భారతీయులు
ధనవంతులా లేక పేదవారా ?
ఎవరూ చెప్పారూ మీకు భారతదేశం పేద దేశం అని. భారత
దేశం అభివృద్ధి చెందుతున్న దేశం.భారతదేశంలో
అత్యధికులు పేదవారే అనడంలో కూడా ఎటువంటి
సందేహం లేదు. అంత మాత్రాన
భారతీయులలో ధనవంతులే లేరు అంటారా? ప్రతి సంవత్సరం ఫోర్బ్స్ జాబితా
పరిశీలించండి.ప్రతిసారి కనీసం ఇరవై మంది
పైననే బిలియనీర్లు ఈ జాబితాలో ఉంటారు.ఈ
జాబితాలో ఉన్న వాళ్ళు బిలియనీర్లు ఐనంతా మాత్రానా భారతదేశం ధనిక దేశం అవుతుందా ?
దేశంలో బిలియన్ పైన జనాభా ఉంది. మరి
వారందరి పరిస్తితి ఏమిటి.? అది సరే ఇప్పుడు ఒక్క విషయం తెలుసుకోండి. భారతదేశం
బంగారం వినియోగంలో ప్రపంచంలో ముందుంటుంది అనే విషయం మీ అందరికి తెలుసు .భారాతీయులు
ప్రతి సంవత్సరం కొన్ని టన్నులకొద్దీ బంగారం కనుగోలు చేస్తారు..భారతీయుల వద్ద కనీసం
20,000టన్నుల బంగారం ఉంది అని ఒక అంచనా
.దానిలో 95% బంగారం ప్రజల వద్దనే ఉంది. భారత ప్రభుత్వం వద్ద
కేవలం 5% మాత్రమే
ఉంది.అదే అమెరికా లాంటి దేశంలో ఐతే ప్రజలవద్ద 5% ఉంటే
ప్రభుత్వం వద్ద 95% బంగారం ఉంటుంది.భారతీయులకు కొన్ని వందల
సంవత్సరాల నుండి బంగారం చాల విలువైన లోహం
అని తెలుసు. అందువలనే భారతీయులు బంగారం అధికంగా కూడబెడతారు. ఒకవేళ భారత దేశ
ప్రజలందరి వద్ద ఉన్న 95% బంగారం ను అమ్మివేస్తె అమెరికా దేశంలో గల
న్యూయార్క్ లాంటి నగరానికంటే మూడు
,నాలుగింతల పెద్దదైన నగరాన్ని కనుగోలు చేయవచ్చు. ఇప్పుడు చెప్పండి
భారతదేశం పేదదేశమా ?భారతీయులలో చాలా మంది దారిద్ర్యరేఖ కంటే క్రింద ఉన్నారూ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంత
మాత్రానా భారతీయులు అందరూ పేదవారూ మాత్రం కాదు. దానికి ముఖ్య కారణం మన వారికి
బంగారం పై ఉన్న మక్కువే.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.