స్టాక్ మార్కెట్
ఇంకా ఎంత వరకు పరిగెత్తగలదు.
ఈవారం స్టాక్ మార్కెట్17-09-2012to21-09-2012
గత వారం ఫెడరల్ బ్యాంక్ , ఈసిబి మీటింగ్ , జర్మనీ కోర్టు తీర్పు మరియు కేంద్ర
ప్రభుత్వం సంస్కరణలకు తెరదీస్తూ
డీజిల్ ధరలు పెంచడం మొదలగు కారణాల
వలన మార్కెట్ లో ర్యాలీ రావడం జరిగినది.అదే విధంగా శుక్రవారం సాయంత్రం విదేశీ నిధులను రిటైల్ రంగంలోకి అనువదిస్తూ
ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వలన మార్కెట్
ఈ రోజు కూడా గ్యాప్ అప్ లోనే ప్రారంభం జరుగును.
అదే విధంగా ఈ రోజు రిజర్వు బ్యాంక్
తన పరపతి సమీక్షలో వడ్డీ రేట్లు కనుక తగ్గిస్తే ప్రస్తుతం కొనసాగుతున్న ర్యాలీకి
మరింత సానుకూల అవకాశం దొరికినట్టు అవుతుంది.ఒకవేళ రిజర్వు
బ్యాంక్ తన పరపతి సమీక్షలో కనుక ప్రతికూల నిర్ణయం తీసుకుంటే మాత్రం పై లెవల్లో
లాభాల స్వీకరణకు అవకాశం కలదు. సానుకూల నిర్ణయం వేలువడటానికే అధిక అవకాశం మాత్రం కలదు. మీరు కనుక
రెగ్యులర్ గా ఈ బ్లాగ్ ఫాలో అవుతున్నట్టు ఐతే మీకు ఇదివరకే చాలా సార్లు
చార్ట్స్ ద్వారా తెలియచేయడం జరిగినది.
నిఫ్టీ 5190-5200 కంటే
క్రిందికి దిగాజారనంత వరకు మీ లాంగ్ పోజిషన్
కు ఎలాంటి ఇబ్బంది లేదు , 5190-5200 స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్స్ కొనసాగించవచ్చు అని తెలియచేయడం జరిగినది. అదే విధంగా నిఫ్టీ
లాంగ్ సైడ్ టార్గెట్ 5520 అని కూడా మీకు తెలియచేయడం జరిగినది. ఇంకా
వివరాల కోసం గత పోస్టులను చదవవచ్చు. అదే
విధంగా ఇప్పుడు మార్కెట్ కి అనుకూలమైన వార్తలు వెలువడుతున్నందున మార్కెట్ ఇంకా ఎంత వరకు పరిగెత్తగలదు అని చాలా మంది
అడుగుతున్నారు. మీకు మార్కెట్ లో నిఫ్టీ
తక్షణ ర్యాలీ 5648 వరకు
చేరుకోగలదు.ఇది ఫిబోనస్సీ గోల్డెన్ రేషియో . ఒకవేళ నిఫ్టీ
5648 పైన నిలదోక్కుకున్నట్టు ఐతే ర్యాలీ 5850 ,5910, 5950 వరకు కూడా కొనసాగగలదు.. నిఫ్టీ 5435 పైన ఉన్నంత వరకు
ఈ ర్యాలీ కొనసాగడానికి అధిక అవకాశం కలదు. ఏది ఎమైనప్పటికి నిఫ్టీ ఇంకా కనీసం
రెండు వందల పాయింట్లు ర్యాలీ జరపడానికి అవకాశం మాత్రం కలదు. అయినప్పటికీ మీ
లాంగ్ పొజిషన్స్ కి 5435 స్టాప్ లాస్
ఉపయోగించండి. ఒకవేళ ఏమైన మార్పులు చేర్పులు ఉంటే మీకు
వెంటవెంటనే తెలియచేయడం జరుగుతుంది.
ముఖ్య గమనిక :మీరు స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా
ఒక పద్ధతి ఎంచుకొని దానినే స్థిరంగా మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు
డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్
మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే
ఎర్నింగ్ సాధ్యం అవుతుంది. http://telugufinancialschool.blogspot.in/2012_09_01_archive.html
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.