స్టాక్ మార్కెట్ లో ఏవిధంగా ప్రవేశించాలి?


స్టాక్ మార్కెట్ లో ఏవిధంగా ప్రవేశించాలి? 

డీమ్యాట్ ఖాతా
మీరు  ప్రైమరీ మార్కెట్ లేదా సెకండరీ మార్కెట్  లలో  షేర్స్  కొనాలి అంటే  మీకు ముందుగా కావలసినది డీమ్యాట్ ఖాతా. షేర్ సర్టిఫికేట్లతో  ముడిపడిన అనేక సమస్యలకు  తెర దించుతూ  అమల్లోకి వచ్చింది కాగిత రహిత లావాదేవీల విధానం . దీనినే డీమ్యాట్ అంటారు. నేడు షేర్లు  కొనాలన్న ,అమ్మాలన్న ,ఈ విధానం తప్పనిసరి . పేరుకు తగ్గట్టు గానే  ఈ విధానం లో షేర్ సర్టిఫికెట్లు  ఉండవు. అంతా ఎలక్రానిక్ రూపంలోనే ఉంటుంది.ఎలక్రానిక్ రూపంలోకి మార్చిన షేర్లను కొనాలన్న, అమ్మాలన్న  డిపాజిటరి పార్టిసిపేట్స్,(డీపీ) వద్ద ఒక ఖాతా (డీమ్యా ట్ ఖాతా) ను  తప్పని సరిగా తెరవాల్సి ఉంటుంది.అమ్మకాలు, కొనుగోళ్లను బట్టి మీ ఖాతాలో షేర్ల సంఖ్యలో హెచ్చుతగ్గులు  ఎలక్రానిక్ రూపంలో నమోదవుతాయి. ఒక విధంగా ఇది బ్యాంకు డిపాజిట్ లాంటిదే.బ్యాంకు లో మీరు సొమ్ము జమచేస్తే ఈ వివరాలు మీ ఖాతాలో జమ అవుతాయి.అలానే షేర్లు కూడా.
డిపాజిటరీ , డిపాజిటరి పార్టిసిపెంట్స్ అంటే ఏమిటి ?
ఇన్వెస్టర్లకు  చెందిన షేర్లను ఎలక్రానిక్ రూపంలో  భద్రపరిచే సంస్థలనే డిపాజిటరీలంటారు. రిజిస్టరైన డిపాజిటరి పార్టిసిపేట్స్,(డీపీ) ద్వారా డిపాజిటరీలు సేవలు అందిస్తాయి.ప్రస్తుతం సెబి వద్ద రిజిస్టరైన సంస్థలు రెండు. అవి నేషనల్ సెక్యురిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ .(ఎన్ఎస్ డీల్)మరియు  సెంట్రల్ డిపాజిటరీ  సర్వీస్ లిమిటెడ్ (సీడీఎస్ డీల్) .16 అంకెల్లో  ఖాతా నం ఉంటే  సీడీఎస్ ల్  ఖాతాగా,,అంకెలు ఇంగ్లీషు అక్షరాలూ  కలగలిసి ఉంటె  ఎన్ఎస్ డీ ల్ ఖాతా గా సులభంగా గుర్తించవచ్చు. 
డిపాజిటరీ ప్రతినిధినే డీపీ అంటారు. డిపాజిటరి పార్టిసిపెంట్స్ ద్వారనే  డిపాజిటరీలు ఖాతాదారులతో లావాదేవీలు నిర్వహిస్తాయి. సెబీ వద్ద రిజిస్టరైన సంస్థలు మాత్రమే డీపీగా   వ్యవహరించటానికి  వీలుంటుంది.డిపాజిటరీని బ్యాంకు గాను   డీపీని బ్యాంకు శాఖగాను  పరిగణించవచ్చు. ప్రస్తుతం 821డీపీ లు సెబీ వద్ద నమోదయ్యారు.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.