స్టాక్ మార్కెట్ ఇంకా ఎంత వరకు పరిగెత్తగలదు.

స్టాక్ మార్కెట్ ఇంకా ఎంత వరకు పరిగెత్తగలదు.
ఈవారం స్టాక్ మార్కెట్17-09-2012to21-09-2012

గత వారం ఫెడరల్  బ్యాంక్ , ఈసిబి  మీటింగ్ , జర్మనీ కోర్టు తీర్పు మరియు కేంద్ర ప్రభుత్వం సంస్కరణలకు తెరదీస్తూ  డీజిల్   ధరలు పెంచడం మొదలగు కారణాల వలన మార్కెట్ లో ర్యాలీ రావడం జరిగినది.అదే విధంగా శుక్రవారం సాయంత్రం  విదేశీ నిధులను రిటైల్ రంగంలోకి అనువదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం  వలన మార్కెట్ ఈ రోజు కూడా గ్యాప్ అప్ లోనే ప్రారంభం జరుగును.  అదే విధంగా  ఈ రోజు రిజర్వు బ్యాంక్ తన పరపతి సమీక్షలో వడ్డీ రేట్లు కనుక తగ్గిస్తే ప్రస్తుతం కొనసాగుతున్న ర్యాలీకి మరింత సానుకూల  అవకాశం దొరికినట్టు అవుతుంది.ఒకవేళ రిజర్వు బ్యాంక్ తన పరపతి సమీక్షలో కనుక ప్రతికూల నిర్ణయం తీసుకుంటే మాత్రం పై లెవల్లో లాభాల స్వీకరణకు అవకాశం కలదు. సానుకూల నిర్ణయం వేలువడటానికే  అధిక అవకాశం మాత్రం కలదు.  మీరు కనుక  రెగ్యులర్ గా ఈ బ్లాగ్ ఫాలో అవుతున్నట్టు ఐతే మీకు ఇదివరకే చాలా సార్లు చార్ట్స్ ద్వారా తెలియచేయడం  జరిగినది. నిఫ్టీ 5190-5200  కంటే క్రిందికి దిగాజారనంత వరకు మీ లాంగ్ పోజిషన్  కు ఎలాంటి ఇబ్బంది లేదు , 5190-5200  స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్స్ కొనసాగించవచ్చు  అని తెలియచేయడం జరిగినది. అదే విధంగా నిఫ్టీ లాంగ్ సైడ్ టార్గెట్ 5520 అని కూడా మీకు తెలియచేయడం జరిగినది. ఇంకా వివరాల కోసం గత పోస్టులను చదవవచ్చు.  అదే విధంగా ఇప్పుడు మార్కెట్ కి అనుకూలమైన వార్తలు వెలువడుతున్నందున  మార్కెట్ ఇంకా ఎంత వరకు పరిగెత్తగలదు అని చాలా మంది అడుగుతున్నారు. మీకు మార్కెట్ లో నిఫ్టీ  తక్షణ ర్యాలీ  5648 వరకు చేరుకోగలదు.ఇది ఫిబోనస్సీ గోల్డెన్ రేషియో . ఒకవేళ  నిఫ్టీ  5648 పైన నిలదోక్కుకున్నట్టు ఐతే  ర్యాలీ 5850 ,5910, 5950 వరకు కూడా కొనసాగగలదు.. నిఫ్టీ 5435 పైన ఉన్నంత వరకు ఈ ర్యాలీ కొనసాగడానికి అధిక అవకాశం కలదు. ఏది ఎమైనప్పటికి నిఫ్టీ ఇంకా కనీసం రెండు వందల పాయింట్లు ర్యాలీ జరపడానికి అవకాశం మాత్రం కలదు. అయినప్పటికీ మీ లాంగ్ పొజిషన్స్ కి  5435 స్టాప్ లాస్ ఉపయోగించండి.  ఒకవేళ ఏమైన మార్పులు చేర్పులు ఉంటే మీకు వెంటవెంటనే తెలియచేయడం జరుగుతుంది.
ముఖ్య గమనిక :మీరు  స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా ఒక పద్ధతి  ఎంచుకొని దానినే స్థిరంగా  మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్ మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ సాధ్యం అవుతుంది.  http://telugufinancialschool.blogspot.in/2012_09_01_archive.html

ఆర్ధికంగా ఎదాగాలి డబ్బు సంపాదించాలి అంటే ఎమి చేయాలి part 3

ఆర్ధికంగా ఎదాగాలి డబ్బు సంపాదించాలి అంటే ఎమి చేయాలి    part 3
ప్రస్తుతం మీ వయస్సు ముప్పై సంవత్సరాలు అనుకుంటే మీరు అరవై సంవత్సరాలకు రిటైర్మెంట్ అవుతారు అనుకుంటే మీరు తక్షణం బయట తాగే టీ ఒక్కటే మానేస్తే ఎంత మిగులుతుందో చూద్దాం. టీ ఒక్కటి ఖరీదు  ఐదు రూపాయలు అనుకున్న  నెలకు  నూట యాభై రూపాయలు మిగులుతుంది. ఈ డబ్బును ప్రతి నెల ఎనిమిది శాతం వడ్డీ వచ్చేలా కనీసం బ్యాంక్ లో రికరింగ్ డిపాజిట్ పథకంలో  మీ  రిటైర్మెంట్ వరకు ఎంత అవుతుందో తెలుసా !    Rs 222639 అవుతుంది . నిజమే ఇది క్రమం తప్పకుండా పొదుపు చేయడం వలన సాధ్యం అవుతుంది.మీరు కేవలం టీ మానివేయడం వల్ల వచ్చిన మొత్తం . ఇంతకంటే పెద్ద పెద్ద అనవసరమైన ఖర్చులు మానేస్తే ఎంత మొత్తం మిగులుతుందో చూద్దాం .  
రోజుకి ఒక సిగరేటు ప్యాకెట్ ఖరీదు Rs  50
నెలకు       Rs 1500 
ఈ డబ్బును మీరు ప్రతి నెల క్రమం తప్పకుండా బ్యాంక్ లో రికరింగ్ డిపాజిట్ పథకంలో డిపాజిట్ చేస్తే, వడ్డీ ఎనిమిది  శాతం వస్తుంది అనుకుంటే మీ రిటైర్మెంట్ నాటికి  మీకు చేతికి వచ్చే మొత్తం Rs 2226392.

 ఒక వేళ మీరు దీనిని ఏదైనా మ్యుచవల్ ఫండ్ పథకంలో సిప్ పద్ధతి ద్వారా పెట్టుబడిగా  క్రమం తప్పకుండా ప్రతి నెల మీరు సిగరెట్ మానేయడం వలన  అదా చేసిన Rs 1500    లను మీ రిటైర్మెంట్  వరకు కొనసాగించినచో  ఎంత వస్తుందో చూద్దాం . స్టాక్ మార్కెట్ దీర్ఘకాలంలో మంచి ఫలితాలు ఇస్తుంది అనే విషయం మీ అందరికి తెలిసిన విషయమే కదా !స్టాక్ మార్కెట్ సాలీనా   సుమారు  18 % వృద్ది కనబరుస్తుంది . మనం ఇక్కడ మరీ అత్యాశకి పోకుండా  కేవలం  12%  మాత్రమే  వృద్ది సాధిస్తుంది అనుకుంటే మీరు సిప్ పద్ధతి లో  Rs 1500  పెట్టుబడిగా  మీ రిటైర్మెంట్   సమయానికి మీరు అందుకొనే డబ్బూ Rs 4578019 . అవును అక్షరాల ఇది మూమ్మటికి  నిజం .
అదే విధంగా ఒక కుటుంబం ఈ రోజుల్లో ఒక సినిమాకు వెళ్తే ఎంత లేదన్న కనీసంరెండు వందల రూపాయలు అవుతుంది.ఈ రెండు వందలను కూడా   క్రమం తప్పకుండా బ్యాంక్ లో రికరింగ్ డిపాజిట్ పథకంలో డిపాజిట్ చేస్తే, వడ్డీ ఎనిమిది  శాతం వస్తుంది అనుకుంటే మీ రిటైర్మెంట్ నాటికి  మీకు చేతికి వచ్చే మొత్తం  Rs .296852 ఈ రెండు వందలను బ్యాంక్ లో కాకుండా  సిప్ పద్ధతి ద్వారా క్రమం తప్పకుండా మ్యుచవల్ ఫండ్ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే  మీ రిటైర్మెంట్ నాటికి  మీకు చేతికి వచ్చే మొత్తం    Rs 610402  . అదే విధంగా కొంత మంది అదే పనిగా షాపింగ్ కి తిరగడం  అవసరం లేకున్న దుస్తులు కొనడం చేస్తుంటారు. మీరు ఖర్చు చేస్తున్నప్పుడు చాలా  చిన్నమొత్తం డబ్బే కదా అనుకుంటారు . కాని, ఈ చిన్న మొత్తమే కొన్ని సంవత్సరాల తర్వాత ఎంత  పెద్ద మొత్తం  అవుతుందో తెలియచేయాడమే నా ఉద్దేశం.  ఇక్కడ నేను మీ కోరికలు చంపు కోమని చెప్పడం కాదు నా  ఉద్దేశం .కొన్ని అనవసరమైన  ఖర్చులను  తగ్గించుకోని దానిని సరియైన పద్దతిలో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి లాభం కలుగుతుందో మీకు తెలియచేయడమే నా ఉద్దేశం  . ముందు మీకు కావలసినది అవగాహన    . అవగాహన  ఉంటే ఆలోచన అదే వస్తుంది. ఆ మంచి ఆలోచనతో పొదుపు చేయడం ప్రారంభించండి. చేసిన పొదుపును  మంచి ఇన్వెస్ట్మెంట్ సాధనాలలో ఇన్వెస్ట్ చేయండి. మన దేశంలో ప్రజలు   సంప్రాదాయ పథకాలో  పొదుపు చేస్తున్నారే తప్ప ఇన్వెస్ట్మెంట్ సాధనాల వైపు చూడలేకపోతున్నారు. దీనికి ముఖ్య కారణం ఆర్ధిక అంశాల పట్ల సరియైన అవగాహన లేకపోవడమే.

ముఖ్య గమనిక :మీరు స్టాక్ మార్కెట్   టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా ఒక పద్ధతి  ఎంచుకొని దానినే స్థిరంగా  మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్ మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ సాధ్యం అవుతుంది.  http://telugufinancialschool.blogspot.in/2012_09_01_archive.html

ఆర్ధికంగా ఎదాగాలి డబ్బు సంపాదించాలి అంటే ఏమి చేయాలి part 2

ఆర్ధికంగా ఎదాగాలి డబ్బు సంపాదించాలి అంటే ఏమి చేయాలి    part 2

బ్యాంక్స్ తర్వాత అధిక శాతం మందికి నమ్మకమైనది భీమా . జీవిత భీమా పైననే అధిక  శాతం  నమ్మకాన్ని కలిగి ఉంటున్నారు.ఈ విషయం లో క్రెడిట్ అంతా కూడా భారత జీవిత బీమా సంస్థ కే   చెందుతుంది. తాను మరణించినప్పుడు కుటుంబానికి ఆర్ధిక రక్షణ కల్పించేందుకే  బీమాను  చాలా మంది ఎన్నుకుంటున్నారు.బీమాను పెట్టుబడి సాదనంగా చూస్తున్నవారు కూడా చాలా తక్కువ . ఒకవేళ భీమా   సంస్థలో పెట్టుబడి పెట్టిన కూడా అది కేవలం టాక్స్ మినహాయింపుల కోసమే చేస్తున్నారు తప్పు  అది నిజమైన పెట్టుబడి కాదు.

బ్యాంకులపై ప్రజలకు చాలా నమ్మకం ఉంది.చాలా మంది బ్యాంక్ లో పెట్టుబడులకు డోకా ఉండదు అనే భావనతోనే చాలా మంది ఉన్నారు. జాతీయ బ్యాంకు లలో ని మొత్తం డిపాజిట్లకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది అని నమ్మే వారు చాలా ఎక్కువ . కాని ఇది తప్పు . ప్రభుత్వం ఎలాంటి గ్యారంటీ ఇవ్వదు . ఏ బ్యాంక్ డిపాజిట్లకు ఐనా డిపాజిట్ ఇన్సురెన్స్ కార్పోరేషనే   భీమా రక్షణ కల్పిస్తుంది. ఆది  కూడా  కేవలం లక్ష రూపాయల వరకే పరిమితం అనే విషయం గుర్తుంచుకోవాలి.
రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఒడిదుడుకులు లేని జీవనాన్ని కొనసాగించేందుకు ఏర్పాట్లు చేసుకోవడంలో చాలా మంది నిర్లక్ష్యం వహిస్తారు.చాలా మంది   రిటైర్మెంట్ తర్వాత తమ పిల్లలు వారి భాద్యత తీసుకుంటారు అనే భావనతోనే ఉంటున్నారు తప్ప వారి జీవితానికి ఎలాంటి ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం లేదు.
ఇక చాలా మంది కి పెట్టుబడులపై ఎలాంటి అవగాహనా ఉండటం లేదు. పెట్టుబడుల విషయంలో ఎవరి సలహాలు , సూచనలు లేకుండా నిర్ణయాలు తీసుకొనే వారు కొందరైతే , స్నేహితులు , ఏజెంట్ల వల్ల కొంత మంది నిర్ణయాలు తీసుకుంటూన్నారు. మీరు మీ పెట్టుబడుల పై తప్పనిసరిగా మీ ఫై నాన్సియాల్ ప్లానర్ లేదా ఆర్ధిక నిపుణులను ను సంప్రదించడం  చాలా మంచిది.  

మీకు పొదుపు చేయాలి  అని ఉంది . అదే విధంగా దాని ప్రాధాన్యం కూడా మీకు తెలుసు . భవిష్యత్తును బాగు చేసుకోవాలన్న ఆలోచన ఉంది .అదే విధంగా ఆర్ధిక లక్ష్యం కూడా   ఉంది.కాని వచ్చిన చిక్కల్లా వచ్చే  నెలా  జీతం మీదనే .వచ్చే జీతం మొత్తం నెల వారి ఇంటి ఖర్చులకే పూర్తిగా సరిపోవడం లేదు . ఇక పొదుపు చేయడానికి మా దగ్గర ఏం  మిగులుతుంది  అనే వారే చాలా ఎక్కువ . ఈ పొదుపుగిదిపు  అనేది లక్షలు  సంపాదించే వారికి కాని మాలాంటి వారికి ఎందుకు అనుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు.  బిందువు , బిందువు కలిస్తేనే  సింధువు అన్నట్టుగా కాస్తంత పొదుపు వల్ల ఎంతో ప్రయోజనం .   పెద్ద ఉద్యోగాలు , భారీ ఆదాయం ఉంటే ఎవరైనా పొదుపు చేయవచ్చన్న మాట ఎంత నిజమో , మిగులు ఆదాయం లేకపోయినంత మాత్రాన పొదుపు అసాధ్యం మాత్రం కాదు. పొదుపు చేయాలన్న దృడ సంకల్పం ఉంటే చాలు అనేక మార్గాలు కన్పిస్తాయి. మనసుంటే మార్గం ఉంటుంది అనే విధంగా.  మీరు పొదుపు చేయాలి అంటే ముందు మీరు మీ ఆదాయ వ్యయాల వివరాలతో బడ్జెట్ తయారుచేసుకోండి.  దాని వల్ల మీరు ఆదాయాన్ని  పెంచుకోలేకపోయిన కనీసం ఎలాంటి ఖర్చులు తగ్గించుకోవచ్చో, ఎలాంటి వృదా ఖర్చులు చేస్తున్నారో తెలుస్తుంది.   వృదా ఖర్చులు పూర్తిగా అరికట్టడం , ఖర్చులు తగ్గించుకోవడం అనేది మీ చేతిలోని పని .అవసరమైన ఖర్చుల్లో కొంత మిగులు సాధించటం , అనవసర ఖర్చులు పూర్తిగా తగ్గించటం . అవసరమైన ఖర్చులు అంటే కాఫీ , టీ, సినిమాలు , బట్టలు  ఈ కోవలోకి వస్తాయి. మీ కోరికలను కొద్దిగా అదుపులో పెట్టుకుంటే చాలు దానితో పొదుపు చేయవచ్చు.ఇక అనవసరమైన  ఖర్చులు . మీరు మీ బడ్జెట్ ను పరిశీలిస్తే దాని వలన తక్షణావసరాలు , తప్పించుకొనే లేదా వాయిదా వేసుకొనే  ఖర్చులు  సులభంగా గుర్తించవచ్చు.కనీసం కొన్ని ఐనా అనవసరపు ఖర్చులు తేలుతాయి.సిగరెట్ , వక్కపొడి, పాన్ మసాలా  ,మందు లాంటి వ్యసనాలు వీటిలో తప్పకుండా కన్పిస్తాయి.వీటి వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోగా అనవసరపు ఖర్చు , అనారోగ్యం  దానితో వైద్యానికి ఖర్చులు.   వీటిని కనుక మీరు మానేయగలిగితే ఎంతో సొమ్మూ మిగులుతుంది ఆరోగ్యమూ బాగుపడుతుంది. కొన్ని సంవత్సరాలనుండి  ఉన్న అలవాట్లు మానుకోవాలి అంటే కొంచెం కష్టమే కాని , ప్రయత్నిస్తే , పొదుపు చేయాలి అనే ఆలోచన కూడా ఉంటే తప్పకుండా సాధ్యం అవుతుంది.కనీసం మీ వినియోగాన్ని సగానికి సగం తగ్గించి దానిని పొదుపు చేసిన చాలు.  మీరు ఇప్పుడు భావిస్తున్న చిన్న మొత్తమే కదా అని భావిస్తున్న ఈ డబ్బూ సక్రమ పద్దతిలో పొదుపు చేస్తే మీకు వచ్చే రాబడి ఎంతో చూస్తే మీరు నమ్మలేరు.ఈ డబ్బూ మీ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా  అండగా    నిలుస్తుంది.

ఆర్ధికంగా ఎదాగాలి డబ్బు సంపాదించాలి అంటే ఎమి చేయాలి part 1

ఆర్ధిక క్రమ శిక్షణ ,అర్దిక అక్షరాస్యత పై అవగాహన 
ఏడాదికి మూడు లక్షలకు పైగా సంపాదించే ఉన్నత మధ్య తరగతి ఆదాయ వర్గాల్లో కూడా ఆర్ధిక వ్యవహరాల్లో  సరియైన అవగాహన కోరవడినది. నిజం చెప్పాలి అంటే ఎవరికి వారు, వారి వారి వృత్తులలో ఎంతో  నైపుణ్యం కనబరిచినప్పటికీ కూడా ఆర్ధిక వ్యవహారాలలో మాత్రం నైపుణ్యం చూపలేరు.పెట్టుబడులకు ఈ రోజుల్లో అనేక సాధనాలు ఉన్నప్పటికి ఎక్కువ శాతం మంది మాత్రం సాంప్రదాయ సేవింగ్ పథకాలైనటువంటి బ్యాంక్ డిపాజిట్లు , బీమా , బంగారం , ఇళ్ళ స్థాలాలనే నమ్ముకుంటున్నారు.వీటితో పోలిస్తే స్టాక్ మార్కెట్ , మ్యుచవల్ ఫండ్స్ ను విశ్వసించే వారు తక్కువగానే ఉన్నారు.వివేకంతో పెట్టుబడి పెడితే స్టాక్ మార్కెట్ మంచి రాబడి అందిస్తుంది అని చాలా కొద్ది మందికే అవగాహన ఉంటుంది.నిజం చెప్పాలి అంటే చాలా మంది జాతీయ బ్యాంకులలో డిపాజిట్ చేస్తే ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది అని నమ్ముతున్నారు అంటే వారి అవగాహన  ఏ పాటిదో అర్ధం చేసుకోండి .  ఆదాయానికి హామీ ఇస్తాయన్న నమ్మకంతోనే చాలా మంది మ్యుచవల్ ఫండ్స్  ఎన్నుకుంటున్నారు. కాని ఒక్క విషయం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి.రాబడి  అనేది మార్కెట్ పరిస్తితి పై ఆధారపడి ఉంటుంది. క్యాపిటల్ ప్రొటక్షన్ ఫండ్స్ పెట్టిన పెట్టుబడికి హామీ ఇస్తాయి అంటే అవి చాలా వరకు రిస్క్ లేని  డేట్ పథకాలలో ఇన్వెస్ట్ చేస్తాయి . మీరు లక్ష రూపాయలు ఈ  క్యాపిటల్ ప్రొటక్షన్ ఫండ్స్ లలో ఇన్వెస్ట్ చేస్టే అవి ఎనభై వేలు డేట్ పథకాలో   ఇన్వెస్ట్ చేసి మిగితా ఇరవై శాతం ఈక్విటీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. డేట్ పథకాలలో  పెట్టిన ఎనభై వేల పెట్టుబడి కొంత కాలానికి లక్ష రూపాయలు అవుతుంది.ఈక్విటీ లలో పెట్టిన పెట్టుబడిలో నష్టం వచ్చిన డేట్ పథకంలో వచ్చిన లక్ష ద్వారా మీ అసలు మొత్తం అదే విధంగా ఉంది. ఒకవేళ   ఈక్విటీ లలో మంచి రాబడి వస్తే ఇంకా మంచిదే కదా! మ్యుచవల్ ఫండ్స్ లో  పెట్టిన పెట్టుబడికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది అని కొంత మంది అనుకుంటారు. అలాగే మ్యుచవల్ ఫండ్స్ యూనిట్   ఏన్ ఏ వి  పది కంటే తగ్గదూ  అని కొంత మంది అపోహ పడుతుంటారు.   మ్యుచవల్ ఫండ్స్ లలో పెట్టుబడి పెడుతున్న వారిలో కూడా వారు ఎంచుకున్న పథకం ఏమిటి ? ఆ ఫథకం  వేటిలో ఇన్వెస్ట్ చేస్తుంది అనే విషయం పై కూడా అవగాహనా ఉండటం లేదు.  

డబ్బుని అదా చేసే విధానం.

డబ్బుని అదా చేసే  విధానం.
ఈ టాపిక్ ని చాలా జాగ్రత్తగా చదవండి ఎందుకంటే ఇది డబ్బుని ఏ విధంగా అదా చేయాలో తెలియచేస్తుంది.ఒక్కసారి ఉహించుకోండి.మీరు మీ షెల్ప్స్ సర్దుతున్నసమయంలో పాత పుస్తకాల మడతలలో ఎప్పుడో  కొన్ని నెలల క్రితం పెట్టి మరిచిపోయిన  Rs 1000 ల నోటు కనబడితే మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. చాలా ఎగ్జయిట్మెంట్ గా ఉంటుంది కదూ ! మీరు ఆ డబ్బూ ఎప్పటికి కనగోనక పోయినప్పటికీ కూడా  మీరు మీ పర్సులో ఉన్న డబ్బూతో  ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీ జీవితం సాఫీగా సాగేది కదా ?
ఇదంతా మీకు ఎందుకు చెప్పుతున్నాను అంటే మీ ఆదాయం నుండి  పొదుపు చేయడానికి వెనుక ఉన్న మూల సూత్రం. మీరు మీ ఆదాయం లో నుండి ఎంత మొత్తం పొదుపు చేయాలి అనుకున్నారో అంత మొత్తం ప్రక్కన పెట్టి దాని గురుంచి మర్చి పోయి మిగిలిన దానితో మీ జీవితం  వేల్లదీయండి. ఇది ఆలోచించడానికి మీకు కొద్దిగా కష్టంగానే ఉండవచ్చు. కాని అసాధ్యం మాత్రం కాదు. ఇప్పటికయినా  మించిపోయినది ఏమిలేదు ప్రయత్నించండి. ఇప్పటికి చాలా మంది పొదుపు అంటే ఆదాయం (జీతం ) – ఖర్చులు
( పొదుపు=ఆదాయం –ఖర్చులు ) అని మాత్రమే అనుకుంటారు. మీరు ఇలా భావిస్తే మీరు ఎన్నటికి పొదుపు చేయలేరు. మీ జేబులో డబ్బు ఉన్నప్పటికీ కూడా మీరు పొదుపు చేయలేకపోవడం మీకు ఇదివరకే అనుభంలోకి వచ్చి ఉంటుంది. ఎందుకంటె మీరు వివిధ రకాల అడ్వర్టయిజ్మెంట్ లేదా వివిధ రకాల డిస్కౌంట్ పథకాల ద్వారా బట్టల మీదా , గాడ్జెట్స్ మీదా వివిధ రకాలుగా  టెంప్ట్ అయ్యి ప్రతి సారి అవసారానికంటే ఎక్కువగానే ఖర్చు పెడుతూ ఖర్చులను నియంత్రించుకోలేకపోతున్నారు.అందువన మీరు పొదుపు చేయాలి అనుకున్న చేయలేకపోతున్నారు. మీరు వాస్తవంగా ప్రతి నెల కనీసం మీ అదాయంలో పది నుండి ఇరవై శాతం  తప్పనిసరిగా   అదా చేయాలి అంటే మీరు రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్  అనే పుస్తకంలో రాబర్ట్ కియోసకి చెప్పిన విధంగా చేయక తప్పదు.అతను ఆ పుస్తకంలో చెప్పిన దాని ప్రకారం మీరు మీ ఖర్చులను నియంత్రించే బదులు ముందుగా మీ ఆదాయం లో నుండి మీరు చేయాలి అనుకుంటున్న పొదుపు చేయగా మిగిలిన మొత్తం మాత్రమే ఖర్చు చేయాలి.  అంటే ఆదాయం –పొదుపు = ఖర్చులు ఈ ఫార్మూలా ప్రకారం మీరు తప్పనిసారిగా పొదుపు చేయాలి కాబట్టి మిగిలిన మొత్తం లో నుండే మీ ఖర్చులు చేసుకోవాలి కాబట్టి మీకు కొంత కాలానికి ఆర్ధిక క్రమశిక్షణ అలవాటు తప్పకుండా అలవాటు అవుతుంది.ఈ విధంగా మీరు కేవలం పొదుపు చేయగానే సరిపోదు. మీ పొదుపు మొత్తాన్ని పెట్టుబడికి అవకాశం గల వాటిలో ఇన్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే మీరు చేసిన పోడుపుకి అర్ధం ఉంటుంది.వివిధ రకాల పెట్టుబడి అవకాశాలను, మీ ఖర్చులను ఏ విధంగా నియంత్రిన్చుకోవాలో  మరొక్క సారి తెలుసుకుందాం.  

ఈ రోజు స్టాక్ మార్కెట్ 13-09-2012

ఈ రోజు స్టాక్ మార్కెట్ 13-09-2012

ఈవారం ప్రారంభంలోనే మీకు తెలియచేయడం జరిగినది.నిఫ్టీ 5330 కంటే క్రిందకు దిగనంత వరకు లాంగ్ పోజిషన్స్ కి ఎలాంటి ఇబ్బంది లేదు అని తెలియచేయడం జరిగినది. అదే విధంగా నిఫ్టీ కూడా 5330 సపోర్ట్ తెసుకొనే పెరగడం జరిగినది. ఇప్పుడు  నిఫ్టీ  5450 కంటే పైన నిలదోక్కుకున్నట్టు ఐతే మరింత ర్యాలీ జరుగగలదు.సపోర్ట్ 5390, 5355  రెసిస్టన్స్ 5480,5500 వద్ద కలదు.

ఈక్వీటీ మరియు డేట్ కి మధ్యగల తేడా ఏమిటి ?

ఈక్వీటీ మరియు డేట్ కి మధ్యగల తేడా ఏమిటి ? 
ఆర్ధిక అక్షరాస్యత సాదించే సమయంలో ఎదుర్కొనే చాలా  బేసిక్ ప్రశ్న ఇది. చాలా మంది షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కాని వారికి కూడా చాలా మందికి అతి బేసిక్ ప్రశ్న ఈక్విటీ అంటే ఏమిటి ? డేట్ లేదా ఋణ పత్రం అంటే ఏమిటో తెలియదు.ఈ ఆర్టికల్ ద్వారా మీరు ఈక్వీటీ మరియు డేట్ అంటే ఏమిటి? వాటి మధ్య గల తేడా ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం.
ఈక్వీటీ అనగా షేర్లు లేదా వాటా అని అర్ధం అంటే మీరు ఒక కంపెనీలో ఈక్వీటీ తీసుకుంటున్నారు అంటే మీ ఈక్వీటీ విలువకి అనుగుణంగా మీరు ఆ కంపెనీలో యాజమాన్యుపు హక్కును పొందుతారు. మీరు ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు అనుకోండి. దానిని వంద సమానభాగాలు లేదా ముక్కలుగా  చేసి మీ వద్ద 51% భాగాలు లేదా ముక్కలు ఉంచుకొని మిగితా భాగాలు లేదా ముక్కలు ఇతరులకు ఇచ్చేసారు అనుకోండి. ఈ ముక్కలు లేదా భాగాలనే ఈక్వీటీ , షేర్లు లేదా వాటాలు అంటారు.ఈ విధంగా వాటాలు తీసుకున్న వారందరూ మీ కంపెనీలో మీతో పాటు వారి వాటా విలువకి అనుగుణంగా యాజమాన్యుపు హక్కును పొందుతారు.మీరు ఈక్వీటీ లేదా షేర్ గురుంచి మరింత  వివరంగా తెలుసుకోవాడానికి  షేర్ లేదా స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి ? అని నేను ఇది వరకు వ్రాసిన ఆర్టికల్ క్రింది లింక్ ద్వారా చదవండి.పూర్తీగా అర్ధం అవుతుంది.
ఇప్పుడు డేట్ అంటే ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం. డేట్ అనగా ఒక కంపెనీ లేదా వ్యాపార సంస్థ బ్యాంక్స్ , ఫైనాన్సియల్ ఇనిస్టిట్యూట్స్  లేదా పబ్లిక్ నుండి అప్పు తీసుకోవడం ,ఈ విధంగా తీసుకున్న అప్పుకి   డేట్ సర్టిఫికేట్ లేదా ఋణ పత్రం ఇస్తాయి. మీరు  కంపెనీకి ఇచ్చే అప్పులనే డేట్ పేపర్స్ అంటారు. మీరు సాదారణంగా కంపెనీలో ఇన్వెస్ట్ చేసి వాటా తీసుకొంటే మీరు కంపెనీలో భాగస్వాములు అవుతారు. ఇది మీరు ఈక్వీటీలు కనుగోలు చేయడం ద్వారా సాధ్యం అవుతుంది.అదే మీరు డేట్ పేపర్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు కేవలం కంపెనీ కి అప్పు ఇచ్చినట్టు. మీరు ఇచ్చిన అప్పుకి కంపెనీ నిర్ణీత రేటు ప్రకారం వడ్డీ ఇస్తుంది.ఎందుకంటె కంపెనీ తన అవసరాలకు అనుగుణంగా మీ వద్ద డేట్ పేపర్ రూపంలో అప్పు తీసుకున్నది కావున.కొన్ని సమయాలలో ప్రభుత్వాలు కూడా ప్రజల వద్ద నుండి అప్పు సేకరిస్తుంటాయి.వాటినే మనం సాధారణంగా బాండ్స్ అని పిలుస్తుంటాం..ఈ డేట్ పేపర్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు బ్యాంక్స్ అందించే వడ్డీ కంటే అధిక వడ్డీ పొందవచ్చు.మరియు పూర్తీ సురక్షితం.

పొదుపు లేదా ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి?

పొదుపు లేదా ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి?

మీరు రూపాయి అదా చేసారంటే  రూపాయి సంపాదించినట్టే   అని బెంజిమేన్ ప్రాంక్లిన్ ఏనాడో చెప్పాడు.మీరు ఎందుకు పొదుపు చేయాలి అనుకుంటున్నారు అంటే చాలా మంది సమాధానం చెప్పక పోవచ్చు. కేవలం పొదుపు చేయడం వలన ఎలాంటి లాభం ఉండదు. మీరు చేసిన పొదుపును ఇన్వెస్ట్మెంట్ గా తప్పని సరిగా మార్చాలి . తగ్గుతున్న రూపాయి విలువ , పెరుగుతున్న ద్రవ్యోల్బణం.భవిషత్తు అవసరాల కొరకు అని చాలా చాలా సమాధానాలు చెప్తాం., మన పెట్టుబడి ఒక్క ముఖ్య ఉద్దేశం  సంపద సృష్టించడం , దానితో పిల్లల   చదువులు ,కళాశాల ఫీజులు. పెళ్ళిల్లు, సెలవులలో  సరదాగా  గడపడం, మంచి జీవన ప్రమాణానికి,రిటైర్మెంట్ తర్వాత జీవితం సాపీగా జరుగుటకు , మీ అనంతరం ఈ సంపద మీ తరాల వారికి  చేర్చటం,
ఈ పెట్టుబడి వల్ల వచ్చే  రాబడి పెరుగుతున్న  ద్రవ్యోల్బణం  కంటే అధికంగా ఉండాలి. ఎప్పుడైనా సరే సంపదను కాపాడటం మరియు దానిని అభివృద్ధి చేయడం అనేది ఒక్క కళ.  మీ దగ్గర ఉన్న వంద రూపాయలు ద్రవ్యోల్బణం ఎనిమిది  శాతం ఉంటే  సంవత్సరం తర్వాత దాని విలువ తొంభై రెండు రూపాయలు మాత్రమె పది సంవత్సరాల తర్వాత కూడా ద్రవ్యోల్బణం ఎనిమిది  శాతం ఉంటే  మీ వంద రూపాయల విలువ కేవలం   నలభై ఆరు రూపాయలు మాత్రమె అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు చేసే మీ  పెట్టుబడి మంచి రాబడి అందించేదిగా  ఉండాలి.
ఇన్వెస్ట్మెంట్ సాధనాలు.

మీరు  సాదారణంగా ఇన్వెస్ట్ చేయడానికి . పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ , షేర్ మార్కెట్, మ్యుచవల్  ఫండ్స్ ,బ్యాంక్ డిపాజిట్లు , వివిధ పోస్టాపీసు పథకాలు, రియల్ ఎస్టేట్స్ , బంగారం, గవర్నమెంట్ బాండ్స్, ట్రెజరీ బిల్ల్స్,  మొదలగునవి కలవు. వీటి గురుంచి మనం  తర్వాత వివరంగా తెలుసుకుందాం. 
గమనిక : ఇన్వెస్ట్ ను తెలుగులో మదుపు అని అంటారు. కాని చాలా మందికి మదుపు, మదుపరి  లాంటి పదాలకు అర్ధాలు తెలియవు. అందుకే నేను వ్రాసే ఆర్టికల్స్ లో  కొన్ని చోట్ల సాదారణంగా వాడుకలో ఉండే ఇంగ్లిష్ పదాలు వాడక తప్పడం లేదు.

బంగారంలో పెట్టుబడి ఎంత శాతం ఉండాలి ?

బంగారంలో పెట్టుబడి ఎంత శాతం ఉండాలి ?

ఈ మధ్య నేను తరచుగా అందుకుంటున్న మెయిల్స్ లో అధిక భాగం  బంగారంలో పెట్టుబడి  గురుంచే అధికంగా ఉంటున్నాయి. దానికి ముఖ్య కారణం ఈ మధ్య బంగారం రేటు అధికంగా పెరగడం కూడా ఒక కారణం. నేను అందుకున్న మెయిల్స్ లో అధిక భాగం వారి వద్ద ఉన్న పెట్టుబడిలో బంగారంలో ఎంత శాతం పెట్టుబడిగా పెట్టాలి ?  బంగారం లో పెట్టుబడి పై మీ ఉద్దేశం ఏమిటి ? లాంటి  ప్రశ్నలు అధికంగా ఉన్నాయి.దీనికి నా సమాధానం వ్యక్తిగతంగా నా పోర్ట్ ఫోలియో లో 5% కంటే అధికంగా పెట్టుబడి ఉండటానికి నేను అసలు ఇష్టపడను. అదే విధంగా ఇన్వెస్టర్లను కూడా వారి  పోర్ట్ ఫోలియో లో  10%  కంటే అధికంగా పెట్టుబడి పెట్టడాన్ని ఎంత మాత్రం మంచిది కాదు అనే హెచ్చరిస్తాను. ఎందుకంటె ఒక ఆర్ధిక నిపుణుడిగా బంగారం పై నాకంటూ ఒక నిచ్చిత అభిప్రాయం ఉంది. నేను కొన్ని సంవత్సరాలుగా అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ అసెట్ తరగతులను నిశితంగా విశ్లేషించడం జరిగినది.వాటిలో బంగారం యొక్క విలువను లెక్కించడానికి సరియైన పద్దతంటూ లేదు. మనం సాదారణంగా దేనిలో అయినా పెట్టుబడి పెడుతున్నాం అంటే   దాని యొక్క ప్రస్తుత విలువను, ఆదాయ వ్యయాలను, బ్యాలన్స్ షీట్ మొదలగు వాటిని పరిశీలించి దాని భవిష్యత్తు ను అంచానా వేస్తాం. కాని బంగారం మాత్రం ఎలాంటి ఆదాయాన్ని ఇవ్వదు. అందువలన దాని విలువను ఖచ్చితంగా అంచనా  వేయడం మాత్రం ఆచరణాత్మకంగా సాధ్యం కాదు.   
సాదారణంగా బంగారం ధర అమెరికా మానిటరీ పాలసీ తో ప్రత్యక్ష సంభందం కలిగి ఉంటుంది. అమెరికా మానిటరీ పాలసీ లో పెరుగుదల లేదా తగ్గుదల బంగారంపై  ప్రభావం కలిగి ఉంటుంది.బంగారం విలు కట్టడానికి అనేక సిద్దాంతాలు ప్రతిపాదిన్చాబడ్డాయి. వాటిలో. అమెరికా మానిటరీ పాలసీ , ద్రవ్యోల్భణం. ముడిచమురు ధరలు మొదలగునవి ఉన్నాయి. కాని ఇవి ఏవి కూడా ఖచ్చితమైనవి  కావు.ఎందుకంటె బనగారాం ఎలాంటి ఆదాయాన్ని ఉత్పత్తి కానీ  , జనరేట్ చేయడం కాని చేయదు.అందువలన బంగారం యొక్క  విలువ ఖచ్చితంగా అంచానా వేయడం సాధ్యం కాదు. అందువలన నేను నా పెట్టుబడిలో 5% కంటే అధికంగా బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడను. అదే విధంగా ఎవ్వరిని కూడా 10%  కంటే అధికంగా పెట్టుబడి పెట్టడానికి సలహా ఇవ్వను.ఐతే కొంత మంది నాతో విభేదించవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా బంగారం ఈక్విటీ మార్కెట్ కంటే అధిక ప్రతి ఫలం అందిస్తుంది కదా ? అని. రెండు మూడు సంవత్సరాల నుండి  ఈక్విటీ మార్కెట్  తక్కువ ప్రతి ఫలం అందించిన దీర్ఘకాలంలో మాత్రం  ఈక్విటీ మార్కెట్  కంటే అధిక రాబడి అందించే సాధానాలు లేవనే చెప్పాలి. కాకపోతే  ఈక్విటీ మార్కెట్  లో మంచి అవగాహనతో ఇన్వెస్ట్ చేయడం చేయాలి. అంతే కాని ఎవ్వరో చేప్పారని, ఎవ్వరో ఇన్వెస్ట్ చేసారని కాకుండా మీరు స్వయంగా విశ్లేషించే సామర్ధ్యం తప్పకుండా కలిగి ఉండాలి.స్టాక్ మార్కెట్ పై మీకు ఏ మాత్రం అవగాహన లేకున్న నష్టాలపాలు కావడం చాలా సర్వసాదారణం. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆర్ధిక విషయాలపై అవగాహన కలుగ చేసుకోవాలి. Learn to earn    

రూపాయి పతనం వలన మన పై ఏ విధమైన ప్రభావం ఉంటుంది.

రూపాయి పతనం వలన  మన పై ఏ విధమైన ప్రభావం ఉంటుంది.
రూపాయి  విలువ పతనం  వలన  మన పై చాలా ప్రభావం ఉంటుంది. ముందుగా రూపాయి విలువ పడిపోవడం వలన లాభపడేది  ఎవరో ఒక్కసారి పరిశీలిద్దాం  .
ఎగుమతి దారులు సాదారణంగా వారూ ఎగుమతి చేసిన వస్తువులకు లేదా  అందించిన సేవలకు  వారి  పేమెంట్ డాలర్ లేదా విదేశీ కరెన్సీ రూపంలో అందుకొని వాటిని మన రూపయలలోకి మార్చుకుంటారు.రూపాయు పతనం వలన వారూ మార్చుకొనే డాలర్ లేదా విదేశీ కరెన్సీ కి అధిక రూపాయలు రావడం వలన లాభం కలుగుతుంది.
NRI లు  విదేశాల నుండి తరుచుగా వారి కుటుంబ సభ్యులకోరకు డబ్బులు పంపిస్తుంటారు. రూపాయు పతనం వలన వారూ పంపించే డాలర్ కి అధిక రూపాయలు రావడంతో NRI లు మరియు వారి కుటుంబ సభ్యులు లాభం అందుకుంటారు.
కొంత మంది కొన్ని విదేశీ కంపెనీల కొరకు మన దేశంలో నుండి  అన్ లైన్ జాబ్ చేయడం జరుగుతుంది. దీనికొరకు వారూ విదేశీ కరెన్సీ రూపంలో పేమెంట్ అందుకోవడం జరుగుతుంది. వారూ కూడా లాభ పడతారు. ఉదా : Ad sense
ఇప్పుడు  రూపాయి విలువ పడిపోవడం వలన నష్టపోయేది ఎవరో ఒక్కసారి పరిశీలిద్దాం  .
దిగుమతిదారులు వారూ దిగుమతి చేసుకున్న వస్తువులకు లేదా పొందిన  సేవలకు పేమెంట్ డాలర్ లేదా విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించవలసి ఉంటుంది.
విదేశాలకు వెళ్ళే టూరిస్టులు, విదేశాలలో చదువుకోవడానికి వెళ్ళే విద్యార్థులు వారి ప్రయాణానికి , విదేశాలలో అవసరమైన డాలర్లు పొందడానికి రూపాయి పతనం వలన అధిక రూపాయలు చెల్లించవలసి ఉంటుంది.
పైన పేర్కొన్న వారూ మాత్రమే కాకుండా సాదారణ ప్రజానీకంపై రూపాయి పతనం చాలా ప్రభావం కలుగచేస్తుంది. ముఖ్యంగా మన దేశం ఆయిల్ దిగుమతి చేసుకోవడం  వారి పేమెంట్ డాలర్ల రూపంలో జరపవలసి ఉండటం వలన  అధిక విదేశీకరెన్సీ కొరకు అధిక రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. అంతర్జాతీయ    మార్కెట్ లో ఆయిల్ ధరలు పెరగడానికితోడు , అదే సమయంలో మన రూపాయి విలువ పతనం కావడం వలన సామాన్యుడిపై  పెట్రోలు, డిజిల్ , గ్యాస్  ధరలు పెరగడం జరుగుతుంది. వీటి ధరలు పెరగడం వలన మిగితా వస్తువుల ధరలు కూడా పెరిగి సామాన్యుడిపై అధిక భారం పడుతుంది.అదేవిధంగా ఇతర దిగుమతి కంపెనీల పై అధిక భారం పడటం వలన అవి నష్టాలపాలు కావడమే కాకుండా కంపెనీలు మూసివేయాల్సిన పరిస్థితులు కూడా తలెత్తుతాయి. దీనివలన చాలా మంది ఉద్యోగాలు కోల్పోవాల్సిన  పరిస్థితులు ఏర్పాటు అవుతాయి.రూపాయి పతనం వలన  ఎగుమతిదారులు మరియు NRI లు తప్ప మిగితా ప్రజల పై తీవ్ర ప్రాభవం ఉంటుంది. ఏది ఎమైనప్పటికి కూడా రూపాయి పతనం కావడం దేశానికి ఎల్లప్పూడూ మంచిది కాదు. 

ముఖ్య గమనిక :మీరు  టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా ఒక పద్ధతి  ఎంచుకొని దానినే స్థిరంగా  మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్ మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ సాధ్యం అవుతుంది.  http://telugufinancialschool.blogspot.in/2012_09_01_archive.html

మ్యూచవల్ ఫండ్స్ అంటే ఏమిటి ?

మ్యూచవల్ ఫండ్స్ అంటే ఏమిటి ?

మ్యూచవల్  ఫండ్ అంటే   ఒకే ఆర్ధిక లక్ష్యం కలిగి ఉన్న అనేక పెట్టుబడిదారుల పొదుపులను కూడకట్టడం కోసం ఏర్పడిన ట్రస్టు. ఒకే లక్ష్యం అనగా డబ్బును ఇన్వెస్ట్ చేయాలి దాని పై రాబడి రావాలి అని అనుకునే వారందరి దగ్గరి నుండి డబ్బును సేకరించి వివిధ పెట్టుబడి సాధనాలలో అనగా షేరు మార్కెట్ , బాండ్స్ ,ప్రభుత్వ సేక్యురిటిలు ,డిబెంచర్లు , బంగారం ,డేట్స్ మొదలగు వాటిలో పెట్టుబడి పెడతారు.  మ్యూచవల్  అని పేరు లోనే ఉన్నట్టుగా, కలిసి కట్టుగా పెట్టుబడి పెట్టడం . మ్యూచవల్  ఫండ్ లలో పెట్టుబడి పెట్టడానికి అదనపు డబ్బు ఉన్న వాళ్ళెవరైన కొంచం డబ్బు అంటే కొన్ని వందల రూపాయల నుండి  మొదలుకొని  మీ పొదుపు సామర్ధ్యానికి అనుగుణంగా  మ్యూచవల్  ఫండ్ లలో పెట్టుబడి పెట్ట వచ్చు. ఈ మ్యూచవల్  ఫండ్ లు  ,పెట్టుబడికి సంబంధించిన వివిధ రకాల ఫండ్ లలో మీ డబ్బును పెట్టుబడి పెట్టి   మ్యూచవల్ ఫండ్ పథకాల యూనిట్లను కొంటారు.వీటిని ప్రపంచంలో కొన్ని భాగాలలో మ్యూచవల్  ఫండ్ లేదా యూనిట్ ట్రస్టు అని అంటారు
ఎవరికీ ఐతే స్టాకు మార్కెట్ నందు అనుభవం లేదో , షేర్ల ధరలను క్రమం తప్పకుండా పరిశీలించడానికి సమయం కేటాయించాలేరో ,ఒకే రంగం లోని షేర్లు కొంటే నష్టపోతాం కాని, వివిధ రంగాల షేర్లు కొనడానికి అధిక డబ్బు లేదు కదా అని అనుకొనేవారు ,పెట్టుబడి పై రిస్కు ఎక్కువగా తీసుకోలేని వారు, పెట్టుబడి పై అధిక రిస్కు తీసుకోగలరు  కాని అనుభవం లేకపోవడం, ఇలాంటి  వారందరికి  మ్యూచవల్  ఫండ్ అనుకూలమగా ఉంటుంది.  ఇలాంటి వారందరూ  మ్యూచవల్  ఫండ్ లో పెట్టుబడి పెడితే  మార్కెట్ నిపుణులు లేదా ఫండ్ మేనేజర్లు వాటిని వివిధ మ్యూచవల్ ఫండ్ పథకాల యందు పెట్టుబడిగా  పెడతారు.

 ఫండ్ మేనేజర్లు పెట్టుబడిని  వివిధ మ్యూచవల్ ఫండ్ పథకాలలో అనగా   షేరు మార్కెట్  మొదలుకొని వివిధ రకాల పెట్టుబడి  సాధనాలలో పెట్టుబడిగా పెడతారు..మీరు  పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఆధారంగా మీకు యూనిట్లు కేటాయిస్తారు . ఈ విధంగా పెట్టిన  పెట్టుబడుల ద్వారా వచ్చిన ఆదాయంను అనగా షేర్లలో పెట్టుబడి పెడితే వచ్చే డివిడెండ్ ,షేరు ధర పెరగడం వళ్ళ  కలిగే లాభం , ఇదే విధంగా వివిధ పధకాల ద్వారా వచ్చే ఆదాయం  మరియు ఈ పథకాల  వలన కలిగిన మూలధనం ( కాపిటల్) లోని పెరుగుదలను మీ వద్ద గల  యూనిట్ ల ఆధారంగా మీకు పంచుతారు. లేదంటే మీరు  మీ యూనిట్లను స్టాక్ మార్కెట్ లో కూడా అమ్ముకోవచ్చు.  ఈ విధంగా మ్యూచవల్  ఫండ్ సామాన్య మానవునికి బాగా అనుకూలమైన పెట్టుబడిఎందుకంటేఇది వివిధి రకాలవృత్తిపర నిపుణల ద్వారా నిర్వహించబడుతూ ,సెక్యూరిటీలలో తక్కువ ఖర్చుతో,తక్కువ పెట్టుబడితో  పెట్టుబడి చేయడానికి అవకాశం కలిగిస్తుంది.

ఒక్క సారి మీరు పైన ఇవ్వబడిన చార్టు ను గమనించండి. మ్యూచవల్  ఫండ్ ఏ విధంగా పని చేస్తున్నదో తెలుస్తుంది.  మ్యూచవల్  ఫండ్  మొదట ఇన్వెస్టర్స్  అనగా మీరు, మీ లాంటి వారి వద్ద  నుండి వివిధ రకాల ఫథకాల ద్వారా సేకరించిన మీ డబ్బును ఫండ్ మేనేజర్లు వివిధ రకాల సెక్కురిటీలలో ఇన్వెస్ట్ చేస్తారు.ఈ  సెక్కురిటీలలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కలిగే లాభాలను మీకు మరియు మీలాగే ఇన్వెస్ట్ చేసిన వారందరికి పంచుతారు. ఈ విధంగా చేసినందుకు  మ్యూచవల్  ఫండ్ లు  మీ వద్ద కొంత రుసుం వసూలు చేస్తాయి.

ఈవారం స్టాక్ మార్కెట్10-09-2012to14-09-2012

ఈవారం స్టాక్ మార్కెట్10-09-2012to14-09-2012
గత వారం ఆరో తేదిన సమావేశమైన యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ బాండ్ల  కనుగోలుకు సంభందించి కీలక నిర్ణయం తీసుకోవడం మరియు క్రింది లెవల్లో నిఫ్టీ కి మదతు రావడంతో  కనుగోల్లు జరిగి  నిఫ్టీ కీలక  రెసిస్టన్స్ 5348  మరియు 20 sma 5330 పైననే ముగియడం జరిగినది.అంతే కాకుండా కీలకమైన 20 sma 5330 పైన శుక్రవారం రోజు ముగిస్తే  మార్కెట్ లో ర్యాలీ మరింత కొనసాగడానికి అవకాశం కలదు అనే విషయం మీకు తెలియచేడం జరిగినది.ఇక ఈ వారానికి వస్తే మార్కెట్ ను ప్రభావిత చేసే అంశాలు పన్నెండో తేదీ  బుధవారం నాడు వెలువడనున్న IIP డేటా , తదుపరి ద్రవ్యోల్భణం మొదలగునవి మార్కెట్ ను ప్రభావితం చేస్తాయి. అదే విధంగా  వచ్చే సోమవారం జరుగనున్న  రిజర్వు బ్యాంక్  సమావేశం కూడా కీలకమే.  

నిఫ్టీ టెక్నికల్ అనాలసిస్ విషయానికి  వస్తే  పై చార్ట్ లో మార్క్ చేసిన పాయింట్ల వద్ద ట్రెండ్ లైన్ సపోర్ట్ పొందిన ప్రతిసారి మంచి ర్యాలీ రావడం జరిగినది. ఈ సారి కూడా నిఫ్టీ ట్రెండ్ లైన్ వద్ద సపోర్ట్ తీసుకోవడం జరిగినది. గత చరిత్ర ప్రకారం చూస్తే  నిఫ్టీ లో ర్యాలీ ఈ సారీ కనీసం 5520 వరకు జరుగగలదు అని అంచనా వేయడం జరుగుతుంది.అంటే ఇది ఒక్కరోజు లో జరిగే పని కాదు. ఈ  నెలలో  మాత్రం చేరుకోవడానికి  అత్యధిక అవకాశం మాత్రం కలదు . అదే అదే విధంగా లాంగ్ టర్మ్  ట్రెండ్ లైన్ రెసిస్టన్స్ 5331 పైన నిఫ్టీ ట్రేడ్ జరుగుతున్నంత వరకు బుల్ల్స్ కి ఎలాంటి ఇబ్బంది లేదు.

అదే విధంగా పై చార్ట్ గమనిస్తీ నిఫ్టీ కీలకమైన 5190-5200 సపోర్ట్ పైననే ముగియడం జరిగినది. ఇది 50%  ఫిబోనసీ రేషియో . అదే విధంగా మార్కెట్ లో ర్యాలీ జరగాలి అంటే ఎప్పుడూ కూడా నిఫ్టీ 50%  ఫిబోనసీ రేషియో పైననే  ఉండటం జరగాలి. అందుకోసమే మీకు గత వారం 5190-5200 కంటే నిఫ్టీ కిందకు దిగాజారనంత వరకు లాంగ్ పోజిశాన్స్ తీసుకోవడానికి ఎలాంటి భయం అవసరం లేదు, క్రింది లెవల్లో కనుగోలు చేయండి అని  తెలియచేయడం  జరిగినది.ఈ వారం ప్రతి డిప్ లో బై చేయడం మంచిది. ఈ వారం రెసిస్టన్స్  5400, 5450, 5520 సపోర్ట్  5330, 5300.  నిఫ్టీ లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే అప్ డేట్ చేయగలం.    