స్టాక్ మార్కెట్
లో బుల్ రన్ ప్రారంభమైనట్టేనా ?
బుల్ మార్కెటులో
సాదారణంగా ప్రతి గుడ్ న్యూస్ మార్కెట్ పెరగడానికి తోడ్పాటు అందిస్తే , ప్రతి బ్యాడ్ న్యూస్ మార్కెట్ లో చిన్న చిన్న
కరేక్షన్స్ రావడానికి సహాయపడతాయి. మమతాబెనర్జీ
UPA ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించినప్పుడు
నిఫ్టీ లో 50 పాయింట్ల కరెక్షన్ వస్తే , ఎప్పుడయితే మూలాయం
సింగ్ యాదవ్ UPA ప్రభుత్వానికి
మద్దతు తెలియచేయడంతో నిఫ్టీ 2012 లోనే అత్యధిక
పాయింట్ల ర్యాలీ చేయడం జరిగినది. కేవలం పన్నెండు రోజుల ట్రేడింగ్ సెషన్స్ లో 502 పాయింట్ల
ర్యాలీ నిఫ్టీ లో జరిగినది. అంతే కాకుండా
మార్కెట్ 14 నెలల గరిష్ట స్థాయిల వద్ద ఉంది. దీనికి ముఖ్య కారణం UPA ప్రభుత్వం సంస్కరణల
బాట పట్టడంతో మార్కట్ సానుకూలంగా స్పందిస్తుంది. అంత మాత్రాన దేశ ఆర్ధిక వ్యవస్థ
బాగున్నట్టు కాదు. ఇంకా ఇన్ఫ్లేషన్ అధిక స్థాయిల వద్దనే ఉంది. యూరోప్ మరియు
అమెరికా ఆర్ధిక వ్యవస్థ ఇంకా ప్రశ్నార్థకంగానే
ఉంది. అక్కడి నుండి వచ్చే ఎలాంటి నెగిటివ్ న్యూస్ అయిన మార్కెట్ పై తప్పకుండా
ప్రభావం చూపెడతాయి. నిఫ్టీ ప్రస్తుత ర్యాలీ మరియు వీక్లీ క్లోజ్ ను బట్టి చూస్తే
ర్యాలీ మరింత కొనసాగి బుల్ రన్ లో ప్రవేశించవచ్చు. ఒకవేళ బుల్ రన్ నిర్ధారణ
జరిగినట్టు ఐతే తెలియచేస్తాం. ఎవరైనా సరే
మార్కెట్ లో ఎప్పుడూ కూడా మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా వెళ్ళాలి. అంతే కాని
ట్రెండ్ కి వ్యతిరేక దిశలో వెళ్తే మీ కాపిటల్ మొత్తం నష్టపోతారు. అప్పుడు మీరు ఏమి
చేయలేరు.గత పక్షం రోజుల నుండి ఎవ్వరయితే ట్రెండ్ కి వ్యతిరేకంగా వెళ్ళారో వారూ అధికంగా
నష్టపోవడం జరిగినది. మేము మాత్రం
ఖచ్చితమైన అనాలసిస్ తో మార్కెట్ ర్యాలీ
అంచనా వేయడం జరిగినది. మీకు ఏ విధమైన అనుమానాలు ఉన్న పాత పోస్టులు ఒక్కసారి
చదవండి.
మీకు గత వారం నుండి తెలియచేయడం జరిగినది. నిఫ్టీ
5648 పైన నిలదోక్కుకున్నట్టు ఐతే ర్యాలీ వస్తుంది
అని తెలియచేయడం జరిగినది.అనుకున్నట్టుగానే 5648 పైన
నిఫ్టీ నిమిషాల వ్యవధి లోనే 5720 వరకు చేరుకోవడం
జరిగినది.
ఇక ఈ వారానికి
వస్తే ఇక్కడి నుండి కనీసం ఇంకా నిఫ్టీ 150-200 పాయింట్ల వరకు ర్యాలీ జరగడానికి అవకాశం
కలదు. నిఫ్టీ 5700, 5648 పైన
ఉన్నంత వరకు లాంగ్ పొజిషన్స్ కి
ఎలాంటి ఇబ్బంది లేదు. నిఫ్టీ కి రెసిస్టన్స్
5750, 5810, 5850, 5958 ,
సపోర్ట్ 5648 , 5580 , వద్ద కలదు. ఈ వారంలో డేరివేటివ్స్ ఎక్స్
ఫైరీ ఉన్నందున జాగ్రత్త వహించడం
మంచిది. స్టాక్ మార్కెట్ లో మీరు
సక్సెస్ కావాలి అంటే స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ లో అవగాహన తప్పనిసరి. ఈ
మధ్య చాలా మంది ప్రతి రోజు మార్కెట్ అప్ డేట్స్ ఇవవంది. ఫ్రీ టిప్స్ ఇవ్వండి అని
అడగడం జరుగుతుంది. మేము ప్రతి సోమవారం
తెలియచేసే నిఫ్టీ అనాలసిస్ ఆ వారానికి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఏమైనా
మార్పులు , చేర్పులు ఉంటే తప్పకుండా తెలియచేస్తాం. ఇక ఫ్రీ టిప్స్ అడిగేవారికి
మాది ఒక్కటే మనవి. మా ప్రయత్నం అంత టిప్స్ కోసం మీరు ఇతరుల పై ఆధారపడకుండా స్వయంగా మార్కెట్ పై పూర్తీ అవగాహాన పెంచుకొని మీ కాళ్ళపై మీరు
మార్కెట్ లో నిలబడాలి అని. మీము ప్రీ టిప్స్ కి పూర్తీ గా వ్యతిరేకం . మీరు
మార్కెట్ గురుంచి నేర్చుకొనే సమయంలో ఏమైనా అనుమానాలు ఉంటే వాటిని నిసందేహంగా
తీరుస్తాం. అంతే కాని మా వద్ద నుండి ఫ్రీ
టిప్స్ మాత్రం ఆశించకండి. ఈ బ్లాగ్
ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు మార్కెట్ పై మా విశ్లేషణ , నిఫ్టీ అనాలసిస్
ఇంత వరకు తప్పలేదు అనే విషయం మీరు రెగ్యులర్ గా మా బ్లాగ్ చదివితే మీకే ఈ పాటికి అర్ధం అయ్యి ఉంటుంది.
ముఖ్య గమనిక :మీరు స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా
ఒక పద్ధతి ఎంచుకొని దానినే స్థిరంగా మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు
డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్
మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే
ఎర్నింగ్ సాధ్యం అవుతుంది.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.