ఈ రోజు స్టాక్ మార్కెట్.


ఈ రోజు స్టాక్ మార్కెట్.
మీకు రెండు రోజుల క్రితం తెలియచేయడం జరిగినది.నిఫ్టీ 5700 క్రింద ఉన్నంత వరకు మార్కెట్ క్రిందకు దిగజారడానికి అవకాశం ఉంది అని తెలియచేయడం జరిగినది.అదే విధంగా   5650-5683 వద్ద ఏర్పాటు కాబడిన గ్యాప్ కూడా నింప బడుతుంది అంటే , 5650 వరకు నిఫ్టీ సులభంగా పడిపోతుంది అని తెలియచేయడం జరిగినది. నిన్న అదే విధంగా జరిగి నిఫ్టీ  5648 వరకు దిగజారడం జరిగినది కూడా. ప్రస్తుతం నిఫ్టీ కి 20 sma వద్ద సపోర్ట్ కలదు. అదే విధంగా  5620, 5600 వద్ద కూడా సపోర్ట్ కలదు.రెసిస్టన్స్ 5684, 5700 వద్ద కలదు. 5684 దాటి నిలదోక్కుకున్నట్టు ఐతే లాంగ్ పోజిశాన్స్ తీసుకోవచ్చు. లేదంటే ప్రతి పెరుగుదలలో సెల్ చేయడం మంచిది. 

షేర్ మార్కెట్ లో షేర్ ధరలు ఎందుకు పెరుగుతాయి.? part 2


కంపెనీ కొత్తగా షేర్లను ఇవ్వడాన్ని  పబ్లిక్ ఇష్యూ అంటారు. కంపెనీ తన వ్యాపరం గురించి, ఇంతకు ముందు కంపెనీ ఉన్నట్టు ఐతే పూర్వపు లాభాల గురించి , తన ఆస్తులు మొదలగు వాటితో కూడిన వివరాలతో దిన పత్రికలో ప్రకటన ఇస్తుంది.అప్పుడు మనకు ఆ కంపెనీ గురించిన సమాచారం నచ్చి , నమ్మకం కుదిరితే  అప్లయ్ చేయవచ్చు.కొనేవారి సంఖ్యా ఎక్కువగా ఉంటే లాటరీ తీసి పంచుతారు.పెద్ద కంపెనీ షేర్లు ఈ విధంగా లాటరీ ద్వారా సంపాదించటం కొద్దిగా కష్టం..ఈ విధంగా పంపకం జరిగాక తమకి సంక్రమించిన షేర్లని కొందరు అమ్మజూపుతారు.కావలసినవాళ్ళు హెచ్చు ధరకి దాన్ని కొనుక్కోవడాన్ని  సెకండరీ మార్కెట్ అంటారు.క్యూ లైన్ లో సినిమా టికెట్స్ దొరక్కపోతే బ్లాకులో ఎక్కువ ధర పెట్టి కొనుక్కున్నట్టు .
షేరు ధరలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి.ప్రభుత్వం పెట్రోల్ ధర పెంచాగానే ఎక్స్  కెమికల్ కంపెనీ షేర్ల ధర పెరగవచ్చు.దానికి కారణాలు అన్వేషించాలి అంటే చాలా లింకులు ఆలోచించాలి.పెట్రోలు ధర పెరిగితే బైక్ లకన్నా లూనాల  డిమాండ్ పెరుగుతుంది. లూనాల టైర్లలో వాడే రసాయనాన్ని ఈ  ఎక్స్  కెమికల్ కంపెనీ తయారు చేస్తుంది.అందువలన వచ్చే సంవత్సరం దీనికి లాభాలు ఎక్కువగా వస్తాయి అన్న ఉద్దేశంతో ఈ కంపెనీ షేరు ధర పెరుగుతుంది.

ప్రధానమంత్రి  , వాణిజ్య మంత్రిని పదవి నుంచి తొలగించాగానే ఒక చెప్పుల కంపెనీ ధర విపరీతంగా పడిపోవచ్చు.దానికి , దీనికి లింక్ ఏమిటని ఆలోచిస్తే సదరు మంత్రి బావమరిదికి  అరబ్ దేశాలకు  చెప్పులు ఎగుమతి చేసే లైసన్స్ ఉండి ఉండవచ్చు.దాని క్రింద లోపాయికారిగా కోట్ల విలువచేసే చెప్పులు ఎగుమతి చేస్తూ లాభాలు గడిస్తూ ఉండవచ్చు.ఇకముందు ఈ ఆటలు సాగవు కదా ? అందుకే ఆ కంపెనీ షేరు ధర పడిపోయింది. ఈ విధంగా దేశంలో ఎక్కడో ఏదో జరిగితే మరెక్కడో షేరు ధరలు పెరగడమో, తరగాడమో  జరుగుతుంది.కేరళలో  వర్షాలు పడితే బొంబాయి కొబ్బరి నూనె కంపెనీ షేరు ధరపై ఆ ప్రాభావం  ఉంటుంది.కార్మిక సంఘాల స్ట్రయికులు , రాజకీయ అనిశ్చితి, పంటలు, యుద్ధం  మొదలగునవి అన్ని కూడా షేర్ల ధరలపై ప్రభావం చూపెడతాయి.దేశంలో ఒక చిన్న కదలిక రాగానే అది ఏ కంపెనీ  మీదా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కరెక్ట్ గా అంచనా వేసి అందరికన్నా  ముందుగా దాన్ని పట్టుకొని దాంతో వ్యాపారం చేసే బ్రోకర్లని స్పెక్యులేటర్లు అంటారు. మనిషి తెలివి తేటలకు వీరి మెదళ్ళు పరాకాష్ట. వీరిలో రెండు రకాలు. బుల్ల్స్, బెర్స్.
స్టాక్ మార్కెట్ లో లో వ్యాపారం చేసే వాళ్ళు సాదరణంగా  ఈ రెండు రకాల్లో ఏదో ఒక రకానికి చెందినవారూ అయి ఉంటారు. మార్కెట్ లో వీళ్ళిద్దరూ ఎప్పుడు యుద్దానికి తలపడే యోదుల్లా ఉంటారు. బుల్ ఆశాజీవి. దేశంలో ఏ చిన్న పరిమాణం జరిగిన షేరు ధర విపరీతంగా పెరుగుతుంది అనుకొనేవాడు.బెర నిరాశాజీవి.ధర అనుకున్నంతగా పెరగదని , కొండకచో తగ్గిపోతుంది అని  భావించేవాడు . ఉదాహరణకు జనవరి 1వ తారీఖున కిలో పంచదార  10 రూపాయలు ఉందనుకొందాం. ఆ సంవత్సరం చెరకు సరిగ్గా పండలేదు అనుకుందాం.మార్చి   31 వ తారీఖు వీరిద్దరూ ఉహించే ధరలు ఈ విధంగా ఉంటాయి.
జనవరి  1 ధర      మార్చి 31ధర  
       బుల్   10              16
      బేర్   10              12
జనవరి ఒకటో తారీఖు పొద్దున్నే బుల్ స్వీట్స్ తీసుకొని బేర్  కి నూతన సంవత్సర శుబాకాంక్షలు చెప్పి బేరం మొదలు పెడతాడు. బ్రదర్   మార్చి 31 వ తారీఖు నాటికి నాకు లక్ష కిలోల పంచాదార కావాలి . కిలో పద్నాలుగు రూపాయల చొప్పున  ఆ రోజు నాటికి ఇవ్వగలవా ? అని అడుగుతాడు.
కొత్త సంవత్సరం మొదట్లో భలే బేరం తగిలిందని బేర్ సంతోషిస్తాడు.మార్చి  31నాటికి అతడు ఉహిస్తున్న ధర  కిలో  12   మాత్రమే. ఆ రోజు   పన్నెండుకి కొని పద్నాలుగికి అమ్మితే రెండు లక్షలు లాభం వస్తుంది అని ఆలోచిస్తాడు.బుల్ ఆలోచనలు వేరు . ఆ రోజు ధర పదహారు రూపాయలు ఉంటే అతడికి రెండు లక్షలు లాభం.ఈ విధంగా ఇద్దరి మధ్య ఒక్క పంచదార పలుకు లేకుండా లక్షల వ్యాపారం చేస్తారు.
మరుసటి ఆర్టికల్ లో షేర్ మార్కెట్ లో మోసాలు ఎలా జరుగుతాయి . హర్షద్ మెహతా  చేసిన మోసం ఎలాంటిదో  తెలుసుకుందాం. 

బంగారంలో ఇప్పుడు పెట్టుబడి పెడితే రానున్న మూడేళ్లలో రెట్టింపు కావడం నిజమేనా ?


బంగారంలో ఇప్పుడు పెట్టుబడి పెడితే రానున్న మూడేళ్లలో రెట్టింపు కావడం నిజమేనా ?

రానున్న మూడేళ్ళ కాలంలో బంగారం ధర  రెట్టింపు అవుతుంది అంటే అచ్చర్యపోతున్నారా ? మీరు బంగారం ధర గత కాలంలో ఎలా పెరిగినదో మీకు తెలుసుకదా ? మీరు బంగారం ధర ఒక్కసారి  పరిశీలిస్తే ఇండియా లో డిశంబర్ 2007  10gr బంగారం ధర  రూ .10,000  ఉంటే  డిశంబర్   2010 లో రూ 20,000 లకు చేరుకుంది.అంటే కేవలం మూడు సంవత్సరాలలో రెట్టింపు ధరకు చేరుకుంది . సెప్టెంబర్ 2009లో  రూ.16500 ఉంటే మూడు సంవత్సరాలో  అంటే 2012లో రూ.32500 కు చేరుకుంది ఇప్పుడు కూడా మూడు సంవత్సరాలలో రెట్టింపు ధరకు చేరుకుంది.
మనదేశం బంగారాన్ని అధిక శాతం విదేశాలనుండే  దిగుమతి చేసుకుంటుంది. అందువలన మన దేశంలో బంగారం ధర అంతార్జాతీయ ధర కి  అనుగుణంగా ఉండదు.
అంతార్జాతీయ మార్కెట్ లో  బంగారం 23 Aug 2011 న $1900 గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు మన దేశంలో బంగారం ధర రూ. 28600 ఉంటే ఇప్పుడు  అంతార్జాతీయ మార్కెట్ లో  బంగారం $ 1730 చేరుకుంటే  మనదేశంలో మాత్రం బంగారం రూ .32500 చేరుకుంది. అంతార్జాతీయ మార్కెట్ లో  బంగారం ధర తగ్గిన మనదేశంలో బంగారం ధర పెరగడానికి ముఖ్య కారణం డాలర్ బలపడటం , రూపాయి బలహీనపడటమే . అంతే కాకుండా రోజురోజుకి బంగారం పై ఇన్వెస్ట్ చేసే వాళ్ళు పెరుగుతుండటం.

రెండు సంవత్సరాల క్రితం డాలర్ కి రూపయాయి మారకపు విలువ రూ 45ఉంటే ఇప్పుడు రూ   55 గా ఉంది.కేవలం రూ. 10తేడా  అంతార్జాతీయ మార్కెట్ లో  బంగారం ధర తగ్గిన మనదేశంలో బంగారం ధర పెరగడానికి కారణమైనది.అంతే కాకుండా అంతార్జాతీయంగా ఆర్ధికమాంద్యం , యూరో జోన్ పరిస్థితులు  హెడ్జ్ ఫండ్స్ ను బంగారంలో అధికంగా ఇన్వెస్ట్ చేయడానికి కారణమవుతున్నాయి.
ఈ బంగారం ధర పెరగడం ఫిజికల్ గా బంగారు అమ్మకాల పై ప్రభావం  చూపినప్పటికీ  గోల్డ్ ETF లో   ఇన్వెస్ట్ చేయడం మాత్రం తగ్గడం లేదు.అంతే కాకుండా దేశంలో వర్షాభావ పరిస్థితులు సాదరణంగానే నమోదు కావడం  నవరాత్రుల తర్వాత మంచి రోజులు ఉండటం .దీపావళి  మొదలగు పండుగల వలన మళ్ళీ బంగారం ఆభరణాలకు గిరాకీ పెరిగే అవకాశం కూడా ఉంది.బంగారం ప్రస్తుతం అధిక స్థాయిల వద్ద ఉన్నప్పటికీ కూడా  అంతార్జాతీయంగా నెలకొన్న ఆర్ధిక పరిస్థితులు, ఇన్వెస్టర్ల నుండి ఉన్న డిమాండ్ , రూపాయి బలహీనత మొదలగు అంశాల ఆధారంగా బంగారం ధర ఇంకా పెరగడానికే అవకాశం ఉంది. మీరు చూస్తూ ఉండగానే బంగారం రూ .32500 నుండి రూ 65000 లకు 2015  కల్లా చేరుకునే అవకాశం అధికంగా ఉంది.
గమనిక : ఏ ఇన్వెస్ట్మెంట్ సాధనం లో ఐనా సరే రిస్కు అనేది తప్పకుండా ఉంటుంది. రిస్కు లేకుండా రిటర్న్ అనేది ఉండదు. అందుకే ఎవరికి వారూ , వారూ భరించగలిగే రిస్కు  కి అనుగుణంగా ఇన్వెస్ట్ చేయడం చేయాలి. పైన బంగారం పై కేవలం నా  అభిప్రాయం తెలియచేయడం జరిగినది.
telugufinancialschool@gmail.com



షేర్ మార్కెట్ లో షేర్ ధరలు ఎందుకు పెరుగుతాయి.?


షేర్ మార్కెట్ లో షేర్ ధరలు ఎందుకు పెరుగుతాయి.?
చాలా మందికి షేర్లు లేదా షేర్ మార్కెట్ అంటే చాలా దురభిప్రాయం ఉంది.గుర్రపు పందాలు.పెకాటలాగే అదికూడా  ఒక వ్యసనం అనుకుంటూ ఉంటారు.నిజానికి అది సరికాదు. రేసులూ, పెకాటాలు గెలవటం, ఓడటం అనేది కేవలం అదృష్టం మీదా మాత్రమే అధారపడి  ఉంటుంది.కానీ  ఈ షేర్ల బిజినెస్ లో కాసింత జ్ఞానం తో పాటు మెలకువతో ముందే రిస్కులను వూహించగలిగితే  లాభాన్ని సంపాదించవచ్చు.షేర్లలో ఉండే లాభాలు సాదరన్మగా రెండు రకాలుగా ఉంటాయి.మనం కొన్న షేరు ధర పెరగడం వలన వచ్చే లాభం మొదటిది.రెండవది కంపెనీ వచ్చిన లాభాలాలో నుండి మనకి కొత్త శాతం పంచి ఇవ్వడం . దానినే  డివిడెండ్ అంటారు.ఒక షేరు ని మనం పది రూపాయలకు కొని ఆర్నెల్ల తర్వాత దాని ధర ఇరవై రూపాయలకు పెరిగినప్పుడు అమ్మితే మనకి వచ్చిన లాభం పది రూపాయలు.రియల్ ఎస్టేట్ కంటే కూడా అధిక లాభాలు అందించే సాధనం షేర్ మార్కెట్ . కాని దానిపై పూర్తీ అవగాహన మాత్రం తప్పనిసరి.బ్యాంకుల్లో డబ్బూ ని ఫిక్సుడ్ డిపాజిట్ చేయడం వలన వచ్చే వడ్డీ శాతం కేవలం ఆరు నుండి ఎనిమిది శాతం మాత్రమే.దానిని మెట్యురిటీ అయ్యే వరకు తీయలెం కూడా.తీసుకున్నా వడ్డీ నష్టం తప్పదు.అదే షేర్ మార్కెట్ లో ఐతే మీ షేర్లు మీ ఇష్టం వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు.ఈ విధంగా భూమూలు, స్తిరాస్తులూ కాపాడుకోవటం, అమ్ముకోవటం, లాభం తీసుకోవడం కన్నా ఈ వ్యాపారం చాలా సులభం.

షేర్ ధర ఎందుకు పెరుగుతుంది. ?
దీనికి చాలా చిన్న సమాధానం. మనదేశంలో బ్యాంక్ వడ్డీ రేటు కన్నా మిగితా వస్తువుల ధరలు  విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి.ఉదాహరణకు వంద మంది కలిసి తలా పదివేలు వేసుకొని పది లక్షలకి భూమి కొన్నారు అనుకోండి. అదే భూమి ఆర్నెల్ల తర్వాత పన్నెండు   లక్షలు ఐతే అప్పుడు ఒక్కొక్కరి షేరు విలువ  పన్నెండు వేలు అవుతుంది. ఈ లోపులో ఒకవేళ ఆ భూమి లో వేసిన వరి పైరు చేతికి వచ్చి లక్ష రూపాయల ధర అయిందనుకోండి.ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల డివిడెండు వస్తుంది.   మొత్తం మీదా మూడు వేలు లాభం కదా? ఒక్కొక్కరికి. అదే విధంగా కంపెనీ అతుల విలువ కూడా పెరుగుతుంది.ప్రతి కంపెనీ తన  లాభాలన్నింటిని వాటాదారులకు పంచాడు. కొంత వరకూ రిజర్వులో దాస్తుంది. అది కూడా మన అస్తే.పైన చెప్పుకున్న ఉదాహరణలో మన కంపెనీ గత ఐదు సంవత్సరాలుగా వచ్చిన లాభాలను రిజర్వు లో యాభై లక్షల వరకు దాచి పెట్టినది అనుకోండి.అప్పుడు మన పది రూపాయల షేరు ధర అరవై రూపాయలు అవుతుంది.కొన్నిసమయాలలో కంపెనీ రిజర్వు అమౌంట్ లో నుండి  కొంత  మొత్తం మనకి పంచుతుంది. వాటిని మనం బోనస్ షేర్లు అంటారు.  

ఈ రోజు స్టాక్ మార్కెట్ 09-10-2012


ఈ  రోజు స్టాక్ మార్కెట్ 09-10-2012
నిన్న నిఫ్టీ  5676  వద్ద క్లోజ్ కావడం జరిగినది. అంటే గత వారం  ఏర్పాటు చేసిన  గ్యాప్ 5650-5683  ఏరియాలో ప్రవేశించడం జరిగినది.ఈ రోజు ఆ గ్యాప్ పూర్తీగా నింపబడటం పూర్తీ కావచ్చు. అంటే నిఫ్టీ 5650 వరకు సులభంగా వస్తుంది.ప్రస్తుతం రెసిస్టన్స్ 5700, 5715 వద్ద  సపోర్ట్  5650,5638 వద్ద కలవు . 5700 పైన నిఫ్టీ నిలదోక్కుకోనంతవరకు  పై లెవల్లో  సెల్లింగ్ చేయడం మంచిది. 5700 పైన  నిలదోక్కుకుంటే మాత్రం  లాంగ్ పోజిషన్స్ తీసుకోవచ్చు.

ఈ వారం నిఫ్టీ 08-10-2012 to 12-10-2012


ఈ వారం నిఫ్టీ 08-10-2012 to 12-10-2012
గత వారం నిఫ్టీ లో ఏం కే  గోల్డ్ బ్రోకరేజ్ తప్పు ఆర్డర్స్ వలన నిఫ్టీలో తొమ్మిది వందల పాయింట్లు పడిపోవడం జరిగినది. మీకు ఇది వరకు 20 april 2012రోజున నిఫ్టీ  5300-5000 పడిపోవడం   may 2011లో అమెరికా మార్కెట్ డౌజోన్స్  1000 పాయింట్ల కి పడిపోవడం గుర్తుందా ?ఈ సంఘటనలు జరిగిన కొన్ని నెలల అనంతంరం నిఫ్టీ మరియు  డౌజోన్స్ ఈ టెక్నికల్ ఎర్రర్ వలన పడిపోయినంత వరకు పడిపోవడం జరిగినది. ఈ సారి కూడా అదేవిధంగా చరిత్ర పునరావృతం అవుతుందా లేదా అనేది చూడాలి.  అంటే నిఫ్టీ తిరిగి 4880 స్థాయికి  తిరిగి చేరుతుందా ?  లేదా ? అనేది వేచి చూడాలి.  
ఇక ఈ వారం మార్కెట్  విషయానికి వస్తే 12-10-2012 నాడు ఇన్ఫోసిస్ రెండవ క్వార్టర్ రిజల్ట్స్ మరియు అదే రోజు iip డేటా కూడా ఉన్నాయి. వీటి అనంతరం ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఏవిధంగా ఉంటుందో చూడాలి.  మీకు ఇదివరకు చాలా సార్లు చెప్పడం  జరిగినది. మార్కెట్ లో ఏర్పాటు కాబడిన గ్యాప్స్ జాగ్రత్తగా గమనించాలి. ఈ గ్యాప్స్ సపోర్ట్ , రెసిస్టన్స్ గా మాత్రమే పనిచేయడం కాకుండా గ్యాప్ ఫిల్లింగ్ అనేది కూడా జరుగుతుంది. ఐతే శుక్రవారం జరిగిన పతనం ద్వారా ఈ ర్యాలీ లో నిఫ్టీ ఏర్పాటు చేసిన గ్యాప్ నింపబడినదా అంటే లేదు అని  నా సమాధానం.ఎందుకంటె బి ఎస్ ఈ  సెన్సెక్స్ లో శుక్రవారం ఎలాంటి  పతనం జరగలేదు. నార్మల్గానే ట్రేడింగ్ జరిగినది. అదే విధంగా నిఫ్టీ ప్యూచర్ శుక్రవారం కనిష్ట స్థాయి 5732  మాత్రమే.


మీరూ క్రింది నిఫ్టీ డేయిలీ చార్ట్ గాని గమనించినట్టు ఐతే 5740 వద్ద నిఫ్టీ కి రెసిస్టన్స్ వస్తున్న విషయం మీకు గత వారమే తెలియచేయడం జరిగినది. గత వారం నిఫ్టీ నిఫ్టీ డేయిలీ బేసిస్ మరియు వీక్లీ బెసేస్ గా రెసిస్టన్స్ ఐనటువంటి 5740 పైన క్లోజ్ కావడం జరిగినది. అంటే ఇప్పుడు ఈ రెసిస్టన్స్  సపోర్ట్ గా పనిచేస్తుంది.
క్రింది ఫోబోనస్సీ చార్ట్ పరిశీలించినట్టు ఐతే మీకు ఇదివరకే తెలియచేయడం జరిగినది.   నిఫ్టీ గోల్డెన్ రేషియో 61.8% ఐనటువంటి 5648వద్ద  సపోర్ట్ తీసుకోవడం మరియు  5638 వద్ద డబల్ బాటం ఏర్పాటు కావడంతో అక్కడి నుండి పైకి వెళ్ళడమే  జరిగినది. నిఫ్టీ  5740-5775 పైన నిలదోక్కుకుంటే 5850- 5900 వరకు సులభంగా చేరుకోగలదు. ఒకవేళ పతనం జరిగిన   5740 క్రింద 5640  వరకు మాత్రమే పతనం జరగడానికి అవకాశం కలదు.





 మీరూ  పైన  ఇచ్చిన వీక్లీ చార్ట్ ను ఒకసారి పరిశీలించండి. గత వారం లో మీకు చార్ట్ లో ట్రెండ్ లైన్ గీసి ఈ ట్రెండ్ లైన్ ప్రకారం నిఫ్టీకి రెసిస్టన్స్ 5815వద్ద రెసిస్టన్స్ రావడానికి అవకాశం ఉంది అని కూడా తెలియచేయడం జరిగినది. అదే విధంగా నిఫ్టీ  5815 వద్ద హై ఏర్పాటు కాబడి ట్రెండ్ లైన్ రెసిస్టన్స్ తో క్రిందికి పతనం కావడం జరిగినది. ఏది ఎమైనప్పటికి ఈ నేలాలో నిఫ్టీ 5500-5850 or 5900  మధ్యలో చలించడానికి అధిక అవకాశం కలదు. నిఫ్టీ లో ఏమైన మార్పులు చేర్పులు ఉంటే వెనతనే అప్డేట్ చేయగలం. లేదంటే ఈ వారం మొత్తానికి ఈ విలువలే ప్రామాణికం.
ముఖ్య గమనిక :మీరు  స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా ఒక పద్ధతి  ఎంచుకొని దానినే స్థిరంగా  మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్ మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ సాధ్యం అవుతుంది. రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్ స్కీమ్

మీ బ్యాంక్ అకౌంట్స్ ప్రాడ్స్ నుండి ఎలా కాపాడుకోవాలి.?


మీ బ్యాంక్  అకౌంట్స్  ప్రాడ్స్ నుండి ఎలా  కాపాడుకోవాలి.?
Crime patrol అనేది సోనీ టి వి లో ప్రసారమయ్యే పాపులర్ క్రైం షో . ఈ షో వాస్తవంగా జరిగిన  క్రైం వెనుక గల సంఘటనలను తెలియచేస్తుంది.ఇందులో ఇటివలే చెన్నయ్ లో జరిగిన e-fruad ప్రసారం చేయడం జరిగినది.ఈ వాస్తవ సంఘటన వెనుక ఉన్న అసలు విషయం మరియు దాని వలన మనం నేర్చుకోవలసినది ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం.
ప్రతీక్ష చెన్నయ్ కి చెందిన సాప్ట్ వేర్ ఇంజనీర్ . ఆమె గత ఏడు సంవత్సరాల నుండి TCS e-serve లో ప్రముఖ అంతర్జాతీయ బ్యాంక్ అయినటువంటి సిటి బ్యాంక్ కి చెందిన బ్యాక్ ఎండ్ ఆపరేషన్ చూసే విభాగంలో పని చేస్తుంది.  ప్రతీక్ష వివాహం కొన్ని నెలల క్రితమే జరిగినది. ఆమె భర్త కూడా   సాప్ట్ వేర్ ఇంజనీర్. ఆమె చిన్ననాటి స్నేహితుడు చాలా అత్యవసరమైన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండి ప్రతీక్షని ఏదైనా  నాన్ ఆపరేటివ్ అకౌంట్ లో నుండి డబ్బు దొందిలించవలసినదిగా  ప్రోత్సహించేవాడు. ప్రతీక్ష సంవత్సరం నుండి ఎలాంటి ఆపరేటివ్ లేని కొన్ని నాన్ ఆపరేటివ్ బ్యాంక్ అకౌంట్స్ గుర్తించి వాటి అకౌంట్ హాల్దర్ అడ్రస్ మార్పు చేసింది.అటుపిమ్మట బ్యాంక్ వారికి డెబిట్ , క్రెడిట్ కార్డ్ కోసం రిక్వెస్ట్ పంపించడం జరిగినది.బ్యాంక్ వారూ మార్పు చేసినటువంటి కొత్త అడ్రస్ కి డెబిట్ , క్రెడిట్ కార్డ్ పంపించడం జరిగినది.వాటిని ఆమె స్నేహితుడు తీసుకొని వాటి ద్వారా బ్యాంక్ అకౌంట్ నుండి నలబై తొమ్మిది లక్షలు డ్రా చేయడం జరిగినది.


ఒకానొక సమయంలో బ్యాంక్ అధికారులకు అనుమానం వచ్చి అకౌంట్ హాల్దార్ ను సంప్రదించడం  జరిగినది.అతను ఎలాంటి రిక్వెస్ట్ లు పంపించడం కాని, డబ్బు డ్రా చేయడం  కాని చేయలేదని తెలియచేయడం జరిగినది. బ్యాంక్ అధికారులు  TCS e-serve విభాగం వారికి ఫిర్యాదు చేయడం జరిగినది.వారూ వారి విచారణలో ప్రతీక్ష కంప్యుటర్ నుండి బ్యాంక్ డేటా మార్పు జరిగినట్టుగా గుర్తించారు. ప్రతీక్ష కూడా ఈ విషయం ఒప్పుకోవడం జరిగినది. ఆమె స్నేహితుడు ప్రస్తుతం పరారీలో ఉండటం జరిగినది.
 పై స్టోరీ నుండి ఏమి నేర్చుకోవాలో ఒక్కసారి తెలుసుకుందాం.

ఇక్కడ వారూ ప్రాడ్ చేయడానికి ఎన్నుకున్న అకౌంట్ ,నాన్ ఆపరేటివ్ అకౌంట్ అంటే కొంత కాలం నుండి ఎలాంటి లావాదేవీలు నిర్వహించడం లేనటువంటి అకౌంట్.సంవత్సరం కంటే  ఎక్కువకాలం మీరు మీ అకౌంట్ లో ఎలాంటి లావాదేవీలు నిర్వహించకపోతే దానిని నాన్ ఆపరేటివ్ అకౌంట్ . కొన్ని బ్యాంక్స్ సంవత్సర కాలాన్ని పరిగణలోకి తీసుకుంటే మరికొన్ని రెండు సంవత్సరాల కాలాన్ని పరిగణలోకి తీసుకుంటాయి.అందువలన మీ బ్యాంక్ అకౌంట్  ని ఎక్కువ కాలంఎలాంటి లావాదేవీలు నిర్వహించకుండా ఉంచకండి.ఆ విధంగా ఉంచడం వలన మీ అకౌంట్ ని ఇలాంటి ప్రాడ్స్ కోసం ఎన్నుకోవడానికి అధిక అవకాశం ఉంటుంది.మీ అకౌంట్ నాన్ ఆపరేటివ్ అకౌంట్ గా మారడానికి ఎక్కువగా మీకు సమయం లేకపోవడం, లేదంటే అకౌంట్ లో ఉన్న డబ్బూ పై వడ్డీ వస్తుంది అని ఆశించడం ఏదైనా కావచ్చు.ఒకవేళ మీకు వడ్డీ కావలి అనున్కుంటే బ్యాంక్ అకౌంట్ లో ఉంచే బదులు ఫిక్సుడ్ డిపాజిట్  చేయడం చాలా మంచిది.ఒకవేళ మీ అకౌంట్ ఆపరేటివ్ అకౌంట్ అయినా కూడా తరచుగా మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్ మెంట్ చెక్ చేసుకోవడం మంచిది.
మీరు మీ డబ్బూ బ్యాంక్ అకౌంట్ లో ఉంచడం కన్నాఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది.పైన చెప్పినట్టుగా నలభై తొమ్మిది లక్షలు నాన్ ఆపరేటివ్ అకౌంట్ లో ఉంచుకోవడం కంటే బుడి తక్కువ పని మరొకటిలేదు కదా ? బ్యాంక్ అకౌంట్ లో ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ ఫండ్ కంటే ఎక్కువగా డబ్బూ మీ బ్యాంక్ అకౌంట్ లో ఉంచకూడదు.బ్యాంక్ అకౌంట్ లో ఈ డబ్బూ ఉంచడం వలన మీరూ మీ డబ్బూ ఇన్వెస్ట్ చేయడానికి గల చాలా అవకాశాలను కోల్పోతుంది.
సాదారణంగా బ్యాంక్స్ వారి వద్ద నుండి హోం లోన్స్, క్రెడిట్ కార్డ్స్, కార్ లోన్స్, పర్సనల్ లోన్స్ కోసం మాతరం చాలా ఫోన్స్ వస్తాయి. కాని ఏ బ్యాంక్ వారూ కూడా మీ అకౌంట్ నా ఆపరేటివ్ అకౌంట్ గా మారుతుంది అని మాత్రం తెలియచేయారు. ఈ విషయంలో బ్యాంక్ వారూ కాస్త శ్రద్ద చూపిస్తే ఇలాంటి ప్రాడ్స్ జరగకుండా చూసుకోవచ్చు.
ఇలాంటి ప్రాడ్స్ ఎక్కువగా సెక్యూరిటీ  ఉల్లంఘన వలెనే అధికంగా జరుగుతాయి. చాలా బ్యాంక్స్ కూడా వారి  బ్యాక్ ఎండ్ ఆపరేషన్ కోసం థర్డ్ పార్టీ ని నియమించుకోవడం లేదా వారి సాప్ట్ వేర్ వాడటం చేస్తుంటాయి.కస్టమర్ యొక్క సున్నితమైన డేటా విషయంలో బ్యాంక్స్ వారూ అధిక శ్రద్ద  తీసుకోవడం మంచిది.బ్యాంక్స్ ఒకటికి రెండు సార్లు ఇలాంటి విషయాలు జరగకుండా రక్షణ చర్యలు లేదా బయోమెట్రిక్ రక్షణ చర్యలు చేపట్టడం మంచిది. కస్టమర్స్ కష్టపడి సంపాదించిన వారి సొమ్మూ బ్యాంక్ లో అయితే భద్రంగా ఉంటుంది అనే నమ్మకంతో మాత్రమే బ్యాంక్స వద్దకు వస్తున్నారు. ఇలాంటి సంఘటన వలన బ్యాంక్స్ పై కూడా నమ్మకం సడలే  అవకాశం కూడా కలదు.

బంగారం ఎక్కడి నుండి ఎంత వస్తుంది? ఎక్కడికి ఎంత వెళ్తుందో ఒక్కసారి చూద్దాం?



బంగారం ఎక్కడి నుండి ఎంత వస్తుంది? ఎక్కడికి ఎంత వెళ్తుందో ఒక్కసారి చూద్దాం?
మీకు క్రింద ఇవ్వబడిన బంగారు ట్రీ లో బంగారం ఎక్కడి నుండి ఎంత వస్తుంది ? ఎక్కడికి ఎంత వెళ్తుందో వివరంగా చిత్రంలో చూపబడినది.

బంగారం గురించి బంగారం లాంటి నిజాలు.


బంగారం గురించి బంగారం లాంటి నిజాలు.
క్రింద ఇవ్వబడిన చిత్రంలో బంగారం గురుంచి బంగారం లాంటి నిజాలు ఉన్నాయి . అవి ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం.ఇప్పటివరకు బంగారు మైన్స్ నుండి  వెలికితీసిన బంగారం ఎంతో తెలుసా ?  167,000 టన్నులు అంటే సుమారు 120 షిప్పింగ్ కంటెయినర్స్ లలో నింపడానికి సరిపోతుంది. ఈ బంగారం బరువు మొత్తం కలిపి ఈఫిల్ టవర్ బరువుకంటే 16.5 రేట్లు అధికంగా బరువు ఉంటుంది.ప్రపంచంలో అత్యంత పెద్దది ఐనటువంటి సూపర్ ట్యాంకర్ ఈ బంగారం కంటే మూడూ రెట్ల అధిక బరువును మోస్తుంది.ఈ బంగారం యొక్క ప్రస్తుత మార్కెట్  విలువ అమెరికా డాలర్లలో 8 ట్రిలియన్లు అంటే 8,000,000,000,000,అమెరికా డాలర్లు.అంటే ఇది అమెరికాకి గల అప్పులలో సగానికి సమానం.మన రూపాయలలోఅయితే 416,000,000,000,000 లకి సమానం. ఈ బంగారంతో బంగారు ఆకులూ తయారు చేస్తే వాటితో స్విట్జర్లాండు మొత్తం పరచవచ్చు లేదంటే  న్యూజెర్సీ  కంటే రెండు రేట్లు అధిక ప్రదేశంపై పరచవచ్చు.కేవలం 60 టన్నుల బంగారంతో తీగ తయారు చేస్తే ఆ తీగ భూమి నుండి సూర్యుడికి గల దూరాన్ని కొలవడానికి సరిపోతుంది. ప్రతి సంవత్సరం 1960 టన్నుల  బంగారం జ్వెల్లరీ కొరకు    1640 టన్నుల  బంగారం ఇన్వెస్ట్మెంట్ కొరకు    460 టన్నుల  బంగారం టెక్నాలజీ కొరకు వాడుచున్నారు. 

బంగారం ధర పెరుగుదల పై అపోహలు.


 బంగారం ధర పెరుగుదల పై అపోహలు.
మనదేశంలో బంగారం ధర పెరుగుదలపై అనేక అపోహలు ఉన్నాయి.అవిఎమిటో ఒక్కసారి చూద్దాం.
దీపావళి పండుగ దగ్గరలో ఉంది కాబట్టి ప్రజలూ అధిక బంగారం కనుగోలు చేస్తారు కావున బంగారం ధర పెరగడానికి అవకాశం ఉంది.
పెళ్ళిళ్ళ సీజన్ ప్రారంభం కాబోతుంది . కాబట్టి   బంగారం ధర పెరగడానికి అవకాశం ఉంది.
దీపావళి అనంతరం బంగారం ధరలు పడిపోతాయి . ఎందుకంటే  డిమాండ్ తగ్గిపోతుంది కాబట్టి.
బంగారం ధర పైకే వెళ్ళుతుంది. ఎందుకంటె భారతీయులు బంగారం అధిక కనుగోలు చేస్తారు కావున .
ఇప్పుడు బంగారం పది గ్రాములకు ముప్పైవేలు ఉంది కాబట్టి ప్రజలూ కొనడం మానేస్తారు . అందువలన బంగారం ధరలు పడిపోతాయి.
అక్షయ తృతీయ వస్తుంది కావున , బంగారం అధికంగా కనుగోలు  చేస్తారు కావున బంగారం ధర పెరుగుతుంది.

వాస్తవం 
పైన పేర్కొన్నవన్ని కేవలం అపోహలు మాత్రమే. పైనవన్ని కలిపి కూడా బంగారం ధరపై కేవలం  ఒక్క శాతం మాత్రమే ప్రభావం చూపగలవు.బంగారం ధర సాదారణంగా అమెరికా మానీటరీ పాలసీ కి అనుగుణంగా పెరగడం , తగ్గడం జరుగుతుంది. మనదేశంలో బంగారం ధరను  రూపాయి బలహీనపడటం, బలపడటం కూడా ప్రభావితం చేస్తుంది.   

మీరు లేదా మీ పిల్లలు జీవితంలో ఆర్ధికంగా ఎదిగి మిలియనీర్లు , బిలియనీర్లు కావాలి అంటే తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆర్ధిక విషయాలు part -3


మీరు లేదా మీ పిల్లలు జీవితంలో ఆర్ధికంగా ఎదిగి మిలియనీర్లు , బిలియనీర్లు కావాలి అంటే తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆర్ధిక విషయాలు part -3
మిలియనీర్లు, బిలియనీర్లు  ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్  గురుంచి అధికంగా ఆలోచిస్తారు.వారూ ఎప్పుడైనా  కొత్త  బిజినెస్ ప్రారంభించడం లేదా వారి డబ్బూ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ సాధనంలో  ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు  ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్  ఏ విభాగం లో ఐతే వారూ పెట్టిన డబ్బూ అధిక రాబడి ఇస్తుందో,  అని ఆలోచిస్తారు.  కాని మధ్యతరగతి వారి దగ్గరికి వచ్చేసరికి  ఇలాంటి ఆలోచన ఏ మాత్రం ఉండదు. మీరు లేదా మీ పిల్లలు  జీవితంలో మిలియనీర్లు లేదా బిలియనీర్లుగా ఎదగాలి అంటే తప్పనిసరిగా ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్  గురించి తప్పనిసరిగా ఆలోచించాలి.కనీసం ఇప్పటినుండైనా   ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్  గురించి తెలుసుకోవడం చేయండి. అదే ధనవంతుల విషయానికి వచ్చే సరికి వారి పిల్లలకు చిన్నప్పటి  నుండే తెలియచేయడం వలన వారూ పెరిగి పెద్దయ్యాక ఆర్ధిక విషయాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు.మధ్యతరగతి వారూ  ఆర్ధికంగా ఎదగపోవడానికి ముఖ్య కారణం ఈ ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్  అవగాహన లేకపోవడమే. వారికి అవగాహన లేకపోవడంతో వారూ కూడా ,వారి పిల్లలకు ఏ విధమైన  ఆర్ధిక పరమైన  విషయాలను పంచలేకపోతున్నారు. అదే ధనవంతుల పిల్లలు ఎప్పుడూ  ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్  గురుంచి ఆలోచిస్తుంటారు. ధనవంతులైన , ధనవంతులు కావాలి అనుకుంటున్నవారూ ఎవరైనా సరే తప్పకుండా   ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్  గురుంచి తెలుసుకోవాలి.
దురదృష్టావశాత్తూ మన స్కూల్స్ లేదా కాలేజీలు ఈ  ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్  పై ఎలాంటి భోధన చేయడం లేదు. స్కూల్స్ లేదా కాలేజీలు అనేవి కేవలం ఎంప్లాయిస్ లేదా సెల్ఫ్  ఎంప్లాయిస్ లను తయారు చేసే విధంగా మాత్రమే రూపకల్పన చేయబడ్డాయి.వీరూ ధనవంతుల యొక్క వ్యాపారాలను నడుపుటకు ఉపయోగపడతారు. ఒకవేళ  స్కూల్స్ లేదా కాలేజీలు ప్రతి ఒక్కరికి  ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్ బేసిక్స్ నేర్పించినట్టు ఐతే ధనవంతుల యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని బానిసలాగా కస్టపడి ముందుకు నడిపించేవారూ ఎవ్వరూ? అందువలనే ఈ   ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్ గురించి  స్కూల్స్ లేదా కాలేజీలలో నేర్పించరు. ఆ పదాన్ని మన ఉద్దేశ పూర్వకంగానే తొలగించడం జరిగినది.కొన్ని శతాబ్దాల క్రితమే ధనవంతులకు తెలుసు ఆర్ధికంగా ఎదగాలి అంటే ముందుగా  ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్ గురుంచి తెలుసుకోవాలి అనే విషయం.
మీరు జీవితంలో మిలియనీర్లు, బిలియనీర్లు కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి.  ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్  అనేది మీరు  మిలియనీర్లు, బిలియనీర్ల క్లబ్ లోకి ప్రవేశించే ప్రవేశ ద్వారం వంటిది.చాలా మంది ఆర్ధిక సలహాదారులు మీరు ఈ మ్యుచవల్ ఫండ్స్ పథకం లేదా ఫలానా షేర్లలో ఇన్వెస్ట్ చేయండి అని సలహా ఇస్తుంటారు తప్పితే ముందుగా మీ ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్ గురుంచి ఆలోచించండి అని కాని , మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ మీ    ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ ప్రకారం మీకు అనుకూలంగా ఉంటుందా లేదా అని ఆలోచించమని మాత్రం చెప్పరు.ప్రతి పెట్టుబడి మిమ్ములను ధనవంతులను చేయాలని లేదా ప్రతి పెట్టుబడి సాధనం ధనవంతులను చేయగలిగే సామర్ధ్యం కలిగి ఉంటుంది అని అనుకోవడానికి ఎంత మాత్రం వీలు లేదు.మీరు   ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్ గురుంచి తెలుసుకోకుండా   ఫైనాన్షియల్ పొడక్ట్ కొనడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. అదే ధనవంతులూ మాతరం వారూ వారి జీవితంలో చేసే ప్రతి ఇన్వెస్ట్మెంట్ ముందు తప్పనిసరిగా  ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్ గురించి తెలుసుకున్నతర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వయూ పెట్టె పెట్టుబడులు ఎప్పుడు మంచి రాబడిని మాత్రమే అందిస్తాయి.