క్రూడ్ ఆయిల్
టెక్నికల్ అనాలసిస్
Mcx లో క్రూడాయిల్ ఆల్ టైమ్ ఆగస్టు 2008 లో 6333 ఐతే , ఆల్ టైమ్
లో జనవరి 2009 లో 1626. కేవలం ఐదు నెలల
కాలంలో 4700 పాయింట్లు
లేదా 75% క్రూడాయిల్
పతనం కావడం జరిగినది. జనవరి 2009 లో 1626 నుండి ఏప్రిల్ 2011 లో 5038 కు చేరుకోవడం జరిగినది. 5038 నుండి
మళ్ళీ 3543 వరకు పతనం కావడం జరిగినది. 3543 నుండి ర్యాలీ జరిగి కేవలం ఎనిమిది నెలల
కాలంలో 2100 పాయింట్లు పెరిగి మార్చి 2012 లో 5635 వరకు
చేరుకోవడం జరిగినది. 5635 నుండి జూన్ 2012 లో 4448 పాయింట్ల వరకు పతనం కావడం జరిగినది. ఇవన్ని పరిగణలోకి తీసుకుంటే టెక్నికల్ అనాలసిస్
ప్రకారం 5175-5190 మధ్య చాలా బలమైన రెసిస్టన్స్ రావడం
జరుగుతుంది. అదే విధంగా అంతర్జాతీయంగా
కూడా క్రూడాయిల్ $93.80 to $94.10
మధ్య
రెసిస్టన్స్ రావడం జరుగుతుంది.నిన్న కూడా $93.78 హైకి
చేరుకోవడం జరిగినది. క్రూడాయిల్ $94.10 బ్రేక్
కానప్పటి వరకు Mcx లో
క్రూడాయిల్ 5175-5190 వద్ద బలమైన
రెసిస్టన్స్ ఎదుర్కొగలదు. అందువలన Mcx లో క్రూడాయిల్ ప్రస్తుతం నలబై , యాభై పాయింట్ల కోరకు బై చేయడం కంటే పై లెవల్లో సెల్ చేయడం చాలా
మంచిది.గత 21 ట్రేడింగ్ సెషన్స్ నుండి Mcx లో క్రూడాయిల్ 500 పాయింట్ల వరకు పెరగడం జరిగినది. 5190-5195 పైన మాత్రమే
మళ్ళీ Mcx లో క్రూడాయిల్ లో ర్యాలీ రావడం జరుగుతుంది . అంత వరకు పై
లెవల్లో 5175-5190 స్టాప్ లాస్ తో సెల్ చేయడం మంచిది .
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.