బంగారం లో పెట్టుబడి పెడుతున్నప్పుడు ఏ గోల్డ్ ETF లో పెట్టుబడి పెట్టడం మంచిది?


బంగారం లో పెట్టుబడి పెడుతున్నప్పుడు  ఏ గోల్డ్  ETF లో పెట్టుబడి పెట్టడం మంచిది?
ఇది వరకు నేను బంగారంపై  వ్రాసిన ఆర్టికల్స్ చదివిన తర్వాత కొంత మంది మిత్రులు బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి వివిధ గోల్డ్  ETF లు అందుబాటులో ఉన్నాయి కదా ? అందులో వేటిలో  ఇన్వెస్ట్ చేస్తే మంచిది ? వాటి రాబడి  ఏ విధంగా ఉంది ? అని అడగడం జరిగినది. ఇప్పుడు వాటి గురుంచి ఒక్కసారి వివవరంగా తెలుసుకుందాం. గోల్డ్  ETF కనుగోలు చేస్తున్నాం అంటే బంగారాన్ని  ఎలక్ట్రానిక్  రూపంలో కనుగోలు చేయడం . గోల్డ్  ETFలు అందుబాటులోకి వచ్చాక బంగారంలో ఇన్వెస్ట్ చేయడం చాలా సులభతరం అయింది. గోల్డ్  ETF లో రాబడి సాదారణంగా ఫిజికల్ గోల్డ్ ధరపై ఆధారపడిఉంటుంది.ఒక గోల్డ్ ETF సుమారు ఒక గ్రాం బంగారం తో సమానం. గోల్డ్  ETF లో ఇన్వెస్ట్ చేయడం చాలా సులభం . అంతేకాకుండా మీరు ఒక గ్రాం బంగారం కూడా కనుగోలు చేయవచ్చు. దాని వల్ల మీరు  కొంత కాలంలో మీకు  కావలసిన  బంగారం జమ అయ్యే వరకు ప్రతినెల  ఇన్వెస్ట్ చేయవచ్చు.వివిధ రకాల గోల్డ్ ETF ల రిటర్న్స్ ఏ విధంగా ఉన్నాయో క్రింది పట్టిక ద్వారా చూడండి.

S.No

ETF  Name


% of Returns For 1 Year
1
Axis
12.82
2
Birla sun life
13.15
3
Gs gold bees
12.98
4
HDFC
13.04
5
ICICI-pru
12.86
6
Kotak

12.99
7
Quantam
13.03
8
Reliance

13.08
9
Religare

13.12
10
Sbi
13.19
11
Uti

13.04
12
Physical gold

14.88
మీరు పై పట్టికను పరిశీలిస్తే వివిధ రకాల గోల్డ్ ETF లో రాబడిలో తేడా చాలా స్వల్పలంగా  ఉంది. దాదాపు గా అన్ని గోల్డ్ ETF లు ఒకే రకమైన రాబడి అందచేసాయి. రాబడిలో స్వల్ప తేడా కూడా నిర్వహణపరమైన ఖర్చుల వలన సంభవించినదే. అందువలన ఏ గోల్డ్ ETF లో  అయిన ఇన్వెస్ట్ చేయవచ్చు.కాకపోతే ఇప్పుడూ కూడా బంగారంలో ఇన్వెస్ట్ చేయవవచ్చా ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అనడంలో ఎలాంటి సందేహం లేదు.  దాని గురుంచి బంగారంలో ఇప్పుడు పెట్టుబడి పెడితే రానున్న మూడేళ్లలో రెట్టింపు కావడం నిజమేనా ?  అనే  ఆర్టికల్ వివరంగా చదవండి.


జీవితంలో డబ్బు సంపాదించాలి ? ఆర్ధికంగా ఎదాగాలి అంటే ఆర్ధిక అక్షరాస్యత తప్పనిసరా ?


జీవితంలో డబ్బు సంపాదించాలి ? ఆర్ధికంగా ఎదాగాలి అంటే ఆర్ధిక అక్షరాస్యత తప్పనిసరా ?
 ప్రతి మనిషికి ఆర్దిక అక్షరాస్యత అనేది చాలా అవసరమే కాకుండా అతి ముఖ్యం కూడా . ఈ రోజుల్లో కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోతే ఏ విధంగా చదువు రాని వారి క్రింద జమకడతారో   మీ అందరికి తెలుసు.  అదే విధంగా మీకు ఆర్ధిక అక్షరాస్యత లేకపోతే , వ్యక్తిగత ఫైనాన్స్ పై అవగాహన లేకపోతే  మీకు ఎన్ని ఉన్నత డిగ్రీలు ఉన్న, మీ రంగంలో మీరు ఎంత గొప్ప వారైనా  అర్దిక అక్షరాస్యత లేకపోతే  మీ జీవితచరమాంకం లోపు ఎప్పుడో ఒకప్పుడు ఇబ్బంది పడక తప్పదు. ఆర్దిక అక్షరాస్యత లేకపోవడం వలన కోట్లు సంపాదించిన వారూ కూడా బికారులు అయిన వారూ ఎంతో మంది ఉన్నారు. చాలా మంది అనుకుంటారు మేము చాలా పెద్ద సాలరీ అందుకుంటూన్నాం , మాకు ఆర్ధిక అక్షరాస్యత అవసరమా అని? ముఖ్యంగా సాప్ట్ వేర్  ప్రోపెషనల్స్ . అలా అనుకోవడం చాలా పెద్ద తప్పు మీరు ఏ రంగం లో ఉన్నా సరే.

దయచేసి ఒక విషయం తప్పక గుర్తుపెట్టుకోండి. డబ్బు సంపాదించడానికి , డబ్బు  మేనేజ్మెంట్ చేయడానికి చాలా తేడా ఉంది. రెండు వేరు వేరు భిన్న ద్రువాలు.మీరు ఎటువంటి వృత్తిలో ఉన్నా సరే  ఆర్దిక అక్షరాస్యత అనేది తప్పనిసరి. మీరు ఎంత కాలం ఇంకా మీ వ్యక్తిగత ఆర్ధిక నిర్ణయాల కొరకు   ఫ్రెండ్స్, బ్రోకర్స్, టి .వి అనలిస్ట్ లు  మొదలగు వారిపై ఆధారపడతారు.  మీరు మిలియనీర్లు ,బిలియనీర్లు కావడం అనేది మీ అర్దిక అక్షరాస్యత పై ఆధారపడి ఉంటుంది. మీరు ధనవంతులు కావడం అనేది మీరు  తీసుకునే అర్దిక పరమైన నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ఆర్దిక అక్షరాస్యత అంటే ఎంతో కష్టమైన స్టాక్ మార్కెట్  డేరివేటివ్స్  విశ్లేషణ , కరెన్సీ మార్కెట్ విశ్లేషణ కాదు. మీ వ్యక్తిగత ఫైనాన్స్ ప్లానింగ్ సరిగ్గా నిర్వహించడం.  ఆర్దిక అక్షరాస్యత పేద వారూ , డబ్బు ఉన్నవారూ  అని తేడా లేదు అందరికి కావలసినదే. చివరకు వంశపారంపర్యంగా  సంపద వారసత్వంగా వచ్చిన వారికి కూడా తప్పనిసరిగా కావలసినదే. ఎందుకంటె  వారసత్వంగా వచ్చిన  సంపదను నిలుపుకోవాలి అంటే కూడా ఆర్దిక అక్షరాస్యత కావాలి. ఆర్దిక అక్షరాస్యత అంటే మీ ఖర్చులను నియంత్రించుకోవడం , ఆస్తులు మరియు అప్పులకు మధ్య తేడా తెలుసుకోవడం, ఆస్తులను ఏవిధంగా పెంచుకోవాలో తెలుసుకోవడం , ఆర్ధిక పరంగా ముఖ్యమైన నిర్ణయాలను సమర్ధవంతంగా  తీసుకోగలగడం , మీరు సంపాదించిన సంపదను ,సంపద  స్ప్రుస్టించే సాధనలాలో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకోవడం. సంపాదించిన సంపదపై ఆదాయపు పన్ను ఏవిధంగా   అదా చేయాలో తెలుసుకోవడం.
మీకు ఒక ఉదాహరణ చెప్తాను .మైక్ టైసన్ , మైఖేల్ జాక్షన్ మీ అందరికి తెలుసుకదా ? వారూ వారి రంగాలలో నెంబర్ వన్ గా ఉండటమే గాక ప్రపంచ వ్యాప్తంగా  కూడా  ఎంతో ప్రసిద్ది పొందడమే కాకుండా మిలియన్ల కొద్ది డబ్బు సంపాదించారు. కాని వారి ఆర్ధిక పరిస్థితి దారుణంగా దిగజారి దివాలా  తీసారు. దీనికి ముఖ్య కారణం వారికి   ఆర్దిక అక్షరాస్యత లేకపోవడమే. వారికి ఆర్దిక అక్షరాస్యత ఉంటే వారూ సంపాదించిన మిలియన్ల డబ్బు, బిలియన్లుగా మారేది. ఆర్దిక అక్షరాస్యత  ప్రతి ఒక్కరికి వయస్సుతో నిమిత్తం లేకుండా , చేస్తున్న వృత్తి , బిజినెస్ తో సంభందం లేకుండా ప్రతి ఒక్కరికి అవసరం. అమెరికాలోఒక   నివేదిక ప్రకారం bankruptcies 70 % మంది 25 సంవత్సరాలలోపు వారే . అదికూడా  80%  మంది వారి bankruptcies తెలియచేసిన ఒకే ఒక కారణం ఏమిటో తెలుసా ? క్రెడిట్ కార్డ్స్.పిల్లలు స్కూల్ వయస్సులో ఉన్నప్పుడే ఆర్ధిక అక్షరాస్యత మౌళిక  సూత్రాలు తెలుసుకొని ఉంటే వారూ కాలేజీలోకి  , యుక్త వయస్సులోకి వచ్చిన వెంటనే లేదా వారి సంపాదన మొదలైన కొత్తలో  అధిక , అనవసరమైన ఖర్చులు చేసేవారు కాదు.వారి సంపాదన మొదలు కాకముందే  వారికి మనీ మేనేజ్మెంట్ పై అవగాహన ఉంటే వారీ జీవితంలో డబ్బు కోసం అసలు ఇబ్బంది పడాల్సిన అవసరమే రాదు.  
పిల్లలు అధికంగా ఖర్చు చేసే చెడు  అలవాటు ఎక్కడి నుండి నేర్చు కొంటారో మీకు తెలుసా ? వారి స్నేహితుల నుండి అనుకుంటున్నారా ? తప్పు వారి  తల్లితండ్రుల నుండే నేర్చుకొంటారు. మీరు నమ్మండి , నమ్మకపొండి .ఇది ముమ్మాటికి వాస్తవం.పిల్లలు ఖరీదైన షాపింగ్ అలవాటు ,క్రెడిట్ కార్డ్ వాడకలు  వారి తల్లితండ్రుల నుండే నేర్చుకొని పెద్దయ్యాక వారి జీవితంలో ఒక భాగం చేసుకుంటారు.
దురదృష్టావశాత్తు  ప్రజలలో మరొక అపోహ కూడా ఉంది. వారి జీవితంలో అనుకోకుండా సంపద రావడం , సాలరీ లో భారీ పెరుగుదల ఉంటే వారి ఆర్ధిక అక్షరాస్యత పెరిగింది అనే అపోహలో  ఉండి ఆర్ధిక నిపుణుల అభిప్రాయం లేకుండానే ఆర్ధిక నిర్ణయాలు తీసుకోవడం వలన చివరకు ఆర్ధికంగా నష్టపోవడం తప్పా వారూ చేయగలిగేది ఏమి ఉండదు.ఎదిఎమైనప్పటికి జీవితంలో ఆర్ధికంగా ఎదగాలి , డబ్బూ సంపాదించాలి అంటే ప్రతి ఒక్కరికి ఆర్ధిక  అక్షరాస్యత అనేది తప్పనిసరి ముఖ్యంగా పిల్లలకు కూడా చిన్నప్పటినుండే  ఆర్ధిక  అక్షరాస్యత కల్పించాలి.ఇప్పటి 

సాప్ట్ వేర్  ఉద్యోగులలో అధిక శాతం ఎడా పెడా దొరికిన లోన్స్ , క్రెడిట్ కార్డ్స్ వాడేసి వచ్చే జీతం మొత్తం EMI లకు వెళ్ళడంతో కనీస సాలరీ కూడా సరిగా అందుకోలేని వాళ్ళను ఎంతో మందిని చూడటం జరిగినది. మీ పరిస్థితి, మీ పిల్లల పరిస్థితి  ఆ విధంగా జరగకుండా జాగ్రత్తపడండి.
telugufinancialschool@gmail.com

బంగారంలో ఇప్పుడు పెట్టుబడి పెడితే రానున్న మూడేళ్లలో రెట్టింపు కావడం నిజమేనా ?


బంగారంలో ఇప్పుడు పెట్టుబడి పెడితే రానున్న మూడేళ్లలో రెట్టింపు కావడం నిజమేనా ?

రానున్న మూడేళ్ళ కాలంలో బంగారం ధర  రెట్టింపు అవుతుంది అంటే అచ్చర్యపోతున్నారా ? మీరు బంగారం ధర గత కాలంలో ఎలా పెరిగినదో మీకు తెలుసుకదా ? మీరు బంగారం ధర ఒక్కసారి  పరిశీలిస్తే ఇండియా లో డిశంబర్ 2007  10gr బంగారం ధర  రూ .10,000  ఉంటే  డిశంబర్   2010 లో రూ 20,000 లకు చేరుకుంది.అంటే కేవలం మూడు సంవత్సరాలలో రెట్టింపు ధరకు చేరుకుంది . సెప్టెంబర్ 2009లో  రూ.16500 ఉంటే మూడు సంవత్సరాలో  అంటే 2012లో రూ.32500 కు చేరుకుంది ఇప్పుడు కూడా మూడు సంవత్సరాలలో రెట్టింపు ధరకు చేరుకుంది.
మనదేశం బంగారాన్ని అధిక శాతం విదేశాలనుండే  దిగుమతి చేసుకుంటుంది. అందువలన మన దేశంలో బంగారం ధర అంతార్జాతీయ ధర కి  అనుగుణంగా ఉండదు.
అంతార్జాతీయ మార్కెట్ లో  బంగారం 23 Aug 2011 న $1900 గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు మన దేశంలో బంగారం ధర రూ. 28600 ఉంటే ఇప్పుడు  అంతార్జాతీయ మార్కెట్ లో  బంగారం $ 1730 చేరుకుంటే  మనదేశంలో మాత్రం బంగారం రూ .32500 చేరుకుంది. అంతార్జాతీయ మార్కెట్ లో  బంగారం ధర తగ్గిన మనదేశంలో బంగారం ధర పెరగడానికి ముఖ్య కారణం డాలర్ బలపడటం , రూపాయి బలహీనపడటమే . అంతే కాకుండా రోజురోజుకి బంగారం పై ఇన్వెస్ట్ చేసే వాళ్ళు పెరుగుతుండటం.

రెండు సంవత్సరాల క్రితం డాలర్ కి రూపయాయి మారకపు విలువ రూ 45ఉంటే ఇప్పుడు రూ   55 గా ఉంది.కేవలం రూ. 10తేడా  అంతార్జాతీయ మార్కెట్ లో  బంగారం ధర తగ్గిన మనదేశంలో బంగారం ధర పెరగడానికి కారణమైనది.అంతే కాకుండా అంతార్జాతీయంగా ఆర్ధికమాంద్యం , యూరో జోన్ పరిస్థితులు  హెడ్జ్ ఫండ్స్ ను బంగారంలో అధికంగా ఇన్వెస్ట్ చేయడానికి కారణమవుతున్నాయి.
ఈ బంగారం ధర పెరగడం ఫిజికల్ గా బంగారు అమ్మకాల పై ప్రభావం  చూపినప్పటికీ  గోల్డ్ ETF లో   ఇన్వెస్ట్ చేయడం మాత్రం తగ్గడం లేదు.అంతే కాకుండా దేశంలో వర్షాభావ పరిస్థితులు సాదరణంగానే నమోదు కావడం  నవరాత్రుల తర్వాత మంచి రోజులు ఉండటం .దీపావళి  మొదలగు పండుగల వలన మళ్ళీ బంగారం ఆభరణాలకు గిరాకీ పెరిగే అవకాశం కూడా ఉంది.బంగారం ప్రస్తుతం అధిక స్థాయిల వద్ద ఉన్నప్పటికీ కూడా  అంతార్జాతీయంగా నెలకొన్న ఆర్ధిక పరిస్థితులు, ఇన్వెస్టర్ల నుండి ఉన్న డిమాండ్ , రూపాయి బలహీనత మొదలగు అంశాల ఆధారంగా బంగారం ధర ఇంకా పెరగడానికే అవకాశం ఉంది. మీరు చూస్తూ ఉండగానే బంగారం రూ .32500 నుండి రూ 65000 లకు 2015  కల్లా చేరుకునే అవకాశం అధికంగా ఉంది.
గమనిక : ఏ ఇన్వెస్ట్మెంట్ సాధనం లో ఐనా సరే రిస్కు అనేది తప్పకుండా ఉంటుంది. రిస్కు లేకుండా రిటర్న్ అనేది ఉండదు. అందుకే ఎవరికి వారూ , వారూ భరించగలిగే రిస్కు  కి అనుగుణంగా ఇన్వెస్ట్ చేయడం చేయాలి. పైన బంగారం పై కేవలం నా  అభిప్రాయం తెలియచేయడం జరిగినది.
telugufinancialschool@gmail.com

ఈ రోజు స్టాక్ మార్కెట్ 20-09-2012


ఈ రోజు స్టాక్ మార్కెట్ 20-09-2012
మమత బెనర్జీ UPA  ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో కేంద్ర ప్రభుత్వం మైనారిటీలో పడిపోవడం జరిగినది. ఇప్పుడు ప్రభుత్వం ప్రస్తుతం ములాయం సింగ్ యాదవ్ , మాయావతి నిర్ణయాలపై ఆధారపడి ఉంది. ములాయం సింగ్ యాదవ్  ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలా , వద్దా అనే తన నిర్ణయాన్ని ఈ రోజు వెలువరించానున్నారు.ఈ రోజు మార్కెట్ గ్యాప్ డౌన్ ప్రారంభం అవుతుంది.నేను ఇదివరకే మీకు తెలియచేసినట్టుగా కొత్తగా ఏర్పాటు కాబడిన స్వింగ్ హై 5652 పైన నిఫ్టీ నిలదొక్కుకున్నట్టు ఐతేనే  మార్కెట్ లో  మరింత ర్యాలీ రావడానికి అవకాశం కలదు. మంగళవారం మొత్తం నిఫ్టీ 5586-5621 మధ్యనే కదలాడటం జరిగినది.ప్రస్తుతం నిఫ్టీ కి తక్షణ మద్దతు  5554, 5528,5465  వద్ద కలదు .ఒకవేళ  గ్యాప్ డౌన్ లో నిఫ్టీ   5554 క్రింద నిలదోక్కుకున్నట్టు 5528,5465  వరకు పతనం  కావడానికి అవకాశం కలదు. లాంగ్ పొజిషన్స్ కి మాత్రం 5466  బ్రేక్ కానంత వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. 

ఆర్ధికంగా ఎదాగాలి డబ్బు సంపాదించాలి అంటే ఎమి చేయాలి part 4


ఆర్ధికంగా ఎదాగాలి డబ్బు సంపాదించాలి అంటే ఎమి చేయాలి    part 4 
మీరు ఎప్పుడైనా  రాష్ట్ర బడ్జెట్ , లేదా కేంద్ర బడ్జెట్ ప్రకటించినప్పుడు ఎప్పుడైనా దానిని చదివి అర్ధం చేసుకొనే ప్రయత్నం చేసారా ! రూపాయి రాకా లేదా రూపాయి పోక గురుంచి. చాలా మంది దీని గురుంచి మాకు ఏమి అర్ధం అవుతుంది అనే ఉద్దేశంతో ఆ పేజీలు కూడా కనీసం  చూడరు. చివరకు పేపర్లో , కాని టీవీ లో వచ్చ్చే బిజినెస్ న్యూస్ చూడటం వలన ఐనా అర్దికంశాల పట్ల అవగాహన కలుగుతుంది. చాలా మంది  పేపర్ రాగానే మొదట చేసేది రాజకీయ వార్తలు , సినిమా వార్తలు లేదంటే క్రికెట్ గురించిన వార్తలు మాత్రమే చూస్తారు. రాజకీయాల గురుంచి భాద్యత గల పౌరుడిగా ఎలక్షన్  సమయంలో  మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి ఆలోచించండి. మీ అభిమాన హీరో సినిమా  మంచిగా ఉన్నా  , లేకున్న అతనికి మాత్రం డబ్బులు వస్తాయి . మీకు డబ్బులు దండగ  పైగా తలనొప్పి ఒక్కటి.ఇంకా చెప్పాలి అంటే అతని డైలాగ్ అతనిది కాదు , అతని పాట అతనిది కాదు, అతని డాన్స్ అతనిది కాదు.ఏది ఆ హీరోది  కానప్పుడు అతని సినిమా చూడటం అవసరమా !ఇకా కొంత మంది ఉంటారు క్రికెట్ వస్తుంటే నోళ్ళు వెళ్ళబెట్టి దాన్ని చూస్తారు తప్ప కనీసం బిజినెస్ న్యూస్ చూడటానికి కూడా ఇష్టపడరు. క్రికేట్ అంటే ఇష్టం ఉంటే చూడటం కాదు ఆడండి. దానివల్ల కనీసం బాడీ లో ఉన్న కొవ్వు కరుగుతుంది .ఆరోగ్యంగా ఉంటారు. మానవ సంభందాలన్ని ఆర్ధిక సంభాదాలైన  ఈ రోజుల్లో మీరు ఆర్ధికంగా ఉన్నత స్థితికి ఎదగడానికి ప్రయత్నం చేయాలి. దానికి మీరు ఆర్ధిక అంశాల పట్ల అవగాహన  కలుగచేసుకోవాలి. మీకు అవగాహన ఉంటేనె  మంచి రాబడి అందించే సాధనాలలో  ఇన్వెస్ట్ చేయగలుగుతారు లేదంటే   ఇంకా సంప్రదాయ పొదుపు పథకాల  పట్టుకొని వేలాడుతూనే ఉంటారు.రానున్న కాలంలో ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ డాక్టర్  ఏవిధంగా ఉన్నారో అదే విధంగా ప్రతి కుటుంబానికి  ఆర్ధిక నిపుణుడి అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరికి  ఆర్ధిక  విషయాల పట్ల అవగాహన తప్పనిసరి.
ముఖ్య గమనిక :మీరు  స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా ఒక పద్ధతి  ఎంచుకొని దానినే స్థిరంగా  మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్ మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ సాధ్యం అవుతుంది.


T20 క్రికెట్ కి, మరియు ఇన్వెస్ట్మెంట్ కి మధ్యగల ఆసక్తికర సారూప్యతలు part 2


T20 క్రికెట్ కి, మరియు ఇన్వెస్ట్మెంట్ కి  మధ్యగల ఆసక్తికర సారూప్యతలు  part2

Strategic break

T20 క్రికెట్ లో పది ఓవర్ల తర్వాత విరామం తీసుకొని తర్వాత  ఆటలో అనుసరించవలసిన వ్యహాల గురుంచి ఏ విధంగా చర్చించుకుంటారో  అదే విధంగా మీరూ కూడా మీ ఫైనాన్సియల్ ప్లానింగ్  ను  మధ్య మధ్యలో సమీక్షీంచుకుంటూ  మీ ఆర్ధిక లక్ష్యాలు చేరుకోవడానికి  కావలసిన విధంగా మీ  ఆర్ధిక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి.
Balance
మీరూ 11 మంది బ్యాట్స్ మెన్  లేదా  11 మంది బౌలర్లతో క్రికెట్ అడలేరు. ఆటకి అనుగుణంగా  బ్యాట్స్ మెన్  మరియు బౌలర్లతో ఆటకి అనుగుణంగా జట్టును ఏర్పాటు చేసుకుంటారు. అదే విధంగా మీరూ కూడా మీ ఇన్వెస్ట్మెంట్ ను కూడా బ్యాలన్సేడ్ పోర్ట్పోలియో ఏర్పాటు చేసుకోవాలి.  ప్రతి ఇన్వెస్ట్మెంట్ సాధనం కూడా కొన్ని అనూకూల , ప్రతికూల లక్షణాలను కలిగి ఉంటుంది.

One bad over
కొన్ని సార్లు క్రికెట్ లో ఏ విధంగా బ్యాడ్ ఓవర్ వస్తుందో అదే విధంగా మన జీవితంలో కూడా బ్యాడ్ పీరియడ్ ఉంటుంది. ఆక్సిడెంట్ కావడం ,వైద్యపరంగా అత్యవసర పరిస్థితి రావడం, ఉద్యోగం కోల్పోవడం ,ఇంట్లో సంపాదించే వ్యక్తీ మరణం  మొదలగు సంఘటనల వలన ఆర్ధిక పరిస్థితి తలక్రిందులు అవుతుంది. అందువలన అలాంటి  సంఘటనలు సంభవించినప్పుడు ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలి.
Consistency gets rewarded
క్రమం  తప్పకుండా సిస్టామేటిక్ గా  దీర్ఘాకాలం చేసే ఇన్వెస్ట్మెంట్   మంచి లాభాలు అందించగలదు..
Coaching helps
ఒక క్రికెట్ అటగాడు మంచి క్రీడాకారుడిగా రూపొందడానికి కోచింగ్ ఏ విధంగా సహాయం చేస్తుందో  మీకు తెలుసుకదా ? అర్దిక పరమైన విషయాలాలో ఎవ్వరికీ వారూ స్వంత నిర్ణయాలు తీసుకొనే శక్తి ఉండదు. అందువలన తప్పనిసరిగా  ఇన్వెస్ట్మెంట్ నిపుణుల సహాయం తప్పకుండా తీసుకోవాలి.
Distractions can be entertaining but ultimately the score matters
వ్యక్తీ గత జీవితంలో భావోద్వేగాలు చాలా సహజం . కాని మీరు మీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ కి వచ్చే సరికి తప్పనిసరిగా మీరు అత్యాశ, భయం. ఒకే ఇన్వెస్ట్మెంట్ సాధనం పై ప్రేమ మొదలగు వాటిని  మాత్రం తప్పకుండా నియంత్రించుకోవాలి.
Winning attitude
క్రికెటర్కి మ్యాచ్ గెలవాలి అనే  దృక్పథం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మీకు ఇన్వెస్ట్మెంట్ లో తప్పనిసరిగా లాభాలు అందుకోవాలి  అనే దృక్పథం ఉండాలి. దానితో మీరు సరియైన ఆలోచనతో మంచి ఇన్వెస్ట్మెంట్ సాధనాలలో ఇన్వెస్ట్ చేయగలుగుతారు.

T20 క్రికెట్ కి, మరియు ఇన్వెస్ట్మెంట్ కి మధ్యగల ఆసక్తికర సారూప్యతలు


T20 క్రికెట్ కి, మరియు ఇన్వెస్ట్మెంట్ కి  మధ్యగల ఆసక్తికర సారూప్యతలు 
T20 క్రికెట్ కి,   ఇన్వెస్ట్మెంట్  మధ్యన  సారూప్యతలు  ఏంటి ? అని అచ్చర్యపోకండి .ఫైనాన్సియల్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్  మరియు  T20 క్రికెట్  కి మధ్యన ఉమ్మడి వ్యూహాలు చాలా ఉన్నాయి.క్రికెట్ మన  దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీద అనడంలో ఎవ్వరికీ ఎలాంటి సందేహం అవసరం లేదు. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్  T20 ప్రారంభం అయ్యాక చాలా ప్రజాదరణ పొందడమే కాకుండా అధిక లాభాలు కూడా అందుకొంటుంది. T20 క్రికెట్ లో ఆటగాళ్ళు అడే ఆటకి , వారూ తక్కువ సమయంలో ఎక్కువ పరుగులు చేయడానికి పడే తపనకి  , మీ ఇన్వెస్ట్మెంట్ , మీ రిటైర్మెంట్  అనంతర జీవితం సాఫీగా గడపడానికి  మీరు చేసుకునే ఆర్ధిక ప్రణాళికకి మధ్య గల  సారూప్యతలు చాలా ఉన్నాయి. ప్రముఖ ఆర్ధిక నిపుణులు కార్తీక్ వర్మ చక్కని ఆసక్తి కరమైన విశ్గ్లేషణ చేయడం జరిగినది. అవి ఏంటో  మనం కూడా ఒక్కసారి  వివరంగా పరిశీలిద్దాం.అవి
1.    Start early
2.    Risk and Reward tradeoff
3.    Be ready for the unexpected
4.    Strategic break
5.    Balance
6.    One bad over
7.    Consistency gets rewarded
8.    Coaching helps
9.    Distractions can be entertaining but ultimately the score matters
10. Winning attitude
ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురుంచి వివరంగా తెలుసుకుందాం.

Start early

T20 క్రికెట్ లో బ్యాట్స్ మెన్  బాదడం లేదా బౌలర్  వికెట్లు తీసి మ్యాచ్ పై పట్టు సాధించడానికి  ప్రారంభంలోనే ప్రయత్నిస్తారు. అదే విధంగా మీరు కూడా మీ జీవితంలో ఆర్ధికంగా ఎదగాలి అంటే మీరూ పొదుపు చేయడం ,చేసిన పొదుపును ఇన్వెస్ట్మెంట్ గా మార్చడం ఎంత త్వరగా చేస్తే అంత మంచిది.  మీరూ క్రమం తప్పకుండా , త్వరగా ఇన్వెస్ట్ చేస్తూ సరియైన ఫైనాన్సియల్ ప్లానింగ్ ఏర్పాటు చేసుకోవడం  వలన కౌమ్పౌన్డింగ్  గ్రోత్ వలన మంచి లాభాలు  అందుకోవచ్చు.
Start now, Save more, Retire rich.

Risk and Reward tradeoff
క్రికెట్ అట యొక్క ఫలితం కెప్టెన్ మరియు ఆటగాళ్ళు తీసుకొనే రిస్కు పై  అధారపడి ఉంటుంది అనే విషయం మీకు తెలుసుకదా ? మీకు వచ్చే లాభాలు ఎప్పుడూ కూడా మీరు తీసుకొనే రిస్కుపై , మీరూ చేసే ఇన్వెస్ట్మెంట్ పై ఆధారపడి ఉంటుంది.మీరూ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న కూడా మీరూ రిస్కుకి సిద్దపడి లేకపోతే మీరూ మంచి రిటర్న్స్ అందుకోలేరు. అందుకే ముందుగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు రిస్కు ఎంత వరకూ తీసుకోగలరు , ఆ రిస్కు వలన సంభవించే పరిణామాలను  ఎంత వరకు తట్టుకోగలరూ మొదలగు వాటిని నిర్ణయించుకోవాలి. రిస్కు లేకపోతే రిటర్న్ లేదని తెలుసుకోండి.
Be ready for the unexpected
ఉహించని సంఘటనలు జరిగిన కూడా తట్టుకోవడానికి సిద్దంగా ఉండాలి. క్రీజ్ లో నిలదొక్కుకొని బాగా ఆడుతున్న అటగాడు ఉహించని విధంగా  ఔట్ ఐనప్పటికి తర్వాత బ్యాట్స్ మెన్  తనపని తనూ చేసుకుంటాడు. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడూ  సాదారణంగా మనుషులకు రెండు లక్షణాలు ఉంటాయి. వాటిలో ఒక్కటి భయం  అంటే పెట్టిన ఇన్వెస్ట్ ఏమవుతుందో అని, ఇక రెండోది అత్యాశ అంటే కొన్నాళ్ళు ఆగితే ఇప్పటికంటే అధిక లాభం వస్తుంది అనే   అత్యాశ ద్వారా మొత్తం పోగోడుతారు. అందుకే మన పెట్టుబడి ఉహించని సంఘటనల ద్వారా నష్టపోయిన తట్టుకోవడానికి సిద్దంగా ఉండాలి. 

ఈ రోజు స్టాక్ మార్కెట్ 18-09-2012


ఈ రోజు స్టాక్ మార్కెట్ 18-09-2012


మీకు నిన్నటి పోస్టులో నిఫ్టీ తక్షణ ర్యాలీ 5648 వరకు వెళ్ళగలదు . 5648 పైన నిఫ్టీ నిలదోక్కుకున్నట్టు ఐతే మరింత పైకి వెళ్ళగలదు అని తెలియచేయడం జరిగినది.నిఫ్టీ 5652 హై ఏర్పాటు ఐనది కాని రెసిస్టన్స్ ఐనటువంటి 5648 పైన నిలదోక్కుకోలేకపోయినది. ప్రస్తుతం నిఫ్టీ 5500-5650 మధ్య చలించడానికి అధిక అవకాశం కలదు. నిఫ్టీ 5648 పైన నిలదోక్కుకుంటేనే మరింత ర్యాలీ జరగడానికి అవకాశం కలదు. ఒక వేళ మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్  వచ్చినా  పై చార్ట్ లో చూపించిన ట్రెండ్ లైన్ లేదా 5440 వరకు రావడానికి అవకాశం కలదు. నిఫ్టీ 5440 పైన ఉన్నంత వరకు లాంగ్ పొజిషన్స్ కి ఎలాంటి ఇబ్బంది లేదు.  సపోర్ట్ 5585, 5550 రెసిస్టన్స్  5648. ఖచ్చితమైన  మార్కెట్ అనాలసిస్ కొరకు ఈ బ్లాగ్  రెగ్యులర్ గా ఫాలో అవండి.

భారతీయులు ధనవంతులా లేక పేదవారా ?


భారతీయులు ధనవంతులా లేక పేదవారా ?
ఎవరూ చెప్పారూ మీకు భారతదేశం పేద దేశం అని. భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశం.భారతదేశంలో  అత్యధికులు పేదవారే అనడంలో కూడా ఎటువంటి  సందేహం లేదు. అంత మాత్రాన  భారతీయులలో ధనవంతులే లేరు అంటారా? ప్రతి సంవత్సరం ఫోర్బ్స్ జాబితా పరిశీలించండి.ప్రతిసారి కనీసం  ఇరవై మంది పైననే బిలియనీర్లు  ఈ జాబితాలో ఉంటారు.ఈ జాబితాలో ఉన్న వాళ్ళు బిలియనీర్లు ఐనంతా మాత్రానా భారతదేశం ధనిక దేశం అవుతుందా ? దేశంలో  బిలియన్ పైన జనాభా ఉంది. మరి వారందరి పరిస్తితి ఏమిటి.? అది సరే ఇప్పుడు ఒక్క విషయం తెలుసుకోండి. భారతదేశం బంగారం వినియోగంలో ప్రపంచంలో ముందుంటుంది అనే విషయం మీ అందరికి తెలుసు .భారాతీయులు ప్రతి సంవత్సరం కొన్ని టన్నులకొద్దీ బంగారం కనుగోలు చేస్తారు..భారతీయుల వద్ద కనీసం 20,000టన్నుల బంగారం ఉంది అని ఒక అంచనా .దానిలో   95%  బంగారం ప్రజల వద్దనే ఉంది. భారత ప్రభుత్వం వద్ద కేవలం  5% మాత్రమే ఉంది.అదే అమెరికా లాంటి దేశంలో ఐతే ప్రజలవద్ద 5% ఉంటే ప్రభుత్వం  వద్ద 95%  బంగారం ఉంటుంది.భారతీయులకు కొన్ని వందల సంవత్సరాల నుండి  బంగారం చాల విలువైన లోహం అని తెలుసు. అందువలనే భారతీయులు బంగారం అధికంగా కూడబెడతారు. ఒకవేళ భారత దేశ ప్రజలందరి వద్ద ఉన్న  95%  బంగారం ను అమ్మివేస్తె అమెరికా దేశంలో గల న్యూయార్క్ లాంటి నగరానికంటే  మూడు ,నాలుగింతల  పెద్దదైన  నగరాన్ని కనుగోలు చేయవచ్చు. ఇప్పుడు చెప్పండి భారతదేశం పేదదేశమా ?భారతీయులలో చాలా మంది దారిద్ర్యరేఖ కంటే క్రింద  ఉన్నారూ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంత మాత్రానా భారతీయులు అందరూ పేదవారూ మాత్రం కాదు. దానికి ముఖ్య కారణం మన వారికి బంగారం పై ఉన్న మక్కువే.

స్టాక్ మార్కెట్ ఇంకా ఎంత వరకు పరిగెత్తగలదు.


స్టాక్ మార్కెట్ ఇంకా ఎంత వరకు పరిగెత్తగలదు.
ఈవారం స్టాక్ మార్కెట్17-09-2012to21-09-2012


గత వారం ఫెడరల్  బ్యాంక్ , ఈసిబి  మీటింగ్ , జర్మనీ కోర్టు తీర్పు మరియు కేంద్ర ప్రభుత్వం సంస్కరణలకు తెరదీస్తూ  డీజిల్   ధరలు పెంచడం మొదలగు కారణాల వలన మార్కెట్ లో ర్యాలీ రావడం జరిగినది.అదే విధంగా శుక్రవారం సాయంత్రం  విదేశీ నిధులను రిటైల్ రంగంలోకి అనువదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం  వలన మార్కెట్ ఈ రోజు కూడా గ్యాప్ అప్ లోనే ప్రారంభం జరుగును.  అదే విధంగా  ఈ రోజు రిజర్వు బ్యాంక్ తన పరపతి సమీక్షలో వడ్డీ రేట్లు కనుక తగ్గిస్తే ప్రస్తుతం కొనసాగుతున్న ర్యాలీకి మరింత సానుకూల  అవకాశం దొరికినట్టు అవుతుంది.ఒకవేళ రిజర్వు బ్యాంక్ తన పరపతి సమీక్షలో కనుక ప్రతికూల నిర్ణయం తీసుకుంటే మాత్రం పై లెవల్లో లాభాల స్వీకరణకు అవకాశం కలదు. సానుకూల నిర్ణయం వేలువడటానికే  అధిక అవకాశం మాత్రం కలదు.  మీరు కనుక  రెగ్యులర్ గా ఈ బ్లాగ్ ఫాలో అవుతున్నట్టు ఐతే మీకు ఇదివరకే చాలా సార్లు చార్ట్స్ ద్వారా తెలియచేయడం  జరిగినది. నిఫ్టీ 5190-5200  కంటే క్రిందికి దిగాజారనంత వరకు మీ లాంగ్ పోజిషన్  కు ఎలాంటి ఇబ్బంది లేదు , 5190-5200  స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్స్ కొనసాగించవచ్చు  అని తెలియచేయడం జరిగినది. అదే విధంగా నిఫ్టీ లాంగ్ సైడ్ టార్గెట్ 5520 అని కూడా మీకు తెలియచేయడం జరిగినది. ఇంకా వివరాల కోసం గత పోస్టులను చదవవచ్చు.  అదే విధంగా ఇప్పుడు మార్కెట్ కి అనుకూలమైన వార్తలు వెలువడుతున్నందున  మార్కెట్ ఇంకా ఎంత వరకు పరిగెత్తగలదు అని చాలా మంది అడుగుతున్నారు. మీకు మార్కెట్ లో నిఫ్టీ  తక్షణ ర్యాలీ  5648 వరకు చేరుకోగలదు.ఇది ఫిబోనస్సీ గోల్డెన్ రేషియో . ఒకవేళ  నిఫ్టీ  5648 పైన నిలదోక్కుకున్నట్టు ఐతే  ర్యాలీ 5850 ,5910, 5950 వరకు కూడా కొనసాగగలదు.. నిఫ్టీ 5435 పైన ఉన్నంత వరకు ఈ ర్యాలీ కొనసాగడానికి అధిక అవకాశం కలదు. ఏది ఎమైనప్పటికి నిఫ్టీ ఇంకా కనీసం రెండు వందల పాయింట్లు ర్యాలీ జరపడానికి అవకాశం మాత్రం కలదు. అయినప్పటికీ మీ లాంగ్ పొజిషన్స్ కి  5435 స్టాప్ లాస్ ఉపయోగించండి.  ఒకవేళ ఏమైన మార్పులు చేర్పులు ఉంటే మీకు వెంటవెంటనే తెలియచేయడం జరుగుతుంది.
ముఖ్య గమనిక :మీరు  స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా ఒక పద్ధతి  ఎంచుకొని దానినే స్థిరంగా  మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్ మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ సాధ్యం అవుతుంది.  http://telugufinancialschool.blogspot.in/2012_09_01_archive.html