బ్యాంక్స్
ఖాతాలు ఓపెన్ చేయడం ఇప్పుడు చాలా సులభం.
ప్రస్తుతం RBI నిబంధనల ప్రకారం బ్యాంక్ లో ఖాతా ప్రారంభం చేయడం
చాలా సులభం. ఇది వరకు ఖాతా ప్రారంభం చేయడానికి గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్ , ఇంట్రడక్షన్
సంతకం తప్పనిసరిగా కావలసి వచ్చేది. ఇప్పుడు RBI
ఇంట్రడక్షన్
సంతకం నిభందనను తీసివేయడం జరిగినది.కావున
ఖాతా ప్రారంభం చేయడం చాలా సులభం .అంతే కాకుండా కొన్ని డాక్యుమెంట్స్ ను
గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్ గా కూడా
తప్పనిసరిగా గుర్తించాలి అని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగినది. ఇంతకు
ముందు ఓటర్
కార్డ్ , డైవింగ్ లైసన్స్ మొదలగు వాటిని
బ్యాంక్స్ కేవలం అడ్రస్ ప్రూఫ్ గా మాత్రమే పరిగణలోకి తీసుకొనేవి. ఇప్పడు
మాత్రం ఏదైనా పత్రం పై ఫోటో మరియు అడ్రస్ ఉంటె దాని ద్వారా తప్పనిసరిగా
ఖాతా ప్రారంభం చేయాలి . అంటే
కేవలం ఓటర్ కార్డ్, డైవింగ్ లైసన్స్ మొదలగు
వాటి వలన కూడా ఖాతా ప్రారంభం చేయడం చాలా సులభం
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.