2013లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి మ్యుచవల్ ఫండ్స్ ( ఈక్వీటీ డైవర్సిఫైడ్ ఫండ్స్ కేటగిరీ )



2013లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి మ్యుచవల్ ఫండ్స్ ( ఈక్వీటీ డైవర్సిఫైడ్  ఫండ్స్ కేటగిరీ )
నేను వ్రాసిన పుస్తకం A to Zఇన్వెస్ట్మెంట్  గైడ్  చదివిన తర్వాత  చాలా మంది ప్రతినెల సిప్ పద్దతిలో ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని మంచి మ్యుచవల్ ఫండ్స్ తెలియచేయగలరు. చాలా మంది రానున్న కొత్త సంవత్సరం నుండి ప్రతినెల ఇన్వెస్ట్ చేస్తూ దానిని కనీసం పదిహేను నుండి ఇరవై సంవత్సరాలు కొనసాగించాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగినది కావున మీ సలహా కావాలి అని సంప్రదించడం జరిగినది.నిజంగా ఇది చాలా సంతోషకర పరిణామం .నా పుస్తకం వలన కొందరికైనా ఆర్ధిక క్రమశిక్షణ అలవాటు పడటం చాలా ఆనందం.   
ఈక్వీటీ డైవర్సిఫైడ్  ఫండ్స్ అంటే యే ఫండ్స్ ఐతే వాటి పెట్టుబడులలో 65% కంటే అధిక నిధులను  షేర్లలో ఇన్వెస్ట్ చేస్తాయో ఆ ఫండ్స్ .
వాటిలో కూడా మళ్ళీ నాలుగు రకాలు కలవు . అవి 1 లార్జ్ క్యాప్ ఫండ్స్,  2 లార్జ్ క్యాప్ & మిడ్ క్యాప్ ఫండ్స్, 3 మల్టీ క్యాప్ ఫండ్స్,4 మిడ్ & స్మాల్ క్యాప్ ఫండ్స్
 లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే యే ఫండ్స్ ఐతే  గత మూడు సంవత్సరాల నుండి వాటి పెట్టుబడిలో 80%  కంటే అధికంగా   లార్జ్ క్యాప్ షేర్లలో పెట్టుబడి పెడతాయో వాటిని  లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటారు. మీరూ ఇన్వెస్ట్ చేస్తూన్నప్పుడు ఎప్పుడు కూడా మీ పోర్ట్ఫోలియో లో లార్జ్ క్యాప్ ఫండ్స్ తప్పనిసరిగా  ఉండేలా చూసుకోండి. క్రింద ఇచ్చిన వాటిలో మీకూ నచ్చిన ఫండ్స్ ఎన్నుకోండి.

    
Fund Name
Performance in %
3 Mths
1 Yr
3 Yrs
5 Yrs
Since Launch
UTI Mastershare
6.69
19.85
6.31
0.80
19.09
DSP BlackRock Top 100 Equity
8.74
23.01
6.70
3.49
27.73
ICICI Prudential Top 100 Fund
7.10
24.33
7.64
2.40
20.62
SBI Magnum Equity Fund
9.34
24.95
7.84
0.60
15.56
Franklin India Bluechip
8.14
20.19
8.20
3.78
23.45

షేర్స్ ఏ విధంగా కొనాలి?


షేర్స్ ఏ  విధంగా  కొనాలి?

షేర్స్ ని మనం రెండు మార్గాల్లో  కొనవచ్చు. మొదటి మార్గం ప్రైమరీ మార్కెట్  , రెండవది సెకండరీ మార్కెట్ , ప్రైమరీ మార్కెట్ లో మీరు  షేర్స్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ కి   వచ్చినప్పుడే కొనటానికి అవకాశం ఉంటుంది.
 ప్రైమరీ మార్కెట్
 IPO (Initial Public Offerings ,IPO’s) ప్రజలకు  తొలిసారిగా షేర్లు   అమ్మడాన్ని IPO’s అంటారు. ఇది ప్రైమరి మార్కెట్ లో  జరుగుతుంది. ఎవరైన ఈ  తొలి వాటా లను కొనుగోలు  చేయాలి .అంటే  ఈ IPO’s ద్వారా కంపెనీ నిబంధనల  ప్రకారం  దరఖాస్తు  చేయాలి. మన దరఖాస్తును పరిశీలించిన అనంతరం వారికి వాటాలను కేటాయించడం  జరుగుతుంది..వాటాల కేటాయింపు అనంతరం  కంపెనీ ని స్టాకు ఎక్సేంజ్ లో  నమోదు చేయడం జరుగుతుంది..ప్రైమరీ మార్కెట్లో మీరు షేర్స్ కొనటానికి సిద్దపడినా  మనకు కచ్చితంగా షేర్లు వస్తాయని , కావాల్సినన్ని  దక్కుతాయని హామీ లేదు. ఎందుకంటే వారు జారీ చేసే వాటలకంటే ఎక్కువ మంది ఉంటె  వాటిని దరఖాస్తు చేసిన  అందరికి ఒక నిష్పత్తి లో జారి చేస్తారు. వాటాల జారీ అనంతరం ఇవి స్టాకు ఎక్సేంజ్  నందు లిస్టు అవుతాయి.పైగా పరిమిత కాలానికే ఈ మార్కెట్ అందుబాటులో ఉంటుంది. ప్రతి పబ్లిక్ ఇష్యూలోను   25 శాతం వాటాలను చిన్న వాటాదారులకు కేటాయిస్తారు. రెండు లక్షల  రూపాయలకంటే తక్కువ విలువైన షేర్లకు దరఖాస్తు  చేసుకునే వారిని చిన్న ఇన్వెస్టర్లు గా పరిగనిస్తారు. ప్రైమరీ మార్కెట్ నందు మీకు రిస్కు తక్కువగా ఉంటుంది.
ఒక కంపనీ ప్రైమరీ మార్కెట్లో వాటాదారులకు  ఎ ధరకు  ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటుందో దానిని ఇష్యూ ప్రైస్  అని పిలుస్తారు. ఈ కంపనీ షేర్ స్టాకు ఎక్సేంజ్ లో   లిస్టు ఐనప్పుడు  అ ప్రైస్ ఇష్యూ ప్రైస్  కంటే ఎక్కువగాను , తక్కువగాను ఉండవచ్చు.ఎక్కువగా ఉంటె మీకు లాభం తక్కువగా ఉంటె మీకు నష్టం రాగలదు. ఈ మధ్యన  IPO  వచ్చిన కోల్ ఇండియా తీసుకొంటే దాని  ఇష్యూ ప్రైస్  Rs. 245  ఐతే  అది లిస్టు ఐన రోజు క్లోజ్ ప్రైస్ Rs. 342  అనగా మీకు   సుమారు 39% లాభం .
ఇక మీ అందరికి గుర్తుండే ఉంటుంది.రిలయన్స్ పవర్ షేర్ల గురుంచి దాని  ఇష్యూ ప్రైస్  Rs 450 ఐతే  అది లిస్టు ఐన రోజు క్లోజ్ ప్రైస్  Rs 372.50 అనగా ఆ షేర్ మీద మీకు నష్టం 17%.మీరు లిస్టు ఐన రోజు హై లేదా లో ప్రైస్ నందు ఎవ్వరు అమ్మలేరు కావున క్లోజ్ ప్రైస్ తీసుకోవడం జరిగినది. ఇక్కడ మీరు గమనించడం జరిగినది  ఏమిటంటే అన్ని IPO లు కూడా లాభ సాటి కావు. కావున మీరు   IPO  కు  అప్లై  చేసేముందు కంపెనీ గురుంచి అన్ని వివరాలు తెలుసుకోవాలి. దీని గురుంచి  మనం తర్వాత వివరంగా తెలుసుకొందాం.

స్టాక్ మార్కెట్ లో PMS అంటే ఏమిటి ?

స్టాక్ మార్కెట్  లో  PMS  అంటే ఏమిటి ?
PMS అంటే ఫోర్ట్ ఫోలోయో మేనేజ్మెంట్  సర్వీస్ .సాదారణంగా చాలా మంది ఇన్వెస్టర్స్ స్టాక్  మార్కెట్ పై పూర్తీ అవగాహన లేకుండా  ప్రవేశించి  వారి వద్ద ఉన్న కాపిటల్ పూర్తీగా నష్టపోతుంటారు. కొంత మందికి అవగాహన ఉన్న పూర్తీ సమయం కేటాయించలేకపోవచ్చు. స్టాక్ మార్కెట్ లో అనుక్షణం అప్రమత్తత , అవగాహన తప్పనిసరి. స్టాక్ మార్కెట్ నిన్న ఉంది, నేడు ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. కాని ఒక్కసారి మీ వద్ద ఉన్న కాపిటల్  నష్టం  జరిగితే  ఇక మీరు  స్టాక్ మార్కెట్ లో ఏమి చేయలేరు.ఈ PMS సర్వీస్ లో మేము మీ ట్రేడింగ్ అకౌంట్ లో ట్రేడ్ చేసి వచ్చిన లాభాలలో వాటా తీసుకుంటాం.ఐతే దీనికి మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ లో  కనీసం పదిహేను శాతం కాపిటల్ రిస్కు తీసుకోవడానికి  మాత్రం తప్పనిసరిగా సిద్దంగా ఉండాలి.  ఇన్వెస్ట్మెంట్ అంటే నే రిస్కు . రిస్కు లేకుండా లాభాలు ఆశించడం  ఎంత మాత్రం సాధ్యం కాదు. స్టాక్ మార్కెట్ లో రిస్కు అనేది అన్ని వేళలా ఉంటుంది. రిస్కు తీసుకొనే స్వభావం మీకు లేకపోతే మీరు స్టాక్ మార్కెట్ వైపే కాదు ఏ ఇన్వెస్ట్మెంట్ సాధనం వైపు చూడవద్దు. ఒకవేళ  మేము అందించే ఈ PMS సర్వీస్ లో మేము  మీ కాపిటల్  పై కేవలం పదిహేను శాతం మాత్రమే రిస్కు తీసుకుంటాం.ఒకవేళ  మీ కాపిటల్ లో పది హేను శాతం నష్టం సంభవిస్తే మీరు మా సర్వీసు ను ఉపసంహరించుకోవచ్చు.మేము  మీ వద్ద  లాభాలలో వాటా తీసుకుంటున్నాం కాబట్టి  ముందుగా మీ కాపిటల్ ప్రొటక్షన్ కి అధికంగా ప్రాముఖ్యత  ఇవ్వడం జరుగుతుంది. మేము మీ అకౌంట్ లో ట్రేడింగ్ చేయడానికి  మీరు మాకు అనుమతి ఇస్తూ తప్పనిసరిగా అథరైజేషణ్ ఇవ్వవలసి ఉంటుంది. మీ అకౌంట్ లో వచ్చే లాభాలు ముందుగా మీ బ్యాంక్ ఖాతాలోకి  వచ్చినా పిదప మీరు మా వాటా మా బ్యాంక్ ఖాతాలోకి  జమ చేయవలసి ఉంటుంది. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ పై మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ప్రతి నెల 10% నుండి   40% వరకు లాభాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్  పెరగడం , పడిపోవటంతో  సంభందం లేదు. ఎందుకంటె మేము మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంటే అదే విధంగా మా ట్రేడింగ్ ఉంటుంది. అంటే పెరుగుతున్నప్పుడు లాంగ్ , పడిపోతున్నప్పుడు షార్ట్ పొజిషన్ తీసుకోవడం జరుగుతుంది.  ఈ PMS సర్వీసు పూర్తీ పారదర్శకత తో ఉంటుంది. మీ అకౌంట్ వివరాలు ఏ రోజు కి ఆరోజు చూసుకోవచ్చు. మిగితా వివరాలకోసం telugufinancialschool@gmail.com సంప్రదించండి.

ఈ వారం స్టాక్ మార్కెట్ 17-12-2012 to 21-12-2012



ఈ వారం స్టాక్ మార్కెట్ 17-12-2012 to 21-12-2012



 





 గత వారం కూడా మార్కెట్  లో  కన్సోలిదేషన్ జరగటం జరిగినది.కాకపోతే మార్కెట్ కి సానుకూల  పరిమాణం ఏమిటంటే నిఫ్టీ  5825 పైన  ఉండటమే. నిఫ్టీ 50hsma ఐనటువంటి  5900కంటే క్రింద ట్రేడ్ కావడం జరుగుతుంది. ఈ రోజు నిఫ్టీ  50hsma పైన నిలదొక్కు కోవడానికి అధిక అవకాశం కలదు.నిఫ్టీ గత కొద్ది రోజులుగా 5950-5980 మరియు  5820-40 మధ్య ఎక్కువగా చలించడం జరుగుతుంది. గత వారం కూడా నిఫ్టీ 5965 వరకు చేరుకోవడం అక్కడి నుండి క్రిందకు దిగజారడం జరిగినది.10-12 ట్రేడింగ్ షెషన్స్ కన్సోలిదేషన్ జరగటం ,తర్వాత 3-4  షెషన్స్ నిఫ్టీ 200 పాయింట్లు పెరగటం చాలా సాదారణంగా జరుగుతుంది.ఒకవేళ ఈ వారంలో కనుక 5950-5980పైన  నిలదోక్కుకోనట్టు ఐతే  కొద్ది కరెక్షన్ రావడానికి అవకాశం కూడా కలదు. కరెక్షన్ కూడా 5715వరకే పరిమితం కాగలదు. 5715 వద్ద  బలమైన సపోర్ట్ ఉంది అనే విషయం మర్చిపోవద్దు. నిఫ్టీ ఒక రెంజీ లో మాత్రమే కదలాడుతున్నది కావున పై లెవల్లో సెల్ చేయడం , క్రింది లెవల్లో బై చేయడం చాలా మంచిది. 5820-40 బ్రేక్ కానప్పటివరకు తగిన స్టాప్ లాస్ తో బై చేయడం మంచిది.  అదే విధంగా పై లెవల్లో  రెసిస్టన్స్ బ్రేక్ కానప్పటివరకు తగిన స్టాప్ లాస్ తో సెల్ చేయడం చాలా మంచిది. రెసిస్టన్స్ 5900, 5925, 5965 సపోర్ట్ 5840-20, 5770

పాత చెక్కుల చెల్లుబాటు గడువు తేదీ పొడగింపు.


పాత చెక్కుల చెల్లుబాటు గడువు తేదీ పొడగింపు.
మీరూ ఇది వరకూ మీ వద్దగల బ్యాంక్స్ చెక్స్ 01-01-2013 నుండి చెల్లు బాటు కావు అనే విషయం గురించి తెలుసుకొనే ఉన్నారు. పూర్తీ వివరాలకొరకు క్రింది లింక్ క్లిక్ చేయండి

చాలా మంది గడువు సమీపిస్తున్నప్పటికి కూడా బ్యాంక్స్ నుండి కొత్త చెక్స్ తీసుకోనందున ఈ గడువు తేదీని 31-03-2013  వరకు రిజర్వు బ్యాంక్ పొడగించడం జరిగినది. కావున ఆ లోపు మీరందరూ కొత్త చెక్స్ తీసుకొనే ప్రయత్నం చేయండి. లేదంటే తర్వాత చాలా ఇబ్బందుల పాలు కావాల్సి ఉంటుంది.  

ఈ రోజు స్టాక్ మార్కెట్ 14-12-2012


ఈ రోజు స్టాక్ మార్కెట్ 14-12-2012
ఈ రోజు 11 am కి ఇన్ఫ్లేషన్ డేటా రాబోతుంది. మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నది  7.6. అంచనా వేసినవిధంగా వస్తే మార్కెట్ సానుకూలంగా లేదంటే ప్రతికూలంగా స్పందించగలదు.కాకపోతే మరో విషయం నిఫ్టీ 5840 వద్ద డబుల్ బాటం ఏర్పాటు కావడం జరిగినది. మీకూ గుర్తుండే ఉంటుంది 5548 వద్ద ఇదివరకి  డబుల్  బాటం పాటర్న్ ఏర్పాటు జరిగిన తర్వాత 400 పాయింట్ల ర్యాలీ నిఫ్టీలో  రావడం జరిగినది. ఒకవేళ రాబోయే మూడు రోజుల్లో ఈ డబుల్ బాటం సపోర్ట్ కాని బ్రేక్ జరగకపోతే మరోసారి నిఫ్టీ లో ర్యాలీ రావడానికి అధిక అవకాశం కలదు. ఏది ఏమైనా 5825 క్లోసింగ్ బేసిస్ గా  బ్రేక్  కానంతవరకు ప్రతి డిప్ లో బై చేయడం మంచిది.       

కొత్త ఫిఫ్ రూల్


కొత్త ఫిఫ్ రూల్
 Employee’s provident fund organization (EPFO)  కొత్త రూల్ ప్రకారం ఉద్యోగుల భవిష్యనిధిలో  జమ చేసే మొత్తం పెరగడం వలన చేతికి వచ్చే జీతం తగ్గుతుంది.ఇంతకు ముందు ఫిఫ్ ఉద్యోగుల మూల వేతనం పై  మాత్రమే  లెక్కించి  భవిస్యనిధికి జమ చేసేవారూ. ఎలాంటి అలవెన్స్ లను లెక్కలోకి తీసుకోలేదు. కాని ప్రస్తుత రూల్ ప్రకారం ఫిఫ్ లెక్కించడానికి మూలవేతనం తో పాటు ఇతర అలవెన్స్ లు  కలిపి లెక్కించి ఆ మొత్తంలో నుండి 12% ఫిఫ్ క్రింద జమచేయడం జరుగుతుంది. ఐతే అలవెన్స్ లలో మొత్తం అలవెన్స్ లు పరిగణలోకి తీసుకుంటారా లేక ఏ ఏ అలవెన్స్ లను పరిగణలోకి తీసుకుంటారు అనే విషయం పై స్ప్రస్టత రావలసి ఉంది.  ఈ రూల్ ప్రకారం ఉద్యోగి మరియు యజమాని భవిష్యనిధిలో  జమ చేసే మొత్తం పెరుగుతుంది.కాని ఉద్యోగి చేతికి వచ్చే జీతం మాత్రం తగ్గుతుంది. 

బ్యాంక్స్ ఖాతాలు ఓపెన్ చేయడం ఇప్పుడు చాలా సులభం.

బ్యాంక్స్ ఖాతాలు ఓపెన్ చేయడం ఇప్పుడు చాలా సులభం.
ప్రస్తుతం RBI నిబంధనల ప్రకారం బ్యాంక్ లో ఖాతా ప్రారంభం చేయడం చాలా సులభం. ఇది వరకు ఖాతా ప్రారంభం చేయడానికి గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్ , ఇంట్రడక్షన్ సంతకం తప్పనిసరిగా కావలసి వచ్చేది. ఇప్పుడు  RBI  ఇంట్రడక్షన్ సంతకం నిభందనను  తీసివేయడం జరిగినది.కావున ఖాతా ప్రారంభం చేయడం చాలా సులభం .అంతే కాకుండా  కొన్ని డాక్యుమెంట్స్  ను   గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్ గా కూడా తప్పనిసరిగా గుర్తించాలి అని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగినది. ఇంతకు ముందు ఓటర్ కార్డ్ , డైవింగ్ లైసన్స్  మొదలగు వాటిని బ్యాంక్స్ కేవలం అడ్రస్ ప్రూఫ్ గా మాత్రమే పరిగణలోకి తీసుకొనేవి.  ఇప్పడు మాత్రం ఏదైనా పత్రం పై  ఫోటో మరియు అడ్రస్ ఉంటె దాని  ద్వారా తప్పనిసరిగా ఖాతా ప్రారంభం చేయాలి . అంటే కేవలం ఓటర్ కార్డ్, డైవింగ్ లైసన్స్  మొదలగు వాటి వలన కూడా ఖాతా ప్రారంభం చేయడం చాలా సులభం