ఈ వారం స్టాక్ మార్కెట్ 10-06-2013 to 14-06-2013



ఈ వారం స్టాక్ మార్కెట్ 10-06-2013 to 14-06-2013  



ఈ వారం స్టాక్ మార్కెట్ మూమెంట్ 12 వ తేదిన విడుదలయ్యే  iip డేటా, ద్రవ్యోల్బణం మరియు రూపాయి కదలిక  పై  ముఖ్యంగా   ఆధారపడి ఉంటుంది.ప్రస్తుతం నిఫ్టీ 20 sma మరియు 50sma  క్రింద ట్రేడ్ కావటం జరుగుతుంది. ఇది నిఫ్టీ మరింత పతనం కావటానికి అవకాశం కలదు అని తెలియచేస్తుంది.ప్రస్తుతం నిఫ్టీ కి వీక్లీ 20 sma  మరియు 50% ఫిబోనస్సీ లెవల్స్ ఐనటువంటి 5850 దరిదాపులో సపోర్ట్ కలదు.ఒకవేళ 5850 కంటే దిగువన ట్రేడ్ కావటం జరిగితే నిఫ్టీ మరింత పతనం కావటానికి అవకాశం కలదు.  

ఈ వారం స్టాక్ మార్కెట్ 04-03-2013 to 08-03-2013



ఈ వారం స్టాక్ మార్కెట్ 04-03-2013 to 08-03-2013
మీకూ గత కొన్ని వారాల నుండి కూడా తెలియచేయడం జరుగుతుంది. నిఫ్టీ 6100 పైన ముగియనంత వరకు మార్కెట్ పెరిగినప్పుడల్లా సేల్ చేయడం చాలా మంచిది అనే విషయం.గత కొన్ని సంవత్సరాల చరిత్ర చూస్తె బడ్జెట్ ముందు మార్కెట్ లో పతనం జరిగితే , బడ్జేట్ తరవాత కూడా మార్కెట్ లో ఈ పతనం  మార్చి నెల మొత్తం కొనసాగడం జరుగుతూనే ఉంది. కాబట్టి లాంగ్ పొజిషన్ తీసుకున్నప్పుడు తగిన స్టాప్ లాస్ ఉపయోగించడం చాలా మంచిది .నిఫ్టీ ఓవర్ సోల్డ్ పొజిషన్లో  ఉంది కాబట్టి కొంత ర్యాలీ రావడానికి అవకాశం కాదు. ఏది ఏమైనా  క్రింది లెవల్లో 5575 స్టాప్ లాస్ తో బై చేయడం , పై లెవల్లో  5680 స్టాప్ లాస్ తో సేల్ చేయడం మంచిది.   

కమోడిటీ సిల్వర్ టెక్నికల్ అనాలసిస్



కమోడిటీ సిల్వర్ టెక్నికల్ అనాలసిస్ 


సిల్వర్ లో ప్రైస్ 54466 ప్రస్తుతం 54520 వద్ద ట్రేడ్ కావడం జరుగుతుంది. 54520వద్ద  ఇంట్రాడే  మరియు పోజిషనల్ కొరకు 54000  స్టాప్ లాస్ తో బై  చేయవచ్చు. టార్గెట్ కనీసం 500  to 1500 పాయింట్స్ .స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తో బై చేయగలరు. డాలర్స్ లో సిల్వర్ మంత్లీ రైసింగ్ ట్రెండ్ లైన్ వరకు చేరుకున్నది. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ కావడం జరిగితే మరింతగా సిల్వర్ పతనం కావడం జరుగుతుంది.