క్రమం తప్పకుండా ఆదాయం పొందడానికి మార్గాలు.


క్రమం తప్పకుండా ఆదాయం పొందడానికి   మార్గాలు.

సాదారణంగా ఇన్వెస్టర్ల లో  షార్ట్ టర్మ్ , మీడియం టర్మ్, లాంగ్ టర్మ్, కాకుండా మరొక రకం ఇన్వెస్టర్లు కూడా ఉంటారు. వారు  ఒకేసారి పెద్ద మొత్తం సొమ్మూ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ సాధనాలలో   ఇన్వెస్ట్ చేసి దానిపై  క్రమం తప్పకుండా ఆదాయం పొందాలి అనుకునేవారు . చాలా వరకు ఇలాంటి ఆలోచన ఎక్కువగా రిటైర్మేంట్  అయిన వారికి ఉంటుంది. రిటైర్మేంట్  అయిన వారే కాకుండా  ఎవరైనా సరే క్రమం  తప్పని ఆదాయం పొందడానికి గల మార్గాలు  ఏమి ఉన్నాయో ఒకసారి చూద్దాం  .

పోస్టాపీసు మంత్లీ ఇన్ కమ్  స్కీమ్స్  

ఈ పథకంలో వ్యకిగతంగా Rs  4.5 Lakhs వరకు జాయింట్ గా ఐతే  Rs 9 Lakhs వరకు  ఇన్వెస్ట్ చేయవచ్చు. కాల పరిమితి ఐదు సంవత్సరాలు. ప్రస్తుతం అందచేస్తున్న వడ్డీ    8.2% శాతం . ఈ వడ్డీ ని మీరు ఇన్వెస్ట్ చేసిన నెల రోజుల తర్వాత నుండి  క్రమం తప్పకుండా చెల్లిస్తారు.ఇంకా ఈ పథకం పూర్తీ వివరాల కొరకు పోస్టాపీసు మంత్లీ ఇన్ కమ్  స్కీమ్స్  చాప్టర్ లో చూడండి.    

ఫిక్సెడ్ డీపాజిట్ల  నుండి నెలవారీ గా వడ్డీ పొందడం.

ఈ పథకం గురుంచి చాలా మందికి తెలిసిన విషయమే . ఎందుకంటె  ఈ పథకం సురక్షితమైన పథకం అని భావించడమే. ఈ పథకంలో  సాదారణంగా వడ్డీ  శాతం అనేది మీ డీపాజిట్  కాల పరిమితిపై  ఆధారపడి ఉంటుంది.మీరు  వడ్డీ 7-8%    వరకు వస్తుంది అని ఆశించవచ్చు. కాని ఇక్కడ వడ్డీ ఆదాయం పై టాక్సు చెల్లించవలసి ఉంటుంది.

ప్రభుత్వ దీర్ఘకాలిక బాండ్లు.

 సాదారణంగా ఈ బాండ్ల కాల వ్యవధి 25-30 వరకు ఉంటుంది.  వడ్డీ ఆరు నెలలకు ఒక్క సారి చెల్లిస్తారు .వడ్డీ సుమారు  8%  వరకు పొందవచ్చు. ఇది సమయానుకూలంగా మారుతుంది. ఇది కూడా సురక్షితమైన పెట్టుబడి . ఈ బాండ్స్ సెకండరీ మార్కెట్ లో ట్రేడ్ అవుతాయి కాబట్టి  వీటిని మీరు అవసరమైతే సెకండరీ మార్కెట్ లో అమ్ముకోవచ్చు.

సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (Senior citizen Saving Scheme)

 అరవై సంవత్సరాల పై బడిన  వారు ఇన్వెస్ట్ చేయతగిన మంచి పథకం . ఇందులో వడ్డీ సుమారు 9.3% వరకు వస్తుంది దానిని మూడు నెలలకు ఒక్కసారి చెల్లిస్తారు. ఐదు సంవత్సరాల కాల వ్యవధి కలిగి ఉంటుంది . గడువు తర్వాత మరల మూడు సంవత్సరాలు పొడగించుకోవచ్చు.ఐతే 55-60 మధ్య వయసుగల వారు కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. కాని వారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం వలన ఈ  సొమ్మూ వచ్చినట్టుగా  తెలియచేయవలసి ఉంటుంది.

ఇన్సురెన్స్  కంపెనీల నుండి అన్యూటీ ప్లాన్స్ కనుగోలు చేయడం

.మీరు ఎల్ ఐ సి లేదా ఇతర ప్రవేట్ ఇన్సురెన్స్ కంపెనీల నుండి అన్యూటీ ప్లాన్స్ కనుగోలు చేయవచ్చు.కాని వీటి మీదా రాబడి మీరు ప్లాన్స్ కనుగోలు సమయంలో ఎంచుకున్న పద్ధతి పై ఆధారపడి ఉంటుంది.  ఎవరైనా సరే దీనిలో ఇన్వెస్ట్ చేయక పోవడం చాలా మంచిది. 

ఇప్పటి వరకు పైన చెప్పుకున్న పథకాలు అన్ని కూడా  సురక్షితమైనవి . ఇప్పుడు చెప్పుకోబోయే పథకాలు  రిస్కు ను కలిగి ఉంటాయి. కాని ఈ పథకాలలో వచ్చే రాబడి కూడా అధికంగానే   ఉంటుంది.  రిస్క్ భరించే వారు ఎవరైనా సరే ఈ పథకాల లో ఇన్వెస్ట్ చేయడం మంచిది.

SWP (systematic withdrawal plan)

మీరు ఈక్వీటీ మ్యుచవల్  ఫండ్ పథకాలలో  లేదా డేట్  మ్యుచవల్  ఫండ్ పథకాలలో ఇన్వెస్ట్ చేసి మీరు SWP  పద్దతిని ఎన్నుకోండి. ఈ పద్ధతి  సిప్  పద్ధతి కి వ్యతిరేకంగా ఉంటుంది. సిప్ లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తే ఈ  SWP లో మాత్రం  క్రమం తప్పకుండా  ఆదాయం పొందడం జరుగుతుంది. ఈక్వీటీ మ్యుచవల్  ఫండ్స్ లో   రిస్కు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది .  రిస్కు తక్కువగా ఉండాలి అనుకునే వారు డేట్ మ్యుచవల్  ఫండ్ పథకాలలో  ఇన్వెస్ట్ చేయడం మంచిది.

మంత్లీ ఇన్ కమ్ ప్లాన్స్ (MIP).

కొన్ని మ్యుచవల్ ఫండ్స్ పథకాలు  రెగ్యులర్ గా ఆదాయం అందిచడానికి ఏర్పడ్డాయి . కాని వీటిలో ఆదాయం అనేది కేవలం డివిడెండ్ ప్రకటించినప్పుడు మాత్రమె వస్తుంది.   డివిడెండ్  అనేది  లాభం వచ్చినప్పుడు మాత్రమె ప్రకటిస్తారు.  అందువలన రెగ్యులర్ గా ఆదాయం వస్తుంది  అని ఆశించలేం.

షేర్ల నుండి డివిడెండ్ రూపం లో ఆదాయం పొందడం.

 మీరు  కనుక షేర్ మార్కెట్ పై అవగాహన    కలిగి ఉంటే క్రమం తప్పకుండా డివిడెండ్ ప్రకటించే మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి. ఒక కంపెనీ ఎప్పుడూ డివిడెండ్ ప్రకటిస్తుంది అని ఆశించలేం కాబట్టి  ఒక పది  మంచి కంపెనీలను ఎన్నుకొని వాటిలో ఇన్వెస్ట్ చేయండి.  అదే విధంగా మీరు ఓపిక తో  వేచి చూస్తె మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా పెరుగుతుంది.

 

మ్యుచవల్  ఫండ్స్ నుండి డివిడెండ్ రూపం లో ఆదాయం పొందడం.

ఎవరైతే డైరెక్ట్ గా ఈక్విటీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయలేరో వారు మ్యుచవల్  ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి  దానిలో డివిడెండ్ ఆప్షన్ ఎన్నుకోవడం మంచిది.రెంటల్ ఆదాయం పొందడం. 

 అద్దె ఆదాయం పొందడం.

 మీరు  ఇంటిపై    ఇన్వెస్ట్ చేసి   దానిని రెంట్ కి ఇవవ్డం ద్వారా అద్దె ఆదాయం పొందవచ్చు. కాని ఇందులో కూడా  కొద్దిగా రిస్క్  ఉంది. మంచి  కిరాయి దారులు దొరకపోవడం లేదా  రెగ్యులర్ గా అద్దె చెల్లించకపోవడం.క్రమం తప్పకుండా   ఆదాయం అందించే కొన్ని మ్యుచవల్ ఫండ్ పథకాలు

Birla asset allocation conservative, DSPML savings plus aggressive, magnum monthly income plan for SBI, and HDFC MIP long term.

ఈవారం స్టాక్ మార్కెట్ 22-10-2012to26-10-2012


ఈవారం స్టాక్ మార్కెట్ 22-10-2012to26-10-2012


నిఫ్టీ 5815  వద్ద టాప్ ఏర్పాటు కాబడిన అనంతరం గత  తొమ్మిది ట్రేడింగ్ సెషన్స్ నుండి  కేవలం  5635-5725  క మధ్య 100  పాయింట్ల  రేంజ్ లో మాత్రమే కదలాడటం జరుగుతున్నది.నిఫ్టీ  5217  నుండి  5815 చాలా వేగంగా ర్యాలీ జరిగిన అనంతరం ఇప్పుడు కన్సోలిడేషన్ కావడం జరుగుతున్నది. 5635-5725   రేంజ్  బ్రేక్ కానంత వరకు  రెసిస్టన్స్ వద్ద అమ్మడం, సపోర్ట్ వద్ద కనుగోలు చహేయడం చాలా ఉత్తమం. ఒకవేళ  క్రింది వైపు  సపోర్ట్ 5635  బ్రేక్ కావడం జరిగితే  అంతకు ముందు 5554-5575 మధ్య గల గ్యాప్ ను  నింపే అవకాశం కూడా కలదు,.రాబోయే వారం డెరివేటివ్స్ కాంట్రాక్ట్ ఎక్స్ఫైరీ కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది.నిఫ్టీ 5830  బ్రేక్ కావడం జరిగితే  5940 వరకు ర్యాలీ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ 5635  బ్రేక్ జరిగితే 5585  వరకు అది కూడా బ్రేక్ కావడం జరిగితే  నిఫ్టీ సులభంగా 5554-5575  మధ్య ఏర్పాటు కాబడిన గ్యాప్ నింపే అవకాశం ఉంది.

స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ ట్రైనింగ్


స్టాక్ మార్కెట్ లో మీరు ఎప్పుడు నష్టాలనే పొందుతున్నారా ? లాభాలు ఎలా వస్తాయో మీకు తెలియడం లేదా ?.ఇంకా ఎంత వరకు మీరు మార్కెట్ డైరెక్షన్ కోసం లేదా కాల్స్ కోసం ఇతరులపై ఆధారపడతారు.మీరే టెక్నికల్ అనాలసిస్ నేర్చుకోండి. మీకు టెక్నికల్ అనాలసిస్ తెలుగులో బేసిక్ నుండి నేర్పడమే కాకుండా యే ట్రేడింగ్ స్ట్రాటజీ ఉపయోగించి  లాభాలు అందుకోవచ్చో తెలుపడం జరుగుతుంది. టెక్నికల్ అనాలసిస్ అనేది చాలా విస్తృతమైన సబ్జెక్ట్  అందులో ఏది అవసరమో కాదో తెలుసుకోవడం చాలా కష్టం. మేము మీకు అవసరమైనవి తెలియచేయడమే కాకుండా నేర్చుకున్నవాటిని యే విధంగా ఉపయోగించాలో తెలియచేస్తాం. చాలా ఇనిస్టిట్యూట్స్ సుమారు యాభై వేల నుండి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తాయి.  మీ ఇంటికి వచ్చి మీకు నేర్పడం జరుగుతుంది. టెక్నికల్ అనాలసిస్ నేర్చుకోండి .స్వయంగా లాభాలు సంపాదించుకొండి. మీరు లెర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ సాధ్యం అవుతుంది.లెర్నింగ్ లేకపోతే మీకు మార్కెట్ లో నష్టాలు సంభవించడం చాలా సర్వసాదారణం .ఈ ప్రపంచంలో ఏది ఉచితంగా రాదు అనే విషయం తెలుసుకోండి.ఇంకా ఎంత కాలం స్టాక్ మార్కెట్ కోసం ఇతరుల మీదా , టి .వి. అనలిస్టుల మీదా ఆధారపడతారు.స్టాక్ మార్కెట్ లో ఒక్కరి మీదా ఆధారపడే వారూ ఎప్పుడు లాభాలు అందుకోలేరు.మీకు మేము స్టాక్ మార్కెట్ అనే అడవిలో లాబలతో బయట పడటానికి కావలసిన రోడ్ మ్యాప్ యే విధంగా ఏర్పాటు చేసుకోవాలో నేర్పుతాం.మీకు స్టాక్ మార్కెట్ పై పూర్తీ అవగాహన లేకపోతే మీ వద్ద గల మొత్తం కాపిటల్ నష్టపోయే ప్రమాదం అధికంగా కలదు.స్టాక్ మార్కెట్ నిన్న ఉంది, నేడు ఉంది , రేపు కూడా ఉంటుంది. కాని ఒక్కసారి మీ కాపిటల్ లాస్ ఐతే మీరు చేయగలిగేడి ఏమి ఉండదు. అందువలన మీరు స్టాక్ మార్కెట్ పై ఇతరుల మీదా ఆధారపడకుండా స్వయం నిర్ణయం యీసుకొనే శక్తి సంపాదించుకొండి . పెద్ద పెద్ద ఇన్స్టిట్యుట్స్ వేలు , లక్షల ఫీజు తీసుకుంటాయి. మీరు క్లాసు రూం లో కాని , సెమినార్ లో కాని మీకు వచ్చిన సందేహాలు  లేదా మీరు ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగిస్తే లాభాలు అందుకోగలరో   తెలియచేయరు. కాని మేము మీకు వ్యక్తిగతంగా  తెలుగులో మీకు కాన్సెప్ట్ అర్ధంఅయ్యేలా  నేర్పడం వలన మీకు స్టాక్ మార్కెట్ పై గల అపోహలు అన్ని పోతాయి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి స్టాక్ మార్కెట్ అంటే మీరు సరియైన మార్గంలో అనాలసిస్ చేయగలిగితే సంపద స్ప్రుటించే సాధనం.మీరు ఏదో  షేర్లు కొన్నాం , అమ్మాం  అంటే తప్పకుండా నష్టాలే వస్తాయి. అలా కాకుండా మీరు స్టాక్ మార్కెట్ లో డబ్బులు సంపాదించాలి అంటే మీకు పూర్తీ అవగాహన అవసరం. మీరు ఒక బిజినెస్ లో డబ్బులు సంపాదించడానికి ఎంత కష్టపడతారో   స్టాక్ మార్కెటులో సంపాదించాలి అంటే కూడా దానిని కూడా ఒక బిజినెస్ గానే చూడాలి. అందువలన మీరు స్టాక్ మార్కెట్ పై  పట్టు సాధించాలి అంటే మేము మీకు నేర్పించే స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ ట్రైనింగ్ తీసుకోండి.గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్టుగా  మీరు టెక్నికల్ అనాలసిస్ నేర్చుకోవడానికి  ట్రైనర్ లేదా మెంటర్  తప్పనిసరి. మీరు ఒక్కరోజు స్టాక్ మార్కెట్ లో పొందే నష్టంతో టెక్నికల్ అనాలసిస్ నేర్చుకున్నట్టు ఐతే మీరు తర్వాత నుండి విజయవంతమైన ట్రేడర్ కాగలరు. మీరు టెక్నికల్ అనాలసిస్ నేర్చుకున్న తర్వాత కేవలం యాభై వేల రూపాయల పెట్టుబడితో  సంవత్సరం తిరిగే సరికల్లా ప్రతినెల లక్ష రూపాయలు యే విధంగా సంపాదిన్చావచ్చో మీకు వివరంగా తెలియచేయడం జరుగుతుంది.       
వివరాలకు   telugufinancialschool@gmail.com

PMS అంటే ఏమిటి ?



PMS  అంటే ఏమిటి ?
PMS అంటే ఫోర్ట్ ఫోలోయో మేనేజ్మెంట్  సర్వీస్ .సాదారణంగా చాలా మంది ఇన్వెస్టర్స్ స్టాక్  మార్కెట్ పై పూర్తీ అవగాహన లేకుండా  ప్రవేశించి  వారి వద్ద ఉన్న కాపిటల్ పూర్తీగా నష్టపోతుంటారు. కొంత మందికి అవగాహన ఉన్న పూర్తీ సమయం కేటాయించలేకపోవచ్చు. స్టాక్ మార్కెట్ లో అనుక్షణం అప్రమత్తత , అవగాహన తప్పనిసరి. స్టాక్ మార్కెట్ నిన్న ఉంది, నేడు ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. కాని ఒక్కసారి మీ వద్ద ఉన్న కాపిటల్  నష్టం  జరిగితే  ఇక మీరు  స్టాక్ మార్కెట్ లో ఏమి చేయలేరు.ఈ PMS సర్వీస్ లో మేము మీ ట్రేడింగ్ అకౌంట్ లో ట్రేడ్ చేసి వచ్చిన లాభాలలో వాటా తీసుకుంటాం.ఐతే దీనికి మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ లో  కనీసం పదిహేను శాతం కాపిటల్ రిస్కు తీసుకోవడానికి  మాత్రం తప్పనిసరిగా సిద్దంగా ఉండాలి.  ఇన్వెస్ట్మెంట్ అంటే నే రిస్కు . రిస్కు లేకుండా లాభాలు ఆశించడం  ఎంత మాత్రం సాధ్యం కాదు. స్టాక్ మార్కెట్ లో రిస్కు అనేది అన్ని వేళలా ఉంటుంది. రిస్కు తీసుకొనే స్వభావం మీకు లేకపోతే మీరు స్టాక్ మార్కెట్ వైపే కాదు ఏ ఇన్వెస్ట్మెంట్ సాధనం వైపు చూడవద్దు. ఒకవేళ  మేము అందించే ఈ PMS సర్వీస్ లో మేము  మీ కాపిటల్  పై కేవలం పదిహేను శాతం మాత్రమే రిస్కు తీసుకుంటాం.ఒకవేళ  మీ కాపిటల్ లో పది హేను శాతం నష్టం సంభవిస్తే మీరు మా సర్వీసు ను ఉపసంహరించుకోవచ్చు.మేము  మీ వద్ద  లాభాలలో వాటా తీసుకుంటున్నాం కాబట్టి  ముందుగా మీ కాపిటల్ ప్రొటక్షన్ కి అధికంగా ప్రాముఖ్యత  ఇవ్వడం జరుగుతుంది. మేము మీ అకౌంట్ లో ట్రేడింగ్ చేయడానికి  మీరు మాకు అనుమతి ఇస్తూ తప్పనిసరిగా అథరైజేషణ్ ఇవ్వవలసి ఉంటుంది. మీ అకౌంట్ లో వచ్చే లాభాలు ముందుగా మీ బ్యాంక్ ఖాతాలోకి  వచ్చినా పిదప మీరు మా వాటా మా బ్యాంక్ ఖాతాలోకి  జమ చేయవలసి ఉంటుంది. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ పై మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ప్రతి నెల 10% నుండి   40% వరకు లాభాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్  పెరగడం , పడిపోవటంతో  సంభందం లేదు. ఎందుకంటె మేము మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంటే అదే విధంగా మా ట్రేడింగ్ ఉంటుంది. అంటే పెరుగుతున్నప్పుడు లాంగ్ , పడిపోతున్నప్పుడు షార్ట్ పొజిషన్ తీసుకోవడం జరుగుతుంది.  ఈ PMS సర్వీసు పూర్తీ పారదర్శకత తో ఉంటుంది. మీ అకౌంట్ వివరాలు ఏ రోజు కి ఆరోజు చూసుకోవచ్చు. మిగితా వివరాలకోసం telugufinancialschool@gmail.com సంప్రదించండి.

మీరూ ఇన్సురెన్స్ చేసే సమయంలో జరిగే పొరపాటు వలన మీ మరణానంతరం మీ కుటుంబం ఏ విధంగా ఇబ్బంది పడుతుందో తెలుసుకోండి.

మీరూ ఇన్సురెన్స్ చేసే సమయంలో జరిగే పొరపాటు వలన మీ మరణానంతరం మీ కుటుంబం ఏ విధంగా ఇబ్బంది పడుతుందో తెలుసుకోండి.
 కొన్ని రోజుల క్రితం ‘Crime Patrol’ అనే ప్రోగ్రాం సోనీ టి వి లో చూడటం జరిగినది. కథ విషయానికి వస్తే గుజరాత్ లోని ఒక యువ వ్యాపారవేత్త  తన తెలివితేటలతో  తన కుటుంబానికి ఉన్న ఆర్ధిక ఇబ్బందులను తొలగించే ప్రయత్నంలో తన కుటుంబాన్నే ఏ విధంగా ఇబ్బందుల్లోకి నేట్టివేసిందో తెలియచేస్తుంది.  ఆ యువ వ్యాపారవేత్త  తనకున్న ఆర్ధిక ఇబ్బందులనుండి  కనీసం తన కుటుంబాన్ని ఐనా  భయటపడేయాలి అనే ఉద్దేశంతో  తన కోసం భీమా చేయించి  తనని ఎవరైనా చంపివేస్తే  భీమా ద్వారా వచ్చే సొమ్ముతో తన కుటుంభం ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ఉంటుంది కదా అనే ఆలోచనతో  Rs. 1.25 కోట్ల రూపాయలకి భీమా చేయించుకున్నాడు. దీని కోసం అతను  Rs. 20-30 లక్షల మధ్య గల  వేరువేరు భీమా పాలసీలు తీసుకోవడం జరిగినది. ఈ భీమా పాలసీల అన్నింటికీ సక్రమంగా  భీమా ప్రీమియం చెల్లించడం చేసాడు. ఒకానొక రోజు హైవే రోడ్డు పై ఆ యువ వ్యాపారవేత్త  తన కారులోనే హత్యగావించబడినాడు...కట్  చేస్తే   అతను తన స్నేహితుడిని తనతో పాటు కారులో ప్రయాణించి తనని హత్య చేస్తే తన కుటుంబం ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ఉంటుంది అనే ఆలోచించాడు. ఎందుకంటె  తను మర్డర్ చేయబడితే తన కుటుంబానికి తను బీమా చేసిన సొమ్మూ మొత్తం అందుతుంది అనుకున్నాడు కాని అతను చేసిన పొరపాట్లు ఏమిటో చూద్దాం.అదే ఆత్మహత్య ఐతే పాలసీ చేసిన సంవత్సరం లోపు ఐతే ఎటువంటి భీమా పరిహారం రాదు అనే విషయం తెలుసుకాబట్టి మర్డర్ ప్లాన్ ఎన్నుకోవడం జరిగినది. ఐతే అతడు Rs. 20-30 లక్షల మధ్య గల  వేరువేరు భీమా పాలసీలు తీసుకోవడం జరిగినది అని అనుకున్నాం కదా ? కాని ఈ విధంగా వివిధ పాలసీలు తీసుకుంటున్నప్పుడు  వాటి వివరాలు మిగితా ఇన్సురెన్స్  కంపెనీలకు  తెలియచేయవలసిన భాద్యత అతనిపై ఉంది.అతనికి Rs. 20 లేదా  Rs.  30 లక్షల భీమా  పాలసీ అతనికి ఇస్తున్నప్పుడు ఇన్సురెన్స్ కంపెనీకి అతనికి గల వివిధ రకాల పాలసీల గురించి తెలియదు కదా ? ఇదే అందరూ చేసే చాలా చాలా పెద్ద పొరపాటు. మీరూ ఏ కొత్త  భీమా పాలసీ తీసుకున్న మీకు గల ఇతర  భీమా పాలసీల వివరాలు తెలియచేయడం చాలా మంచిది.అతను మరోక  విషయం  కూడా మర్చి పోవడం జరిగినది. లైఫ్ పాలసీలు తొందరగా అంటే పాలసీ తీసుకున్న రెండు సంవత్సరాలలోపు  క్లైమ్ కొరకు వస్తే వాటిపై  తప్పనిసరిగా  విచారణ జరుగుతుంది.ఇది మీకు ఎందుకు చెప్పడం జరుగుతున్నది అంటే  ఆ యువకుడు తన ఆర్ధిక ఇబ్బందుల గురించి తన కుటుంబానికి తెలియచేసి ఉంటే  ఏదో విధంగా సహాయం అందేది. ఇప్పుఉద్ అతని వలన అతనకి సహాయం చేసిన స్నేహితుడు కూడా జైలు పాలు కావడం జరిగినది. ఆ యువకుడు ఒక విషయం మర్చిపోయాడు. ఇన్సురెన్స్ కంపెనీలు చారిటీ సంష్టాలు కాదు అనే విషయం.మీరూ నిజాయితీతో అన్ని వివరాలు తెలియచేస్తే మీ  క్లైమ్ తిరస్కరించే అవకాశం ఎంత మాత్రం ఉండేదికాదు. ఆ యువకుడి భీమా పాలసీలలో ఒక బీమా పాలసీ ఐదు సంవత్సరాల క్రితం నాటిది కాబట్టి, ఆ పాలసీ భీమా అమౌంట్ మాత్రమే అతని కుటుంబానికి రావడం జరిగినది. అందువలన ఎవ్వరైనా సరే మీరూ కొత్త పాలసీ తీసుకుంటున్నప్పుడు మీ పాత భీమా పాలసీల వివరాలు తప్పక అందచేయండి.   

బంగారంలో పెట్టుబడి ఎంత శాతం ఉండాలి ?

బంగారంలో పెట్టుబడి ఎంత శాతం ఉండాలి ?

ఈ మధ్య నేను తరచుగా అందుకుంటున్న మెయిల్స్ లో అధిక భాగం  బంగారంలో పెట్టుబడి  గురుంచే అధికంగా ఉంటున్నాయి. దానికి ముఖ్య కారణం ఈ మధ్య బంగారం రేటు అధికంగా పెరగడం కూడా ఒక కారణం. నేను అందుకున్న మెయిల్స్ లో అధిక భాగం వారి వద్ద ఉన్న పెట్టుబడిలో బంగారంలో ఎంత శాతం పెట్టుబడిగా పెట్టాలి ?  బంగారం లో పెట్టుబడి పై మీ ఉద్దేశం ఏమిటి ? లాంటి  ప్రశ్నలు అధికంగా ఉన్నాయి.దీనికి నా సమాధానం వ్యక్తిగతంగా నా పోర్ట్ ఫోలియో లో 5% కంటే అధికంగా పెట్టుబడి ఉండటానికి నేను అసలు ఇష్టపడను. అదే విధంగా ఇన్వెస్టర్లను కూడా వారి  పోర్ట్ ఫోలియో లో  10%  కంటే అధికంగా పెట్టుబడి పెట్టడాన్ని ఎంత మాత్రం మంచిది కాదు అనే హెచ్చరిస్తాను. ఎందుకంటె ఒక ఆర్ధిక నిపుణుడిగా బంగారం పై నాకంటూ ఒక నిచ్చిత అభిప్రాయం ఉంది. నేను కొన్ని సంవత్సరాలుగా అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ అసెట్ తరగతులను నిశితంగా విశ్లేషించడం జరిగినది.వాటిలో బంగారం యొక్క విలువను లెక్కించడానికి సరియైన పద్దతంటూ లేదు. మనం సాదారణంగా దేనిలో అయినా పెట్టుబడి పెడుతున్నాం అంటే   దాని యొక్క ప్రస్తుత విలువను, ఆదాయ వ్యయాలను, బ్యాలన్స్ షీట్ మొదలగు వాటిని పరిశీలించి దాని భవిష్యత్తు ను అంచానా వేస్తాం. కాని బంగారం మాత్రం ఎలాంటి ఆదాయాన్ని ఇవ్వదు. అందువలన దాని విలువను ఖచ్చితంగా అంచనా  వేయడం మాత్రం ఆచరణాత్మకంగా సాధ్యం కాదు.   
సాదారణంగా బంగారం ధర అమెరికా మానిటరీ పాలసీ తో ప్రత్యక్ష సంభందం కలిగి ఉంటుంది. అమెరికా మానిటరీ పాలసీ లో పెరుగుదల లేదా తగ్గుదల బంగారంపై  ప్రభావం కలిగి ఉంటుంది.బంగారం విలు కట్టడానికి అనేక సిద్దాంతాలు ప్రతిపాదిన్చాబడ్డాయి. వాటిలో. అమెరికా మానిటరీ పాలసీ , ద్రవ్యోల్భణం. ముడిచమురు ధరలు మొదలగునవి ఉన్నాయి. కాని ఇవి ఏవి కూడా ఖచ్చితమైనవి  కావు.ఎందుకంటె బనగారాం ఎలాంటి ఆదాయాన్ని ఉత్పత్తి కానీ  , జనరేట్ చేయడం కాని చేయదు.అందువలన బంగారం యొక్క  విలువ ఖచ్చితంగా అంచానా వేయడం సాధ్యం కాదు. అందువలన నేను నా పెట్టుబడిలో 5% కంటే అధికంగా బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడను. అదే విధంగా ఎవ్వరిని కూడా 10%  కంటే అధికంగా పెట్టుబడి పెట్టడానికి సలహా ఇవ్వను.ఐతే కొంత మంది నాతో విభేదించవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా బంగారం ఈక్విటీ మార్కెట్ కంటే అధిక ప్రతి ఫలం అందిస్తుంది కదా ? అని. రెండు మూడు సంవత్సరాల నుండి  ఈక్విటీ మార్కెట్  తక్కువ ప్రతి ఫలం అందించిన దీర్ఘకాలంలో మాత్రం  ఈక్విటీ మార్కెట్  కంటే అధిక రాబడి అందించే సాధానాలు లేవనే చెప్పాలి. కాకపోతే  ఈక్విటీ మార్కెట్  లో మంచి అవగాహనతో ఇన్వెస్ట్ చేయడం చేయాలి. అంతే కాని ఎవ్వరో చేప్పారని, ఎవ్వరో ఇన్వెస్ట్ చేసారని కాకుండా మీరు స్వయంగా విశ్లేషించే సామర్ధ్యం తప్పకుండా కలిగి ఉండాలి.స్టాక్ మార్కెట్ పై మీకు ఏ మాత్రం అవగాహన లేకున్న నష్టాలపాలు కావడం చాలా సర్వసాదారణం. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆర్ధిక విషయాలపై అవగాహన కలుగ చేసుకోవాలి. Learn to earn 

మ్యూచవల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వలన కలిగే ప్రయోజనాలు


మ్యూచవల్  ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వలన కలిగే  ప్రయోజనాలు 

Professional Management

మ్యూచవల్  ఫండ్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బును సరియైన పద్దతిలో ఇన్వెస్ట్ చేయడానికి అపారమైన అనుభవం  , నైపుణ్యం కలిగిన ఫండ్ మేనేజర్లు ఉంటారు. వారికి సహాయంగా మీ ఇన్వెస్ట్మెంట్ చూడాటానికి  టీం కూడా ఉంటుంది. వారు ఈక్విటీ ఫండ్స్  మరియు డేట్స్ ఫండ్స్  లలో ఇన్వెస్ట్ చేయడానికి ముందు రీసేర్చీ చేసి  పూర్తీ అవగాహన తో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు.మీరు   మ్యూచవల్  ఫండ్స్ గత చరిత్ర ను ఇంతవరకు పరిశీలించిన వారు స్థిరమైన రాబడిని అందిస్తున్నారు.
Diversification

మీ ఫోర్ట్ ఫోలియోలో  డైవరిఫికేషన్ అనేది మీ పెట్టుబడికి రక్షణగాను  , దానికి స్థిరత్వం ఇచ్చేదిగా  ఉంటుంది.ఫండ్ మేనేజర్ మీ దగ్గర నుండి సేకరించిన డబ్బును వివిధ రకాల స్టాక్స్ మరియు సేక్యురిటిలలో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ వైవిధ్యమైన పెట్టుబడి ఇన్వెస్టర్స్ కు మంచి రాబడి అందిస్తుంది. అదే  మీరు స్వయంగా ఇన్వెస్ట్ చేస్టే  ఈ వైవిధ్యమైన పెట్టుబడి చేయడం మీకు సాధ్యం కాకపోవచ్చు. అంతే కాకుండా కొన్ని సమయాలలో మీ దగ్గర ఉన్న చిన్న మొత్తం ద్వారా ఇది అసలే సాధ్యం కాదు. కాని మ్యూచవల్  ఫండ్స్ కొంత మొత్తం ద్వారా కూడా సాధ్యం అవుతుంది.

Convenient Administration

మీరు మ్యూచవల్  ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం  ఎంతో సులభం . మీరు మ్యూచవల్  ఫండ్ పథకాన్ని నిపుణుడి సహాయంతో  ఎన్నుకొని ,దరఖాస్తు ఫారాన్ని  నింపి ,వారి పేరు మీదా చెక్కు  జారీ చేసి రావడమే .ఇది మొత్తం రెండు నిమిషాల పని . అదే విధంగా మీ ఇన్వెస్ట్మెంట్ తిరిగి తీసుకోవడం కూడా చాలా సులభం.
Return potential

మ్యూచవల్  ఫండ్స్ లో   మధ్య కాలం నుండి దీర్ఘ కాలం కొరకు ఇన్వెస్ట్ చేసినచో మంచి రాబడి అందిస్తాయి.ఎందుకంటే వారు వివిధ పథకాలలో ఇన్వెస్ట్ చేస్తుంటారు కాబట్టి.   


Low cost

కాబట్టి.   మీరు ఎటైనా ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సులో వెళ్ళిన దానికంటే మీ స్వంత వాహనంలో వెళ్ళితే అధిక ఖర్చు   ఏ విధంగా  అవుతుందో అదే విధంగా ఇక్కడ కూడా  మ్యూచవల్  ఫండ్స్ పథకాలలో కొన్ని వేల మంది ఇన్వెస్ట్ చేయడం వలన ఫండ్ నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. దానితో  మీకు కూడా తక్కువ ఖర్చు అవుతుంది. 
Liquidity

మ్యూచవల్  ఫండ్స్ పథకాలలో నుండి మీరు ఎప్పుడు కావలి అంటే అప్పుడు ఉపసంహరించుకోవచ్చు.మీరు ఉపసంహరణ దరఖాస్తూ సంతకం చేసి ఇచ్చిన రెండూ మూడు రోజులలో మీ డబ్బు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.   ఒక వేళ ప్రతేకంగా ఆ పథకానికి లాక్ ఇన్ పిరియడ్ , టాక్స్ సేవింగ్ పథకం ఐతే మాత్రం  సాధ్యం కాదు.ఓపెన్ ఎండెడ్ పథకాలనుండి ఎప్పుడైనా బయటకు రావచ్చు. క్లోజ్ ఎండెడ్ పథకాల యూనిట్స్ ని స్టాక్ ఎక్సేంజీ లో ఎప్పుడైనా అమ్ముకోవచ్చు.  మీకు   టాక్స్ సేవింగ్   అవసరమైతే తప్ప లేనిచో టాక్స్ సేవింగ్ పథకాల వైపు వెళ్ళవద్దు.
Transparency

పారదర్శకత  అనేది మ్యూచవల్  ఫండ్స్ యొక్క ముఖ్యమైన ప్రయోజనం .ఒక ఇన్వెస్టర్ గా మీ డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ చేయబడినది , ప్రస్తుతం దాని విలువ ఎంత ఉన్నది మొదలగు వివరాలు మీకు క్రమం తప్పకుండా తెలియచేయబడతాయి.

Choice of schemes
మీ పెట్టుబడి లక్ష్యాలకు అనుగుణంగా , మీరు తీసుకొనే రిస్కు స్వభావానికి అనుగుణంగా , మీరు నిర్ణయించుకున్న నిర్ణీత కాలానికి అనుగుణంగా  , మీ అవసరాలకు అనుగుణంగా ,మీరు వివిధ రకాల మ్యూచవల్  ఫండ్స్ పథకాలను ఎంచుకొనే  అవకాశం కలదు. మీకు  ఈక్వీటీ   మార్కట్ , డేట్ మార్కెట్ , మనీ మార్కెట్ , ఈ టి ఫ్స్  , గోల్డ్ ఈ టి ఫ్స్, టాక్స్ సేవింగ్ ,  ఇలా  వివిధ రకాల పథకాలు  మీకు అందుబాటులో ఉంటాయి.

Well regulated

మీ అన్ని మ్యూచవల్  ఫండ్స్ కూడా సేబీ వద్ద రిజిస్టర్ కాబడి , సెబీ నిబందనల ప్రకారం పనిచేయబడతాయి. ఈ మ్యూచవల్  ఫండ్స్ ను సేబీ రెగ్యులర్ గా మానిటర్ చేస్తుంది.

Tax benefits
మ్యూచవల్  ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా  టాక్స్ మినహాయింపులు పొందవచ్చు. ఈ మినహాయింపులు సమయానుకూలంగా  మారుతుంటాయి. మనం దీని గురుంచి మరో చాప్టర్ లో చదువుకుందాం. 

భవిష్యత్తులో బంగారం ధర ఏ విధంగా ఉంటుందో ఎలా అంచనా వేయాలి ?


భవిష్యత్తులో బంగారం ధర ఏ విధంగా  ఉంటుందో  ఎలా అంచనా వేయాలి ?
భవిష్యత్తులో బంగారం ధర ఏ విధంగా  ఉంటుందో లెక్కించడం , అంచనా వేయడం  ఏ మాత్రం కష్టమైన పని కాదు. నిజం చెప్పాలి అంటే  మనం బంగారం అసలు ధర భవిష్యత్తులో ఎంత ఉంటుంది అని ఉహించడం కాదు ,US  గోల్డ్ రిజర్వు యొక్క విలువ కనుగొంటున్నాం. దీనిని స్కూల్ కి వెళ్ళే బాలుడు కూడా చేయవచ్చు. ఇది సాదారణ అల్జీబ్రిక్ మ్యాథ్స్ .దీనిని క్రింది విధంగా లెక్కించవలసి ఉంటుంది. ఉదాహరణకి ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం అమెరికా వద్ద 8673.5 (మార్చి 2011 ) టన్నుల గోల్డ్ రిజర్వు ఉంది. . US మానిటరీ బేస్ (జూన్ 2011) 2.6 ట్రిలియన్ల డాలర్లు    లేదా  2600  బిలియన్ల డాలర్లు గా ఉంది.  ఆగస్టు 2011 లో బంగారం ధర  అవున్స్ ( ounce)1784  డాలర్లు గా ఉంది. మీరు ఎప్పుడు కూడా బంగారం భవిష్యత్తు  గురించి ధర అంచనా వేయాలి అంటే మీకు మూడు  విషయాలు తప్పకుండా తెలియాలి.అవి
లేటెస్ట్ గోల్డ్ రిజర్వ్ డేటా .
లేటెస్ట్ US మానిటరీ బేస్
ప్రస్తత బంగారం ధర అవున్స్ ( ounce) కి ఎంత ఉంది అనే విషయాలు ముందుగా మీరు తెలుసుకోవాలి. పై మూడు విషయాలు తెలిస్తే మీరు బంగారం ధర సులభంగా అంచానా వేయవచ్చు.
ఉదాహరణకి పై మూడు విలువలు

The US Monetary Base (Aug 2011) is US $ 2.6 Trillion ($ 2600 Billion)
• The Gold Price in Aug 2011 is US $ 1784 per ounce &

The US Reserve Gold in March 2011 was 8673 Tonnes
So,
8673 Tonnes Gold = $ 2600 Billion ($ 2.6 Trillion)
So 01 Tonne Gold = $ 0.29978 Billion. = $ 299.78 Million
Now, 1 Tonne = 1000 KG = 1000000 Grams
Now, 1 Ounce = 28.3495 Grams = 0.0283495 KG
Now, 28.3495 Grams = 1 Ounce
1000000g = 35273.9620 Ounce.

 So 1 Tonne = 35273.9620  Ounce
So Approx. 1 Tonne = 35273Ounce.
Now, 35273 Ounce (1 Tonne) Gold = $ 299.78 Million
So 1 Ounce Gold = $0.0084985181 Million = $ 8498.518
So 1 Ounce Gold = $ 8498.518
The current price (Aug 2011) of Gold is $ 1784 per 1 Ounce.
The difference is $ 6714.518
This is 4.76 Times price Hike.
 కావున  బంగారం ధర ఇంకా 4.76  రేట్లు పెరగడానికి అవకాశం  ఉంది. ఉదాహరణకి ఇండియా లో బంగారం ధర 10gr రూ 32000 ప్రస్తుతం ఉంటే   రూ 152300 లకు లేదా అంతకంటే ఎక్కువకు చేరడానికి అవకాశం ఉంది. ఎప్పుడు చేరుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేం. కాని చేరడానికి గల అవకాశాన్ని కొట్టిపారేయలేం.బంగారం ధర పెరగడం అనేది US మానిటరీ బేస్ పై  ఆధారపడి ఉంటుంది కదా ?

బంగారం ధర ఎప్పుడు ఎందుకు పెరుగుతుంది. ఎప్పుడు ఎందుకు తగ్గుతుంది.?.


బంగారం ధర ఎప్పుడు  ఎందుకు పెరుగుతుంది.  ఎప్పుడు ఎందుకు తగ్గుతుంది.?.

మీరూ ఇదివరకే గోల్డ్ స్టాండర్ట్ గురించి తెలుసుకున్నారు కదా ? ఇప్పుడు US మానిటరీ బేస్  గురించి తెలుసుకోండి. సాదారణ పరిబాషలో సులభంగా అర్ధం అయ్యేలా చెప్పాలి  అంటే మానిటరీ బేస్ అనగా చలామణిలో ఉన్న కరెన్సీ  లేదా మనీ సప్లై . US మానిటరీ బేస్  అనగా  ఆ దేశ ప్రభుత్వం కాలానుగుణంగా  ముద్రించినటువంటి  కరెన్సీ.

మీరు పై చార్ట్ గమనించినట్టు ఐతే 2007 వరకు US మానిటరీ బేస్   800 బిలియన్ డాలర్లు  మాత్రమే. కాని 2011 వచ్చే సరికి US మానిటరీ బేస్   2.6 ట్రిలియన్లు లేదా  2600 బిలియన్ డాలర్ల కు చేరుకుంది. అంటే కేవలం నాలుగు సంవత్సరాలలో 1.8 ట్రిలియన్లు లేదా  1800 బిలియన్ల డాలర్లు ముద్రించడం జరిగినది.1970 తర్వాత ఎప్పుడయితే  గోల్డ్ స్టాండర్డ్ తీసివేయడం జరిగినదో  అప్పటి నుండి  US వారి అవసరానికి అనుగుణంగా కరెన్సీ నోట్లు ముద్రించుకుంటుంది. 1970 నుండి వాస్తవంగా  బంగారానికి , డాలర్ కి మధ్య ఎలాంటి సంభందం లేదు. నిజం చెప్పాలి అంటే బంగారం  నిజమైన మనీ. దీని ధర   US మానిటరీ బేస్   కి అనుగుణంగా  మారుతుంది. మీకు ఇది వరకే తెలియచేయడం జరిగినది కదా ?. US ప్రభుత్వం ఎప్పుడూ కావాలి అంటే అప్పుడు  కరెన్సీ నోట్లను ముద్రించుకుంటుంది కదా ?  ఈ విధంగా ముద్రించిన కరెన్సీ నోట్లు చలామణిలోకి రావడంతో వాటి కనుగోలు శక్తి తగ్గిపోతుంది కదా ?  అప్పుడు బంగారం ధర ఆటోమేటిక్ గా పెరుగుతుంది. అంటే డాలర్ బలహీనపడటం. బంగారం బలపడటం జరుగుతుంది. ఎప్పుడయితే US మానిటరీ బేస్  పెరుగుతుందో అప్పుడు ప్రపంచంలో డాలర్ల చలామణీ అధికం కావడం  వలన  దానికి అనుగుణంగా బంగారం ధర పెరుగుతుంది.   US మానిటరీ బేస్   పెరగడం వలన  ప్రజల వద్ద అధిక డాలర్లు ఉండటంతో  బంగారాన్ని అధిక ధరల వద్ద కనుగోలు చేస్తారు. దానితో బంగారం ధర పెరుగుతుంది.వాస్తవంగా చెప్పాలి అంటే  బంగారం ధర పెరగడం లేదు.డాలర్ మరియు ఇతర కరెన్సీల విలువ తగ్గుతుండటం  జరుగుతుంది. ప్రభుత్వాలు కొత్తగా కరెన్సీ నోట్లను ముద్రించి చలామణిలోకి తీసుకరావడం  వలన కరెన్సీ కనుగోలు శక్తి తగ్గిపోతుంది దాని వలన బంగారం ధర పెరుగుతుంది అనే విషయం మీకు తెలిసినది కదా ? అదే విధంగా  బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందో ఒక్కసారి పరిశీలిద్దాం. చలామణి లో ఉన్న అధిక కరెన్సీ నోట్లను ప్రభుత్వం ఎప్పుడైతే ఉపసంహరించుకుంటుందో ఆప్పుడు బంగారం ధరలు తగ్గుతాయి.కరెన్సీ నోట్లను ప్రభుత్వం ఉపహరించుకోవడం వలన ప్రజల వద్ద తక్కువ మనీ ఉండటంతో బంగారాన్ని కనుగోలు చేయడం తగ్గుతుంది. దాని వలన బంగారం ధర తగ్గుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. US మానిటరీ బేస్   కి , బంగారం ధరకి అవినాభావ సంభందం ఉంది.  US మానిటరీ బేస్   పై బంగారం ధరలు ఆధారపడి ఉంటాయి.అంతే కాని పెళ్ళిళ్ళ సీజన్, పండుగల సీజన్ , దీపావళి , అక్షయ తృతీయ  ఇలాంటివి ఏవి బంగారం ధరను ప్రభావితం చేయలేవు.చేసినా ఒక్కశాతం మించి చేయలేవు. తర్వాతి ఆర్టికల్స్ లో బంగారం ధర  ఏవిధంగా  అంచనా వేస్తారో , ఎంత వరకు ధర పెరగడానికి అవకాశం ఉందో తెలుసుకుందాం.

కరెన్సీ నోట్లు కావలసినంత ముద్రించుకోవడానికి బంగారంతో ఏమైనా సంభందం ఉందా ?

కరెన్సీ నోట్లు కావలసినంత ముద్రించుకోవడానికి  బంగారంతో ఏమైనా సంభందం ఉందా ?


పైన చూస్తున్న బంగారు నాణేలు దీ గ్రేట్ అలెగ్జాండర్  330 B.C  కాలానికి  సంభందించినవి.
ఈ ఆర్టికల్ యొక్క ముఖ్యఉద్దేశం  ఎవరైనా సరే  భవిష్యత్తులో  వృద్ది ( appreciate in future ) చెందడానికి అవకాశం ఉండే ఆస్తులు మాత్రమే సంపాదించుకోవాలి  కాని  తరుగుదల ( Depreciating in future) ఉండే ఆస్తులను సంపాదించుకోవడం కాని,కొంత కాలానికి విలువ కోల్పోయే ( purchasing power)నగదును కాని నిల్వ చేసుకోవడం వలన ఎలాంటి లాభం ఉండదు అని  తెలియచేయడం ఈ ఆర్టికల్ ఉద్దేశం.
1970   కంటే ముందు  USA  మరియు  ఇతర ప్రపంచ దేశాలు  కరెన్సీ నోట్లు ముద్రించడానికి బంగారాన్ని ప్రామాణికంగా పరిగణించేవారు.అంటే ఒక డాలర్ లేదా కరెన్సీ ముద్రిస్తున్నారు అంటే అంతే విలువ కలిగిన బంగారాన్ని నిల్వ చేసేవారు . దీనినే గోల్డ్ స్టాండర్డ్ అని పిలిచేవారు.ఉదాహరణకు ఒక డాలర్ ముద్రిస్తున్నారు అంటే  దానికి సమానంగా విలువ కలిగిన గోల్డ్ అంటే 0.693 ounce బంగారం నిల్వ చేసేవారు. ఖచ్చితంగా ఎంత బంగారం అని తెలియదు కాని  కొంత బంగారాన్ని మాత్రం ప్రామాణికంగా నిల్వ చేసేవారు. దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజలకు ప్రభుత్వ  వ్యవస్థ మీదా విశ్వాసం లేనప్పుడు ,ద్రవ్యోల్బణం పెరిగి ,  డాలర్ లేదా ఇతర కరెన్సీ వలన  వారి  కనుగోలు శక్తి తగ్గినా సమయంలో  వారి వద్ద ఉన్న కరెన్సీ  నోట్లతో బంగారాన్ని మార్పిడి చేసుకొనే అవకాశం ఉండటం. దీనినే   గోల్డ్ స్టాండర్డ్  అని అంటారు.
ఈ గోల్డ్ స్టాండర్ వలన ప్రభుత్వం ఎప్పుడైనా కరెన్సీ నోట్లను ముద్రించి చలామణిలోకి తీసుకరావాలి అంటే ముందుగా ప్రభుత్వం అంతే విలువ కలిగిన బంగారాన్ని నిల్వ చేసుకోవాలి.దాని తర్వాత మాత్రమే  కరెన్సీ నోట్లను ముద్రించి చలామణిలోకి తీసుకరావదానికి వీలు కలుగుతుంది.

ఈ గోల్డ్ స్టాండర్డ్ అనే పదం ఎప్పటి నుండి ఎక్కడి నుండి  వాడుకలోకి వచ్చినది అని ఆలోచిస్తున్నారా ? ఇది  కొన్ని శతాబ్దాల క్రితమే ప్రారంభం కావడం జరిగినది. వీటిని ప్రజలు వారి  వస్తువులు , ఆస్తులు, సేవలు  పొందే సమయంలో మార్పిడి క్రింద బంగారాన్ని  ఉపయోగించేవారు.కొన్ని సంవత్సరాల తర్వాత  ప్రజలూ ఈ విధంగా  బంగారం తో మార్పిడి చేయడం రిస్కు అని భావించి నగరంలో పేరొందిన బంగారు వ్యాపారస్తుడి వద్ద బంగారం పెట్టి దాని బదులు అతని వద్ద  హామీ పత్రం తీసుకొనేవారు. అంటే ఆ పత్రాన్ని ఎవ్వరూ తీసుకవచ్చిన బంగారం ఇచ్చే విధంగా. ఈ విధంగా  ఈ హామీ పత్రాల చలామణీ ప్రజలకు చాలా సౌకర్యవంతంగా  ఉండేది.ఒకరకంగా చెప్పాలి అంటే ఈ విధంగా కరెన్సీ నోట్ల చలామణి వాడుకలోకి వచ్చినది.

కొన్ని సంవత్సరాల తర్వాత ఈ బంగారు వ్యారస్తులు ఈ హామీ పత్రాలను ప్రింట్ చేసి వారి వద్ద బంగారం నిల్వ చేసి హామీ పత్రాల కోసం వచ్చే వారికి ఇచ్చేవారు.ఈ విధంగా కరెన్సీ నోట్ల ముద్రణ ప్రారంభం కావడం జరిగినది. కాని ఎప్పుడైనా చలామణి లో ఉండే  కరెన్సీ నోట్లలో పెరుగుదల ఉంటే వాటి కనుగోలు శక్తి తగ్గుత్న్ది అనే విషయం మీకు తెలుసుకదా ? కొన్ని సంవత్సరాల తర్వాత ప్రబుత్వం ఈ పద్ధతి మీదా అజమాయిషీ తీసుకొని ద్రవ్య  సరఫారా ను నియంత్రణలోకి తీసుకోవాలని భావించడం జరిగినది. దానినే  మోడరన్ గోల్డ్ స్టాండర్డ్ అని పిలువడం జరిగినది.
మరికొన్ని సంవత్సరాల తర్వాత  అంటే   1970 లో    USA ప్రభుత్వం  గోల్డ్ స్టాండర్డ్ కి ఎందుకు కట్టుబడి ఉండాలి అనే ఉద్దేశంతో చాలా తెలివిగా ఈ గోల్డ్ స్టాండర్డ్ ను రద్దు చేయడం జరిగినది. అంతే కాకుండా  USA ప్రభుత్వం  తన ప్రజలకి కరెన్సీ కి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ హామీ ఇస్తుంది అని తెలియచేయడం జరిగినది.
ఈ విధంగా USA ప్రభుత్వం  గోల్డ్ స్టాండర్డ్ రద్దు చేయడమే కాకుండా  అదనంగా కావలసినంత కరెన్సీ ఎప్పుడూ కావాలంటే అప్పుడు ప్రింట్ చేయగలం అని పరోక్షంగా తెలియచేయడం జరిగినది. 1970 నుండి    USA ప్రభుత్వం  ప్రతి సంవత్సరం కరెన్సీ నోట్లు ముద్రించి చలామణి లోకి తీసుకవస్తుంది. ఈ విధంగా అధిక కరెన్సీ నోట్లు చలామణిలోకి రావడం వలన కరెన్సీ నోట్ల యొక్క కనుగోలు శక్తి తగ్గిపోవడం తో ఇన్ఫ్లేషన్ కూడా పెరగడం మొదలైంది. మీ చేతిలో ఉన్న కరెన్సీ నోటు ఎలాంటి ఇంట్రెన్సిక్  విలువ లేనటువంటి కాగితం మాత్రమే. దానిపై ఎప్పుడో చనిపోయిన ఒక నాయకుడి  ఫోటో మాత్రమే ఉంటుంది. అందువలనే ఈ కరెన్సీ నోట్ యొక్క కనుగోలు ప్రతి సంవత్సరం దారుణంగా తగ్గిపోతుంది.ఈ ఆర్టికల్  నుండి మీరూ తెలుసుకోవలసినది ఏమిటంటే మీరు కరెన్సీ నోట్లను దాచుకోవడం కంటే ఆస్తులు కూడగట్టడం  చాలా మంచిది. మీ దగ్గర అవసరానికి మించి డబ్బూ ఉంటే , కొంత కాలం దానితో పని లేకపోతే  బ్యాంక్ లో  లేదా బీరువాలో దాచే బదులు ఏవైనా  విలువ పెరిగే ఆస్తులు కనుగోలు చేయండి.  అంటే షేర్లు , లాండ్స్ , బాండ్స్,  ఏవైనా కావచ్చు.మీరూ కేవలం డబ్బూ దాచుకోవడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటె దాని విలువ కొంత కాలంలో తగ్గిపోతుంది అని మీకు తెలుసుకదా ? ఇప్పుడు ఉన్న కరెన్సీ నోటు  ఏదైనా కాని డాలర్, యూరో , రూపాయి  ఏదైనా సరే ఎలాంటి   ఇంట్రెన్సిక్   వాల్యూ లేనటువంటి కాగితం  నోటు అని మాత్రమే గుర్తుపెట్టుకోండి. కాబట్టి దానిని దాచి పెట్టుకొనే బదులు ఆస్తులు కనుగోలు చేయండి.

మీరు ఆర్ధికంగా ఎదగాలన్న , ఆర్ధికంగా దివాళా తీయాలన్న కాంపౌండ్ ఇంట్రెస్ట్ (చక్రవడ్డీ ) ఏ విధంగా ముఖ్య పాత్ర వహిస్తుందో తెలుసుకోండి


మీరు  ఆర్ధికంగా ఎదగాలన్న , ఆర్ధికంగా దివాళా తీయాలన్న కాంపౌండ్ ఇంట్రెస్ట్ (చక్రవడ్డీ )  ఏ విధంగా ముఖ్య పాత్ర వహిస్తుందో   తెలుసుకోండి?   
ప్రముఖ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్స్టీన్ మాటల్లో చక్రవడ్డీ  ఆర్ధిక అభివృద్దికి తోడ్పడే ప్రపంచంలోనే  అత్యుత్తమ సాధనం.అంతేకాకుండా  మరొక సందర్భంలో  చక్రవడ్డీ గురించి   అల్బర్ట్ ఐన్స్టీన్ చెప్తూ ఇది ప్రపంచంలోనే ఎనిమిదవ వండర్  అనడం జరిగినది.   
చక్రవడ్డీ యొక్క బేసిక్స్ ముందుగా మీరు అర్ధం చేసుకుంటే ఈ చక్రవడ్డీ ఆర్ధిక అభివృద్దికి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుస్తుంది.ముందుగా చక్రవడ్డీ అంటే ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం. అయితే చక్రవడ్డీ గురించి తెలుసుకోవడానికంటే ముందు సాదారణ వడ్డీ లేదా సింపుల్ ఇంట్రెస్ట్ గురించి తెలుసుకుందాం. ఇవన్నీ మీరు చిన్నప్పుడు చదువుకొని ఉండవచ్చు. కాని అవి నిత్య జీవితంలో  మన ఆర్ధిక అభివృద్దికి ఏ విధంగా  తోడ్పాటు అందిస్తాయో తెలుసుకోవాలి.  సాదారణ వడ్డీ లో , వడ్డీ మీరు మొదట ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పై మాత్రమే వడ్డీ పొందుతారు. ఉదాహరణకు మీరు    రూ. 100 లను  10% సాదారణ వడ్డీకి ఇన్వెస్ట్ చేస్తే మీరు సంవత్సరం తర్వాత తిరిగి పొందే వడ్డీ రూ 10.  అంటే మీరు సంవత్సరం తర్వాత తిరిగి పొందే మొత్తం రూ 110 (రూ 100 అసలు  + రూ 10వడ్డీ ). రెండు సంవత్సరాల తర్వాత ఐతే రూ 110+10 = రూ 120.  అదే పది సంవత్సరాల తర్వాత అయితే  మీరు పొందే మొత్తం రూ .100 + 10 + 10 + 10 + 10 + 10 + 10 + 10 + 10 + 10 + 10 = రూ .200 .సాదారణ వడ్డీ లో మీరు 10% వడ్డీ రేటు చొప్పున ప్రతి సంవత్సరం రూ 10 లను వడ్డీ రూపంలో పొందుతున్నారు.
చక్రవడ్డీ విషయానికి వస్తే  ప్రతి సంవత్సరం అంతకు ముందు ఉన్న బ్యాలన్స్ అమౌంట్ పై వడ్డీ పొందుతారు. అంతే కాని మొదట ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పై కాదు. దీనిని సాదారణ పరిబాష లో  వడ్డీ పై వడ్డీ అని కూడా అంటారు.
ఉదాహరణకి మీరు  రూ. 100 లను  10%  చక్ర వడ్డీకి సంవత్సరానికి ఒక్కసారి లెక్కించే విధంగా ఇన్వెస్ట్ చేస్తే మీరు సంవత్సరం తర్వాత తిరిగి పొందే వడ్డీ రూ 10. అంటే సంవత్సరం తర్వాత మీ వద్ద  గల బ్యాలన్స్  రూ 110 (రూ 100 అసలు  + రూ 10వడ్డీ). రెండవ సంవత్సరం తర్వాత మీ వడ్డీ లెక్కించడానికి మీరు ముందు ఇన్వెస్ట్ చేసిన రూ. 100  ను కాకుండా  ఇప్పుడు ఉన్న బ్యాలన్స్  రూ 110 ని పరిగణలోకి తీసుకొని లెక్కిస్తారు. అంటే రెండో సంవత్సరం తర్వాత మీరు పొందే మొత్తం రూ .110 + రూ .11 (10% of 110) = రూ .121.  మూడు సంవత్సరాల తర్వాత  మీరు పొందే మొత్తం రూ  121 +రూ . 12.1 (10% of 121) =రూ . 133.1, నాలుగు సంవత్సరాల తర్వాత పొందే మొత్తం రూ .133.1 + రూ . 13.31 (10% of 133.1) = రూ . 146.41 మిగితా సంవత్సరాలు కూడా ఇదే విధంగా వడ్డీని లెక్కిస్తారు.పది సంవత్సరాల తర్వాతః పొందే మొత్తం రూ 285.31. మీరు రూ. 100 లను  10%  సాదారణ వడ్డీ కి పది సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే, పది సంవత్సరాల తర్వాత  పొందే మొత్తం  రూ 200.  అదే రూ. 100 లను  10% చక్రవడ్డీకి పది సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే, పది సంవత్సరాల తర్వాత  పొందే మొత్తం  రూ 285.31  అంటే మీరు    రూ. 100 లను  సాదారణ వడ్డీ మరియు చక్రవడ్డీ లలో ఇన్వెస్ట్ చేస్తే సాదారణ వడ్డీ కంటే చక్రవడ్డీ ద్వారా  రూ .85.31 ఎక్కువగా రాబడి పొందుతున్నారు .ఇదే చక్రవడ్డీ యొక్క మహత్యం .ప్రారంభం లో వడ్డీ లో పెరుగుదల తక్కువగా ఉన్నప్పటికీ కాలం గడుస్తున్న కొలది ఈ వడ్డీ లో పెరుగుదల చాలా భారీగా ఉంటుంది. మీరు  ఉదాహరణలో కేవలం  సంవత్సరానికి ఒక్కసారి లెక్కించే విధానాన్ని మాత్రమే చూసారు. కొన్ని ఆర్ధిక సాధనాలు మూడు నెలలకు ఒక్కసారి, ఆరునెలలకు ఒక్కసారి లేక్కిస్తాయి. ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం వలన రాబడి అధికంగా ఉంటుంది.

మీరు బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ఏదైనా లోన్  తీసుకుంటే  చక్రవడ్డీ ద్వారా వడ్డీ లెక్కించడం వలన మీరు ఆర్ధికంగా  చాలా దెబ్బతినడమే కాకుండా చివరకు దివాళా కూడా తీయవలసి వస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు చక్రవడ్డీ వలన మీరు  ఆర్ధికంగా ఎదగడానికి ఎంత  లాభం పొందుతారో క్రెడిట్ కార్డ్ లేదా ఏదైనా లోన్   అంతే నష్టపోతారు.
మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం పై చక్రవడ్డీ ద్వారా కాలక్రమేణా ఆసాదరణ లాభాలు అందుకుంటారు.. చక్రవడ్డీ వలనే  ప్రపంచంలో ధనవంతులు ఇంకా ధనవంతులు కావడం జరుగుతుంది.

చివరగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీరూ ఎప్పుడయితే చక్రవడ్డీ ద్వారా పొదుపు లేదా పెట్టుబడి చేయడం మొదలు పెడతారో  మీ డబ్బే మీ కోసం కష్టపడటం ద్వారా కొంత కాలానికి మీరూ ఆర్ధికంగా ఎదగడానికి  ఎంతో సహాయపడుతుంది. మీరూ  ఎప్పుడయితే లోన్స్ లేదా క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటారో అప్పుడు అదే చక్రవడ్డీ మిమ్ములను అర్దికంగా పతనం చేసి చివరకు దివాళా కూడా తీయుస్తుంది. అందుకే ఆర్ధిక వేత్తలు. ఫైనాన్సియల్ అడ్వయిజర్ ఇచ్చే సలహా ఏమిటంటే మీ చిన్న వయస్సులో  అంటే సంపాదన మొదలైన తొలినాళ్ళలోనే మీరు సేవింగ్ , ఇన్వెస్ట్మెంట్ మొదలు పెడితే  కొంత కాలంలో మీరు ఆర్ధికంగా ఉన్నత స్థితికి చాలా సులభంగా ఎదగవచ్చు. మీరూ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది కాదు ముఖ్యం . ఎంత త్వరగా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది చాలా  చాలా ముఖ్యం. అందుకే ఇన్వెస్ట్ వెంటనే ప్రారంభించండి.