బంగారం ధర
మరింత పెరిగే అవకాశం ఉందా ?
బంగారం మరోసారి
అత్యంత సురక్షితమైన పెట్టుబడి సాధనం అని నిరూపించబడినది. బంగారం లో
పెట్టుబడి కేవలం ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి మాత్రమే కాకుండా మిగితా
పెట్టుబడి సాదానాలు ఐనటువంటి షేర్లు, మ్యుచవల్
ఫండ్స్, బాండ్స్, కమోడిటీస్ మరియు ఇతర విలువైన వాటిలో పెట్టుబడి కంటే కూడా
అధిక రాబదినే అందిస్తుంది. బంగారం సరాసరి
సాలీనా సుమారు 16.92% రాబడి ఇస్తుంది. ముఖ్యంగా 2008 సంవత్సరం నుండి
బంగారంలో 148 % వృద్ది నమోదు ( 12500 నుండి 31000 చేరుకుంది. ) కావడం జరిగినది.
బంగారంలో పెట్టుబడి అనేది ఒక వ్యక్తీ యొక్క ఇష్టాఇష్టాలు అతను రిస్కు తీసుకొనే స్వభావం మొదలగు వాటిపై ఆధారపడి ఉంటుంది.
చాలా మందిలో
భవిష్యత్తులో కూడా బంగారం ధర పెరుగుతుందా ? అనే సందేహం వేధిస్తుంది. చాలా మంది
బంగారం ధర మీదా ఆర్టికల్ వ్రాయండి అని కోరడం జరిగినది. రాబోవు రోజుల్లోబంగారం ధర
యే విధంగా ఉంటుందో ఒక్కసారి పరిశీలిద్దాం.
బంగారం డిమాండ్
మరియు సప్లై
అన్ని
వస్తువులలాగే బంగారం కూడా డిమాండ్ మరియు సప్లై పై ఆధారపడి ఉంటుంది అనడంలో
ఎలాంటి సందేహం అవసరం లేదు. బంగారం డిమాండ్ సాదారణంగా నాలుగు కేటగిరీలలో ఉంటుంది.
అవి. రిజర్వు బ్యాంక్ లేదా సెంట్రల్ బ్యాంక్ కనుగోలు, జ్వెల్లరీ కొరకు , పరిశ్రమల
కొరకు మరియు ఇన్వెస్ట్మెంట్ లేదా
పెట్టుబడి కొరకు కనుగోలు చేయడం
జరుగుతుంది.
చాలా ప్రపంచ
దేశాల సెంట్రల్ బ్యాంకులు కంటిన్యూగా బంగారాన్ని కనుగోలు చేస్తున్నాయి. రాబోవు
రోజుల్లో కూడా ఇదే విధంగా జరుగుతుంది అని ఆశిద్దాం. గత కొన్నిసంవత్సరాల నుండి
జ్వెల్లరీ కొరకు బంగారం డిమాండ్ తగ్గిపోతుంది. దీనికి ముఖ్య కారణం అధిక బంగారం
ధరలు మరియు అనిచ్చిత ఆర్ధిక పరిస్థితులు ఒక కారణమైతే చాలా మంది ఇప్పుడు
బంగారాన్ని జ్వెల్లరీ కంటే పెట్టుబడి
సాధనంగా గుర్తించడం మరొక కారణం. GOLD ETF లాంటి పెట్టుబడి సాధనాలు అందరికి అందుబాటులో
ఉండటంతో బంగారంలో పెట్టుబడి చేయడం
పెరిగినది. ఇది రానున్ను కాలంలో ఇంకా పెరగగలదు.
అదే విధంగా
అంతార్జాతీయ ఆర్ధిక పరిస్థుతులు కూడా
దారుణంగా ఉన్నాయి. యూరోపియన్ దేశాల అర్దిక పరిస్థితి యే విధంగా ఉందో అందరికి
తెలిసిన విషయమే. ఆర్ధిక మాంద్యం ఇంకా
వెన్నాడుతూనే ఉంది. చైనా పరిస్థితి కూడా బాగాలేదు.
వివిధ దేశాల
సెంట్రల్ బ్యాంకులు కనోగులు చేసిన బంగారం
క్రింది విధంగా ఉంది.
|
2011
quarter 2nd
|
2012
quarter 2nd
|
Change in %
|
Purchase in Tons
|
66.2
|
157.5
|
138%
|
Value in million dollars
|
3207
|
8148
|
154%
|
వివిధ దేశాల ఆర్ధిక వృద్ది దారుణంగా ఉండటంతో
వివిధ ప్రపంచ దేశాలు ద్రవ్య లభ్యత ఉండేలా చర్యలు చేపడుతుండటంతో కూడా బంగారం ధర
పెరగడానికి దోహదపడుతుంది.కాని వివిధ దేశాల బంగారం డిమాండ్ కూడా గత సంవత్సరంతో
పోలిస్తే తక్కువగానే ఉంది. వివిధ దేశాలలో
గోల్డ్ డిమాండ్ యే విధంగా ఉందో ఒక్కసారి చూద్దాం.
Country
|
2011
quarter 2nd
|
2012
quarter 2nd
|
Change in %
|
India
|
115
|
56.5
|
-51%
|
Chaina
|
54.8
|
53.1
|
-3%
|
Japaan
|
-9.4
|
5.1
|
-
|
Soudi arebiya
|
3.9
|
4.4
|
13%
|
america
|
19.8
|
14.4
|
-27%
|
jermaney
|
22.6
|
34.2
|
51%
|
turkey
|
14.7
|
17.5
|
19%
|
OVERALL GOLD DEMAND
|
336.2
|
302.8
|
-10%
|
పై పట్టికను
గమనించినట్టు ఐతే ప్రపంచ వ్యాప్తంగా
బంగారం 10% డిమాండ్ తగ్గి పోగా మనదేశంలో మాత్రం ఫిజికల్
గోల్డ్ లో -51% డిమాండ్ తగ్గుదల నమోదు కావడం జరిగినది. దానికి ముఖ్య కారణం బంగారం ధరలో ఒకేసారి
విపరీతమైన పెరుగుదల మరియు వర్షాభావ స్థితులు సరిగా లేకపోవడమే కారణం. ఐతే డిమాండ్ లో తగ్గుదల కారణంగా షార్ట్ టర్మ్ లో
సుమారు ఐదు నుండి పది శాతం కరెక్షన్ వచ్చే అవకాశం కూడా కలదు. కాని దీర్ఘకాలంలో
మాత్రం బంగారం ధర ఇంకా పెరగడానికే అధిక
అవకాశం కలదు. దీనికి ముఖ్య కారణం వివిధ
ఇన్వెస్ట్మెంట్ సాధనాల కంటే కూడా బంగారం సురక్షితమైన పెట్టుబడి సాధనంగా
పరిగణించడమే.
ముఖ్య గమనిక :మీరు టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా ఒక పద్ధతి ఎంచుకొని దానినే స్థిరంగా మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు
డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్
మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే
ఎర్నింగ్ సాధ్యం అవుతుంది. http://telugufinancialschool.blogspot.in/2012_09_01_archive.html
it is definitely a good article
ReplyDeletekindly what is the link between gold and currency in circulation in country. How govt have a control over the currency in ciruclation in country.
pl explain