దీపావళి శుభాకాంక్షలు


దీపావళి శుభాకాంక్షలు
ఈ దీపావళి మీ ఇంటా సిరులు కురిపించి మీరూ  ఆర్ధికంగా  ఉన్నతంగా ఎదగాలి అని కోరుకుంటూ మీ  తెలుగు ఫైనాన్సియల్ స్కూల్

దీపావళి ధమాకా : ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉన్న కొన్ని మంచి షేర్లు

దీపావళి ధమాకా : ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉన్న కొన్ని మంచి షేర్లు

ఈ దీపావళికి చాలా మంది స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచనతో ఉంటారు. ఏ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలో సలహా ఇవ్వగలరు అని చాలా మంది అడుగుతున్నారు.ఎవ్వరైనా సరే ఇన్వెస్ట్ చేయడానికి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉన్న కొన్ని కంపెనీలు మీకు తెలియచేయడం జరుగుతుంది. వాటిలో మీకు నచ్చిన వాటిని ఎన్నుకొని ఇన్వెస్ట్ చేయండి.ఒకవేళ మీరూ ఎక్కువ మొత్తం అమౌంట్ ఉంటే కనుక మీ పోర్ట్ ఫోలియో  డైవర్సిఫైడ్ గా ఉండేలా జాగ్రత్త పడండి.

 COAL INDIA LTD
 CMP: 345
TARGET: 410

AXIS BANK
CMP: 1184  
TARGET: 1476

CROMPTON GREAVES
CMP:125
TARGET : 150

ICICIBANK
CMP:1050
TARGET :1270

DB CORP
CMP:210
TARGET :260

UNITED PHOSPHOROUS
CMP:114
TARGET:170

LASERN & TURBO LTD
CMP:1274
TARGET :1500

INFOSYS LTD
CMP :2583
TARGET :3103

SBIN
CMP:1931
TARGET :2140

JK LAKSHMI CEMENT
CMP:125
TARGET:195

ఈవారం స్టాక్ మార్కెట్ 12-11-2012to16-11-2012


ఈవారం స్టాక్ మార్కెట్ 12-11-2012to16-11-2012

గత సంవత్సరం  మూహర్త్  ట్రేడింగ్ నుండి ఇప్పటి వరకు ఈక్విటీ మార్కెట్ 8%,ఇండెక్స్ 20% లాభాలు జరిగినది. అదే విధంగా గత చరిత్ర పరిశీలిస్తే మూహర్త్  ట్రేడింగ్ ముందు లేదా తర్వాత  మార్కెట్ లో 5-6% కదలిక ఉండటం సర్వసాధారణం కాబట్టి , రాబోయో రోజుల్లో దానికి సిద్దంగా ఉండక తప్పదు.ఈ రోజు ప్రకటించే IIP డేటా మార్కెట్ పై ప్రభావం చూపిస్తుంది. గత 14 ట్రేడింగ్ సెషన్స్ రేంజ్ ఐనటువంటి  5637-5725 బ్రేక్ జరిగి కొత్తగా నిఫ్టీ  5585- 5777 రేంజ్ ఏర్పాటు చేస్తున్నట్టుగా కనబడుతుంది.నిఫ్టీ కి తక్షణ మద్దతు  5677వద్ద కలదు. ఒకవేళ ఈ సపోర్ట్ కోల్పోయినట్టు ఐతే ఇంతకు ముందు ఏర్పాటు కాబడిన స్వింగ్ లో ఐనటువంటి 5585 వద్దకు నిఫ్టీ చేరుకోగలదు. ఒకవేళ 5677 వద్ద సపోర్ట్ పొందితే మాత్రం న్యూ 52  వీక్ హై  ఏర్పాటు కావడానికి అవకాశం కూడా కలదు.నిఫ్టీ సపోర్ట్ 5677, 5645, 5585 , రెసిస్టన్స్  5725,5752,5777,5815 వద్ద కలవు.

లోన్స్ ద్వారా సంపద ఎలా స్ప్రుస్టించు కోవచ్చు?


లోన్స్ ద్వారా సంపద ఎలా స్ప్రుస్టించు కోవచ్చు?
లోన్స్ తీసుకొని కూడా సంపద స్ప్రుస్టించు కోవచ్చు అనే విషయం మీకు తెలుసా ? ఈ విషయం మీకు వినడానికి అచ్చర్యంగా ఉండవచ్చు.అప్పు ద్వారా ఎలా సంపద  స్ప్రుస్టించుకోవడం సాధ్యం అవుతుంది అని ఆలోచిస్తున్నారా ? వాస్తవానికి అప్పులకు దూరంగా ఉండటం , ఉన్న అప్పులను వదిలించుకోవడం , క్రెడిట్ కార్డ్స్ డ్యూ ఉన్న కూడా వాటిని వదిలించుకోవడం మీరు తప్పనిసరిగా చేయాలి అనే విషయం మీ అందరికి తెలిసిన విషయమే .పైన చెప్పిన సలహా సాదారణంగా   ఆర్ధిక క్రమశిక్షణ ,ఆర్ధిక అక్షరాస్యత లేని వారికి వర్తిస్తుంది.  అదే మీరూ ఆర్ధిక అక్షరాస్యత కలిగి ఉండి , ఫైనాన్సియల్  స్టేట్మెంట్స్ చదవగలిగి ఉంది ఉంటే మీకు లోన్స్ కూడా రెండు రకాలు ఉంటాయి అనే విషయం తెలిసి  ఉంటుంది. అవి గుడ్ లోన్స్ మరియు బ్యాడ్ లోన్స్ .
సాదారణంగా బ్యాడ్ లోన్స్ వలన మీ ఆర్ధిక పరిస్థితి దిగజారుతుంది తప్ప వాటి వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. ఉదాహరణకు లోన్స్ తీసుకొని విహర యాత్రలకు వెళ్లడం,కార్స్ , లాప్ టాప్స్ , ఖరీదైన మొబైల్స్ , ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడం,  ఇక గుడ్ లోన్స్ అంటే  లోన్స్ తీసుకొని వాటి ద్వారా బిజినెస్ ప్రారంబించడం , ఎడ్యుకేషన్ కొరకు ఉపయోగించడం , అద్దె ఆదాయం పొందడం కొరకు ఉపయోగించడం లేదా ఏదైనా ఆస్థి ఏర్పాటు కొరకు ఉపయోగించేవి గుడ్ లోన్స్.అంతే కాకుండా దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ ను కాపాడుకోవడానికి తీసుకొనే  లోన్స్ కూడా గుడ్ లోన్స్. ఒక ఉదాహరణ ద్వారా వివరంగా తెలుసుకుందాం.

ఉదాహరణకు మీరూ పది సంవత్సరాల పాటు మీ ఇన్వెస్ట్మెంట్ కొనసాగించేలా ఒక రియల్ ఎస్టేట్ ప్లాట్ లో ఇన్వెస్ట్ చేసారు అనుకుందాం. సుమారు ఐదు సంవత్సరాల  అనంతరం మీకు గుండె పోటూ వచ్చి మీకూ డబ్బు అత్యవసరమై  మీ ప్లాట్ కనుక అమ్మివేస్తే మీరూ కాపిటల్ గెయిన్  టాక్స్ చెల్లించడమే కాకుండా భవిష్యత్తులో మీ ప్లాట్ ద్వారా పెరిగే కాపిటల్ గెయిన్  నష్టపోవడమే కాకుండా మీరూ మీ ఇన్వెస్ట్మెంట్ కొనసాగించలనుకున్న కాలం కంటే ముందే అమ్మివేయడం వలన మీ లక్ష్యం కూడా నెరవేరే అవకాశం కూడా లేదు.అందువలన ఇలాంటి సమయంలో మీరూ షార్ట్ టర్మ్ లోన్స్ ఏదైనా తీసుకొని మీ దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ ఐనటువంటి మీ ప్లాట్ ను అమ్మకుండా కాపాడుకోగలుగుతారు కాబట్టి ఇది గుడ్ లోన్స్  .  
మీరూ ఏదైనా వ్యాపారం ప్రారంభం  చేయాలి అనుకుంటారు కాని మీ వద్ద డబ్బూ లేకపోవడంతో బ్యాంక్స్ నుండి, స్నేహితులనుండి అప్పు తీసుకొని వ్యాపారం ప్రారంభం చేసారు అనుకుందాం. మీరూ ఈ విధంగా అప్పు తీసుకొని వ్యాపారం ప్రారంభం చేయడంలో ఎలాంటి తప్పు లేదు ఎందుకంటె మీరూ చేసే వ్యాపారం మీకూ ఆదాయాన్ని అందివ్వగలుగుతుంది  కాబట్టి ఇది గుడ్ లోన్స్.   
మీరూ ఒక విలాసవంతమైన కారు కొనాలి అనుకొని లోన్ తీసుకొని కారు కొనడం బ్యాడ్ లోన్స్ క్రిందకు వస్తుంది.మీరూ కొత్తగా తీసుకున్న కారు ఖరీదు మొదటి నాలుగు సంవత్సరాలలోనే అరవై శాతం వరకు తరుగుదల ఉంటుంది.అంతే కాకుండా మీరూ కారు కోసం తీసుకున్న లోన్స్ వలన మీ ఆదాయం వృద్ది చెందటం కాని , కారు విలువ పెరగటం కాని జరగక పోగా మీ కారు విలువ ప్రతి సంవత్సరం తగ్గిపోతుంది.
ఇప్పుడు మీకూ గుడ్ లోన్స్ కి మరియు బ్యాడ్ లోన్స్ కి మధ్యగల తేడా అర్ధం అయినది అనుకుంటాను. ఎప్పుడూ కూడా మీరూ తీసుకొనే లోన్స్ ద్వారా మీ ఆదాయం లేదా మీ ఆస్థి వృద్ది చెందడానికి ఉపయోగపడేలా ఉండాలి . అంతేకాని విలువ కోల్పోయే వాటి కోసం లోన్స్ తీసుకోవద్దు. బ్యాంకు లు వారి లాభాలు పెంచుకోవడానికి సాదారణ ప్రజానీకాన్ని ప్రలోభపెట్టె విధంగానే వారి అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి.కాబట్టి లోన్స్ తీసుకొనే సమయంలో విచక్షణతో మెలగండి.

ఈ దీపావళికి బంగారంలో ఇన్వెస్ట్ చేయవచ్చా ?

ఈ దీపావళికి బంగారంలో ఇన్వెస్ట్ చేయవచ్చా ?


దీపావళి సంబరాలు దగ్గరకు వచ్చేసాయి. సాదారణంగా  హిందువులు అధికంగా దీపావళి ముందు వచ్చే దన్ తే రాస్ నాడు బంగారాన్ని కొనడం లేదా బంగారం లో ఇన్వెస్ట్ చేయడం చాలా కాలం నుండి సంప్రాదాయబద్దంగా చేస్తున్నారు.చాలా మంది ఆ రోజు బంగారం కొనడానికి సిద్దంగా ఉన్నారు.

గత కొన్ని రోజుల నుండి బంగారంలో స్వల తగ్గుదల జరిగిన విషయం అందరికి తెలిసిన విషయమే.ఈ నెల  వ తేదిన బంగారం ధర రూ 30950 నమోదు కావడం జరిగినది. ఈ విధంగా బంగారంలో తగ్గుదల వలన  ఈ సంవత్సరం   దన్ తే రాస్  నాడు  బంగారం కోటే లాభదాయకంగా ఉంటుందా అనే సందేహంలో చాలా మంది ఉన్నారు.
మీరూ గత సంవత్సరం దన్ తే రాస్  నాడు  10gm బంగారం రూ   26750 వద్ద కనుగోలు చేసి ఉంటే నేడు  10gm బంగారం రూ 30950 వద్ద ఉంది. అంటే మీకు సంవత్సరంలో వచ్చిన రాబడి సుమారు ( cagr) 15.70% . అంటే సంవత్సరంలో 15.70% రాబడి అంటే చాలా మంచి రాబడి అందుకోవడం జరిగినట్టే. అదే విధంగా ఈ సంవత్సరం దన్ తే రాస్  నాడు  బంగారం కనుగోలు చేస్తే వచ్చే దన్ తే రాస్  నాటికి కూడా రాబడి ఈ విధంగానే వస్తుంది అని అంచనా వేస్తే అప్పుడు బంగారం ధర సుమారు రూ 35810 వద్ద ఉండగలదు.
గత కొంత కాలం నుండి బంగారంలో పెరుగుదల వేగంగా జరిగినప్పటికీ కూడా అనలిస్టులు బంగారం ధర ఇంకా పెరగడానికే అధిక అవకాశం ఉంది అని అంచనా వేయడం జరుగుతుంది.కనీసం రాబోయే సంవత్సర కాలంలో బంగారం రూ  33890నుండి   38000వరకు మధ్య చలించడానికి అధిక అవకాశం ఉంది. అంటే కనీసం రాబడి 10% to 20% వరకు ఉండగలదు.గత కొద్ది రోజులుగా బంగారం లో నమోదు అవుతున్న తగ్గుదల కనుగోలు చేయడానికి వచ్చిన అవకాశంగా భావించాలి. ఐతే మీరూ బంగారాన్ని కనుగోలు జ్వేల్లరీ రూపంలో చేస్తే  మేకింగ్ చార్జీల  రూపంలో నష్టపోవలసి వస్తుంది. అంతే కాకుండా వ్యాట్ కూడా చెల్లించవలసి ఉంటుంది.కాయిన్స్ లేదా బార్స్ రూపంలో కనుగోలు చేసిన కూడా వ్యాట్ చెల్లించవలసి ఉంటుంది. అందువలన మీరూ గోల్డ్ ఈటిప్ ద్వారా బంగారంలో ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. గోల్డ్  ఈటిప్ ద్వారా మీరూ కేవలం గ్రాం బంగారం కూడా కనుగోలు చేయవచ్చు.అందువలన ఈ దీపావళి సందర్భంగా మీరూ కనీసం ఒక గ్రాం బంగారం ఐనా కనుగోలు చేయడం మంచిది.   


మీ దీపావళి బోనస్ ఏ విధంగా ఉపయోగించుకోవాలి?

మీ దీపావళి బోనస్ ఏ విధంగా ఉపయోగించుకోవాలి?
రాజేష్ ముప్పై సంవత్సరాల యువకుడు . మంచి MNC కంపెనీలో ఉద్యోగం.ఈ దీపావళికి కి సుమారు లక్ష రూపాయలు బోనస్ అందుకోబోతున్నాడు.ఐతే అతడు ఈ బోనస్ ను ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియక తికమకపడుతున్నాడు. ఏదైనా వృద్దికి అవకాశం ఉండే వాటిలో ఇన్వెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు. ఒకవేళ మీరూ కూడా రాజేష్ లాగే ఎలాంటి నిర్ణయం తీసుకోలేని అవస్థలో ఉంటే ఈ ఆర్టికల్ మీకూ తప్పకుండా ఉపయోగపడగలదు.
ముందుగా మీ బోనస్ ద్వారా ఏవైనా క్రెడిట్ కార్డ్స్ డ్యూ అమౌంట్ ఉంటే వెంటనే చెల్లించండి.ఎందుకంటె అత్యధికంగా వడ్డీ వసూలు చేస్తున్న దానిలో అన్నిటికంటే ముందు వరుసలో ఉండేది ఈ క్రెడిట్ కార్డ్స్. తర్వాత పర్సనల్ లోన్స్, లేక ఇతర లోన్స్ ఏవైనా ఉంటే వాటిని చెల్లించి మీ రుణభారాన్ని తగ్గించుకోండి.
మీకు సరిపడా ఇన్సురెన్స్ ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి.వాటిలో టర్మ్ ఇన్సురెన్స్ ,హెల్త్ ఇన్సురెన్స్ తప్పకుండా ఉండేలా జాగ్రత్త వహించండి.ఒకవేళ మీకు సరిపడా ఇన్సురెన్స్ లేనట్టు ఐతే ఈ బోనస్ అమౌంట్ లో నుండి కొద్ది మొత్తం ఇన్సురెన్స్ కొరకు కేటాయించండి.మిగిలినది ఎమర్జెన్సీ ఫండ్ క్రింద కేటాయించండి.మీరు  మీ బోనస్ ని ఇన్వెస్ట్ చేయడానికి కంటే ముందు సరిపడా ఇన్సురెన్స్ , ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మాత్రమే మిగితా వాటి గురించి ఆలోచించాలి. ఒకవేళ మీకు ఎలాంటి అప్పులు మరియు సరిపడా ఇన్సురెన్స్ , ఎమర్జెన్సీ ఫండ్ మొదలగునవి ఉంటే మీ బోనస్ ను క్రింద తెలియచేసిన చార్ట్ ప్రకారం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు
మీరూ ఇన్వెస్ట్ చేసే ముందు ఒక్కవిషయం తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి.మీ ఇన్వెస్ట్మెంట్ మీ పోర్ట్ఫోలియో ని తప్పకుండా ప్రభావితం చేస్తుంది. మీ ఇన్వెస్ట్మెంట్ మీరూ భరించగలిగే రిస్కు సామర్ద్యంనకు అనుగుణంగా  చేసుకోవాలి. మీకూ రిస్క్ భరించే సామర్ద్యం తక్కువగా ఉంటే సురక్షితమైన సాధనాలలో ఇన్వెస్ట్ చేయాలి. రిటర్న్ కూడా అదేవిధంగా ఉంటుంది. ఒకవేళ రిస్క్ అధికంగా తీసుకొనే సామర్ధ్యం ఉంటే దానికి అనుగుణంగా ఇన్వెస్ట్ చేయాలి .మీరూ ఒక్కవేళ బ్యాంకు లో ఫిక్సుడ్ డిపాజిట్ చేస్తే tds వసూలు చేస్తారూ అనే విషయం గుర్తుపెట్టుకోండి.మీరూ దీర్ఘాకాలం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఈక్వీటీ లలో ఇన్వెస్ట్ చేయడం ఎంత మాత్రం మర్చిపోవద్దు. అదే విధంగా బంగారం , వెండిలో కూడా ఇన్వెస్ట్ చేయాలి.    

టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ లో కట్టిన ప్రీమియం తిరిగి వస్తుందా ?


టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ లో కట్టిన ప్రీమియం తిరిగి వస్తుందా ?
టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ లో మీరు పాలసీ కోసం కట్టిన  ప్రీమియం  ఎట్టి పరిస్థుతులలో కూడా తిరిగి రాదు.చాలా మంది కేవలం వారు కట్టిన ప్రీమియం తిరిగి రావడం లేదనే కారణంతో టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీల వైపు చూడటం లేదు. మీరు దేనికైనా  మనీ చేల్లిస్తున్నప్పుడు  మీ మనీ తిరిగి రాకుంటే   దానికి విలువ లేదు అని భావించడం చాలా తప్పు. ఒకవేళ మీరు కట్టిన మనీ పాలసీ గడువు తర్వాత తిరిగి వచ్చిన  దాని విలువ చాలా తక్కువగా ఉంటుంది. దాని వలన మీరు కట్టిన ప్రీమియం తిరిగి రావడం వలన ఉపయోగం ఏమిటి ? మీరు ప్రతి  సంవత్సరం  పదివేల రూపాయల ఇన్స్యూరెన్స్ ప్రీమియం  కడితే ముప్పై సంవత్సరాల తర్వాత మూడు లక్షలు అవుతుంది. ముప్పై ఏళ్ళ తర్వాత మీరు అందుకునే ఈ మూడు లక్షల  ఎంత  ఉంటుందో ఒక్కసారి లేక్కించండి.  ఇప్పుడు మీకు నెలవారీ ఖర్చుల కోసం కనీసం నలభై వేలు అవుతుంది అనుకుంటే  ముప్పై ఏళ్ళ తర్వాత ఇదే జీవితం గడపడానికి  నెలకు సుమారు రెండున్నర నుండి మూడు లక్షలు అవసరం అవుతుంది. అంటే ఒకవేళ మీరు కట్టిన ప్రీమియం మీకు తిరిగి చెల్లించిన  అది  మీఒక్కనెల  ఖర్చులకు కూడా సరిపోదు. ఆ మాత్రం మనీ  కోసం ఆశపడి   టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీ  తీసుకోకుండా ఉంటారా ! మీరు కనుక మీకు  సరిపడా  టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీ  తీసుకోలేదంటే మీరు మీ  ప్యామిలీ కొరకు సరైనా జాగ్రత్త తీసుకోనట్టే. మీరు ఎప్పుడు కూడా   టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీ  చేయడం వలన ఎంత నష్టం వస్తుంది అని ఆలోచించకుండా  దాని వలన కలిగే లాభాల గురుంచి మాత్రమే ఆలోచించండి. ఎవరైనా సరే నిండు నూరేళ్ళు బ్రతకాలనే కోరుకుంటాం . అనుకొని సంఘటనలు  సంభవించడం కూడా జీవితంలో భాగమే. మీరు చెల్లించే కొద్ది మొత్తం మనీ వలన మీ కుటుంబానికి  రేపు అనుకొని సంఘటనలు జరిగినప్పుడు ఎంతో రక్షణగా ఉంటుంది. అంతే కాదు మీకు  మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

స్టాక్ మార్కెట్ లో మీరూ ప్రతి రోజూ వినే సెన్సెక్స్ అంటే ఏమిటి?

స్టాక్  మార్కెట్ లో మీరూ ప్రతి రోజూ వినే  సెన్సెక్స్ అంటే ఏమిటి?

సెన్సెక్స్ లేదా సెన్సిటివ్ ఇండెక్స్  ( SENSEX-or SENSitve index ) ను జనవరి 1 1986 రొజూ ముంబాయి స్టాక్ ఎక్సేంజీ ద్వారా పరిచయం చేసారు.ఇది ఇండియా లో గల ప్రముఖ ఇండేక్స్లలో ఒకటి .ఈ సెన్సెక్స్ మొత్తం మార్కెట్ ను ప్రతిబంబించేలా రూపొందించబడినది.దీనిలో బాగా పేరొందిన , స్థిరపడిన , ఆర్ధికంగా బాగా బలమైన పునాదులు కలిగినటువంటి  ముప్పై  పెద్ద కంపెనీలతో ఏర్పాటు చేయడం జరిగినది.సెన్సెక్స్ లెక్కించడం కోసం ఆ కంపీనీ మార్కెట్ కాపిటలైజేషన్ లెక్కలోకి తీసుకోవడం జరిగినది. అధిక కాపిటలైజేషన్ కలిగిన కంపెనీకి అధిక వెయిటేజీ ఇవ్వడం జరిగినది.అదే విధంగా 1978-79వ సంవత్సరం ను బెస్ సంవత్సరంగా , 100 ను బెస్ ఇండెక్స్ వాల్యుగా పరిగణలోకో తీసుకోవడం జరిగినది.అంటే సెన్సెక్స్ నిర్మాణ సమయంలో మొత్తం మార్కెట్ కాపిటలైజేషన్ విలువ  100 తీసుకోవడం వలన మరుసటి రోజూ మార్కెట్ కాపిటలైజేషన్  10% పెరిగితే ఇండెక్స్ కూడా   10% పెరిగి 100 నుండి  110 అవుతుంది. 100 ను బెస్ ఇండెక్స్ వాల్యుగా తీసుకోవడంలో ముఖ్య ఉద్దేశం లెక్కించడానికి సులభంగా ఉంటుంది అనే ఆలోచనే. సెన్సెక్స్ లో ఎన్నుకొనే కంపెనీలు క్వాలిటీ పరంగా మరియు క్వాంటిటీ పరంగా మంచి లక్షణాలు కలిగిఉంటాయి.
ఇప్పుడు సెన్సెక్స్ ఇండెక్స్ యే విధంగా నిర్మిస్తారో ఒక్కసారి చూద్దాం.మార్కెట్ లో ఒక స్టాక్ మాత్రమే ఉంటే దానిలో పెరుగుదల కాని, పతనం కాని సులభంగా అర్ధం చేసుకోవచ్చు. బెస్ ఇండెక్స్ విలువ  100 కాబట్టి ఒక స్టాక్ యొక్క ధర 200 నుండి 240 వరకు పెరిగితే ఆ స్టాక్ లో పెరుగుదల  20% నమోదు ఐతే ఇండెక్స్ లో కూడా పెరుగుదల 20% ఉండి ఇండెక్స్  100 నుండి 120 కి చేరుకుంటుంది. మరుసటి రోజు ఆ స్టాక్ యొక్క ధర  10% పతనం జరిగి  216 కు చేరుకుంటే సెన్సెక్స్ ఇండెక్స్ కూడా 10%  తగ్గడంతో   110 కి చేరుకుంటుంది.ఈ విధంగా సెన్సెక్స్ లో ఒకే స్టాక్ ఉండటం వలన ఇండెక్స్ విలువ  మనం లెక్కించడం సులభంగా జరిగినది. మరి ఒకటి కంటే ఎక్కువ అంటే రెండు స్టాక్ లు ఉంటే యే విధంగా లెక్కించాలో చూద్దాం.
ఇప్పుడు ఇండెక్స్ లో A మరియు B అనే రెండు కంపెనీల స్టాక్స్ ఉన్నాయి అనుకోండి. A స్టాక్ ధర 200 వద్ద ఉంది , B స్టాక్ ధర  150 వద్ద ఉంది.సెన్సెక్స్ ఇండెక్స్ ఏర్పాటు చేయడంలో స్టాక్స్ యొక్క మార్కెట్ కాపిటలైజేషన్ పరిగణలోకి తీసుకొని దానికి అనుగుణంగా ఆ కంపెనీకి ఇండెక్స్ లో వెయిటేజీ ఇస్తారు అని మనం ఇది వరకే తెలుసుకున్నాం. మరి ఇప్పు ఈ రెండు స్టాక్ ల యొక్క వెయిటేజీ ఏవిధంగా తెలుసుకోవాలో ఒక్కసారి చూద్దాం. ఒక కంపీనీ లో గల మొత్తం షేర్లను ఆ కంపెనీ షేరు లేదా స్టాక్ ధరతో గుణించగా వచ్చేదే మార్కెట్ కాపిటలైజేషన్ . కంపెనీ  A వద్ద  100,000 షేర్లు మరియు కంపెనీ  Bవద్ద  200,000 షేర్లు ఉంటే కంపెనీ  A కాపిటలైజేషన్  200 x 100000 =20000000 మరియు కంపెనీ  B కాపిటలైజేషన్ 150 x 200000 = 30000000 అవుతుంది. మొత్తం మార్కెట్ కాపిటలైజేషన్ (200 x 100000 + 150 x 200000) Rs 500 lakhs అవుతుంది. ఈ మొత్తం  సెన్సెక్స్ ఇండెక్స్ బెస్ విలువ   100 కి సమానం  అవుతుంది.ఇప్పుడు కంపెనీ  A స్టాక్ ధర  260 (30% increase in price) కి చేరుకుంది.కంపెనీ  B స్టాక్ ధర  135. (10% drop in price)కి చేరుకుంది.ఇప్పుడు మార్కెట్ కాపిటలైజేషన్  260 x 100000 +135 x 200000= Rs 530 lakhsలకు చేరుకుంది. అంటే స్టాక్స్ ధరలలో మార్పు వల్ల మార్కెట్ కాపిటలైజేషన్ ) Rs 500 lakhs నుండి Rs 530 lakhsలకు చేరుకుంది. అంటే 6% పెరుగుదల నమోదు కావడం జరిగినది కావున సెన్సెక్స్ ఇండెక్స్ లో కూడా పెరుగుదల 6% నమోదు కావడం జరుగుతుంది కాబట్టి సెన్సెక్స్ ఇండెక్స్ 100 to 106 మార్పు చెందడం జరుగుతుంది.ఈ విధమైన లాజిక్ ను సెన్సెక్స్ లో ఎంచుకున్న స్టాక్స్ అన్నిటికి విస్తరించి లెక్కించడం జరుగుతుంది. అందుకే స్టాక్స్ యొక్క ధరల మార్పు కి అనుగుణంగా సెన్సెక్స్ కూడా మార్పు చెందడం జరుగుతుంది. ఐతే సెన్సెక్స్ ఇండెక్స్  ముప్పై ఆర్ధికంగా బలంగా ఉన్న పెద్ద కంపెనీలను చేర్చడం ద్వారా లెక్కిస్తాయు అని తెలుసుకున్నాం. కాని ఒక్క విషయం ఈ విధంగా లెక్కించడానికి  కంపెనీ యొక్క అన్ని షేర్లను పరిగణలోకి తీసుకోరు. కేవలం ఫ్రీ ప్లోటింగ్ ఉన్న షేర్ల విలువను  మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.ప్రీ ప్లోటింగ్ అంటే ఏమిటో మనం ఒక్క సారి తెలుసుకుందాం.స్టాక్ మార్కెట్ లో ప్రజలూ ట్రేడ్ చేయడానికి అందుబాటులో ఉన్న షేర్లను ప్రీ ప్లోటింగ్ షేర్లు అంటారు.అంటే కంపెనీ ప్రమోటర్లు, FDIs , ప్రభుత్వం వద్ద ఉన్న షేర్లు మినహాయించి మిగిలిన షేర్లను ప్రీ ప్లోటింగ్ షేర్లు అంటారు.ఒక కంపెనీ యొక్క    ప్రీ ప్లోటింగ్ విలువను లెక్కించాలి అంటే ఒక కంపెనీ మొత్తం కాపిటలైజేషన్లో  ఎంత శాతం పబ్లిక్ వద్ద ఉందో ఆ మొత్తం ను పరిగణలోకి తీసుకుంటారు.. పబ్లిక్  వద్ద  ఎంత శాతం షేర్లు అందుబాటులో ఉంటే ఆ కంపెనీ యొక్క ప్రీ ప్లోటింగ్ విలువ ఎక్కువగా ఉంటుంది.

ఉదాహరణకు ఒక కంపెనీ యొక్క మార్కెట్ విలువ  Rs 100,000 కోట్లు అనుకుంటే ఒక్క షేర్ విలువ Rs 1,000 ఐతే కంపెనీ వద్ద ఉన్న మొత్తం షేర్ల సంఖ్యా 100 అవుతాయి. కాని కేవలం 20% షేర్లు మాత్రమే పబ్లిక్ కి అందుబాటులో ఉంటే అప్పుడు కంపెనీ యొక్క ఫ్రీ ప్లోటింగ్ మార్కెట్ విలువ మొత్తం కంపెనీ యొక్క మార్కెట్ విలువ లో  20% మాత్రమే అవుతుంది. అంటే  Rs 100,000x20% =20,000అవుతుంది.మీరు ఈ ఫ్రీ ప్లోటింగ్ విలువ ఎప్పటికప్పుడు క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.


ఇప్పుడు సెన్సెక్స్  లో గల ముప్పై కంపెనీల ఫ్రీ ప్లోటింగ్ విలువ ప్రకారం సెన్సెక్స్ ఇండెక్స్ పెరగడం లేదా తగగ్డం జరుగుతుంది.
ఉదాహరణకు  Rs 10,00,000కోట్ల ఫ్రీ ప్లోట్   మార్కెట్ కాపిటలైజేషన్  ఉన్నప్పుడు సెన్సెక్స్ ఇండెక్స్  12500 ఉంటే , ఫ్రీ ప్లోట్   మార్కెట్ కాపిటలైజేషన్ పెరిగి   Rs 11,50,000 కోట్లకు చేరుకుంటే సెన్సెక్స్ ఇండెక్స్  ఎంత ఉండగలదో లేక్కగట్టండి.తెలియడం లేదా ఐతే సమాధానం ఏంతో తెలుసా 14,375. ఎలాగో తెలియడం లేదా చిన్నప్పుడు లెక్కల్లో నేర్చుకున్న  ratios and proportionsగుర్తుతెచ్చుకోండి.ఐనా సాధ్యం కాకపోతే మాకు మెయిల్ చేయండి. 

మీ కుటుంబ రక్షణ కోసం చదవండి ?


మీ కుటుంబ రక్షణ కోసం చదవండి ?
మీరు 2007లో 25 లక్షలకు ఇన్సురెన్స్ పాలసీ తీసుకోవడం జరిగినది.మీరు మీ పాలసీ ప్రీమియం  0708,09,2010లో చెక్ ద్వారా చెల్లించడం జరిగినది.  2011లో మాత్రం క్యాష్ ద్వారా  చెల్లింపు చేయడం జరిగినది.అంటే మీ పాలసీ అమలులో ఉన్నది. మీరు 20122 లో ఆకస్మికంగా మరణించడం జరిగినది.మీ కుటుంబం మీ పాలసీ చూసి మీ ఇన్సురెన్స్ ఏజెంట్ కి కాల్ చేస్తే  సమాధానం ఇవ్వడం  లేదు.  మీ కుటుంబానికి ఏమి చేయాలో పాలు పోవడం లేదు.చివరకు మీ వాళ్ళు ఇన్సురెన్స్ కంపెనీ ని సంప్రందించి మీ మరణ వార్త తెలియచేయడంతోపాటు పాలసీ వివరాలు వారికి అందించడం జరిగినది.అప్పుడు కంపెనీ చిన్నగా సారీ చెప్తూ పాలసీ ప్రీమియం చెల్లించలేదు కావున ఇన్సురెన్స్ పాలసీ రద్దు చేయడం జరిగినది అని తెలియచేస్తే మీ కుటుంబం ఏమి చేయగలదు. సాదారణంగా ఇంటికి వచ్చి రసీదుల కోరకు  వెతకడం చేస్తుంది. కాని అది వారికి దొరకదు. ఎందుకంటె చాలా మందికి రసీదులు జాగ్రత్తగా భద్రపరిచే అలవాటు లేదు. ఒకవేళ భద్రపరిచిన అవి ఎక్కడ ఉంటాయో చాలా     మంది కుటుంబ సభ్యులకు తెలియను కూడా తెలియదు.మీరు మాత్రం అలంటి పొరపాటు ఎత్తి పరిస్తితులలో చేయవద్దు. మీ పాలసీల వివరాలు , వాటి రసీదులు మొదలగునవి ఎక్కడ ఉన్నాయో , క్లైమ్ లాంటివి ఏ విధంగా చేసుకోవాలో వివరంగా మీ కుటుంబ  సభ్యులకు  వివరంగా తెలియచేయండి. కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఐనప్పటికీ కూడా ఈ వివరాలు మీ కుటుంబ సభ్యులకు తెలియచేయడం చాలా మంచిది.   

ఈవారం స్టాక్ మార్కెట్ 29-10-2012to02-11-2012


ఈవారం స్టాక్ మార్కెట్ 29-10-2012to02-11-2012
గత వారం కూడా దాదాపుగా సైడ్ వేస్ లోనే చలించడం జరిగినది. చివరకి ఎక్స్ ఫైరీ రోజు కూడా మార్కెట్  ప్రభావం చూపలేకపోయినది. అందువలన నిఫ్టీ  5635-5725  ల మధ్య కదలాడుతున్నంతవరకు ట్రేడింగ్ కి ఉఎలాంటి అవకాశం ఉండటం లేదు. సేఫ్ ట్రేడర్స్ బ్రేక్ ఆవుట్ ఎటో ఒకవైపు జరిగేటంతవరకు మార్కెట్ కు దూరంగా ఉండటం మంచిది. రిస్క్ తీసుకొనే వారు మాత్రం  5635 స్టాప్ లాస్ తో బై చేయడం , 5725 స్టాప్ లాస్ తో సెల్ చేయడం మంచిది.కంపెనీల రిజల్ట్ సీజన్ దాదాపుగా ముగుస్తున్నందున  మార్కెట్ ట్రెండ్ తీసుకొనే అవకాశం కలదు.సోమవారం BHEL రిజల్ట్ కలదు.అదే విధంగా మంగళవారం  MARUTHI , RBI POLICY కలవు. నిఫ్టీ  గత పదమూడు ట్రేడింగ్ సెషన్స్ నుండి 5635-5725  మధ్య కదలాడుతూ ట్రేడింగ్ కి ఎలాంటి అవకాశం ఇవ్వడం లేదు.ఈ రోజు కూడా నిఫ్టీ   5635 బ్రేక్ కాకపోతే 5690  వరకు దానిని అధిగమిస్తే మళ్ళీ అప్పర్ సైడ్ రేంజ్  వరకు కూడా వెళ్ళవచ్చు.ప్రస్తుతం పై లెవల్లో సెల్ చేయడం చాలా మంచిది.   

పర్సనల్ లోన్స్ కి ఎందుకు దూరంగా ఉండాలి?

పర్సనల్ లోన్స్ కి ఎందుకు దూరంగా ఉండాలి?
ప్రస్తుత ప్రపంచంలో ఆదాయం పరిమితం కాని కోరికలు అనంతం . ఈ కోరికలను తీర్చుకోవడానికి మనకు ఉన్న దారులలో ముఖ్యమైనది పర్సనల్ లోన్స్ తీసుకోవడం లేదా క్రెడిట్   కార్డ్స్ వాడటం.ఒక్క విషయం మీరూ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి . మీరూ ఏవిధమైన అప్పు తీసుకున్న కూడా  దానిని తీర్చవలసిన భాద్యత మీపై ఉంటుంది అంతేకాకుండా అది మిమ్ములను ఆర్ధికంగా ఇబ్బందులపాలు తప్పకుండా చేస్తుంది.అందువలన పర్సనల్ లోన్స్ తప్పని పరిస్థితి , అత్యవసరం ఐతే తప్ప వాటిని తీసుకోకూడదు. మీరు పర్సనల్ లోన్స్ తీసుకోవడం అనేది మీ చిట్టా చివరి అవకాశంగా ఉండాలి.
పర్సనల్ లోన్స్ సాదారణంగా దేనికైనా ఉపయోగించుకోవచ్చు. అంటే వైద్య ఖర్చులు, వివాహ ఖర్చులు, గృహోపకరణ వస్తువులు , క్రెడిట్ కార్డ్ అప్పు తీర్చడం మొదలగు వాటిలో దేనికైనా వాడుకోవచ్చు.మీరూ పర్సనల్ లోన్స్ తీసుకొనేటప్పుడు  దానిని ఎందుకు వినియోగిస్తున్నారో బ్యాంక్ వారికి తెలియచేయవలసిన అవసరం లేదు కాబట్టి పర్సనల్ లోన్స్ అంటే అన్ని రకాల అవసరాలకి ఉపయోగించే లోన్స్.సాదారణంగా హౌసింగ్ లోన్స్, కార్ లోన్స్ , ఎడ్యుకేషనల్ లోన్స్ అంటే మీరూ వాటిని ప్రత్యేకంగా  వాటి గురించి మాత్రమే ఉపయోగించాలి. మీరూ బ్యాంక్ నుండి పర్సనల్ లోన్స్ తీసుకోవడం కూడా చాలా సులభం . అంతేకాకుండా చాలా బ్యాంకులు పర్సనల్ లోన్స్ కోసం గ్యారంటర్  లేదా సెక్యూరిటీ కూడా అడగరు. అందువలన చాలా మంది పర్సనల్ లోన్స్ తీసుకోవడం చాలా మంచిది ఆనే ఉద్దేశంతో ఉంటారూ కాని పర్సనల్ లోన్స్ తీసుకోవడం అంత పెద్ద  తప్పు ఇంకోటి లేదు. అని రకాల లోన్స్ లోకెల్లా అత్యంత వరస్ట్ లోన్స్ పర్సనల్ లోన్స్ .వీటిలో వసూలు చేసే వడ్డీ రేటు కూడా సాదారణంగా చాలా ఎక్కువగా ఉంటుంది.సుమారు 14-18% వరకు వడ్డీ వసూలు చేస్తారు.
మనం ఒక ఉదాహరణ ద్వారా  అర్ధం చేసుకొనే ప్రయత్నం చేద్దాం.ఒక వ్యక్తీ అత్యవసర నిమిత్తమై రూ   5,00,000 బ్యాంక్ నుండి అప్పు తీసుకుంటే 17%  వడ్డీ రేటుతో  5సంవత్సరాలలో తిరిగి చెల్లించటానికి ప్రతి నెల చెల్లించే  emi  రూ 12,426 తీసుకున్న లోన్ పై సుమారు  రూ 2,45,560 వడ్డీ  చెల్లించవలసి వస్తుంది.   అంటే లోన్ పై 50% అధికంగా వడ్డీ రూపంలో చెల్లించవలసి వస్తుంది.


సాదారణంగా చాలా బ్యాంకులు ముందస్తూ చెల్లింపులకు ఒప్పుకోవు. దాని వలన మీ లోన్ కాలపరిమితి తీరేటంత వరకు వాయిదాలు చెల్లించవలసి ఉంటుంది. మీరు చెల్లించే వాయిదాలలో మొదటి రెండు సంవత్సరాలు ఎక్కువగా  వడ్డీ చెల్లించడానికే  వెళ్ళిపోతుంది.కొన్ని బ్యాంకులు ముందస్తూ చెల్లింపులకు అనుమతించిన ఎక్కువ పెనాల్టీ విదిస్తాయి.
ఇవి సాదారణంగా మీ ఆర్ధిక సానర్ద్యం బాగుండి తిరిగి చెల్లించే సామర్ధ్యం బాగుంటే మాత్రమే ఈ లోన్స్ మీకూ ఇస్తాయి.అదే విధంగా కొన్ని బ్యాంకులు హిడ్డేన్ చార్జీలు విధిస్తూ మీకూ ఇంకా భారాన్ని కలుగచేస్తాయి.చాలా మందికి లోన్ ఆఫర్ డాక్యుమెంట్స్ , అగ్రిమెంట్స్ కనీసం చదవకుండానే సంతకం పెడతారు. దానికి అధిక మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది.మీ లోన్ వాయిదాలు నిర్ణీత సమయంలోగా చెల్లించకపోతే పెనాల్టీ చెల్లించ వలసి ఉంటుంది.ఒకవేళ మీరూ లోన్స్ చెల్లించడంలో విఫలమయి , డిఫాల్ట్ అయితే మీరూ భవిష్యత్తులో లోన్స్ పొందడం చాలా చాలా కష్టం అవుతుంది. అందువలన వీలు అయినంతవరకు పర్సనల్ లోన్స్ కి చాలా చాలా దూరంగా ఉండండి.ఒకవేళ అత్యవసర నిమిత్తమై డబ్బులు అవసరమైతే గోల్డ్ లోన్స్ ఏవైనా తీసుకోండి.తప్పని పరిస్థుతులలో వైద్యం కోసం ఐతే పర్సనల్ లోన్స్ తీసుకోవడంలో తప్పులేదు కాని విహర యాత్రలకి , వస్తువులకి  మొదలగు వాటికి మాత్రం పర్సనల్ లోన్స్ ఎలాంటి పరిస్థుతులలో కూడా తీసుకోవద్దు.