దేశంలో సంపద ఎలా స్ప్రుస్టించబడుతున్నదో తెలుసుకోండి ?


దేశంలో సంపద ఎలా స్ప్రుస్టించబడుతున్నదో తెలుసుకోండి ?
ఈ ఆర్టికల్ సంపద ఎలా స్ప్రుస్టించబడుతుందో తెలియచేస్తుంది.సంపద స్ప్రుస్టించడం  అంటే అంటే కొత్తగా సంపదని ఉత్పత్తి చేయడం అంటే ప్రభుత్వం ఏ విధంగా డబ్బూ ముద్రిస్తుందో అదే విధంగా  చేయడం.మీరూ అడగవచ్చు ఇది ఏ విధంగా సాధ్యం అవుతుంది అని? సంపద ఏ విధంగా స్ప్రుస్టించడం సాధ్యం అవుతుంది అని?. దానికి ఒకే ఒక సమాధానం మీరూ ఏదైనా కంపెనీ స్థాపించి దానిని  పబ్లిక్ వద్దకు తీసుకవేల్లడం అంటే IPOకి వెళ్లడం వలన సంపద నూతనంగా  క్రియేట్ చేయడం జరుగుతుంది.ఏ విధంగా జరుగుతుందో ఒక ఉదాహరణ ద్వారా పరిశీలిద్దాం.

ఉదాహరణకు మీరూ ఒక కంపెనీనీ స్థాపించి దానిని రిజిస్టర్ చేసారు అనుకుందాం.మీకాపిటల్  రూ 1,00,000
(1 lac ) ఐతే దానిని 10,000 సమాన భాగాలుగా విభజిస్తే ఒక్కో వాటా విలువ రూ 10 అవుతుంది.అంటే రూ రూ 10 face valueగల  10,000 వాటాలు మీకంపెనీలో ఉన్నాయి. అవన్నీ కూడా మీవాటాలే. మీరూ మీ బిజినెస్ ను సమర్ధవంతగా నిర్వహించడంతో మీకంపెనీ 10-15 సంవత్సరాలలో మంచి వృద్ధిలోకి రావడంతో మీకంపెనీ విలువ రూ 10  కోట్లకు చేరుకుంది అని అనుకుందాం. ఇప్పుడు మీకంపెనీ నెట్ వర్త్ రూ10 కోట్లు కాబట్టి మీవద్ద  రూ 10 face valueగల 1 croreవాటాలు లేదా షేర్లు మీ వద్ద ఉంటాయి. ఎందుకంటె మీనెట్ వర్త్  రూ10కోట్లను  10 face value తో భాగించగా మీ వద్ద ఎన్ని వాటాలు ఉన్నాయో తెలుస్తుంది.  
అంటే మీ కంపెనీ   రూ 10 face valueగల 1 crore వాటాలతో లేదా షేర్లతో రూ 10 కోట్ల నెట్ వర్త్ కలిగి ఉన్నది. Sebiనియమనిబందనల ప్రకారం ఇప్పుడు మీరూ మీ కంపెనీని ప్రజల వద్దకు తీసుకవెళ్ళే అవకాశం కలదు.ఇప్పుడు మీరూ మీ కంపెనీలోగల మీ షేర్లనుండి 10% వాటాను ప్రజలకు IPO ద్వారా రూ  100 చొప్పున అమ్మడం ద్వారా , మీ కంపెనీలోకి కొత్త వాటా దారులను షేర్లు అమ్మడం ద్వారా తీసుకోవడంతో పాటు ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో మీ షేరు ధర రూ100 పలుకుతుంది. మీ వద్ద గల రూ 10 face valueగల 1 crore షేర్లలో   10% వాటాను  అంటే పది లక్షల షేర్లను ప్రజలకు అమ్మారు. ఇంకా మీ వద్ద 90%  వాటాలు మీ వద్దనే ఉన్నాయి. అంతే కాకుండా రూ రూ 10 face valueగలమీ కంపెనీ షేర్ స్టాక్ మార్కట్ లో రూ  100  వద్ద ట్రేడ్ కావడం కూడా జరుగుతుంది.సరే ఇంతకు ముందు మీరూ  10% వాటాను అమ్మకముందు   మీ కంపెనీ నెట్ వర్త్ రూ10కోట్ల ఉంది కాదా ? ఇప్పుడు మీ వాటా అమ్మిన తర్వాత మీ కంపెనీ నెట్ వర్త్  ఎంత ఉందో తెలుసుకుందాం.స్టాక్ మార్కెట్ లో మీ కంపెనీ షేర్ రూ   100 వద్ద ట్రేడ్ కావడం జరుగుతుంది కావున మీఒక్కో వాటా విలువ రూ100గా పరిగణించవలసి ఉంటుంది. కావున మీకంపెనీ మొత్తం 1crore వాటాలు కావున మీకంపెంనీ నెట్ వర్త్ రూ 100 కోట్లు అవుతుంది.ఈ విధంగా మీ కంపెనీ నెట్ వర్త్ నే మార్కెట్ కాపిటలైజేషన్  అంటారు.అంటే మీ కంపెనీ పబ్లిక్ వద్దకు వెళ్లడం వలన మీ కంపెనీ మార్కెట్ కాపిటలైజేషన్ రూ100కోట్లు కాబడినది.  ఇందులో మీరూ కేవలం 10% వాటాను మాత్రమే అమ్మడం జరిగినది. ఇంకా మీవద్ద 90% వాటా ఉంది అంటే మీషేర్ల విలువ రూ90 కోట్లు .మీరూ మీ కంపెనీ ని స్థాపించి దానిని పబ్లిక్ వద్దకు తీసుకవేల్లడం వలన రూ100 కోట్లుదేశఎకానమీలోకి తీసుకరాగలిగారు.ప్రభుత్వం ఎలాంటి కరెన్సీ నోట్లు ముద్రించకుండానే మీ కంపెనీ వలన దేశ ఎకానమీలోకి  రావడం జరిగినది (on paper). దీనినే సంపద  స్ప్రుస్టించడం అంటారు. ఇంత సంపద సంపాదించడం దాదాపు సాధ్యం కాదు కాని  స్ప్రుస్టించడం సాధ్యం అవుతుంది.మీరూ  ఎప్పుడైనా  ఫోర్బ్స్ మేగజైన్ ప్రచురించే ప్రపంచ ధనవంతుల జాబితాను గమనించారా ? ఆ జాబితాలో ఉన్న ప్రతి ధనవంతుడు ఏదో ఒక కంపెనీని స్థాపించడం దానిని ప్రజల వద్దకు తీసుకవేల్లడం వలన మాత్రమే ధనవంతులు కాగలిగారు. ఎందుకంటె ఆ కంపెనీలో ఉండే వారి వాటా విలువ కొన్ని బిలియన్ డాలర్ల రూపాయలకు సమానం అవుతుంది.ప్రపంచంలో ఉన్న ధనవంతులు ఎవ్వరూ కూడా ఎకానమీలో సంపద నిర్మించిన వారూ కాదు సంపద స్ప్రుస్టించిన వారూ మాత్రమే. 

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.