేదా సెన్సిటివ్ ఇండెక్స్  ( SENSEX-or SENSitve index ) ను జనవరి 1 1986 రొజూ ముంబాయి స్టాక్ ఎక్సేంజీ ద్వారా పరిచయం చేసారు.ఇది ఇండియా లో గల ప్రముఖ ఇండేక్స్లలో ఒకటి .ఈ సెన్సెక్స్ మొత్తం మార్కెట్ ను ప్రతిబంబించేలా రూపొందించబడినది.దీనిలో బాగా పేరొందిన , స్థిరపడిన , ఆర్ధికంగా బాగా బలమైన పునాదులు కలిగినటువంటి  ముప్పై  పెద్ద కంపెనీలతో ఏర్పాటు చేయడం జరిగినది.సెన్సెక్స్ లెక్కించడం కోసం ఆ కంపీనీ మార్కెట్ కాపిటలైజేషన్ లెక్కలోకి తీసుకోవడం జరిగినది. అధిక కాపిటలైజేషన్ కలిగిన కంపెనీకి అధిక వెయిటేజీ ఇవ్వడం జరిగినది.అదే విధంగా 1978-79వ సంవత్సరం ను బెస్ సంవత్సరంగా , 100 ను బెస్ ఇండెక్స్ వాల్యుగా పరిగణలోకో తీసుకోవడం జరిగినది.అంటే సెన్సెక్స్ నిర్మాణ సమయంలో మొత్తం మార్కెట్ కాపిటలైజేషన్ విలువ  100 తీసుకోవడం వలన మరుసటి రోజూ మార్కెట్ కాపిటలైజేషన్  10% పెరిగితే ఇండెక్స్ కూడా   10% పెరిగి 100 నుండి  110 అవుతుంది. 100 ను బెస్ ఇండెక్స్ వాల్యుగా తీసుకోవడంలో ముఖ్య ఉద్దేశం లెక్కించడానికి సులభంగా ఉంటుంది అనే ఆలోచనే. సెన్సెక్స్ లో ఎన్నుకొనే కంపెనీలు క్వాలిటీ పరంగా మరియు క్వాంటిటీ పరంగా మంచి లక్షణాలు కలిగిఉంటాయి.
ఇప్పుడు సెన్సెక్స్ ఇండెక్స్ యే విధంగా నిర్మిస్తారో ఒక్కసారి చూద్దాం.మార్కెట్ లో ఒక స్టాక్ మాత్రమే ఉంటే దానిలో పెరుగుదల కాని, పతనం కాని సులభంగా అర్ధం చేసుకోవచ్చు. బెస్ ఇండెక్స్ విలువ  100 కాబట్టి ఒక స్టాక్ యొక్క ధర 200 నుండి 240 వరకు పెరిగితే ఆ స్టాక్ లో పెరుగుదల  20% నమోదు ఐతే ఇండెక్స్ లో కూడా పెరుగుదల 20% ఉండి ఇండెక్స్  100 నుండి 120 కి చేరుకుంటుంది. మరుసటి రోజు ఆ స్టాక్ యొక్క ధర  10% పతనం జరిగి  216 కు చేరుకుంటే సెన్సెక్స్ ఇండెక్స్ కూడా 10%  తగ్గడంతో   110 కి చేరుకుంటుంది.ఈ విధంగా సెన్సెక్స్ లో ఒకే స్టాక్ ఉండటం వలన ఇండెక్స్ విలువ  మనం లెక్కించడం సులభంగా జరిగినది. మరి ఒకటి కంటే ఎక్కువ అంటే రెండు స్టాక్ లు ఉంటే యే విధంగా లెక్కించాలో చూద్దాం.
ఇప్పుడు ఇండెక్స్ లో A మరియు B అనే రెండు కంపెనీల స్టాక్స్ ఉన్నాయి అనుకోండి. A స్టాక్ ధర 200 వద్ద ఉంది , B స్టాక్ ధర  150 వద్ద ఉంది.సెన్సెక్స్ ఇండెక్స్ ఏర్పాటు చేయడంలో స్టాక్స్ యొక్క మార్కెట్ కాపిటలైజేషన్ పరిగణలోకి తీసుకొని దానికి అనుగుణంగా ఆ కంపెనీకి ఇండెక్స్ లో వెయిటేజీ ఇస్తారు అని మనం ఇది వరకే తెలుసుకున్నాం. మరి ఇప్పు ఈ రెండు స్టాక్ ల యొక్క వెయిటేజీ ఏవిధంగా తెలుసుకోవాలో ఒక్కసారి చూద్దాం. ఒక కంపీనీ లో గల మొత్తం షేర్లను ఆ కంపెనీ షేరు లేదా స్టాక్ ధరతో గుణించగా వచ్చేదే మార్కెట్ కాపిటలైజేషన్ . కంపెనీ  A వద్ద  100,000 షేర్లు మరియు కంపెనీ  Bవద్ద  200,000 షేర్లు ఉంటే కంపెనీ  A కాపిటలైజేషన్  200 x 100000 =20000000 మరియు కంపెనీ  B కాపిటలైజేషన్ 150 x 200000 = 30000000 అవుతుంది. మొత్తం మార్కెట్ కాపిటలైజేషన్ (200 x 100000 + 150 x 200000) Rs 500 lakhs అవుతుంది. ఈ మొత్తం  సెన్సెక్స్ ఇండెక్స్ బెస్ విలువ   100 కి సమానం  అవుతుంది.ఇప్పుడు కంపెనీ  A స్టాక్ ధర  260 (30% increase in price) కి చేరుకుంది.కంపెనీ  B స్టాక్ ధర  135. (10% drop in price)కి చేరుకుంది.ఇప్పుడు మార్కెట్ కాపిటలైజేషన్  260 x 100000 +135 x 200000= Rs 530 lakhsలకు చేరుకుంది. అంటే స్టాక్స్ ధరలలో మార్పు వల్ల మార్కెట్ కాపిటలైజేషన్ ) Rs 500 lakhs నుండి Rs 530 lakhsలకు చేరుకుంది. అంటే 6% పెరుగుదల నమోదు కావడం జరిగినది కావున సెన్సెక్స్ ఇండెక్స్ లో కూడా పెరుగుదల 6% నమోదు కావడం జరుగుతుంది కాబట్టి సెన్సెక్స్ ఇండెక్స్ 100 to 106 మార్పు చెందడం జరుగుతుంది.ఈ విధమైన లాజిక్ ను సెన్సెక్స్ లో ఎంచుకున్న స్టాక్స్ అన్నిటికి విస్తరించి లెక్కించడం జరుగుతుంది. అందుకే స్టాక్స్ యొక్క ధరల మార్పు కి అనుగుణంగా సెన్సెక్స్ కూడా మార్పు చెందడం జరుగుతుంది. ఐతే సెన్సెక్స్ ఇండెక్స్  ముప్పై ఆర్ధికంగా బలంగా ఉన్న పెద్ద కంపెనీలను చేర్చడం ద్వారా లెక్కిస్తాయు అని తెలుసుకున్నాం. కాని ఒక్క విషయం ఈ విధంగా లెక్కించడానికి  కంపెనీ యొక్క అన్ని షేర్లను పరిగణలోకి తీసుకోరు. కేవలం ఫ్రీ ప్లోటింగ్ ఉన్న షేర్ల విలువను  మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.ప్రీ ప్లోటింగ్ అంటే ఏమిటో మనం ఒక్క సారి తెలుసుకుందాం.స్టాక్ మార్కెట్ లో ప్రజలూ ట్రేడ్ చేయడానికి అందుబాటులో ఉన్న షేర్లను ప్రీ ప్లోటింగ్ షేర్లు అంటారు.అంటే కంపెనీ ప్రమోటర్లు, FDIs , ప్రభుత్వం వద్ద ఉన్న షేర్లు మినహాయించి మిగిలిన షేర్లను ప్రీ ప్లోటింగ్ షేర్లు అంటారు.ఒక కంపెనీ యొక్క    ప్రీ ప్లోటింగ్ విలువను లెక్కించాలి అంటే ఒక కంపెనీ మొత్తం కాపిటలైజేషన్లో  ఎంత శాతం పబ్లిక్ వద్ద ఉందో ఆ మొత్తం ను పరిగణలోకి తీసుకుంటారు.. పబ్లిక్  వద్ద  ఎంత శాతం షేర్లు అందుబాటులో ఉంటే ఆ కంపెనీ యొక్క ప్రీ ప్లోటింగ్ విలువ ఎక్కువగా ఉంటుంది.

ఉదాహరణకు ఒక కంపెనీ యొక్క మార్కెట్ విలువ  Rs 100,000 కోట్లు అనుకుంటే ఒక్క షేర్ విలువ Rs 1,000 ఐతే కంపెనీ వద్ద ఉన్న మొత్తం షేర్ల సంఖ్యా 100 అవుతాయి. కాని కేవలం 20% షేర్లు మాత్రమే పబ్లిక్ కి అందుబాటులో ఉంటే అప్పుడు కంపెనీ యొక్క ఫ్రీ ప్లోటింగ్ మార్కెట్ విలువ మొత్తం కంపెనీ యొక్క మార్కెట్ విలువ లో  20% మాత్రమే అవుతుంది. అంటే  Rs 100,000x20% =20,000అవుతుంది.మీరు ఈ ఫ్రీ ప్లోటింగ్ విలువ ఎప్పటికప్పుడు క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
Click this link to get it.

ఇప్పుడు సెన్సెక్స్  లో గల ముప్పై కంపెనీల ఫ్రీ ప్లోటింగ్ విలువ ప్రకారం సెన్సెక్స్ ఇండెక్స్ పెరగడం లేదా తగగ్డం జరుగుతుంది.
ఉదాహరణకు  Rs 10,00,000కోట్ల ఫ్రీ ప్లోట్   మార్కెట్ కాపిటలైజేషన్  ఉన్నప్పుడు సెన్సెక్స్ ఇండెక్స్  12500 ఉంటే , ఫ్రీ ప్లోట్   మార్కెట్ కాపిటలైజేషన్ పెరిగి   Rs 11,50,000 కోట్లకు చేరుకుంటే సెన్సెక్స్ ఇండెక్స్  ఎంత ఉండగలదో లేక్కగట్టండి.తెలియడం లేదా ఐతే సమాధానం ఏంతో తెలుసా 14,375. ఎలాగో తెలియడం లేదా చిన్నప్పుడు లెక్కల్లో నేర్చుకున్న  ratios and proportionsగుర్తుతెచ్చుకోండి.ఐనా సాధ్యం కాకపోతే మాకు మెయిల్ చేయండి.