గోల్డ్ మరియు సిల్వర్ లలో దేనిలో పెట్టుబడి పెడితే
అధిక రాబడి ఉంటుంది.
2012 లో
అధిక రాబడి అందించిన ఇన్వెస్ట్మెంట్ సాధనం ఏమిటో చెప్పగలరా ? ఆలోచిస్తున్నారా
? బంగారం , షేర్ మార్కెట్ లేదా రియల్
ఎస్టేట్ అని అనుకుంటున్నారా ? ఎంత మాత్రం
కాదు. 2012 లో
అధిక రాబడి వచ్చినది సిల్వర్ లో మాత్రమే .సిల్వర్
ఇప్పటి వరకు 2012 లో 25.61% CAGR రిటర్న్
అందివ్వడం జరిగినది.1 jan 2012 రోజు సిల్వర్ రేటు రూ 51043 kg ఉంటే ఇప్పుడు 20 sep 2012రోజు రూ 64116kg రేటుకి పెరగడం జరిగినది.అంటే కేవలం 9 నెలలలో నమ్మశక్యం కాని విధంగా 25.61% రాబడి ఇవ్వడం
జరిగినది. సిల్వర్ లో తొమ్మిది నెలల రాబడి చూసి మోసపోకండి పూర్తీగా చదవండి. సిల్వర్
లో స్మవత్సరం వారీగా రాబడి చూసుకుంటే
రాబడి సున్నా మాత్రమే. గత సంవత్సరం sep 2011 లో కూడా సిల్వర్ ధర 64353 kg ఉండటం జరిగినది.
బంగారం పరిశీలిస్తే
2012 లో 16.63% CAGR రిటర్న్ అందివ్వడం జరిగినది. 1 jan 2012 నాడు రూ 27322 - 10gm ఉంటే
20
sep 2012రోజున 31865-10gm ధర
ఉండటం జరిగినది.అంటే కేవలం తొమ్మిది నెలలలో 16.63% రాబడి
అందించడం జరిగినది.
ఇన్వెస్టర్లలో
బంగారం లో ఇన్వెస్ట్ చేయడమా ? లేక సిల్వర్ లో చేయడం మంచిదా ? దేనిలో రాబడి అధికంగా ఉంటుంది అని
సందేహం ఎప్పటి నుండో ఉంది . ఒకసారి మనం ఈ
అనుమానం తీర్చుకొనే ప్రయత్నం చేద్దాం.
మన దేశంలో
బంగారం పై మక్కువ ప్రతి ఒక్కరికి ఉంది .ఇక స్త్రీలకయితే చెప్పవలసిన పని లేదు.
ప్రతి శుభ సమయంలో స్త్రీలు ధరించేది అధికంగా బంగారు ఆభరణాలనే .అదే సిల్వర్
దగ్గరికి వచ్చేసరికి కొద్ది మందికి మాత్రమే
ఇష్టం ఉంటుంది. అది కూడా ఎవరికి అయితే బంగారం ధర భరించడం కష్టంగా ఉంటుందో
వారికి. ఇన్వెస్ట్మెంట్ దగ్గరికి వచ్చే సరికి సిల్వర్ . ప్లాటినం కంటే బంగారం లో
మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి అధికంగా ఇష్టపడతాం.అందువలనే బంగారం ఎక్కువగా
వార్తలలో ఉంటుంది.
చరిత్రని బట్టి
చూస్తే బంగారంలో రాబడి గత దశాబ్దం నుండి స్థిరంగా ఉంది.కాని బంగారంతో పోలిస్తే
సిల్వర్ లో రాబడి నమ్మశక్యంగాని విధంగా ఉంది. 2009 లో బంగారం 19.3% రాబడి అందిస్తే సిల్వర్ 42.4 % ,2010 లో బంగారం 22.3% రాబడి అందిస్తే సిల్వర్ 70.60% అందించినది..క్రింద పట్టికలో గత
దశాబ్దకాలంలో బంగారం మరియు సిల్వర్
అందించిన రాబడి వివరాలు ఉన్నాయి.
పై పట్టికను
చూసి దేనిలో ఇన్వెస్ట్ చేయాలో తెలియక తికమక పడుతున్నారా ? బంగారం తో పోలిస్తే సిల్వర్
అధికంగా రాబడిని అందించినది వాస్తవమే అయినా బంగారం స్థిరంగా రాబడి అందించినది. అదే సిల్వర్
లో అధికంగా ఒడిదుడుకులు ఉన్నాయి. సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే అధిక రిస్కు తీసుకొనే వారికి మాత్రమే సూట్ అవుతుంది. సిల్వర్లో అధికంగా స్పెక్యులేషన్ జరుగుతుంది. అంతే
కాకుండా సిల్వర్ యొక్క ధరను అంచానా వేయడం కూడా చాలా కష్టం అవుతుంది. అదే బంగారం ధరలో మార్పు స్థిరంగా ఉంటుంది అది కూడా
పెరగడమే . ధర పడిపోయిన తక్కువ శాతం
మాత్రమే పడిపోతుంది. అంతే కాకుండా ఇన్ఫ్లేషన్ తట్టుకొనే శక్తి బంగారం కి
మాత్రమే ఉంది. అందువలన ఇన్వెస్ట్మెంట్
కొరకు బంగారం లేక సిల్వర్ అనే ఆలోచన
వచ్చినప్పుడు బంగారానికి మీ ఓటు
వేయండి. సిల్వర్ అధికంగా రిస్కు తీసుకొనే
వారికి మాత్రమే పనికి వస్తుంది.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.