మీరు ,మీ పిల్లలు జీవితంలో ఆర్ధికంగా ఎదిగి మిలియనీర్లు , బిలియనీర్లు కావాలి అంటే తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆర్ధిక విషయాలు part -1

మీరు ,మీ పిల్లలు జీవితంలో ఆర్ధికంగా ఎదిగి మిలియనీర్లు , బిలియనీర్లు కావాలి అంటే తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆర్ధిక విషయాలు part -1

డబ్బు గురుంచి మిలియనీర్లు , బిలియనీర్లు వాళ్ళ పిల్లలకు నేర్పేది , పేద , మధ్యతరగతి వాళ్ళు, వాళ్ళ పిల్లలకు నేర్పలేనిది ఏమిటో తెలుసుకుందాం.
సాదారణంగా మీరు ఏ ఇంట్లో చూసిన ఏ తల్లిదండ్రులు అయినా వారి పిల్లలకు  పై క్రింది  నేర్పిస్తారు.మీరు జీవితంలో కనుక ధనవంతులు , మిలియనీర్లు , బిలియనీర్లు కావాలి అంటే మాత్రం  కొన్ని ఆర్ధిక విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.  అవి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

MIDDLE CLASS TEACH
RICH TEACH
GO TO SCHOOL
FINANCIAL STATEMENTS
WORK HARD
ASSETS
GET GOOD GRADES
LAIBILITIES
GET A JAB
CASH FLOW
JOB SECURITY
GOOD & BAD DEBT
DO IT YOUR SELF
BUSINESS
NEVER THINK OF MONEY
INVESTMENTS
BUSINESS IS RISKY
CREATE JOBS
INVESTMENT IS RISKY
PASSIVE INCOME


అందరూ వారి జీవితంలో ఏదో ఒక్కరోజు ధనవంతులు కావాలి అని ఆశ పడుతూ కలలు కంటారు. ఆశపడటం , కలలు కనడంలో  ఎలాంటి తప్పు లేదు.కాని దురద్రుస్టావశాత్తు  మన విద్యా వ్యవస్థ డబ్బు గురుంచి ఎలాంటి భోదన చేయడం లేదు. అందువల్లనే  చాలా మంది విద్యార్థులు వారి కళాశాల విద్య అనంతరం జీవితంలో డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. చివరకు వారం ప్రారంభంలో  సాలరీ కొరకు ఎదిరి చూడాల్సి వస్తుంది.పోనీ కనీసం తల్లిదండ్రులు అయినా  పిల్లలకు  డబ్బు గురుంచి, ఆర్ధిక విషయాల గురుంచి చిన్నప్పటి నుండి  నేర్పిస్తారా అంటే అది ఉండదు. ఇందులో పాపం వారి తప్పేం ఉంది. ముందుగా వారికి అవగాహన ఉండాలి కదా ?. అదే మిలియనీర్లు , బిలియనీర్లు  వారి పిల్లలకు చిన్నప్పటి నుండి డబ్బు గురుంచి,  ఆర్ధిక విషయాల గురుంచి చిన్నప్పటి నుండి నేర్పిస్తారు. ఎందుకంటె వారికి ఆర్ధిక విషయాల పట్ల పూర్తీ అవగాహన ఉంటుంది కాబట్టి. మీరు జీవితంలో ఆర్ధికంగా ఎదగాలి అంటే మాత్రం తప్పనిసరిగా మీరు ఇక్కడ చెప్పే విషయాలను తప్పనిసరిగా నేర్చుకోవాలి. ముందుగా మీరు మధ్యతరగతి, మిలియనీర్లు, బిలియనీర్ల  ఆలోచనా విధానాలలో  గల తేడా తెలుసుకోండి.

మధ్యతరగతి వాళ్ళు డబ్బు కోసం కష్టపడతారు.
మధ్యతరగతి వారి ఆలోచనా విధానం సాదారణంగా సెక్యూరిటీ గా ఉండే  ఉద్యోగం సంపాదించడం , ఆ ఉద్యోగంలో నెలవారీ జీతం కోసం కష్టపడటం , కొంత వయస్సు వచ్చాక అంటే అరవై , అరవై ఐదేళ్ళ వయస్సు వచ్చాకా రిటైర్ కావడం అనే విధంగా ఉంటుంది.
ఈ ఆలోచన విధానం వారి తల్లిదండ్రులు, తాతముత్తాతల నుండి వస్తుంది. ఇప్పటికి కూడా వారి ఆలోచన విధానంలో తేడా ఎంత మాత్రం ఉండదు. ఉద్యోగం లేకపోవడం లేదా ఉన్న ఉద్యోగం పోవడం అనే ఆలోచనే వారికి భరింపరానిదిగా ఉంటుంది.  వీరికి డబ్బు సంపాదించడానికి చేతనైనది ఒక్కటే అది ఉద్యోగం చేయడం. వారి విలువైన జీవితాన్ని ఉద్యోగానికి అంకితం చేస్తూ ప్రతినెల మొదటి వారం రాగానే సాలరీ కొరకు ఎదిరిచూడటం మాత్రమే చేస్తారు.
మిలియనీర్లు వారి  మనీని వారి కోసం పనిచేసే విధంగా చేస్తారు.
సాదారణంగా మిలియనీర్లు వారి మనీ ని వారి కోసం పనిచేసే విధంగా చేస్తారు.అంటే వారూ అధికంగా కష్టపడకుండా  వారూ ఇదివరకే సంపాదించిన మనీ , ఇంకా వారి కోసం సంపాదించే విధంగా చేసుకుంటారు.వీరూ  మనీని మానేజ్ చేసే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు.అంటే మనీని పెట్టుబడి పెట్టడం . వీరూ సాదారణంగా అనేక రకాలైన పెట్టుబడులు పెడతారు. అంటే షేర్స్ , రియల్ ఎస్టేట్ , గోల్డ్, బాండ్స్, మ్యుచవల్  ఫండ్స్, బిజినెస్ , వెబ్సైట్స్ మొదలగునవి. వీరికి ఇన్వెస్ట్మెంట్ చేయడం నైపుణ్యంతో కూడుకున్నది అనే విషయం బాగా తెలుసు, దాని వలన ఆర్ధికంగా చాలా త్వరగా ఎదగవచ్చు అనే విషయం కూడా బాగా తెలుసు. అందువల్లనే వారూ వారి  యుక్త వయస్సులో అంటే సంపాదన  మొదలైన తొలినాళ్ళ లోనే  వీరూ ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడతారు. వీరి ఆలోచన విధానం ఒక్కటే .ఇన్వెస్ట్ చేసిన మొదటి రోజు నుండే వారి మనీ ,వారి కోసం  పని చేయడం మొదలు పెట్టి కొంత కాలానికి వారిని ఆర్ధికంగా ఉన్నత స్థితిలో నిలబెట్టి ధనవంతులు చేస్తుంది అని.  అంతే కాకుండా వీరూ  ,వారి పిల్లలకు చిన్నప్పటి నుండి  ఆర్ధికపరమైన పాఠాలు  , ఇన్వెస్ట్మెంట్ నైపుణ్యాలు నేర్పుతారు. అదే సమయంలో మధ్యతరగతి వారూ మాత్రం వారి పిల్లలకు బాగా చదివి  మంచి మార్కులు తెచ్చుకుంటే ,  సెక్యురిటీ ఉన్న మంచి ఉద్యోగం వస్తుంది.దానితో పాటు మంచి సాలరీ వస్తుంది అని పిల్లలకు నేర్పుతారు.

మీరు సంపాదిస్తున్న ఆదాయం మంచిదా ? లేక చెడ్డదా ? అసలు ఆదాయం ఎన్ని రకాలు ? వాటిలో ఏ ఆదాయం మంచిది ? ఎందుకు మంచిది ?


మీరు  సంపాదిస్తున్న ఆదాయం మంచిదా ? లేక చెడ్డదా ? అసలు ఆదాయం ఎన్ని రకాలు ? వాటిలో ఏ ఆదాయం మంచిది ? ఎందుకు మంచిది ?
ఆదాయం అంటే  ఉద్యోగం, బిజినెస్ ,ఇన్వెస్ట్మెంట్ ద్వారా  వచ్చే డబ్బు. ఈ ఆదాయం  మంచి ఆదాయం , చెడ్డ ఆదాయం ఏదైనా కావచ్చు. ఏంటి? ఆదాయంలో కూడా మంచి ఆదాయం , చెడ్డ ఆదాయం అని కూడా ఉంటాయి అని అనుకుంటున్నారా ?  అవును తప్పకుండా ఉంటాయి.మీ దృష్టిలో మంచి ఆదాయం అంటే మంచి సాలరీ , అధిక ఆదాయం ఉండటం , చెడ్డ ఆదాయం అంటే తక్కువ సాలరీ ఉండటం , తక్కువ ఆదాయం ఉండటం.అంటే మీరు పొందుతున్న ఆదాయం యొక్క పరిమాణం ను బట్టి అది మంచి ఆదాయం లేదా చెడ్డ ఆదాయం అనే నిర్ణయానికి వస్తారు.కాని ఇది ఎంత మాత్రం మంచిది కాదు.ఇప్పుడు ఒక్కసారి మనం ఆదాయం ఎన్ని రకాలు దానిలో మంచి ఆదాయం , చెడ్డ ఆదాయం ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం.
ఆదాయం సాదారణంగా మూడు రకాలుగా ఉంటుంది.
ఆక్టివ్ ఇనకమ్  లేదా ఎర్నేడ్ ఇనకమ్:ఈ ఆదాయం సాదారణంగా మీరు పని చేయడం వలన వచ్చే ఆదాయం.మీరు సాదారణంగా ప్రతి నెల అందుకొనే సాలరీ .దీనిలోనే మీ బోనస్ , కమీషన్ , ఓవర్ టైమ్ పని చేయడం వలన వచ్చే ఆదాయం కూడా ఉంటుంది. ఈ ఆదాయం మీరు ఎప్పుడైతే పని చేయడం అపేస్తారో, అప్పుడు ఈ ఆదాయం రావడం కూడా ఆగిపోతుంది.
పోర్ట్ఫోలియో ఇనకమ్ : ఈ ఆదాయం సాదారణంగా పేపర్ అస్తులవలన  లేదా ఎలక్ట్రానిక్ ఆస్తుల వలన వస్తుంది. అంటే  షేర్స్ ,బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మొదలగు వాటి ద్వారా వచ్చే ఆదాయం.
పాసివ్ ఇనకమ్:పాసివ్ ఇనకమ్ సాదారణంగా బిజినెస్ లేదా రియల్ ఎస్టేట్ మార్గాల ద్వారా వస్తుంది.అంతే కాకుండా మీ తెలివి తేటల మీదా వచ్చే రాయల్టీ ఇనకమ్ అంటే మీరు వ్రాసిన బుక్స్, సాంగ్స్ ,మొదలగు వాటిపై వచ్చేది.
పై మూడింటిలో పోర్ట్ఫోలియో ఇనకమ్, పాసివ్ ఇనకమ్ మంచి ఆదాయం ఆయితే , ఆక్టివ్ ఇనకమ్  లేదా ఎర్నేడ్ ఇనకమ్  చెడ్డ ఆదాయం అవుతుంది. చాలా మందికి ఈ చేడ్డ ఆదాయం సంపాదించడం మాత్రమే చేతనవుతుంది.మంచి ఆదాయం సంపాదించే ప్రయత్నం కూడా చేయరు.చెడ్డ ఆదాయం కోసం మాత్రం  అధికంగా కష్టపడతారు. 
ఆక్టివ్ ఇనకమ్  లేదా ఎర్నేడ్ ఇనకమ్ ఎందుకు చెడ్డ ఆదాయం.?
ఈ ఆదాయం కోసం మీరు నిరంతరం శ్రమ పడవలసి ఉంటుంది.
మీరు సంపాదించే ఆదాయం పై అధికంగా టాక్స్ చెల్లించవలసి ఉంటుంది.
మీ ఆదాయం పై మీకు ఎలాంటి  కంట్రోల్ ఉండదు. అంటే మీరు టాక్స్ చెల్లించగా మిగిలే ఆదాయం ను మాత్రమే మీకు ఇష్టమైన రీతిలో వాడుకోవచ్చు.
కొన్ని సమయాలలో మీకు కనీస ఆదాయం కూడా మిగలకపోవచ్చు.
ఈ ఆదాయానికి నిర్దిష్ట పరిమితి ఉంటుంది.
ఈ ఆదాయం నో వర్క్ , నో  పే  అనే కేటగిరికి చెందుతుంది.
ఈ ఆదాయం కోసం మీరు నిజంగా చెప్పాలి అంటే బానిసలాగా పని చేయవలసి ఉంటుంది.
ఈ ఆదాయం మీరు ఎంత ఎక్కువగా పొందుతుంటే మీరు అంత బానిసలాగా పని చేయవలసినదే. మీరు పని చేయడం ఒక్కసారి ఆపి వేసారు అంటే మీ ఆదాయం రావడం ఆగిపోతుంది. అంతే కాకుండా ఈ ఆదాయం కొరకు మీరు మీ విలువైన మీ సమయం మొత్తం కేటాయించవలసి ఉంటుంది. కొంత మంది ఈ ఆదాయం కోసం వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబానికి కనీస సమయం కూడా కేటాయించకుండా కష్టపడేవాళ్ళ ని చాలా మందిని చూస్తేనే ఉంటారు. ఈ కష్టం పాసివ్  ఇనకమ్ కొరకు కష్టపడితే వారి జీవితం ఆర్ధికంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉండేది.
పాసివ్ ఇనకమ్ ఎందుకు ఆమంచి ఆదాయం.
పాసివ్ ఇనకమ్ కొరకు తక్కువగా పని చేయవలసి ఉంటుంది.
పాసివ్ ఇనకమ్ పై టాక్స్ తక్కువగా ఉంటుంది.
ఈ ఆదాయానికి టాక్స్ పరంగా కూడా చాలా మినహాయింపులు ఉంటాయి.
ఈ ఆదాయం సంపాదించడానికి ఎలాంటి నిర్దిష్ట పరిమితి ఉండదు. ఆకాశమే హద్దుగా మీకు చేతనయినంత ఆదాయం సంపాదించు కోవచ్చు. 
మీరు ఎంత ఎక్కువ మందికి సేవ అందించగలిగితే అంత ఆదాయం సంపాదించు కోవచ్చు.
ఒక్కసారి మీరు ఈ ఇనకమ్ సంపాదించడంలో మాస్టర్ అయితే ఇక మీ ఆదాయానికి తిరుగు ఉండదు.
సాదారణంగా బిజినెస్ ఓనర్స్ వారి ఆదాయం పై అధిక కంట్రోల్ కలిగి ఉంటారు. వీరు ఖర్చు పెట్టగా మిగిలిన దానిపై మాత్రమే టాక్స్ చెల్లిస్తారు. మీరు ధనవంతులు కావాలి అంటే మీరు తప్పకుండా పాసివ్ ఇనకమ్ కొరకు ప్రయత్నం చేయాలి.  కాని దురద్రుస్టావశాత్తు చాలా మంది చెడ్డ ఆదాయం కొరకు బానిసలాగా కష్టపడతారు.కనీసం మంచి ఆదాయం సంపాదించే ప్రయత్నం కూడా చేయరు.
ఆక్టివ్ ఇనకమ్  లేదా ఎర్నేడ్ ఇనకమ్ ను 70% ఆదాయం అని కూడా అంటారు.ఎందుకంటె ఈ ఆదాయంలో మీరు తప్పనిసరిగా గరిష్ట  టాక్స్ 30% మీరు చెల్లించిన తర్వాత మిగిలిన ఆదాయం 70% ను మాత్రమే సాలరీ రూపంలో అంటే పే చెక్ రూపంలో అందుకోగలరు. అంటే కనీసం మీరు సంపాదించిన ఆదాయం మీ చేతికి కూడా రాక ముందే 30% పోతుంది. ఇకా మిగిలేది 70% ఆదాయం మాత్రమే కదా ?
జాబ్ చేయడం వలన సెక్యురిటీ ఉంటుంది అని చాలా మంది భావిస్తుంటారు. ఈ రోజుల్లో జాబ్ కి ఎంత సెక్యురిటీ ఉంటుందో మీకు ఎవ్వరూ చెప్పవలసిన  పనిలేదు. జాబ్ చేయడం వలన మీరు చాలా చాలా తక్కువ ఆదాయం పొందుతారు. కాని చాలా ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది.ఈ రోజుల్లో తెలివైన వారూ చేసే పని తక్కువ కష్టపడటం , ఎక్కువ ఆదాయం పొందటం. దీనినే 80:20  రూల్ అంటారు . అంటే మీ  20% కష్టం తో 80% ఆదాయం రావాలి. ఇది కూడా మన జనాభాలో 20 % మాత్రమే అంటే పాసివ్ ఇనకమ్  కోసం మాత్రమే పని చేస్తారు . 80 % మాత్రం ఆక్టివ్ ఇనకమ్  లేదా ఎర్నేడ్ ఇనకమ్ కోసం పని చేస్తారు. ఏది ఎమైనా మీరు మీ స్వంత బిజినెస్ కోసం కష్టపడం వలన చాలా లాభాలు ఉంటాయి.

-
EMPLOYESS
BUSINESS OWNER
STEP 1
EARNS
EARNS
STEP 2
TAXED (TDS)
SPENDS
STEP 3
SPENDS WHAT IS LEFT
PAY TAX WHAT IS LEFT
ఉద్యోగస్తులూ , బిజినెస్ చేసే వాళ్ళు ఇద్దరూ  ఆదాయం పొందుతారు.కాని  ఉద్యోగస్తులూ ముందుగా వారూ సంపాదించిన దానికి టాక్స్ చెల్లించి మిగిలిన మొత్తాన్ని మాత్రమే ఖర్చు చేసుకొనే అవకాశం కలిగి ఉంటారు. అదే వ్యాపారస్తులు ఐతే మాత్రం  సంపాదించిన ఆదాయం ముందుగా ఖర్చు చేసి మిగిలిన మొత్తం పై మాత్రమే టాక్స్ చెల్లిస్తారు. ఉద్యోగస్తుల కొరకు టాక్స్ లా  పరమ దరిద్రంగా ఉంటే , వ్యాపారస్తుల కోసం మాత్రం టాక్స్ లా   చాలా అనుకూలంగా ఉంటుంది.మీరు మీకున్న భాద్యతల వలన ఉద్యోగం తప్పనిసరి అయితే మీకున్న ఖాళీ సమయం ప్రెండ్స్ తో పనికి రాని కబుర్లు,  టి .వి చూడటం కంటే పార్ట్ టైం బిజినెస్ ప్రారంబించి  మంచి ఆదాయం పొందడానికి  కష్టపడండి.

ఈవారం స్టాక్ మార్కెట్ 01-10-2012to05-10-2012


ఈవారం స్టాక్ మార్కెట్ 01-10-2012to05-10-2012




గత వారం నిఫ్టీ 52 వారాల గరిష్ట స్థాయి  5735  నమోదు కావడం జరిగినది.ఇక ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే మంగళవారం గాంధీ జయంతీ రోజున సెలవు కావడం , ఈ వారం మొత్తం చైనా మార్కెట్స్ కి నేషనల్ డే సెలవులు  ఉండటం ,హాంకాంగ్ మార్కెట్ కి కూడా రెండు రోజులు సెలవులు ఉండటం వలన మన మార్కెట్ కూడా కాస్తంత బోర్ గా ఉండే అవకాశం మాత్రం కలదు.గతవారం నిఫ్టీ కాన్సాలిడేషన్  జరిగి నిఫ్టీ ఫిబోనస్సీ గోల్డెన్  రేషియో 61.8% ఐనటువంటి 5648 వద్ద మరియు  5638 వద్ద డబల్ బాటం పాటర్న్ ఏర్పాటు జరిగి అక్కడ సపోర్ట్ తీసుకొని నిఫ్టీ 5735 వరకు వెళ్లి april 2011తర్వాత మొదటిసారిగా 5700 పైన క్లోజ్ కావడం జరిగినది.కాని రెసిస్టన్స్ ఐనటువంటి 5740  మాత్రం దాటలేకపోయినది.నిఫ్టీ డెయిలీ చార్ట్ లో షూటింగ్ స్టార్ లాంటి పాటర్న్, వీక్లీ చార్ట్ లో దోజి పాటర్న్ ఏర్పాటు కావడం జరిగాయి. రెండు కూడా బెరిష్ పాటర్న్స్ . కాని కన్ఫర్మేషన్ మాత్రం తప్పనిసరి. 5740 పైన నిఫ్టీ నిలదోక్కుకున్నట్టు ఐతే మాత్రం నిఫ్టీ వీక్లీ చార్ట్ ట్రెండ్ లైన్ రెసిస్టన్స్ 5850 , తర్వత 5940    వరకు ర్యాలీ జరగవచ్చు.గత నెల లో వచ్చిన ర్యాలీ తర్వాత ఈ నెలలో ఎక్కువ ర్యాలీ జరగకపోవచ్చు. ఈ నేలాలో నిఫ్టీ 5500-5850 మధ్యలో చలించడానికి అవకాశం ఉంది.  ప్రస్తుతానికి నిఫ్టీకి మద్దతు 5635, 5580 5535  వద్ద కలదు.  నిఫ్టీ గురుంచి డెయిలీ అప్ డేట్ చేయండి అని చాలా మంది అడుగుతున్నారు.ఈ పోస్ట్ లో నిఫ్టీ ఈ వారం గురుంచి వివరించడం జరిగినది.ఈ పోస్ట్ లో వివరించిన  వ్యూ ఈ వారం గురుంచి. ఒకవేళ ఏవైనా మార్పులు , చేర్పులు ఉంటే తప్పకుండా అప్ డేట్ చేయగలం. ఈ బ్లాగ్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్న వారందరికి తెలుసు . నిఫ్టీ గురుంచి ఎంత ఖచ్చితంగా తెలియచేయడం జరుగుతున్నదో.
ముఖ్య గమనిక :మీరు  స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా ఒక పద్ధతి  ఎంచుకొని దానినే స్థిరంగా  మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్ మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ సాధ్యం అవుతుంది. రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్ స్కీమ్

నెంబర్ 72 మహత్యం


నెంబర్ 72  మహత్యం 

సాదరణంగా చాలా మందిని ఒక సందేహం   ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. అదేమిటంటే   వారి డబ్బు ఎంత కాలంలో రెట్టింపు అవుతుంది అనే విషయం. చక్రవడ్డీ తో మీరు పొదుపు చేసిన డబ్బు  ఎంతకాలంలో రెట్టింపు అవుతుంది తెలుసుకోవాలి అంటే  మీరు నెంబర్  72 గురించి తప్పకుండా తెలుసుకోవలసినదే. ఈ ఫార్ములా ని శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ అవిష్కరించెను . ఇది చాలా సులభం వడ్డీ రేటు తో 72 ను భాగిస్తే చాలు . మీ సొమ్మూ ఎంత కాలంలో రెట్టింపు అవుతుందో సులభంగా తెలిసిపోతుంది. ఉదాహరణకు వడ్డీ రేటు 12 శాతం అనుకుంటే మీ డబ్బు 8  సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది.అదెలాగంటే  72/12=8.  ఈ విధంగా  72 సంఖ్యా ద్వారా మీ దబ్బు రెట్టింపు  జరిగే కాలాన్ని సులభంగా లెక్కించవచ్చు.వడ్డీ రేటు స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమె ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది.మీరు రూ.  2,500  లను 9% శాతం వడ్డీ కి ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు  72/9= 8.  సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది.

ధనవంతులు కావడానికి ఉన్న అవకాశాలు

ధనవంతులు కావడానికి ఉన్న అవకాశాలు
ధనవంతులు  ఏ విధంగా కావచ్చు అని ఎవ్వరిని అడిగిన చెప్పే సమాధానం . బాగా సంపాదించు  లేదా కోరికలను తక్కువగా కలిగి ఉండి  అధికంగా అదా చేయడం అని చెప్తారు. కాని చాలా మంది రెండిటిలో దేనిలో కూడా ప్రావీణ్యం కలిగి ఉండలేరు.చాలా  మందికి  అధిక కోరికలు  ఉంటాయి కాని అధిక సంపాదన మాత్రం ఉండదు. చాలా మంది ఇతర  మార్గాలా ద్వారా ధనవంతులు  కావడం జరుగుతుంది.  మనం ఒక్కసారి ఆ మార్గాలు ఏమిటో పరిశీలిద్దాం.
మీరు ధనవంతులైన  అమ్మాయిని లేదా అబ్బాయిని పెళ్లి చేసుకోవడం. 
చాలా మందికి ధనవంతులు కావడానికి సులభంగా ఎన్నుకొనే మార్గం. ఈ రోజుల్లో దాదాపుగా ప్రతి పెళ్లి వెనుక డబ్బు ప్రముఖ పాత్ర వహిస్తుంది.కాని ఇక్కడ ఒక్క విషయం కేవలం డబ్బుపై ప్రేమతో అమ్మాయి లేదా అబ్బాయి పై ప్రేమ లేకుండా  పెళ్లి చేసుకోవడం వలన  జీవితంలో  ఇబ్బందుల పాలు తప్పకుండా పడతారు.
మోసగాడు లేదా నిజాయితీ లేని వ్యక్తిగా మారడం.
చాలా మంది లీగల్ గా నిజాయితీ తో ధనవంతులు కాలేము అనే ఉద్దేశంతో  ఇల్లీగల్ మారగాన్ని అంటే మోసపూరిత మార్గాన్ని ఎన్నుకుంటారు.  కాని ఈ మార్గంలో ఎప్పటికైనా జైలు కి వెళ్ళాక తప్పదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.ఈ మార్గం ఎన్నటికి అనుసరణీయం కాదు.
వంశ పారంపర్యంగా ధనవంతులు కావడం. 
ఉదాహరణకు మీ తాత లేదా తండ్రిగారు ధనవంతులు ఐతే  , ఆ ఆస్థి వారసత్వంగా మీ వద్దకు చేరుకోవడం వలన కూడా ధనవంతులు  కావచ్చు. కాని  మీ సంపాదన ద్వారా  మీరు ధనవంతులు ఐతే ఉండే ఆనందం దీనిలో ఉండదు.అంతే కాకుండా ఇలా వారసత్వంగా ధనవంతులు కావడం అనేది అందరికి ఉండే అవకాశం మాత్రం కాదు.
లాటరీ గెలుపొందడం వలన ధనవంతులు కావడం.
ఈ మార్గం ద్వారా ధనవంతులు కావడం  మంచిదే. కాని ఈ విధంగా ధనవంతులు కావాలి అని మీరు ఎదిరి చూడటం గాలిలో దీపం లాంటిది.చాలా మంది లాటరీ గెలుస్తాం అనే ఆశతో లాటరీ టిక్కెట్లు కొనడం చూస్తేనే ఉంటాం. కాని  ఈ విధంగా ధనవంతులు కావదానికి ఉండే అవకాశం చాలా తక్కువ..
సినిమా స్టార్ లేదా గొప్ప స్పోర్ట్ స్టార్  కావడం
మీరు చాలా అందంగా ఉండి  మీ వద్ద టాలెంట్ ఉంటే మీరు సినిమా స్టార్ లేదా టి వి స్టార్  కావడం లేదా మీకు ఏదైనా ఆటలో మంచి ప్రావీణ్యం ఉంటే  గొప్ప స్పోర్ట్ స్టార్  కావడం వలన కూడా మీరు ధనవంతులు కావచ్చు.
ధనవంతులు కావాలి కోరిక మీలో అధికంగా ఉండటం.
కొంత మందికి ధనవంతులు కావలి అనే కోరిక చాలా అధికంగా ఉంటుంది. ఇలాంటి వారూ ,వారి లక్ష్యాల కోసం చాలా కష్టపడతారు. వారి లక్ష్యం కోసమా వారి వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేయవలసి ఉంటుంది.
ఆర్ధికంగా పూర్తీ అవగాహన కలిగి  ఉండటం. 
కొంత మంది ఆర్ధిక విషయాల పట్ల పూర్తీ అవగాహన కలిగి ఉండి  సరియైన సమయంలో , సరియైన విధంగా ఫైనాన్సియల్ ప్లానింగ్ ఏర్పాటు చేసుకొని ధనవంతులు కావడం జరుగుతుంది. దీని కోసం మీరు ఆర్ధిక విషయాలు నేర్చు కోవలసి ఉంటుంది.
చాలా మందికి సేవ చేయడం.
ఇక్కడ సేవ చేయడం అంటే  సామాజిక సేవ చేయడం కాదు. మీరు ఉద్యోగస్తులూ  ఐతే మీ సర్వీసు కొంత మందికే మాత్రమే అందించ బడుతుంది దానికి మీరు జీతం అందుకుంటారు .అదే మీరు వ్యాపారస్తులూ ఐతే చాలా మందికి సేవ చేయవచ్చు. దాని ద్వారా మీ వ్యాపారం సులభంగా అభివ్రుద్ది చెందడంతో మీ కోరిక నెరవేరుతుంది.కాని ఈ పద్దతిలో మీరు ధనవంతులో కావాలి అంటే మాత్రం మీరు మీ ఉద్యోగాన్ని వదిలి మీ స్వంత బిజినెస్ ప్రారంభం చేయాల్సి ఉంటుంది.

ఈ రోజు స్టాక్ మార్కెట్ 28-09-2012


ఈ రోజు స్టాక్ మార్కెట్ 28-09-2012
సెప్టెంబర్ సీరీస్ కాంట్రాక్ట్ ముగియడం జరిగినది. ఈ వారంలో నిఫ్టీ అటు ఇంతకు ముందు ఏర్పాటు చేసినటువంటి హై 5720 ను కాని, క్రింది వైపు మీకు ఇదివరకే తెలియచేసిన సపోర్ట్ 5648క్రింద ముగియడం కాని జరగలేదు.కాకపోతే  5640 వద్ద డబల్ బాటం పాటర్న్ ఏర్పాటు కావడం జరిగినది.ఇది బుల్లిష్ పాటర్న్ .నిఫ్టీకి తక్షణ మద్దతు 5640, 5618  వద్ద కలదు. నిఫ్టీ 5600  కంటే క్రిందికి క్లోసింగ్ కానంత వరకు  లాంగ్ పొజిషన్స్ కి  ఎలాంటి  ఇబ్బంది లేదు. రెసిస్టన్స్   5680, 5700, 5720  వద్ద కలదు 

రాష్ట్ర ప్రభుత్వాలు VAT విధించి ఇన్ఫ్లేషన్ పెరగడానికి ఏ విధంగా కారణం అవుతాయో తెలుసుకుందాం?


రాష్ట్ర ప్రభుత్వాలు VAT విధించి  ఇన్ఫ్లేషన్ పెరగడానికి ఏ విధంగా కారణం అవుతాయో తెలుసుకుందాం?
మీకు అవగాహన ఉందో లేదో తెలియదు కాని ప్రభుత్వాలు ప్రజల  నుండి వివిధ రూపాలలో  ఇరవై  రకాల పన్నులను వసూలు చేస్తున్నాయి . వాటిలో అత్యంత ప్రముఖమైనవి ఇనకం టాక్స్ , సర్వీస్ టాస్క్ .ప్రజల వద్ద నుండి ప్రభుత్వం వసూలు చేసిన మొత్తం తో దేశాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు ,రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాలు మొదలగునవి  సమకూర్చుకోవడానికి వినియోగిస్తారు.

ఈ రోజు  ప్రజలూ సంపాదిస్తున్న మొత్తంలో అధిక శాతం టాక్స్ లు చెల్లించడానికే  పోతుంది. సాదారణంగా ప్రజలూ వారూ చెల్లించే పన్నుల ద్వారా దేశాభివృద్ది జరుగుతుంది అని ఆశిస్తారు. కాని ఈ పన్నులు ఒక ప్రజల యొక్క ఆర్ధిక పరిస్థతి ని చాలా దారుణంగా ప్రభావితం చేస్తున్నాయి.  
ముందుగా మీరు ఇన్ఫ్లేషన్ గురుంచి అర్ధం చేసుకోండి. ఈ ఇన్ఫ్లేషన్ మరియు టాక్స్ లు ప్రజల ఆర్ధికస్థితి పై ఏ విధమైన ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకుందాం. మీకు ఇన్ఫ్లేషన్ గురుంచి వివరంగా తెలుసుకోవాలి అంటే క్రింద ఇవ్వబడిన లింక్స్ పై క్లిక్ చేసి చదవండి.


రోజు రోజుకి వస్తువులా ధరలు పెరుగుతున్నాయి   అనే విషయం మీ అందరికి తెలుసు. చాలా మంది ప్రభుత్వం ఈ ధరల పెరుగుదలని అరికట్టడానికి ఇన్ఫ్లేషన్  పెరుగుదలని అరికట్టడానికి తగు చర్యలు తీసుకోవాలి అని బావిస్తుంటారు.వాస్తవానికి ప్రభుత్వం ఏమైన  చర్యలు తీసుకుంటుందా. మీరు ఒక్కసారి గత పది సంవత్సరంల నుండి ఇన్ఫ్లేషన్ రేటు ఏ విధంగా ఉందో ఒక్కసారి క్రింది పట్టికలో చూడండి.

Year
Inflatation rate
Apr -03
5.12%
Apr -04
2.23%
Apr -05
4.96%
Apr-06
4.65%
Apr-07
6.67%
Apr-08
7.81%
Apr-09
8.70%
Apr-10
13.33%
Apr-11
9.41%
Apr-12
10.22%
  పై పట్టికను గమనిస్తే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా  ఇన్ఫ్లేషన్ పెరుగుతూనే ఉంది.సాదారణ మధ్యతరగతి కుటుంబం ఒక్కప్పుడు ప్రతి నెల రూ 10,000 లతో ఇంటి ఖర్చులు సరిపెట్టుకుంటే ఇప్పుడు అదే కుటుంబానికి రూ .  30,000  లు కూడా సరిపోవడం లేదు. దీనికి ప్రభుత్వం చెప్పే సమాధానం లైఫ్ స్టైల్ లో మార్పు . కాని వాస్తవం వేరే  ఉంది. అదేమిటో ఒక్కసారి చూద్దాం.
VAT( value added tax ) అనేది రాష్ట్ర ప్రభుత్వం విధించే టాక్స్ .దాని పేరు లోనే ఉన్నట్టుగా వస్తువుకి  అదనపు విలువ కలవడం వలన వస్తువు ధర పెరిగి వస్తువు ధర మరింత అధికం  కావడానికి కారణం అవుతుంది.ఈ టాక్స్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళుతుంది. ఈ టాక్స్ రేటు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది. మీరు వస్తువులపై  ఎంత వ్యయం చేస్తే అంత అధికంగా పన్ను చెల్లించవలసి ఉంటుంది.
సాదారణంగా పెట్రోలు , డిజీల్  మరియు గ్యాస్ ప్రతిఒక్కరికి అవసరమైనవి. ప్రస్తుతం ఇవి లేకుండా జీవితాన్ని ఉహించలేం . వస్తువులు రవాణా చేయడానికి ఇందనం తప్పనిసరి . ఈ ఇందనం ధర పెరగడం వలన రవాణా చార్జీలు పెరిగి వస్తువులా ధరలు పెరగడానికి కారణం అవుతాయి.అంటే ఇందన ధరలు పెరిగితే , వస్తువుల ధరలు పెరగడంతో , ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది.
ఉదాహరణకు ఒక వస్తువు ధర రూ 20 ఆయితే  ఇంధన ధరలు పెరగడం వలన రవాణా చార్జీలు పెరిగి ఆ వస్తువు ధర రూ 25 అవుతుంది.
మీకు తెలుసా ? ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం  దేశంలోకెల్లా అత్యధికంగా  34% టాక్స్  వసూలు  చేస్తుంది.ఉదాహరణకు లీటరు పెట్రోలు రూ 75 ఉంటే మీరు  చెల్లించే  డబ్బులలో రూ .25.50 ప్రభుత్వానికే వెళ్తాయి.అదే గోవాలో ఐతే కేవలం 0.1% మాత్రమే  పెట్రోలు పై వ్యాట్ విధిస్తున్నారు.దీనివలన రూ 11 తక్కువకే పెట్రోలు అక్కడ దొరుకుతుంది.గోవా ప్రభుత్వం ఈ విధంగా ప్రజలకోసం తక్కువ వ్యాట్ వసూలు చేస్తున్నప్పుడు మిగితా రాష్ట్రాలు ఆ విధంగా ఎందుకు చేయలేకపోతున్నాయి.వివిధ రాష్ట్రాలలో వ్యాట్ ఏవిధంగా ఉందో ఒక్కసారి చూద్దాం ..

State
Petrol
diesel
Andharapradesh
34%
23%
Arunachalapradesh
20%
20%
Assam
27.50%
16.50
Chattishgarh25%
25%
25%
Delhi
20%
20%
Goa
0.10%
19%
Gujarath
23%
21%
Haryana
20%
12%
Himachalapradesh
20%
14%
Madhyapradesh
30.04%
-
Maharasra
26%
24%
Punjab
32.69%
8.80%
Rajasthan
28.89%
18%
Tamilnaadu
33%
30%
Westbengal
26.87%
-
మనం పెట్రోలు పై మాత్రమే కాకుండా మనం కనుగోలు చేస్తున్న ప్రతి వస్తువుపై 5 % to 15%వరకు రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ వసూలు చేస్తుంది. దీని వలన వస్తువు యొక్క ధర పెరగడమే కాకుండా ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. అదే ప్రభుత్వాలు వ్యాట్ తగ్గిస్తే ధరలు తగ్గి , ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది. కాని రాష్ట్ర ప్రభుత్వాలు ఆవిధంగా మాత్రం చేయవు. వాటికి ఇన్ఫ్లేషన్ పెరిగి ప్రజలూ ఇబ్బందులపాలు ఐనా పర్వాలేదు. కాని వాటి ఆదాయాన్ని పోగొట్టుకోవడానికి మాత్రం ఇష్టపడవు.ఇది మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం 12.36%  సర్వీసు  టాక్స్ కూడా వడ్డిస్తూనే ఉంది..
చాలా మంది ఇంతకు ముందు గోవాకి అక్కడి సుందర దృశ్యాలు. బీచ్ లు చూసి వస్తూ , వస్తూ కాజు కొనుక్కొని వచ్చే వాళ్ళు . ఇప్పుడు మాత్రం పెట్రోలు కూడా కొనుక్కొని వస్తున్నారు