జీవితంలో ఆర్ధికంగా ఎదగాలి అంటే ప్రతి ఒక్కరూ తెలుగులో మొదటిసారిగా అందరికి సులభంగా అర్ధమయ్యే విధంగా వెలువడిన షేర్ మార్కెట్ ,షేర్ మార్కెట్ టెక్నికల్అనాలసిస్,ఫైనాన్సియల్ ప్లానింగ్ ,మ్యుచవల్ ఫండ్స్,ఇన్కంటాక్స్ పుస్తకాలు తప్పనిసరిగా చదవాలి.


జీవితంలో ఆర్ధికంగా ఎదగాలి అంటే ప్రతి ఒక్కరూ తెలుగులో మొదటిసారిగా అందరికి సులభంగా అర్ధమయ్యే విధంగా వెలువడిన  షేర్ మార్కెట్ ,షేర్ మార్కెట్ టెక్నికల్అనాలసిస్,ఫైనాన్సియల్ ప్లానింగ్  ,మ్యుచవల్ ఫండ్స్,ఇన్కంటాక్స్ పుస్తకాలు తప్పనిసరిగా చదవాలి.

స్టాక్ మార్కెట్ ఈ  మాట వినగానే చాలామంది దానిని ఒక భూతంలాగా, లేదంటే ఒక జూదశాలగా చూస్తారు తప్ప దానిని ఒక ఇన్వెస్ట్మెంట్ సాధనంగా అసలు చూడరు. ఎందుకంటే  చాల మంది దానిలో ప్రవేశించి రాత్రి కి రాత్రే డబ్బులు సంపాదించాలి అనే అత్యాశ ,అవగాహనా లోపం, మరియు సరియైన పరిజ్ఞానం లేకుండా ప్రవేశించి నష్టాల పాలు అవుతుంటారు. నిజం చెప్పాలంటే  తగు పరిజ్ఞానం, మంచి ప్రణాళిక తో స్టాక్ మార్కెట్ లో ప్రవేశిస్తే దీనిలో  పొందిన రాబడి ఇక  మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ సాధనం లో పొందలేరు.  మార్కెట్ అనలిస్టు గా  నా ప్రత్యక్ష అనుభవంలో  నేను తెలుసుకున్నది ఏమనగా  స్టాక్ మార్కెట్ లో ప్రవేశిస్తూన్న వారిలో చాలా మంది కనీస అవగాహన లేకుండానే ప్రవేశిస్తున్నారు.దానితో  వారు మార్కెట్ లో డబ్బులు పోగొట్టుకొని అప్పుడు  దానిని అది ఒక జూదశాల  అని నిందిస్తూ అది మనకు అర్థం కాదు అనే ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు,మీరు పది రూపాయలు ఖర్చు పెట్టి టమాటలు కొనేటప్పుడు ఐదు నిమిషాలు దానిలో పుచ్చులు ఉన్నాయా లేవా  అని చూడటానికి కేటాయించిన మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు సంపాదించాలి అంటే దానికి కూడా సమయం కేటాయించి కావలసిన విజ్ఞానం  పొందాలి అనే విషయం గుర్తుంచుకోవాలి..మీరు స్టాక్ మార్కెట్ లో డబ్బు సంపాదించాలి అంటే ముందుగా మీరు లెర్నింగ్ స్టార్ట్ చేయాలి , లెర్నింగ్ చేస్తే ఏర్నింగ్  వస్తుంది.లెర్నింగ్ లేకుండా ఏర్నింగ్ ఉండదు.ఏదో పొద్దున్న లేచాం కంప్యూటర్ ముందు కూర్చున్నాం ట్రేడింగ్ చేసాం అంటే తప్పకుండా నష్టపోవలసి ఉంటుంది.
       
     “యద్భావం తద్భవతి అని భగవద్గీత చెప్తుంది . అనగా ఏది అనుకుంటే అదే జరుగుతుంది అని దాని సారాంమన ఆలోచనలను బట్టే , చేసే పనులు , మన  నిర్ణయాలు ఉంటాయి .మార్కెట్ పై మనకు ప్రతికూల ఆలోచనలు , నష్టాలు వస్తాయి అనే భయం ఉంటే ప్రతికూల ఫలితాలే వస్తాయి. Attitude is everything  అనగా సమస్త విజయాలకు దృక్పథం మూలకారణం  అనగా మీ ఆలోచనలలో  మీరు మార్కెట్ పై  ఎల్లప్పుడు సానూకుల దృక్పథం  కలిగిఉండాలి. అంతే కాని  ప్రతికూల దృక్పథం  కలిగి ఉండకూడదు.. కాబట్టి ముందుగా మార్కెట్ పై మీకు ఉండే వ్యతిరేక భావనలను వీడండి. మార్కెట్ పై మంచి అవగాహన పెంపొందించుకొని మంచి  నిర్ణయం తీసుకోండి. ఈ నిర్ణయం తీసుకొనే శక్తి రాత్రికి రాత్రి అలవడదు. నిరంతర సాధనతోనే  ఇది సాధ్యం . మంచి నిర్ణయం తీసుకోవాలి అంటే ముందు మీకు  మార్కెట్ పై  సమగ్రమైన అవగాహన ఉండాలి. అవగాహన రావాలంటే సమాచారం తెలిసి ఉండాలి. సమాచారం తెలియడంతో, అభ్యాసం ద్వారా అవగాహన ఏర్పడుతుంది.ఆ పై  విషయ విశ్లేషణ  చేసేందుకు ఆస్కారం ఏర్పాటు అవుతుంది . అప్పుడే మీరు మంచి నిర్ణయం తీసుకోగలరు .ఆయితే  ఇది సాధన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మీరు తీసుకొనే నిర్ణయాలను బట్టే మీకు లాభాలు సొంతం అవుతాయి. ఒక పసిపాపకు  తల్లి పాలు ఎంత కీలకమో , జీవులు జీవించడానికి శ్వాసించే గాలి ఎంత అవసరమో , మనిషి బ్రతకడానికి శరీరంలో రక్తం ఎంత ముఖ్యమో , డబ్బు కూడా అంతే . అలాంటి డబ్బును సంపాదించాలి అంటే నిబద్దత కావాలి.  
రోడ్డు మీద నడవటం రిస్కుతో కూడుకున్నదే.అంతరిక్షంలోకి వెళ్లటమూ రిస్కే.రిస్క్ ఎందుకని కూర్చుంటే సైన్స్ ఇంతగా ఎదిగేది కాదు.మానవ జీవితాలు ఇంత సుఖంగా గడిచేవి కావు.ఆర్ధికం గా , సామాజికంగా ,వ్యక్తిగతంగా  ఎలా ఎదగాలన్నాఅందులో రిస్కు ఉంటుంది.అవకాశాలు అంది వచ్చేది రిస్క్ తీసుకోనేవారికే .కాని, ఇక్కడ మీరు గమనించవలసిన  విషయం రిస్కు తీసుకొనే ముందు మీరు పూర్తిగా మార్కెట్ గురుంచి అధ్యయనం చేయండి.తగినంత నిద్ర పోవాలి అనుకుంటే అర్ధరాత్రి టెలివిజన్ వదలాల్సిందే .పరీక్షల్లో మార్కులు కావాలి అంటే పరీక్షలకు కొద్ది  రోజుల ముందు నుండే సినిమాలు , షికార్లు తగ్గించాల్సిందే .అదే విధంగా షేర్  మార్కెట్  లో   లాభాలు పొందాలి అంటే మీరు కస్టపడి మార్కెట్  గురుంచి తెలుసుకోవలసినదే.  

స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు ఒకరిని గుడ్డిగా అనుకరించవద్దు. స్నేహితుడు కొన్నాడు అని ఇంకా ఎవరో ఏదో చెప్పారు అని షేర్లను  కొనడం కాకుండా అందులోని సత్యాసత్యాలు తెలుసుకోవడం చేయాలి.మీరు జీవితం లో ఏదైనా వ్యాపారం చేసి మంచి లాభాలు అందుకోవాలి  అనుకుంటే ,ఆ వ్యాపారం గురుంచి ఎన్నో వివరాలు  కష్టపడి సేకరిస్తారు. కాని స్టాక్ మార్కెట్  కూడా లాభాలు అందించే సాధనం ఐనప్పటికీ మీరు దాని గురుంచి కనీస సమాచార సేకరణ  కూడా చేయరు. అటువంటప్పుడు మీరు లాభాలు ఎలా అందుకోగలరు. స్టాక్ మార్కెట్ ను కూడా వ్యాపారం లాగా భావించి ఇన్వెస్ట్ చేయాలి.మీరు స్టాక్ మార్కెట్ లో నష్టపోయిన వ్యక్తులను ఎవరిని ఐనా గమనించండి.ఒక స్టాక్ ను  ట్రేడింగ్ కొరకు కాని , ఇన్వెస్ట్మెంట్ కొరకు కాని కొంటున్నప్పుడు  ఆ స్టాక్ ను కొనడానికి గల సరియైన కారణం వివరించ గలరో చూడండి.చాలా మంది వివరించలేరు .అలాంటప్పుడు నష్టాలు రాకుండా లాభాలు వస్తాయా!

మీరు మార్కెట్ పై పూర్తి అవగాహన కలిగే వరకు కొన్నాళ్ళు పేపర్ ట్రేడింగ్ చేయండి.అనగా మీరు ఏదైనా స్టాక్ కొనాలి అనుకున్నప్పుడు ఆ స్టాక్ ఎందుకు కొనాలి అనుకుంటున్నారు , దాని టార్గెట్ ప్రైస్ ని ఎంత కాలం లో చేరుకోగలదు., టార్గెట్ ను చేరుకున్నది లేనిది మొదలగు వివరాలతో కొంతకాలం పాటు అభ్యాసం  చేయండి.మీ పై మీకు నమ్మకం ఏర్పాటు ఐన తర్వాత అప్పుడు మీరు మార్కెట్ లోకి దిగండి.ఈ రకంగా  అభ్యాసం చేసే సమయంలో టెక్నికల్ అనాలసిస్ సహాయం తీసుకోండి.  మీ పై మీకు విశ్వాసం కలిగినప్పుడు మాత్రమే మీకు ఏ రంగం లో ఐనా విజయం సాదించగలరు. 
పుస్తకాలు మీకు షేరు మార్కెట్  లో  బేసిక్ నుండి మొదలు పెట్టి షేరు మార్కెట్   మీద పూర్తీ అవగాహనను కలుగచేస్తుంది. షేరు మార్కెట్ లో మీరు ప్రవేశించినది మొదలు  మీకు కలిగే అనేక సందేహాలకు సమాధానం చెప్పుతుంది. షేరు మార్కెట్లో  మీరు షేర్లు ఎలా  కొనాలి ఎప్పుడు కొనాలి ,ఎప్పుడు అమ్మాలి, IPO  గురించి ,లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చూడవలసిన ఫండ మెంటల్ విషయాలు,డే ట్రేడింగ్ నందు జరిగే పొరపాటులను     విధంగా నివారించవచ్చో తెలుపుతుంది. సిప్ ఇన్వెస్ట్మెంట్ .మ్యూచవల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ గురుంచి తెలుపుతుంది.స్టాక్ మార్కెట్ లో సాధారణంగా చేసే పొరపాట్లు , వాటి వలన సంభవించే నష్టాల నుండి ఏ విధంగా బయటపడాలో వివరంగా తెలుపుతుంది.  అంతే కాకుండా స్టాక్ మార్కెట్ లో టెక్నికల్ ఆనాలసిస్ ఎంతో ప్రాముఖ్యత కలిగినది.ఈ పుస్తకాలలో మీకు టెక్నికల్ ఆనాలసిస్ సులభంగా అర్ధం అయ్యే రీతిలో వివరించడం జరిగినది.మ్యుచవల్ ఫండ్స్ అంటే ఏమిటి ? అవి అందించే వివిధ రకాల పథకాలు , వాటిలో ఎలాంటి పథకాలు లాభదాయకం ,సిప్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వల్ల కలిగే లాభాలు , ముఖ్యంగా మీ భవిష్యత్తు ఆర్ధిక అవసరాలు తీరాలి అంటే మీరు మీ ఫైనాన్సియల్ ప్లానింగ్ యే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. మీ పాప వివాహం , ఉన్నత చదువులకు , మీ రిటైర్మెంట్ అనంతర జీవితానికి కావలసిన డబ్బు ఏర్పాటు కొరకు మీ ఫైనాన్సియల్ ప్లానింగ్ యే విధంగా యే విధంగా ఏర్పాటు చేసుకోవాలో వివరంగా తెలియచేయడం జరిగినది. ఇన్కంటాక్స్ లో గల వివిధ రకాల సెక్షన్స్ ప్రకారం ఆదాయపు పన్ను యే విధంగా అదా చేసుకోవచ్చో తెలియచేయడం జరిగినది.   ఈ పుస్తకం లో మీ సౌలభ్యం కొరకు  కొంత వరకు సాధారణంగా ట్రేడర్స్ ఉపయోగించే ఇంగ్లీషు పదాలనే వాడటం జరిగినది.  ఈ పుస్తకం కథల పుస్తకం లేదా నవలా పుస్తకం కాదు ఒక్కసారి చదివి ప్రక్కన పడవేయడానికి ,ఈ పుస్తకాలలో   నేర్చు కొనే  విషయాలు నిరంతరం మననం చేసుకొంటూ , అభ్యాసం చేస్తే   స్టాక్ మార్కెట్ లో మంచి లాభాలు అందుకోవడం చాలా సులభం.
ముఖ్య గమనిక :మీరు  టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా ఒక పద్ధతి  ఎంచుకొని దానినే స్థిరంగా  మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్ మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ సాధ్యం అవుతుంది.  http://telugufinancialschool.blogspot.in/2012_09_01_archive.html




No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.