కొత్త ఫిఫ్ రూల్


కొత్త ఫిఫ్ రూల్
 Employee’s provident fund organization (EPFO)  కొత్త రూల్ ప్రకారం ఉద్యోగుల భవిష్యనిధిలో  జమ చేసే మొత్తం పెరగడం వలన చేతికి వచ్చే జీతం తగ్గుతుంది.ఇంతకు ముందు ఫిఫ్ ఉద్యోగుల మూల వేతనం పై  మాత్రమే  లెక్కించి  భవిస్యనిధికి జమ చేసేవారూ. ఎలాంటి అలవెన్స్ లను లెక్కలోకి తీసుకోలేదు. కాని ప్రస్తుత రూల్ ప్రకారం ఫిఫ్ లెక్కించడానికి మూలవేతనం తో పాటు ఇతర అలవెన్స్ లు  కలిపి లెక్కించి ఆ మొత్తంలో నుండి 12% ఫిఫ్ క్రింద జమచేయడం జరుగుతుంది. ఐతే అలవెన్స్ లలో మొత్తం అలవెన్స్ లు పరిగణలోకి తీసుకుంటారా లేక ఏ ఏ అలవెన్స్ లను పరిగణలోకి తీసుకుంటారు అనే విషయం పై స్ప్రస్టత రావలసి ఉంది.  ఈ రూల్ ప్రకారం ఉద్యోగి మరియు యజమాని భవిష్యనిధిలో  జమ చేసే మొత్తం పెరుగుతుంది.కాని ఉద్యోగి చేతికి వచ్చే జీతం మాత్రం తగ్గుతుంది. 

బ్యాంక్స్ ఖాతాలు ఓపెన్ చేయడం ఇప్పుడు చాలా సులభం.

బ్యాంక్స్ ఖాతాలు ఓపెన్ చేయడం ఇప్పుడు చాలా సులభం.
ప్రస్తుతం RBI నిబంధనల ప్రకారం బ్యాంక్ లో ఖాతా ప్రారంభం చేయడం చాలా సులభం. ఇది వరకు ఖాతా ప్రారంభం చేయడానికి గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్ , ఇంట్రడక్షన్ సంతకం తప్పనిసరిగా కావలసి వచ్చేది. ఇప్పుడు  RBI  ఇంట్రడక్షన్ సంతకం నిభందనను  తీసివేయడం జరిగినది.కావున ఖాతా ప్రారంభం చేయడం చాలా సులభం .అంతే కాకుండా  కొన్ని డాక్యుమెంట్స్  ను   గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్ గా కూడా తప్పనిసరిగా గుర్తించాలి అని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగినది. ఇంతకు ముందు ఓటర్ కార్డ్ , డైవింగ్ లైసన్స్  మొదలగు వాటిని బ్యాంక్స్ కేవలం అడ్రస్ ప్రూఫ్ గా మాత్రమే పరిగణలోకి తీసుకొనేవి.  ఇప్పడు మాత్రం ఏదైనా పత్రం పై  ఫోటో మరియు అడ్రస్ ఉంటె దాని  ద్వారా తప్పనిసరిగా ఖాతా ప్రారంభం చేయాలి . అంటే కేవలం ఓటర్ కార్డ్, డైవింగ్ లైసన్స్  మొదలగు వాటి వలన కూడా ఖాతా ప్రారంభం చేయడం చాలా సులభం

అమెరికా రియల్ ఎస్టేట్ క్రాష్ నుండి నేర్చుకోవలసిన గుణపాఠాలు.


అమెరికా రియల్ ఎస్టేట్ క్రాష్ నుండి నేర్చుకోవలసిన గుణపాఠాలు.
ఇండియాలో ఇప్పుడిప్పుడే మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపు అందుకుంటుంది.మీరూ ఇప్పుడు ఏ పేపర్ చూసిన రియల్ ఎస్టేట్ అడ్వర్టయిజ్మెంట్లు ఎక్కువగా కనబడుతున్నాయి.ఇవన్ని చూస్తుంటే మూడేళ్ళ క్రిందటి  అమెరికాలో జరిగిన రియల్ ఎస్టేట్  సంఘటనలు గుర్తుకువస్తున్నాయి.మీరూ కూడా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ సంఘటనలు గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది.
రియల్ ఎస్టేట్ వ్యాపారం , గృహనిర్మాణ రంగం విజ్రంభన ఉన్న సమయంలో చాలా మంది రెండు లేదా మూడు ఇల్లు ఐనా సొంతం చేసుకోవాలి అనే ఆలోచనతో ఉండేవారు.వాస్తవంగా చెప్పాలి అంటే వారి ఆర్ధిక స్తోమత , వారి శక్తి సామర్ధ్యలకు మించి కనుగోలు చేయదానికి  చూసే వారు.వాస్తవానికి బ్యాంక్స్ కూడా ఒక వ్యక్తీ యొక్క ఆర్ధిక స్థోమతకు మించి అప్పులు ఇచ్చేవి.  అంతేకాకుండా బ్యాంక్స్ కూడా ARMs (Adjustable Rate Mortgages) ప్రకారం వడ్డీ వసూలు చేసేవి.అంటే మొదట వడ్డీ రేటు తక్కువగా ఉండి కొంత కాలం అనంతరం అధిక వడ్డీ వసూలు చేసేవి. దీనిలో ఉండే ముఖ్య ఉద్దేశం అధిక కస్టమర్లని ఆకర్షించడం  చాలా మంది అమెరికాలో ఈ విధంగా లోన్స్ సులభంగా లభ్యం అవుతున్నాయి  అనే ఉద్దేశం తో అధిక లోన్స్ తీసుకోవడం వలన చివరకు వాటిని చెల్లించలేకపోవడంతో అధికంగా జప్తుకీ వేళ్ళుతుండేవి. అందువలన మీరు కూడా మీరూ చెల్లించగలిగే మీ సామర్ధ్యానికి అనుగుణంగా మాత్రమే లోన్స్ తీసుకోండి. హౌసింగ్ లోన్స్ సుమారు మీ సంపాదన కాలం మొత్తం చెల్లించవలసి ఉంటుంది. కావున లోన్స్ తీసుకొనే సమయంలో జాగ్రత్తగా తీసుకోండి.  అంతేకాకుండా మీరూ రియల్ ఎస్టేట్ ధరలు ఎప్పటికి కూడా  తగ్గు ముఖం పట్టవు అని భావించవద్దు.అమెరికా సంక్షోభం కంటే ముందు జపాన్ లో జరిగిన విషయం మీరూ మర్చిపోవద్దు.రియల్ ఎస్టేట్ ధరలు ఎప్పటికి  తగ్గవు అనే భ్రమలో మీరూ ఉండవద్దు. రియల్ ఎస్టేట్ కూడా ఇతర అసెట్ క్లాస్ లో ఒక్కటి. మిగితా అసెట్ క్లాస్ లో పెరగడం, తగ్గడం ఏ విధంగా ఉంటుందో దీనిలో కూడా అదే విధంగా ఉంటుంది అనే విషయం మర్చిపోవద్దు.     

ఈ వారం స్టాక్ మార్కెట్ 10-12-2012 to 14-12-2012


ఈ వారం స్టాక్ మార్కెట్ 10-12-2012 to 14-12-2012
మార్కెట్ లో బ్రహ్మాండమైన ర్యాలీ అనంతరం కన్సోలిదేషన్ జరగటం చాలా సర్వసాదారణం .దీని గురించి మనం గత వారం పోస్ట్ లో కూడా చర్చించడం  జరిగినది.గత వారం కేవలం నిఫ్టీ  27 పాయింట్లు మాత్రమే స్వల్ప లాభం పొందటం జరిగినది.12 వ తేదీన వెలువడనున్న IIP డేటా , 14 వ తేదీన వెలువడనున్న  ఇన్ఫ్లేషన్  డేటా పై మార్కెట్ మూమెంట్ ఆధారపడి ఉంటుంది. ఈ డేటా ల ప్రకారం ఈ నెలలో జరుగనున్న క్రెడిట్ పాలసీలో RBI  కీలక రెట్ల విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు .మీకూ ఇది వరకు తెలియచేసినట్టుగా 50hsma కూడా చాలా కీలకం అని తెలియచేయడం జరిగినది. అదే విధంగా నిఫ్టీ కూడా గురు, శుక్ర వారం    50hsma  సపోర్ట్ తీసుకోవడం మీరూ క్రింద ఇచ్చిన హవర్లీ చార్ట్ లో చూడవచ్చు. ఈ వారం ప్రస్తుతం   50hsma 5885 వద్ద ఉంది.కాబట్టి దానిని ఈ రోజు జాగ్రత్తగా గమనించాలి.5548 వద్ద ఏర్పాటు కాబడిన డబుల్ బాటం మరియు 5540 వద్ద ఉన్న ట్రెండ్ లైన్ సపోర్ట్ మార్కెట్ లో ర్యాలీ రావడానికి సహాయపడ్డాయి. అదే విధంగా ట్రెండ్ లైన్ బ్రేక్ జరగనంతవరకు మార్కెట్ పైకి వెళ్లడానికే అధిక అవకాశం ఉంది.ప్రస్తుతం చార్త్స్ లో చూపిన విధంగా 5950-70 మధ్య రెసిస్టన్స్ వస్తుంది. ఒకవేళ ఈ రెసిస్టన్స్ కనుక దాటితే 6050, 6150 వరకు నిఫ్టీ సులభంగా చేరుకోగలదు. నిఫ్టీ బుల్లిష్ ప్లాగ్ పాటర్న్ ప్రకారం కూడా టార్గెట్  6150 గా ఉంది.ఈ వారం నిఫ్టీ కి సపోర్ట్ 5825, 5770,5720 రెసిస్టన్స్ 5950,6050,6150  . స్టాప్ లాస్ పాటించి తగు జాగ్రత్తతో ట్రేడింగ్ చేసుకోగలరు.  


 telugufinancialschool@gmail.com

టాక్స్ సేవింగ్ ఫిక్సుడ్ డిపాజిట్స్ నిజంగా ఆదాయపు పన్ను అదా చేయడానికి ఉపయోగపడుతున్నాయా ?


టాక్స్ సేవింగ్ ఫిక్సుడ్ డిపాజిట్స్  నిజంగా ఆదాయపు  పన్ను అదా చేయడానికి ఉపయోగపడుతున్నాయా ?
చాలా మంది ఆదాయపు పన్ను సెక్షన్ 80C ప్రకారం అదా చేయడానికి  ఫిక్సుడ్ డిపాజిట్స్   ఎన్నుకుంటారు.మీరూ నిజంగా ఈ విధంగా చేయడం వలన ఆదాయపు పన్ను అదా చేయవచ్చు అని అనుకుంటున్నారా ? ఈ విధమైన టాక్స్ సేవింగ్ పథకాల వలన ఆదాయపు పన్ను అదా చేయవచ్చా ?
ముందుగా టాక్స్ సేవింగ్  ఫిక్సుడ్ డిపాజిట్స్   అంటే ఏమిటో ఒక్కసారి చూద్దాం.
బ్యాంక్స్ టాక్స్ సేవింగ్ కోసం అందించే ఫిక్సుడ్ డిపాజిట్స్   పథకాలు ఇవి.
వీటీ మీదా వడ్డీ రేటు వివిధ బ్యాంక్స్ లో వివిధ రకాలుగా ఉంటుంది.
ఈ డిపాజిట్స్ మీరూ ఐదు సంవత్సరాల వరకు తిరిగి తీసుకోవడానికి వీలు లేదు.
మీరూ డిపాజిట్ చేసిన సంవత్సరం సెక్షన్ 80C ప్రకారం డిపాజిట్ చేసిన మొత్తంపై ఆదాయపు పన్ను మినహాయింపు పొందుతారు. మీకు ఈ వివరాలు అన్ని తెలిసిన తర్వాత ఒక్కసారి ఆలోచించవలసి ఉంటుంది. నిజంగా ఈ డిపాజిట్స్ వలన మీరూ అదా చాయగలిగే ఆదాయపు పన్ను ఎంత  అనే విషయం మీరూ పదివేలు ఇన్వెస్ట్ చేయడం వలన పొందే ఆదాయపు పన్ను మినహాయింపు మీకూ వర్తించే స్లాబ్ పై ఆధారపడి ఉంటుంది.
10% స్లాబు ఐతే  మీరూ పొందే ఆదాయపు పన్ను మినహాయింపు Rs1030
20% స్లాబు ఐతే  మీరూ పొందే ఆదాయపు పన్ను మినహాయింపు Rs2060
30% స్లాబు ఐతే  మీరూ పొందే ఆదాయపు పన్ను మినహాయింపు Rs3090

ఐదు సంవత్సరాల తర్వాత మీరూ అసలు మరియు వడ్డీ తిరిగి పొందుతారు.మీరూ పొందే వడ్డీ పై ఆదాయపు పన్ను చెల్లించాలి.   .
ఉదాహరణకు మీరూ మూడు నెలలకు ఒకసారి లెక్కించే పద్దతిలో పది వేలు  8.5%  చొప్పున డిపాజిట్ చేసినట్టు ఐతే  మీరూ కాలపరిమితి ముగిసిన అనంతరం  పొందే  మొత్తం Rs 15227 ఐతే   దానిలో వడ్డీ  5227  పై మీరూ ఆదాయపు పన్ను చెల్లించవలసి ఉంటుంది.మీరూ ఎంత  పన్ను చెల్లించవలసి ఉంటుంది అనేది మీ ఆదాయం ఏ స్లాబ్ పరిధిలో ఉంది అనే విషయం పై ఆధారపడి ఉంటుంది.
10% స్లాబు ఐతే  మీరూ చెల్లించే ఆదాయపు పన్ను  Rs538
20% స్లాబు ఐతే  మీరూ చెల్లించే ఆదాయపు పన్ను  Rs 1076
30% స్లాబు ఐతే  మీరూ చెల్లించే ఆదాయపు పన్ను  Rs 1615
 ఒకవేళ మీరూ కనుక తక్కువ పన్ను స్లాబ్ పరిధిలో ఉంటె దీనివలన పెద్దగా ఎలాంటి ఉపయోగం ఉండదు.అంతే కాకుండా మీ డిపాజిట చేసిన మొత్తం ఎట్టి పరిస్తుతులలో ఐదు సంవత్సరాల లోపు తిరిగి తీసుకోవడానికి వీలు కాదు. అత్యవసర పరిస్తుతులలో బ్యాంక్స్ కూడా ఎలాంటి ఈ డిపాజిట్స్ పై ఎలాంటి లోన్స్ అందించవు. కావున ఈ డిపాజిట్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు జాగ్రత్తగా ఒక్కటికి రెండు సార్లు ఆలోచించండి

REC టాక్స్ సేవింగ్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా ? లేక బ్యాంక్ ఫిక్సుడ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా ?


REC  టాక్స్ సేవింగ్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా ? లేక బ్యాంక్ ఫిక్సుడ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా ?   
మార్చి 31, 2013 లోపు పది ప్రభుత్వ అధీనంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు రూ 53500 కోట్ల విలువైన టాక్స్ సేవింగ్ బాండ్స్ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాయి. ఈ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన  అమౌంట్ పై   వచ్చే వడ్డీ మీదా ఎలాంటి టాక్స్ ఉండదు.ఏయే కంపెనీలు టాక్స్ సేవింగ్ బాండ్స్ జారీ చేస్తున్నాయో క్రింద ఇవ్వబడినవి.

ఈ బాండ్స్ ను టాక్స్ సేవింగ్ బాండ్స్ అంటారు . వీటిపై వచ్చే వడ్డీ మీదా మీరూ ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించనవసరం లేదు.పై వాటిలో REC బాండ్స్ జారీ ఈ నెల మూడవ తేది నుండి జారీ చేయబడుతున్నాయి. వీటిలో ఇన్వెస్ట్ చేయడం వలన నిజంగా లాభం ఉందా ? అని చాలా మంది అడగటం జరుగుతుంది. అందువలన వీటి గురించి ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం. REC బాండ్స్  10, 15  సంవత్సరాల కాల పరిమితితో  7.22% , 7.38%  కూపన్ రేటు అందిస్తున్నాయి .వీటిని స్టాక్ మార్కెట్ లో కూడా , కొనడం , అమ్మడం చేయవచ్చు. వడ్డీ పై ఎలాంటి పన్ను లేదు .కాని, కాపిటల్ గెయిన్  టాక్స్ ఉంటుంది.ప్రస్తుతం పది సంవత్సరాల కాలపరిమితి గల బాండ్స్ స్టాక్ మార్కెట్ లో 7.22% వద్ద ట్రేడ్ కాబడుతున్నాయి.

అదే విధంగా ఇప్పుడు దీర్ఘకాల బ్యాంక్   ఫిక్సుడ్ డిపాజిట్లపై వడ్డీ రేటు సుమారుగా 8.5% to 8.75%వరకు అందిస్తున్నాయి.సాదారణంగా చాలా మంది బ్యాంక్  డిపాజిట్ల లోనే ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తారు.కాని వాస్తవంగా మీరు బ్యాంక్ ఫిక్సుడ్ డిపాజిట్లపై పొందిన వడ్డీ పై టాక్స్ చెల్లించవలసి ఉంటుంది అనే విషయం మర్చిపోవద్దు.మీరూ పొందిన వడ్డీ ని  మీ ఆదాయానికి కలిపి ఆదాయపు పన్ను లెక్కించవలసి ఉంటుంది.మీ ఆదాయం కనుక అధిక పన్ను స్లాబ్ రేటులో ఉంటె మీ రాబడి తక్కువగా ఉంటుంది.ఒకవేళ మీ ఆదాయం కనుక అధిక స్లాబ్ రేటు అంటే 30% స్లాబ్ లో కనుక ఉండి మీ  బ్యాంక్   ఫిక్సుడ్ డిపాజిట్లపై టాక్స్ ముందు వడ్డీ  8.5% ఉంటె మీకూ వాస్తవంగా వచ్చే వడ్డీ కేవలం 5.9% మాత్రమే .
ఉదాహరణకు మీరూ 8.5% వడ్డీ తో పది వేల రూపాయలు  బ్యాంక్ లో   ఫిక్సుడ్ డిపాజిట్ చేస్తే సంవత్సరం తర్వాత మీకూ వచ్చే రాబడి రూ 10850  ఐతే మీరూ కనుక 10% ఆదాయపు పన్ను స్లాబ్ లో కనుక ఉంటె మీకు వాస్తవంగా వచ్చే మొత్తం రూ 10765  అంటే మీ రాబడి 7.6% మాత్రమే. ఒకవేళ మీరూ 20% ఆదాయపు పన్ను స్లాబులో ఉంటె వచ్చే మొత్తం రూ 10680 ఇది 6.8%.మీరూ 30% ఆదాయపు పన్ను స్లాబులో ఉంటె వచ్చే మొత్తం రూ 10595 ఇది   5.9% మాత్రమే.
పై విషయాలను బట్టి చూస్తె ఒక్క విషయం మాత్రం స్ప్రుస్టంగా అర్ధం అవుతుంది. మీరూ కనుక అధిక ఆదాయపు పన్ను స్లాబ్ లో ఉంటె టాక్స్ ప్రీ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయడమ వలన ఉపయోగం ఉంటుంది. మీరూ తక్కువ ఆదాయపు పన్ను గల స్లాబ్ లో ఉంటె ఎలాంటి ఉపయోగం ఉండదు. 

స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ పరిచయం

స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్  పరిచయం

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి అనునది రెండు విశ్లేషణ పద్దతుల ద్వారా జరుగుతుంది. మొదటిది  ఫండమెంటల్ అనాలసిస్ ,రెండవది టెక్నికల్ అనాలసిస్ .ఫండమెంటల్  అనాలసిస్ అనగా కంపనీ యొక్క బాలన్స్ షీటు,డివిడెండ్,కంపనీ యొక్కబుక్ వాల్యూ,E.P.S(Earning per share),P/E రేషియో,PEG రేషియో  మొదలగు వాటి గురుంచి తెలియచెస్తుంది..అంతే కాకుండా  ఫండమెంటల్  అనాలసిస్ లో గమనించవలసినది ప్రమోటర్ల చరిత్ర ,వాతావరణం ,ఎంపిక చేసుకున్న రంగం,కంపనీ యొక్క ఎగుమతులు, దిగుమతులు ,రాబోయే కాలం లో కంపెనీ విస్తరణ , ఉత్పత్తి చేయు పొడక్ట్ యొక్క సప్లయ్ మరియు డిమాండ్, భవిష్యత్తు అంచనా , ప్రభుత్వం యొక్కనిర్ణయాలు ఆ కంపెనీమీద ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయి అనే మొదలగు విషయాల మీద ఆధారపడి ఉంటుంది.  ఇక్కడ మనం పూర్తిగా టెక్నికల్ అనాలసిస్ గురించి తెలుసు కొంటున్నాం కావున ఫండమెంటల్ అనాలసిస్  గురుంచి  లోతుగా వెళ్ళడం లేదు
 “టెక్నికల్  అనాలసిస్ అనగా సెక్యూరిటీ ధర యొక్క గత ప్రవర్తన ఆధారంగా రాబోవు కాలం లో ఆ షేర్ ధర ఏ విధంగా  ఉండగలదో ఉహించ గలగడమే టెక్నికల్ అనాలసిస్”. టెక్నికల్ అనాలసిస్ నందు గతంలో  సెక్యూరిటీ  ధర యొక్క మార్పులు మరియు వాల్యూమ్ పరిమాణాన్ని చార్ట్ రూపంలోఉంచి దానిని విశ్లేషించడం ద్వారా భవిష్యత్తులో  సెక్యూరిటీ యొక్క ధరని అంచనా వేయడం జరుగుతుంది. టెక్నికల్ అనాలిసిస్ అనగా మార్కెట్ ని అధ్యయనం చేయడం.ఇక్కడ సెక్యూరిటీ అనగా స్టాకులు, ఇండెక్స్ ,బాండ్స్ మొదలగునవి .ఈ   రోజులలో షేర్ మార్కెట్ లో ప్రోపెషనల్స్ ,  రిటరైనవారు ,స్టూడెంట్స్, గృహిణులు  మొదలగు అన్ని రంగాలవారు ప్రవేశిస్తున్నారు.అంతేకాకుండా   షేర్ మార్కెట్ కూడ చిన్న పట్టణాలకు విస్తరించడం తో కొత్తవారు చాలామంది  ప్రవేశిస్తున్నారు .ఈ రోజులలో  కంప్యూటర్లు మరియు  ఇంటర్నెట్ అనేది సులభంగా  అందరికి అందుబాటులో ఉండడం తో ట్రేడర్స్ మార్కెట్ యొక్క మొత్తం డెటానీ విశ్లేషించడం ద్వారా వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకోగలుగుతున్నారు . కానీ మార్కెట్లోకి  కొత్తగా వస్తున్న చాలా  మంది  వారిదగ్గర  కంప్యూటర్స్ మరియు  చార్టింగ్  సాఫ్టవేర్ ఉన్నప్పటికిని దానిని సరియగు పద్దతిలో  ఉపయోగించుకోకుండా  స్వంతంగా నిర్ణయాలు తీసుకోలేక బ్రోకర్స్ మరియు టిప్స్  అందించే వారి మీద ఆధారపడుతుంటారు . ఫలితంగా వారు గాని డబ్బు సంపాదించడం  అటుంచి మీదనుండి డబ్బు లాస్  అవుతున్నారు. దానితో వారు మార్కెట్‌లో ఒక్కోసారి ఒక్క విధంగా  ప్రవర్తిస్తారు.ఒక్కసారి ఇన్వెస్టర్ గా మరోసారి ట్రేడర్ లాగా  ప్రవర్తిస్తారు..విజయవంతమైన  ఇంవేస్టింగ్ లేదా ట్రేడింగ్ అనునది మూడు M  ల మీద ఆధారపడి .ఉంటుంది. మైండ్, మెథడ్, మరియు మనీ. అంతే కాకుండా ద్రుడమైనమానసిక బలాన్ని , సరిగా డబ్బు నిర్వహణ పద్దతి కలిగి ఉండాలి..మన దగ్గర డబ్బులు ఉన్నాయ్ కదా అని మనకు డ్రైవింగ్ రాకున్న మూడు లక్షలు  పెట్టి  కారు కొని దానిని నడుపుటకు ప్రయత్నిస్తే మన కారుకు ప్రమాదం జరగడమే కాకుండా దానిని నడుపుతున్న వ్యక్తికీ  ,రోడ్డు మీద వెళ్తున్న వారికి కూడా ప్రమాదం జరగవచ్చు ముందుగా మనం కారు నడుపుటలో మెళకువలు  నేర్చుకొని కారు కొన్నచో మనం తగు జాగ్రత్తగా ఉంటాం .అదే విధంగా  మన దగ్గర  డబ్బులు  ఉన్నాయ్ కద అని షేర్ మార్కెట్ గురుంచి ఎలాంటి అవగాహనా ,విశ్లేషణ సామర్ధ్యం లేకుండా టిప్స్ మీద ఆధారపడి ,టిప్స్ కోసం నెల నెల వేలకు వేలు ఫీజు చెల్లిస్తూ ,మన కష్టార్జితాన్ని  నష్టపర్చుకుంటూ షేర్ మార్కెట్ అంటే జూదంగా ,అది ఒక్క మహాసముద్రం  అది మనకు అర్థం కాదు దీనిలో మనం డబ్బులు సంపాదించలేము అనుకొంటారు. . స్టాక్ మార్కెట్ ను  పెట్టుబడి వృద్ది చేసే సాధనం గా  చూడాలి.మనం డబ్బులు సంపాదించు కొనుటకు ఏ బిజీనేసు  అయిన  మొదలు పెట్టేముందు  దాని గురించి  పూర్తిగా తెలుసుకొని    మనం బిజినెసు మొదలు పెడతాము.అలాగే షేర్ మార్కెట్ లో డబ్బులు సంపాదించాలి అంటే దాని గురుంచి కూడ  వివరంగా తెలుసుకోవాలి.మన బిజినేసు కొరకు  ఎలా కష్టపడి  వివరాలు  సేకరిస్తామో  షేర్ మార్కెట్ గురించి కూడ అలాగే కష్టపడాలి .రిస్కు అంటారా రిస్కు అనేది ప్రతి బిజినెసులో  ఉంది వ్యవసాయం మొదలుకొని .టాక్సీ  డ్రైవింగ్ వరకు ప్రతి దానిలో ఉన్నది.రిస్కు లేకుండా కష్టపడకుండా మనం దేన్నీ సాధించలేము.టెక్నికల్ అనాలసిస్ అనునది షేర్ మార్కెట్ అనే అడవిలో సురక్షితంగా బయటపడే రోడ్డు  మ్యాపు లాంటిది .ఈ మ్యాపుని సరిగా ఉపయోగించగలిగితే మీరు విజయవంతంగా బయటపడతారు. టెక్నికల్ అనాలసిస్ మీద ఇంతవరకు తెలుగులో  వివరంగా ఎలాంటి పుస్తకం లేదు.మీకు టెక్నికల్ అనాలసిస్  మీద ఇదివరకు ఎలాంటి  కనీస  పరిజ్ఞానం  లేకున్నను మీరు ఈ పుస్తకం ద్వారా టెక్నికల్ అనాలసిస్ ని ఏ విధమగా ఉపయోగించుకోవచ్చో  తెలియ చేస్తుంది
ప్రసిద్ధ చైనీస్ సామెత  , "ఒక మనిషికి ఒక చేపను  ఇస్తే  అతనికి  ఆ రోజు మాత్రమే  ఆహారం అవుతుంది  కానీ  మీరు ఆ మనిషికి చేపలు పట్టడం నేర్పిస్తే ఆ మనిషికి జీవితాంతం ఆహారం అందించిన వారు అవుతారు .ఈ పుస్తకం కూడా మీకు అలాగే ఉపయోగపడుతుంది.  టెక్నికల్ అనాలిసస్లో చరిత్ర   పునరావృతం  అవుతుంది  అనే భావన  బలంగా   ఉంటుంది.