భవిష్యత్తులో బంగారం ధర ఏ విధంగా ఉంటుందో ఎలా అంచనా వేయాలి ?


భవిష్యత్తులో బంగారం ధర ఏ విధంగా  ఉంటుందో  ఎలా అంచనా వేయాలి ?
భవిష్యత్తులో బంగారం ధర ఏ విధంగా  ఉంటుందో లెక్కించడం , అంచనా వేయడం  ఏ మాత్రం కష్టమైన పని కాదు. నిజం చెప్పాలి అంటే  మనం బంగారం అసలు ధర భవిష్యత్తులో ఎంత ఉంటుంది అని ఉహించడం కాదు ,US  గోల్డ్ రిజర్వు యొక్క విలువ కనుగొంటున్నాం. దీనిని స్కూల్ కి వెళ్ళే బాలుడు కూడా చేయవచ్చు. ఇది సాదారణ అల్జీబ్రిక్ మ్యాథ్స్ .దీనిని క్రింది విధంగా లెక్కించవలసి ఉంటుంది. ఉదాహరణకి ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం అమెరికా వద్ద 8673.5 (మార్చి 2011 ) టన్నుల గోల్డ్ రిజర్వు ఉంది. . US మానిటరీ బేస్ (జూన్ 2011) 2.6 ట్రిలియన్ల డాలర్లు    లేదా  2600  బిలియన్ల డాలర్లు గా ఉంది.  ఆగస్టు 2011 లో బంగారం ధర  అవున్స్ ( ounce)1784  డాలర్లు గా ఉంది. మీరు ఎప్పుడు కూడా బంగారం భవిష్యత్తు  గురించి ధర అంచనా వేయాలి అంటే మీకు మూడు  విషయాలు తప్పకుండా తెలియాలి.అవి
లేటెస్ట్ గోల్డ్ రిజర్వ్ డేటా .
లేటెస్ట్ US మానిటరీ బేస్
ప్రస్తత బంగారం ధర అవున్స్ ( ounce) కి ఎంత ఉంది అనే విషయాలు ముందుగా మీరు తెలుసుకోవాలి. పై మూడు విషయాలు తెలిస్తే మీరు బంగారం ధర సులభంగా అంచానా వేయవచ్చు.
ఉదాహరణకి పై మూడు విలువలు

The US Monetary Base (Aug 2011) is US $ 2.6 Trillion ($ 2600 Billion)
• The Gold Price in Aug 2011 is US $ 1784 per ounce &

The US Reserve Gold in March 2011 was 8673 Tonnes
So,
8673 Tonnes Gold = $ 2600 Billion ($ 2.6 Trillion)
So 01 Tonne Gold = $ 0.29978 Billion. = $ 299.78 Million
Now, 1 Tonne = 1000 KG = 1000000 Grams
Now, 1 Ounce = 28.3495 Grams = 0.0283495 KG
Now, 28.3495 Grams = 1 Ounce
1000000g = 35273.9620 Ounce.

 So 1 Tonne = 35273.9620  Ounce
So Approx. 1 Tonne = 35273Ounce.
Now, 35273 Ounce (1 Tonne) Gold = $ 299.78 Million
So 1 Ounce Gold = $0.0084985181 Million = $ 8498.518
So 1 Ounce Gold = $ 8498.518
The current price (Aug 2011) of Gold is $ 1784 per 1 Ounce.
The difference is $ 6714.518
This is 4.76 Times price Hike.
 కావున  బంగారం ధర ఇంకా 4.76  రేట్లు పెరగడానికి అవకాశం  ఉంది. ఉదాహరణకి ఇండియా లో బంగారం ధర 10gr రూ 32000 ప్రస్తుతం ఉంటే   రూ 152300 లకు లేదా అంతకంటే ఎక్కువకు చేరడానికి అవకాశం ఉంది. ఎప్పుడు చేరుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేం. కాని చేరడానికి గల అవకాశాన్ని కొట్టిపారేయలేం.బంగారం ధర పెరగడం అనేది US మానిటరీ బేస్ పై  ఆధారపడి ఉంటుంది కదా ?

బంగారం ధర ఎప్పుడు ఎందుకు పెరుగుతుంది. ఎప్పుడు ఎందుకు తగ్గుతుంది.?.


బంగారం ధర ఎప్పుడు  ఎందుకు పెరుగుతుంది.  ఎప్పుడు ఎందుకు తగ్గుతుంది.?.

మీరూ ఇదివరకే గోల్డ్ స్టాండర్ట్ గురించి తెలుసుకున్నారు కదా ? ఇప్పుడు US మానిటరీ బేస్  గురించి తెలుసుకోండి. సాదారణ పరిబాషలో సులభంగా అర్ధం అయ్యేలా చెప్పాలి  అంటే మానిటరీ బేస్ అనగా చలామణిలో ఉన్న కరెన్సీ  లేదా మనీ సప్లై . US మానిటరీ బేస్  అనగా  ఆ దేశ ప్రభుత్వం కాలానుగుణంగా  ముద్రించినటువంటి  కరెన్సీ.

మీరు పై చార్ట్ గమనించినట్టు ఐతే 2007 వరకు US మానిటరీ బేస్   800 బిలియన్ డాలర్లు  మాత్రమే. కాని 2011 వచ్చే సరికి US మానిటరీ బేస్   2.6 ట్రిలియన్లు లేదా  2600 బిలియన్ డాలర్ల కు చేరుకుంది. అంటే కేవలం నాలుగు సంవత్సరాలలో 1.8 ట్రిలియన్లు లేదా  1800 బిలియన్ల డాలర్లు ముద్రించడం జరిగినది.1970 తర్వాత ఎప్పుడయితే  గోల్డ్ స్టాండర్డ్ తీసివేయడం జరిగినదో  అప్పటి నుండి  US వారి అవసరానికి అనుగుణంగా కరెన్సీ నోట్లు ముద్రించుకుంటుంది. 1970 నుండి వాస్తవంగా  బంగారానికి , డాలర్ కి మధ్య ఎలాంటి సంభందం లేదు. నిజం చెప్పాలి అంటే బంగారం  నిజమైన మనీ. దీని ధర   US మానిటరీ బేస్   కి అనుగుణంగా  మారుతుంది. మీకు ఇది వరకే తెలియచేయడం జరిగినది కదా ?. US ప్రభుత్వం ఎప్పుడూ కావాలి అంటే అప్పుడు  కరెన్సీ నోట్లను ముద్రించుకుంటుంది కదా ?  ఈ విధంగా ముద్రించిన కరెన్సీ నోట్లు చలామణిలోకి రావడంతో వాటి కనుగోలు శక్తి తగ్గిపోతుంది కదా ?  అప్పుడు బంగారం ధర ఆటోమేటిక్ గా పెరుగుతుంది. అంటే డాలర్ బలహీనపడటం. బంగారం బలపడటం జరుగుతుంది. ఎప్పుడయితే US మానిటరీ బేస్  పెరుగుతుందో అప్పుడు ప్రపంచంలో డాలర్ల చలామణీ అధికం కావడం  వలన  దానికి అనుగుణంగా బంగారం ధర పెరుగుతుంది.   US మానిటరీ బేస్   పెరగడం వలన  ప్రజల వద్ద అధిక డాలర్లు ఉండటంతో  బంగారాన్ని అధిక ధరల వద్ద కనుగోలు చేస్తారు. దానితో బంగారం ధర పెరుగుతుంది.వాస్తవంగా చెప్పాలి అంటే  బంగారం ధర పెరగడం లేదు.డాలర్ మరియు ఇతర కరెన్సీల విలువ తగ్గుతుండటం  జరుగుతుంది. ప్రభుత్వాలు కొత్తగా కరెన్సీ నోట్లను ముద్రించి చలామణిలోకి తీసుకరావడం  వలన కరెన్సీ కనుగోలు శక్తి తగ్గిపోతుంది దాని వలన బంగారం ధర పెరుగుతుంది అనే విషయం మీకు తెలిసినది కదా ? అదే విధంగా  బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందో ఒక్కసారి పరిశీలిద్దాం. చలామణి లో ఉన్న అధిక కరెన్సీ నోట్లను ప్రభుత్వం ఎప్పుడైతే ఉపసంహరించుకుంటుందో ఆప్పుడు బంగారం ధరలు తగ్గుతాయి.కరెన్సీ నోట్లను ప్రభుత్వం ఉపహరించుకోవడం వలన ప్రజల వద్ద తక్కువ మనీ ఉండటంతో బంగారాన్ని కనుగోలు చేయడం తగ్గుతుంది. దాని వలన బంగారం ధర తగ్గుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. US మానిటరీ బేస్   కి , బంగారం ధరకి అవినాభావ సంభందం ఉంది.  US మానిటరీ బేస్   పై బంగారం ధరలు ఆధారపడి ఉంటాయి.అంతే కాని పెళ్ళిళ్ళ సీజన్, పండుగల సీజన్ , దీపావళి , అక్షయ తృతీయ  ఇలాంటివి ఏవి బంగారం ధరను ప్రభావితం చేయలేవు.చేసినా ఒక్కశాతం మించి చేయలేవు. తర్వాతి ఆర్టికల్స్ లో బంగారం ధర  ఏవిధంగా  అంచనా వేస్తారో , ఎంత వరకు ధర పెరగడానికి అవకాశం ఉందో తెలుసుకుందాం.

కరెన్సీ నోట్లు కావలసినంత ముద్రించుకోవడానికి బంగారంతో ఏమైనా సంభందం ఉందా ?

కరెన్సీ నోట్లు కావలసినంత ముద్రించుకోవడానికి  బంగారంతో ఏమైనా సంభందం ఉందా ?


పైన చూస్తున్న బంగారు నాణేలు దీ గ్రేట్ అలెగ్జాండర్  330 B.C  కాలానికి  సంభందించినవి.
ఈ ఆర్టికల్ యొక్క ముఖ్యఉద్దేశం  ఎవరైనా సరే  భవిష్యత్తులో  వృద్ది ( appreciate in future ) చెందడానికి అవకాశం ఉండే ఆస్తులు మాత్రమే సంపాదించుకోవాలి  కాని  తరుగుదల ( Depreciating in future) ఉండే ఆస్తులను సంపాదించుకోవడం కాని,కొంత కాలానికి విలువ కోల్పోయే ( purchasing power)నగదును కాని నిల్వ చేసుకోవడం వలన ఎలాంటి లాభం ఉండదు అని  తెలియచేయడం ఈ ఆర్టికల్ ఉద్దేశం.
1970   కంటే ముందు  USA  మరియు  ఇతర ప్రపంచ దేశాలు  కరెన్సీ నోట్లు ముద్రించడానికి బంగారాన్ని ప్రామాణికంగా పరిగణించేవారు.అంటే ఒక డాలర్ లేదా కరెన్సీ ముద్రిస్తున్నారు అంటే అంతే విలువ కలిగిన బంగారాన్ని నిల్వ చేసేవారు . దీనినే గోల్డ్ స్టాండర్డ్ అని పిలిచేవారు.ఉదాహరణకు ఒక డాలర్ ముద్రిస్తున్నారు అంటే  దానికి సమానంగా విలువ కలిగిన గోల్డ్ అంటే 0.693 ounce బంగారం నిల్వ చేసేవారు. ఖచ్చితంగా ఎంత బంగారం అని తెలియదు కాని  కొంత బంగారాన్ని మాత్రం ప్రామాణికంగా నిల్వ చేసేవారు. దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజలకు ప్రభుత్వ  వ్యవస్థ మీదా విశ్వాసం లేనప్పుడు ,ద్రవ్యోల్బణం పెరిగి ,  డాలర్ లేదా ఇతర కరెన్సీ వలన  వారి  కనుగోలు శక్తి తగ్గినా సమయంలో  వారి వద్ద ఉన్న కరెన్సీ  నోట్లతో బంగారాన్ని మార్పిడి చేసుకొనే అవకాశం ఉండటం. దీనినే   గోల్డ్ స్టాండర్డ్  అని అంటారు.
ఈ గోల్డ్ స్టాండర్ వలన ప్రభుత్వం ఎప్పుడైనా కరెన్సీ నోట్లను ముద్రించి చలామణిలోకి తీసుకరావాలి అంటే ముందుగా ప్రభుత్వం అంతే విలువ కలిగిన బంగారాన్ని నిల్వ చేసుకోవాలి.దాని తర్వాత మాత్రమే  కరెన్సీ నోట్లను ముద్రించి చలామణిలోకి తీసుకరావదానికి వీలు కలుగుతుంది.

ఈ గోల్డ్ స్టాండర్డ్ అనే పదం ఎప్పటి నుండి ఎక్కడి నుండి  వాడుకలోకి వచ్చినది అని ఆలోచిస్తున్నారా ? ఇది  కొన్ని శతాబ్దాల క్రితమే ప్రారంభం కావడం జరిగినది. వీటిని ప్రజలు వారి  వస్తువులు , ఆస్తులు, సేవలు  పొందే సమయంలో మార్పిడి క్రింద బంగారాన్ని  ఉపయోగించేవారు.కొన్ని సంవత్సరాల తర్వాత  ప్రజలూ ఈ విధంగా  బంగారం తో మార్పిడి చేయడం రిస్కు అని భావించి నగరంలో పేరొందిన బంగారు వ్యాపారస్తుడి వద్ద బంగారం పెట్టి దాని బదులు అతని వద్ద  హామీ పత్రం తీసుకొనేవారు. అంటే ఆ పత్రాన్ని ఎవ్వరూ తీసుకవచ్చిన బంగారం ఇచ్చే విధంగా. ఈ విధంగా  ఈ హామీ పత్రాల చలామణీ ప్రజలకు చాలా సౌకర్యవంతంగా  ఉండేది.ఒకరకంగా చెప్పాలి అంటే ఈ విధంగా కరెన్సీ నోట్ల చలామణి వాడుకలోకి వచ్చినది.

కొన్ని సంవత్సరాల తర్వాత ఈ బంగారు వ్యారస్తులు ఈ హామీ పత్రాలను ప్రింట్ చేసి వారి వద్ద బంగారం నిల్వ చేసి హామీ పత్రాల కోసం వచ్చే వారికి ఇచ్చేవారు.ఈ విధంగా కరెన్సీ నోట్ల ముద్రణ ప్రారంభం కావడం జరిగినది. కాని ఎప్పుడైనా చలామణి లో ఉండే  కరెన్సీ నోట్లలో పెరుగుదల ఉంటే వాటి కనుగోలు శక్తి తగ్గుత్న్ది అనే విషయం మీకు తెలుసుకదా ? కొన్ని సంవత్సరాల తర్వాత ప్రబుత్వం ఈ పద్ధతి మీదా అజమాయిషీ తీసుకొని ద్రవ్య  సరఫారా ను నియంత్రణలోకి తీసుకోవాలని భావించడం జరిగినది. దానినే  మోడరన్ గోల్డ్ స్టాండర్డ్ అని పిలువడం జరిగినది.
మరికొన్ని సంవత్సరాల తర్వాత  అంటే   1970 లో    USA ప్రభుత్వం  గోల్డ్ స్టాండర్డ్ కి ఎందుకు కట్టుబడి ఉండాలి అనే ఉద్దేశంతో చాలా తెలివిగా ఈ గోల్డ్ స్టాండర్డ్ ను రద్దు చేయడం జరిగినది. అంతే కాకుండా  USA ప్రభుత్వం  తన ప్రజలకి కరెన్సీ కి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ హామీ ఇస్తుంది అని తెలియచేయడం జరిగినది.
ఈ విధంగా USA ప్రభుత్వం  గోల్డ్ స్టాండర్డ్ రద్దు చేయడమే కాకుండా  అదనంగా కావలసినంత కరెన్సీ ఎప్పుడూ కావాలంటే అప్పుడు ప్రింట్ చేయగలం అని పరోక్షంగా తెలియచేయడం జరిగినది. 1970 నుండి    USA ప్రభుత్వం  ప్రతి సంవత్సరం కరెన్సీ నోట్లు ముద్రించి చలామణి లోకి తీసుకవస్తుంది. ఈ విధంగా అధిక కరెన్సీ నోట్లు చలామణిలోకి రావడం వలన కరెన్సీ నోట్ల యొక్క కనుగోలు శక్తి తగ్గిపోవడం తో ఇన్ఫ్లేషన్ కూడా పెరగడం మొదలైంది. మీ చేతిలో ఉన్న కరెన్సీ నోటు ఎలాంటి ఇంట్రెన్సిక్  విలువ లేనటువంటి కాగితం మాత్రమే. దానిపై ఎప్పుడో చనిపోయిన ఒక నాయకుడి  ఫోటో మాత్రమే ఉంటుంది. అందువలనే ఈ కరెన్సీ నోట్ యొక్క కనుగోలు ప్రతి సంవత్సరం దారుణంగా తగ్గిపోతుంది.ఈ ఆర్టికల్  నుండి మీరూ తెలుసుకోవలసినది ఏమిటంటే మీరు కరెన్సీ నోట్లను దాచుకోవడం కంటే ఆస్తులు కూడగట్టడం  చాలా మంచిది. మీ దగ్గర అవసరానికి మించి డబ్బూ ఉంటే , కొంత కాలం దానితో పని లేకపోతే  బ్యాంక్ లో  లేదా బీరువాలో దాచే బదులు ఏవైనా  విలువ పెరిగే ఆస్తులు కనుగోలు చేయండి.  అంటే షేర్లు , లాండ్స్ , బాండ్స్,  ఏవైనా కావచ్చు.మీరూ కేవలం డబ్బూ దాచుకోవడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటె దాని విలువ కొంత కాలంలో తగ్గిపోతుంది అని మీకు తెలుసుకదా ? ఇప్పుడు ఉన్న కరెన్సీ నోటు  ఏదైనా కాని డాలర్, యూరో , రూపాయి  ఏదైనా సరే ఎలాంటి   ఇంట్రెన్సిక్   వాల్యూ లేనటువంటి కాగితం  నోటు అని మాత్రమే గుర్తుపెట్టుకోండి. కాబట్టి దానిని దాచి పెట్టుకొనే బదులు ఆస్తులు కనుగోలు చేయండి.

మీరు ఆర్ధికంగా ఎదగాలన్న , ఆర్ధికంగా దివాళా తీయాలన్న కాంపౌండ్ ఇంట్రెస్ట్ (చక్రవడ్డీ ) ఏ విధంగా ముఖ్య పాత్ర వహిస్తుందో తెలుసుకోండి


మీరు  ఆర్ధికంగా ఎదగాలన్న , ఆర్ధికంగా దివాళా తీయాలన్న కాంపౌండ్ ఇంట్రెస్ట్ (చక్రవడ్డీ )  ఏ విధంగా ముఖ్య పాత్ర వహిస్తుందో   తెలుసుకోండి?   
ప్రముఖ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్స్టీన్ మాటల్లో చక్రవడ్డీ  ఆర్ధిక అభివృద్దికి తోడ్పడే ప్రపంచంలోనే  అత్యుత్తమ సాధనం.అంతేకాకుండా  మరొక సందర్భంలో  చక్రవడ్డీ గురించి   అల్బర్ట్ ఐన్స్టీన్ చెప్తూ ఇది ప్రపంచంలోనే ఎనిమిదవ వండర్  అనడం జరిగినది.   
చక్రవడ్డీ యొక్క బేసిక్స్ ముందుగా మీరు అర్ధం చేసుకుంటే ఈ చక్రవడ్డీ ఆర్ధిక అభివృద్దికి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుస్తుంది.ముందుగా చక్రవడ్డీ అంటే ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం. అయితే చక్రవడ్డీ గురించి తెలుసుకోవడానికంటే ముందు సాదారణ వడ్డీ లేదా సింపుల్ ఇంట్రెస్ట్ గురించి తెలుసుకుందాం. ఇవన్నీ మీరు చిన్నప్పుడు చదువుకొని ఉండవచ్చు. కాని అవి నిత్య జీవితంలో  మన ఆర్ధిక అభివృద్దికి ఏ విధంగా  తోడ్పాటు అందిస్తాయో తెలుసుకోవాలి.  సాదారణ వడ్డీ లో , వడ్డీ మీరు మొదట ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పై మాత్రమే వడ్డీ పొందుతారు. ఉదాహరణకు మీరు    రూ. 100 లను  10% సాదారణ వడ్డీకి ఇన్వెస్ట్ చేస్తే మీరు సంవత్సరం తర్వాత తిరిగి పొందే వడ్డీ రూ 10.  అంటే మీరు సంవత్సరం తర్వాత తిరిగి పొందే మొత్తం రూ 110 (రూ 100 అసలు  + రూ 10వడ్డీ ). రెండు సంవత్సరాల తర్వాత ఐతే రూ 110+10 = రూ 120.  అదే పది సంవత్సరాల తర్వాత అయితే  మీరు పొందే మొత్తం రూ .100 + 10 + 10 + 10 + 10 + 10 + 10 + 10 + 10 + 10 + 10 = రూ .200 .సాదారణ వడ్డీ లో మీరు 10% వడ్డీ రేటు చొప్పున ప్రతి సంవత్సరం రూ 10 లను వడ్డీ రూపంలో పొందుతున్నారు.
చక్రవడ్డీ విషయానికి వస్తే  ప్రతి సంవత్సరం అంతకు ముందు ఉన్న బ్యాలన్స్ అమౌంట్ పై వడ్డీ పొందుతారు. అంతే కాని మొదట ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పై కాదు. దీనిని సాదారణ పరిబాష లో  వడ్డీ పై వడ్డీ అని కూడా అంటారు.
ఉదాహరణకి మీరు  రూ. 100 లను  10%  చక్ర వడ్డీకి సంవత్సరానికి ఒక్కసారి లెక్కించే విధంగా ఇన్వెస్ట్ చేస్తే మీరు సంవత్సరం తర్వాత తిరిగి పొందే వడ్డీ రూ 10. అంటే సంవత్సరం తర్వాత మీ వద్ద  గల బ్యాలన్స్  రూ 110 (రూ 100 అసలు  + రూ 10వడ్డీ). రెండవ సంవత్సరం తర్వాత మీ వడ్డీ లెక్కించడానికి మీరు ముందు ఇన్వెస్ట్ చేసిన రూ. 100  ను కాకుండా  ఇప్పుడు ఉన్న బ్యాలన్స్  రూ 110 ని పరిగణలోకి తీసుకొని లెక్కిస్తారు. అంటే రెండో సంవత్సరం తర్వాత మీరు పొందే మొత్తం రూ .110 + రూ .11 (10% of 110) = రూ .121.  మూడు సంవత్సరాల తర్వాత  మీరు పొందే మొత్తం రూ  121 +రూ . 12.1 (10% of 121) =రూ . 133.1, నాలుగు సంవత్సరాల తర్వాత పొందే మొత్తం రూ .133.1 + రూ . 13.31 (10% of 133.1) = రూ . 146.41 మిగితా సంవత్సరాలు కూడా ఇదే విధంగా వడ్డీని లెక్కిస్తారు.పది సంవత్సరాల తర్వాతః పొందే మొత్తం రూ 285.31. మీరు రూ. 100 లను  10%  సాదారణ వడ్డీ కి పది సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే, పది సంవత్సరాల తర్వాత  పొందే మొత్తం  రూ 200.  అదే రూ. 100 లను  10% చక్రవడ్డీకి పది సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే, పది సంవత్సరాల తర్వాత  పొందే మొత్తం  రూ 285.31  అంటే మీరు    రూ. 100 లను  సాదారణ వడ్డీ మరియు చక్రవడ్డీ లలో ఇన్వెస్ట్ చేస్తే సాదారణ వడ్డీ కంటే చక్రవడ్డీ ద్వారా  రూ .85.31 ఎక్కువగా రాబడి పొందుతున్నారు .ఇదే చక్రవడ్డీ యొక్క మహత్యం .ప్రారంభం లో వడ్డీ లో పెరుగుదల తక్కువగా ఉన్నప్పటికీ కాలం గడుస్తున్న కొలది ఈ వడ్డీ లో పెరుగుదల చాలా భారీగా ఉంటుంది. మీరు  ఉదాహరణలో కేవలం  సంవత్సరానికి ఒక్కసారి లెక్కించే విధానాన్ని మాత్రమే చూసారు. కొన్ని ఆర్ధిక సాధనాలు మూడు నెలలకు ఒక్కసారి, ఆరునెలలకు ఒక్కసారి లేక్కిస్తాయి. ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం వలన రాబడి అధికంగా ఉంటుంది.

మీరు బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ఏదైనా లోన్  తీసుకుంటే  చక్రవడ్డీ ద్వారా వడ్డీ లెక్కించడం వలన మీరు ఆర్ధికంగా  చాలా దెబ్బతినడమే కాకుండా చివరకు దివాళా కూడా తీయవలసి వస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు చక్రవడ్డీ వలన మీరు  ఆర్ధికంగా ఎదగడానికి ఎంత  లాభం పొందుతారో క్రెడిట్ కార్డ్ లేదా ఏదైనా లోన్   అంతే నష్టపోతారు.
మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం పై చక్రవడ్డీ ద్వారా కాలక్రమేణా ఆసాదరణ లాభాలు అందుకుంటారు.. చక్రవడ్డీ వలనే  ప్రపంచంలో ధనవంతులు ఇంకా ధనవంతులు కావడం జరుగుతుంది.

చివరగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీరూ ఎప్పుడయితే చక్రవడ్డీ ద్వారా పొదుపు లేదా పెట్టుబడి చేయడం మొదలు పెడతారో  మీ డబ్బే మీ కోసం కష్టపడటం ద్వారా కొంత కాలానికి మీరూ ఆర్ధికంగా ఎదగడానికి  ఎంతో సహాయపడుతుంది. మీరూ  ఎప్పుడయితే లోన్స్ లేదా క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటారో అప్పుడు అదే చక్రవడ్డీ మిమ్ములను అర్దికంగా పతనం చేసి చివరకు దివాళా కూడా తీయుస్తుంది. అందుకే ఆర్ధిక వేత్తలు. ఫైనాన్సియల్ అడ్వయిజర్ ఇచ్చే సలహా ఏమిటంటే మీ చిన్న వయస్సులో  అంటే సంపాదన మొదలైన తొలినాళ్ళలోనే మీరు సేవింగ్ , ఇన్వెస్ట్మెంట్ మొదలు పెడితే  కొంత కాలంలో మీరు ఆర్ధికంగా ఉన్నత స్థితికి చాలా సులభంగా ఎదగవచ్చు. మీరూ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది కాదు ముఖ్యం . ఎంత త్వరగా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది చాలా  చాలా ముఖ్యం. అందుకే ఇన్వెస్ట్ వెంటనే ప్రారంభించండి.   

మీ సంపాదన లేక మీ జీతంలోలో 10%-15% తగ్గుదల ఉంటే ఇప్పటి మీ జీవితాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా గడపగలరా !


మీ సంపాదన  లేక  మీ జీతంలోలో  10%-15%  తగ్గుదల ఉంటే ఇప్పటి మీ జీవితాన్ని ఎలాంటి  ఇబ్బంది లేకుండా గడపగలరా !
ఈ ప్రశ్న మీకు మీరే  ఒక్కసారి స్వయంగా వేసుకొని జవాబు నిజాయితీగా చెప్పుకోండి. ప్రస్తుత మీ సంపాదన లేదా జీతం కాని పది నుండి పదిహేను శాతం తక్కువ కాని వస్తే ప్రస్తుత మీ జీవిత విధానంలో ఏమైనా తీవ్ర ఇబ్బందులు ఉంటాయా! లేకపోతే  సాదరణంగానె  ఉంటుందా !   అంటే ఇంటి అద్దె , ఇంట్లో సామాను, పిల్లల ఫీజులు  మొదలగు వాటిలో ఇబ్బంది లేకుండా !  నాకు తెలిసి మీ సంపాదనలో తగ్గుదల ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు తప్పించి ఎప్పటిలాగే జీవితాన్ని గడపవచ్చు. అవునా ?కాదా?. ఒకవేళ మరి ఇబ్బంది అనిపిస్తే  మీ ఖర్చులు కొద్దిగా తగ్గిస్తే సరిపోతుంది. నెలకు   మూడు సినిమాలు చూసే  బదులు , రెండు సినిమాలు, నెలకు  రెండు సార్లు బయట హోటళ్ళలో తినే బదులు ఒక్కసారి తినడం   ఇలాంటి  చిన్న చిన్న మార్పుల వల్ల సులభంగా ఎలాంటి ఇబ్బంది పడకుండా జీవితాన్ని గడపవచ్చు. ఒక్కవిషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సాదరణంగా సంపాదనకు అనుగుణంగానే మీ ఖర్చులు  ఉంటాయి.. ఈ విధంగా మీ సంపాదన  తగ్గింది అని భావించడంతో మీకు మీ సంపాదనలో  సులభంగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి  పది నుండి పదిహేను శాతం  అందుబాటులో ఉంది.ఇప్పుడు మీరు పది నుండి పదిహేను  డబ్బును మంచి రాబడి అందివ్వగల సాధనాలలో ఇన్వెస్ట్ చేయండి. ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తి  నెలకు   నలభై వేలు సంపాదిస్తూ  అతని సంపాదనలో కనీసం పది శాతం  ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు ఐతే కనీస రాబడి 12%-16% నెలకు  వస్తుంది అనుకుంటే ఆ వ్యక్తీ రిటైర్మెంట్ నాటకి  పొందే మొత్తం సుమారు రెండున్నర కోట్ల రూపాయల నుండి ఆరు కోట్ల  వరకు ఉంటుంది. ఇక్కడ నేను మిమ్ములను పిసినారి లా బ్రతకమని చెప్పడం లేదు. కొన్ని ఖర్చులు తగ్గించుకోవడం వలన మీ రిటైర్మెంట్ లేదా పిల్లల అవసారల కోరకు  డబ్బు ఏ విధంగా సమకూర్చుకోవచ్చో  తెలుపడం జరిగినది. 

షేర్ మార్కెట్ లో హర్షద్ మెహతా చేసిన మోసం ఏమిటి ? షేర్ మార్కెట్ లో షేర్ ధరలు ఎందుకు పెరుగుతాయి.?


షేర్ మార్కెట్ లో హర్షద్ మెహతా చేసిన మోసం ఏమిటి ?
షేర్ మార్కెట్ లో షేర్ ధరలు ఎందుకు పెరుగుతాయి.?
 మీరు ఇంతకు ముందు  బుల్ మరియు బేర్ ఒక్క పంచదార పలుకు లేకుండా లక్షల వ్యాపారరం చేసారు అని తెలుసుకున్నారు కదా ? అయితే దీని మీదనే షేర్ల ధర ఆధారపడి ఉంటుంది. ఫలానా బుల్  మార్చి 31 వ తారీఖు నాడు పద్నాలుగు రూపాయలకు  లక్ష కిలోల పంచదార కొంటున్నాడన్న  వార్త  మార్కెట్ లోకి  పొక్కగానే  అతడు ఏయే అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ రేటు నిర్ణయించడా  అన్నది అందరూ  పరిశీలిస్తారు. ఆ విధంగానే బేర్ లు ఏ నమ్మకం తో ఆ అమ్మకానికి వప్పుకున్నడన్న  విషయం లెక్కలు వేస్తారు.ఇరుపక్షాల వైపు అటూ ఇటూగా విడిపోతారు.ఈ విధంగా ఒక షేరు ధర బుల్ల్స్ మరియు బెర్స్ మధ్య లావాదేవీలవల్ల  నిర్ణయించబడుతుంది. ముందే చెప్పినట్టు దీని వెనుక అపూర్వమైన తెలివితేటలు , దేశ రాజకీయ , సామాజిక ఆర్ధిక పరిస్థితులు  ఉంటాయి.

మోసం ఎలా జరుగుతుంది.
జనవరి ఒకటో తారీఖున మీరు వెళ్లి బేర్ ని మార్చి  31 న నాకు కిలో  పద్నాలుగు రూపాయల చొప్పున లక్ష కిలోల పంచదార కావాలి అన్నారు అనుకోండి. బేర్ దానికి ఒప్పుకున్నారు అనుకోండి. బయట ఎక్కడో స్నేహితుడి దగ్గర  పది లక్షలు అప్పు తెచ్చి ఆ డబ్బుతో లక్ష కిలోల పంచదార కొనేసి ఆ స్టాక్ బ్యాంక్ లో పెట్టి దాని మీదా పది లక్షలు అప్పు తీసుకున్నారు అనుకోండి. దాంతో మళ్ళీ ఇంకో లక్ష కిలోల పంచదార కొన్నారు అనుకోండి. బ్యాంక్ మార్జిన్ లేకుండా అప్పు ఇచ్చినది అనుకుందాం.మీ చర్య వలన ఈ లోపులో పంచదార డిమాండ్ పెరిగి వారం రోజుల్లో కిలో పంచదార  పద్నాలుగు రూపాయలు అవుతుంది. ప్రస్తుతం మీ దగ్గర  రెండు లక్షల కిలోల పంచదార ఉంది. స్నేహితుడి దగ్గర అప్పుచేసి లక్ష  కిలోల  పంచదార కొంటే , దానిని బ్యాంక్ లో కుదవ పెట్టి మరో లక్ష  కిలోల  పంచదార కొనడం జరిగినది.ప్రస్తుతం ఈ రెండు లక్షల కిలోల పంచదార విలువ ఇరవై ఎనిమిది లక్షలు.మీ బ్యాంక్ అప్పు పది లక్షలు.మిగితా విలువకి బ్యాంక్ మళ్ళీ అప్పు ఇస్తుంది.ఆ డబ్బుతో  మీరు మరో 1.25 లక్షల  కిలోల పంచదార కొంటారు. మార్కెట్ లో పంచదార దొరకటం లేదు. కిలో ధర ఇరవై ఐదు రూపాయలు అయింది. ఇంతలో    మార్చి  31మీకు గుర్తుందా ? ఆ రోజు మీకు లక్ష కిలోల పంచదార పద్నాలుగు రూపాయల చొప్పున మీకు సప్లయ్ చేస్తానని బేర్ మీతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగినది.ప్రస్తుతం ధర ఇరవై ఐదు రూపాయలు. మీతో బేరం కుదుర్చుకున్న బేర్  బావురుమని ఏడుస్తూ మీకు పదకొండు లక్షల రూపాయలు ఇచ్చాడు.(25-14  రూపాయలు x లక్ష కిలోలు ) . దాంతో మీరూ మీ స్నేహితుడు అప్పు తీర్చేసారు. ప్రస్తతం మీ దగ్గర 3.25 లక్ష కిలోల పంచదార ఉంది. దాని ధర కిలోకి 25  చొప్పున 81,25,000 . మీరూ చేస్తున్న వ్యాపారం చూసి బ్యాంక్ చైర్మన్స్ కూడా విస్తూపోయారు.  మీరూ తమ బ్యాంక్ లో లావాదేవీలు పెట్టుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నారు. మీరు వడ్డీ కరెక్ట్ గా చెల్లిస్తున్నారు. మూడు నెలలో పంచదార కిల్ప్ పది రూపాయలనుండి , పాతిక రూపాయలు కావడం తో జనం బంగారం దాచుకోవడం బదులు పంచదార వ్యాపారం చేయడం మొదలు పెట్టారు. పెళ్లాల మంగళ సూత్రాలు అమ్మి పంచదార కొంటున్నారు.దాంతో పంచదార ధర 30 రూపాయలు అయింది .అంటే ప్రస్తుతం మీ దగ్గర  కోటి రూపాయల విలువగల స్టాక్ ఉంది.దానిని కుదువ పెట్టుకొని బ్యాంక్ మీకు మరో కోటి రూపాయలు అప్పు ఇచ్చినది.మీరు మరో 3.30 లక్షల కిలోల  పంచదార కొన్నారు.దానిని కూడా బ్యాంక్ కి కుదవ పెట్టారు. కానీ బ్యాంక్ చైర్మన్ ఇక్కడే పొరపాటు చేసాడు. సెక్యురిటీ  కరెక్ట్ గానే ఉంది.  3.30 లక్షల కిలోల  పంచదార   కోటీ రూపాయలు అనుకునాడు . దాని ధర కిలో 30 రూపాయలు అనుకున్నాడు. దాని అసలు ధర కిలో పది రూపాయలు అని, మీ వలెనే కిలో  30 రూపాయలకి పెరిగినది అనే విషయం మర్చిపోయాడు.ఒకరోజు దురద్రుస్టావశాత్తు  ఈ విషయం రిజర్వు బ్యాంక్ నోటిసుకి వచ్చినది.కంగారు పది లెక్కలు సరిచూసుకుంటే కిలో పది రూపాయల చొప్పున 6000 కోట్ల నికర విలువగల పంచాదారకి బ్యాంక్ 11480కోట్లు అప్పు ఇచ్చినట్టు తేలింది. తేడా 5480. ఈ విధంగా  చేతిలో నయా పైసాలేకుండా  ఒక వ్యక్తీ పంచాదారలాంటి షేర్లతో  ఐదు సంవత్సరాలాలో  5480 కోట్లు సంపాదించాడు. ఆ వ్యక్తే   హర్షద్ మెహతా THE BIG BULL. 
కొన్నేళ్ళ క్రితం  చుక్కాని లేని నావలా బొంబాయి వీధుల్లో తిరిగిన హర్షద్ మెహతా , పన్నెండు  వందల రూపాయలకి చిన్న అసిస్టెంట్ గా ఉద్యోగం చేసిన మెహతా , కోట్ల విలువ చేసే బంగాళాలో  ఉంటూ , ఖరీదైన కారలలో తిరుగుతూ  చివరకు జైలు పాలు అయ్యి  జైలులోనే గుండె పోటూతో మరణించడం జరిగినది.ఇక్కడ పంచదార కేవలం మీకు సాదారణ బాషలో సులభంగా అర్ధం కావడానికి తీసుకోవడం జరిగినది. వాస్తవంగా పంచదార బదులు షేర్లు లెక్కలోకి తీసుకోవాలి. మీకు ఈ విషయం పూర్తీగా అర్ధం కావలి అంటే ఇంతకు ముందు రెండు భాగాలు కూడా చదివితే సులభంగా అర్ధం అవుతుంది.       

ఈ రోజు స్టాక్ మార్కెట్.


ఈ రోజు స్టాక్ మార్కెట్.
మీకు రెండు రోజుల క్రితం తెలియచేయడం జరిగినది.నిఫ్టీ 5700 క్రింద ఉన్నంత వరకు మార్కెట్ క్రిందకు దిగజారడానికి అవకాశం ఉంది అని తెలియచేయడం జరిగినది.అదే విధంగా   5650-5683 వద్ద ఏర్పాటు కాబడిన గ్యాప్ కూడా నింప బడుతుంది అంటే , 5650 వరకు నిఫ్టీ సులభంగా పడిపోతుంది అని తెలియచేయడం జరిగినది. నిన్న అదే విధంగా జరిగి నిఫ్టీ  5648 వరకు దిగజారడం జరిగినది కూడా. ప్రస్తుతం నిఫ్టీ కి 20 sma వద్ద సపోర్ట్ కలదు. అదే విధంగా  5620, 5600 వద్ద కూడా సపోర్ట్ కలదు.రెసిస్టన్స్ 5684, 5700 వద్ద కలదు. 5684 దాటి నిలదోక్కుకున్నట్టు ఐతే లాంగ్ పోజిశాన్స్ తీసుకోవచ్చు. లేదంటే ప్రతి పెరుగుదలలో సెల్ చేయడం మంచిది. 

షేర్ మార్కెట్ లో షేర్ ధరలు ఎందుకు పెరుగుతాయి.? part 2


కంపెనీ కొత్తగా షేర్లను ఇవ్వడాన్ని  పబ్లిక్ ఇష్యూ అంటారు. కంపెనీ తన వ్యాపరం గురించి, ఇంతకు ముందు కంపెనీ ఉన్నట్టు ఐతే పూర్వపు లాభాల గురించి , తన ఆస్తులు మొదలగు వాటితో కూడిన వివరాలతో దిన పత్రికలో ప్రకటన ఇస్తుంది.అప్పుడు మనకు ఆ కంపెనీ గురించిన సమాచారం నచ్చి , నమ్మకం కుదిరితే  అప్లయ్ చేయవచ్చు.కొనేవారి సంఖ్యా ఎక్కువగా ఉంటే లాటరీ తీసి పంచుతారు.పెద్ద కంపెనీ షేర్లు ఈ విధంగా లాటరీ ద్వారా సంపాదించటం కొద్దిగా కష్టం..ఈ విధంగా పంపకం జరిగాక తమకి సంక్రమించిన షేర్లని కొందరు అమ్మజూపుతారు.కావలసినవాళ్ళు హెచ్చు ధరకి దాన్ని కొనుక్కోవడాన్ని  సెకండరీ మార్కెట్ అంటారు.క్యూ లైన్ లో సినిమా టికెట్స్ దొరక్కపోతే బ్లాకులో ఎక్కువ ధర పెట్టి కొనుక్కున్నట్టు .
షేరు ధరలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి.ప్రభుత్వం పెట్రోల్ ధర పెంచాగానే ఎక్స్  కెమికల్ కంపెనీ షేర్ల ధర పెరగవచ్చు.దానికి కారణాలు అన్వేషించాలి అంటే చాలా లింకులు ఆలోచించాలి.పెట్రోలు ధర పెరిగితే బైక్ లకన్నా లూనాల  డిమాండ్ పెరుగుతుంది. లూనాల టైర్లలో వాడే రసాయనాన్ని ఈ  ఎక్స్  కెమికల్ కంపెనీ తయారు చేస్తుంది.అందువలన వచ్చే సంవత్సరం దీనికి లాభాలు ఎక్కువగా వస్తాయి అన్న ఉద్దేశంతో ఈ కంపెనీ షేరు ధర పెరుగుతుంది.

ప్రధానమంత్రి  , వాణిజ్య మంత్రిని పదవి నుంచి తొలగించాగానే ఒక చెప్పుల కంపెనీ ధర విపరీతంగా పడిపోవచ్చు.దానికి , దీనికి లింక్ ఏమిటని ఆలోచిస్తే సదరు మంత్రి బావమరిదికి  అరబ్ దేశాలకు  చెప్పులు ఎగుమతి చేసే లైసన్స్ ఉండి ఉండవచ్చు.దాని క్రింద లోపాయికారిగా కోట్ల విలువచేసే చెప్పులు ఎగుమతి చేస్తూ లాభాలు గడిస్తూ ఉండవచ్చు.ఇకముందు ఈ ఆటలు సాగవు కదా ? అందుకే ఆ కంపెనీ షేరు ధర పడిపోయింది. ఈ విధంగా దేశంలో ఎక్కడో ఏదో జరిగితే మరెక్కడో షేరు ధరలు పెరగడమో, తరగాడమో  జరుగుతుంది.కేరళలో  వర్షాలు పడితే బొంబాయి కొబ్బరి నూనె కంపెనీ షేరు ధరపై ఆ ప్రాభావం  ఉంటుంది.కార్మిక సంఘాల స్ట్రయికులు , రాజకీయ అనిశ్చితి, పంటలు, యుద్ధం  మొదలగునవి అన్ని కూడా షేర్ల ధరలపై ప్రభావం చూపెడతాయి.దేశంలో ఒక చిన్న కదలిక రాగానే అది ఏ కంపెనీ  మీదా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కరెక్ట్ గా అంచనా వేసి అందరికన్నా  ముందుగా దాన్ని పట్టుకొని దాంతో వ్యాపారం చేసే బ్రోకర్లని స్పెక్యులేటర్లు అంటారు. మనిషి తెలివి తేటలకు వీరి మెదళ్ళు పరాకాష్ట. వీరిలో రెండు రకాలు. బుల్ల్స్, బెర్స్.
స్టాక్ మార్కెట్ లో లో వ్యాపారం చేసే వాళ్ళు సాదరణంగా  ఈ రెండు రకాల్లో ఏదో ఒక రకానికి చెందినవారూ అయి ఉంటారు. మార్కెట్ లో వీళ్ళిద్దరూ ఎప్పుడు యుద్దానికి తలపడే యోదుల్లా ఉంటారు. బుల్ ఆశాజీవి. దేశంలో ఏ చిన్న పరిమాణం జరిగిన షేరు ధర విపరీతంగా పెరుగుతుంది అనుకొనేవాడు.బెర నిరాశాజీవి.ధర అనుకున్నంతగా పెరగదని , కొండకచో తగ్గిపోతుంది అని  భావించేవాడు . ఉదాహరణకు జనవరి 1వ తారీఖున కిలో పంచదార  10 రూపాయలు ఉందనుకొందాం. ఆ సంవత్సరం చెరకు సరిగ్గా పండలేదు అనుకుందాం.మార్చి   31 వ తారీఖు వీరిద్దరూ ఉహించే ధరలు ఈ విధంగా ఉంటాయి.
జనవరి  1 ధర      మార్చి 31ధర  
       బుల్   10              16
      బేర్   10              12
జనవరి ఒకటో తారీఖు పొద్దున్నే బుల్ స్వీట్స్ తీసుకొని బేర్  కి నూతన సంవత్సర శుబాకాంక్షలు చెప్పి బేరం మొదలు పెడతాడు. బ్రదర్   మార్చి 31 వ తారీఖు నాటికి నాకు లక్ష కిలోల పంచాదార కావాలి . కిలో పద్నాలుగు రూపాయల చొప్పున  ఆ రోజు నాటికి ఇవ్వగలవా ? అని అడుగుతాడు.
కొత్త సంవత్సరం మొదట్లో భలే బేరం తగిలిందని బేర్ సంతోషిస్తాడు.మార్చి  31నాటికి అతడు ఉహిస్తున్న ధర  కిలో  12   మాత్రమే. ఆ రోజు   పన్నెండుకి కొని పద్నాలుగికి అమ్మితే రెండు లక్షలు లాభం వస్తుంది అని ఆలోచిస్తాడు.బుల్ ఆలోచనలు వేరు . ఆ రోజు ధర పదహారు రూపాయలు ఉంటే అతడికి రెండు లక్షలు లాభం.ఈ విధంగా ఇద్దరి మధ్య ఒక్క పంచదార పలుకు లేకుండా లక్షల వ్యాపారం చేస్తారు.
మరుసటి ఆర్టికల్ లో షేర్ మార్కెట్ లో మోసాలు ఎలా జరుగుతాయి . హర్షద్ మెహతా  చేసిన మోసం ఎలాంటిదో  తెలుసుకుందాం. 

బంగారంలో ఇప్పుడు పెట్టుబడి పెడితే రానున్న మూడేళ్లలో రెట్టింపు కావడం నిజమేనా ?


బంగారంలో ఇప్పుడు పెట్టుబడి పెడితే రానున్న మూడేళ్లలో రెట్టింపు కావడం నిజమేనా ?

రానున్న మూడేళ్ళ కాలంలో బంగారం ధర  రెట్టింపు అవుతుంది అంటే అచ్చర్యపోతున్నారా ? మీరు బంగారం ధర గత కాలంలో ఎలా పెరిగినదో మీకు తెలుసుకదా ? మీరు బంగారం ధర ఒక్కసారి  పరిశీలిస్తే ఇండియా లో డిశంబర్ 2007  10gr బంగారం ధర  రూ .10,000  ఉంటే  డిశంబర్   2010 లో రూ 20,000 లకు చేరుకుంది.అంటే కేవలం మూడు సంవత్సరాలలో రెట్టింపు ధరకు చేరుకుంది . సెప్టెంబర్ 2009లో  రూ.16500 ఉంటే మూడు సంవత్సరాలో  అంటే 2012లో రూ.32500 కు చేరుకుంది ఇప్పుడు కూడా మూడు సంవత్సరాలలో రెట్టింపు ధరకు చేరుకుంది.
మనదేశం బంగారాన్ని అధిక శాతం విదేశాలనుండే  దిగుమతి చేసుకుంటుంది. అందువలన మన దేశంలో బంగారం ధర అంతార్జాతీయ ధర కి  అనుగుణంగా ఉండదు.
అంతార్జాతీయ మార్కెట్ లో  బంగారం 23 Aug 2011 న $1900 గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు మన దేశంలో బంగారం ధర రూ. 28600 ఉంటే ఇప్పుడు  అంతార్జాతీయ మార్కెట్ లో  బంగారం $ 1730 చేరుకుంటే  మనదేశంలో మాత్రం బంగారం రూ .32500 చేరుకుంది. అంతార్జాతీయ మార్కెట్ లో  బంగారం ధర తగ్గిన మనదేశంలో బంగారం ధర పెరగడానికి ముఖ్య కారణం డాలర్ బలపడటం , రూపాయి బలహీనపడటమే . అంతే కాకుండా రోజురోజుకి బంగారం పై ఇన్వెస్ట్ చేసే వాళ్ళు పెరుగుతుండటం.

రెండు సంవత్సరాల క్రితం డాలర్ కి రూపయాయి మారకపు విలువ రూ 45ఉంటే ఇప్పుడు రూ   55 గా ఉంది.కేవలం రూ. 10తేడా  అంతార్జాతీయ మార్కెట్ లో  బంగారం ధర తగ్గిన మనదేశంలో బంగారం ధర పెరగడానికి కారణమైనది.అంతే కాకుండా అంతార్జాతీయంగా ఆర్ధికమాంద్యం , యూరో జోన్ పరిస్థితులు  హెడ్జ్ ఫండ్స్ ను బంగారంలో అధికంగా ఇన్వెస్ట్ చేయడానికి కారణమవుతున్నాయి.
ఈ బంగారం ధర పెరగడం ఫిజికల్ గా బంగారు అమ్మకాల పై ప్రభావం  చూపినప్పటికీ  గోల్డ్ ETF లో   ఇన్వెస్ట్ చేయడం మాత్రం తగ్గడం లేదు.అంతే కాకుండా దేశంలో వర్షాభావ పరిస్థితులు సాదరణంగానే నమోదు కావడం  నవరాత్రుల తర్వాత మంచి రోజులు ఉండటం .దీపావళి  మొదలగు పండుగల వలన మళ్ళీ బంగారం ఆభరణాలకు గిరాకీ పెరిగే అవకాశం కూడా ఉంది.బంగారం ప్రస్తుతం అధిక స్థాయిల వద్ద ఉన్నప్పటికీ కూడా  అంతార్జాతీయంగా నెలకొన్న ఆర్ధిక పరిస్థితులు, ఇన్వెస్టర్ల నుండి ఉన్న డిమాండ్ , రూపాయి బలహీనత మొదలగు అంశాల ఆధారంగా బంగారం ధర ఇంకా పెరగడానికే అవకాశం ఉంది. మీరు చూస్తూ ఉండగానే బంగారం రూ .32500 నుండి రూ 65000 లకు 2015  కల్లా చేరుకునే అవకాశం అధికంగా ఉంది.
గమనిక : ఏ ఇన్వెస్ట్మెంట్ సాధనం లో ఐనా సరే రిస్కు అనేది తప్పకుండా ఉంటుంది. రిస్కు లేకుండా రిటర్న్ అనేది ఉండదు. అందుకే ఎవరికి వారూ , వారూ భరించగలిగే రిస్కు  కి అనుగుణంగా ఇన్వెస్ట్ చేయడం చేయాలి. పైన బంగారం పై కేవలం నా  అభిప్రాయం తెలియచేయడం జరిగినది.
telugufinancialschool@gmail.com